రొమాన్స్‌కు నా భార్య ఓకే | my wife reday for Romance on Screen says Vijay Antony | Sakshi
Sakshi News home page

రొమాన్స్‌కు నా భార్య ఓకే

Published Tue, Apr 28 2015 3:45 AM | Last Updated on Wed, Apr 3 2019 9:16 PM

రొమాన్స్‌కు నా భార్య ఓకే - Sakshi

రొమాన్స్‌కు నా భార్య ఓకే

రొమాన్స్‌కు నా భార్య ఓకే అంటున్నారు సంగీత దర్శకుడు, నటుడు విజయ్ ఆంటోని. మీరేదో ఊహించుకోకండి. తెరపై హీరోయిన్‌తో రొమాన్స్‌కు తన భార్య ఎలాంటి ఆంక్షలూ విధించలేదని విజయ్ ఆంటోని వ్యాఖ్యానించారు. సంగీత దర్శకుడుగా ఉన్నత స్థాయికి చేరుకున్న ఈయన ఇప్పుడు హీరోగానూ తనకంటూ గుర్తింపు పొందారు. తొలి చిత్రం నాన్, మలి చిత్రం సలీం విజయం సాధించడంతో మూడో ప్రయత్నంగా చేస్తున్న చిత్రం ఇండియా - పాకిస్తాన్. ఈ చిత్రాన్ని తన విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.
 
 నూతన నటి సుష్మా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో పశుపతి, ఎంఎస్.భాస్కర్, జగన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. యువ దర్శకుడు ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి దీనా సంగీతం అందించారు. చిత్రం మే ఎనిమిదో తేదీన తెరపైకి రానుంది. సలీం చిత్రాన్ని విడుదల చేసిన శ్రీ గ్రీన్ ప్రొడెక్షన్ సంస్థ అధినేత ఏఎస్ శరవణన్ ఈ చిత్రాన్ని కూడా విడుదల చేస్తున్నారు. ఇండియా - పాకిస్తాన్‌లో ఏది విజయం సాధిస్తుందన్న ప్రశ్నకు ప్రేమే జయిస్తుందన్న సందేశం ఇస్తున్నట్లు విజయ్ ఆంటోని చెప్పారు. ఇది కుటుంబ సమేతంగా చూసి ఆనందించే రొమాంటిక్ ఎంటర్‌టైనర్ అని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement