కోలివుడ్‌లో 'నాన్' అనే సీరియస్ కథా చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయం అయిన సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని. ఆ తరువాత పలు సక్సెస్‌పుల్ చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న ఈయన పిచ్చైక్కారన్– 2 తెలుగులో (బిచ్చగాడు-2) చిత్రంతో దర్శకుడిగానూ పరిచయం అయ్యి విజయం సాధించారు. తాజాగా విజయ్ ఆంటోని కథానాయకుడిగా నటించిన చిత్రం కొలై (హత్య). నటి రిత్వికా సింగ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి బాలాజీ కె.కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా శుక్రవారం తెరపైకి రానుంది.
(ఇదీ చదవండి: ఎవరూ నమ్మలేరు మన హీరోయిన్లు పాక్ సినిమాల్లో నటించారంటే)
ఈ సందర్భంగా చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో చిత్ర ఫ్రీ రిలీజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో పాల్గొన్న విజయ్ ఆంటోని మాట్లాడుతూ కథ చెప్పినప్పుడు ఇందులో ముగ్గురు హీరోయిన్లు ఉంటారని దర్శకుడు చెప్పారన్నారు. ఆ తరువాత ఇద్దరని అన్నారనీ, వారిలో నటి మీనాక్షీ వేరే నటుడికి పెయిర్ కాగా, నటి రిత్వికా సింగ్ తనకు సోదరిగా నటించినట్లు చెప్పారు. ఇందులో తనకు ఒకే ఒక్క భార్య ఉన్నారనీ, ఆమె కూడా కళ్ల ముందే కాలిపోతుందని చెప్పారు. అలా ఈ చిత్రంలో తనకు రొమాన్స్ లేకుండా చేశారని, ఇందుకు తనకు న్యాయం కావాలి అని సరదాగా అన్నారు.
అయితే దర్శకుడు బాలాజీ కే.కుమార్ ఏడు ఏళ్ల తరువాత దర్శకత్వం వహంచిన చిత్రం ఇది అనీ, చాలా బాగా వచ్చిందని పేర్కొన్నారు. కాగా మళ్లీ సంగీత దర్శకుడిగా ఎప్పుడు పని చేస్తారన్న ప్రశ్నకు బదులిస్తూ, ప్రస్తుతానికి కొంచెం గ్యాప్ ఇచ్చానని, తన కేరీర్ ముగిసేలోగా కనీసం 20 మంది కొత్త సంగీత దర్శకులను పరిచయం చేయాలని కోరుకుంటున్నానని చెప్పారు. అందుకే సంగీతదర్శకుడిగా కొంత కాలం తప్పుకుంటున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment