ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో తమిళ చిత్రం ‘హిట్లర్’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం
నెవర్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అన్నట్టు... ఈ సినిమా పేరుకి, సినిమాకి అస్సలు సంబంధముండదు. కాని సినిమా మాత్రం ఓ అద్భుతమైన థ్రిల్లర్ అని చెప్పవచ్చు. హిట్లర్ సినిమా ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా లభ్యం. ధనశేఖరన్ ఈ సినిమాకి దర్శకుడు.
ప్రముఖ తమిళ హీరో విజయ్ యాంటోని, హీరోయిన్ రియాసుమన్ ప్రధాన పాత్రలలో నటించగా ప్రముఖ దర్శకులు, నటులు అయిన గౌతమ్ వాసుదేవ్ మీనన్ మరో ముఖ్య పాత్రలో నటించారు. అంతే కాదు నాటి విలన్ చరణరాజ్ ఈ సినిమాలో విలన్ గా నటించారు.
ఇక హిట్లర్ కథ విషయానికొస్తే ఇదో వినూత్నమైన కథ. హీరో సెల్వకు చెన్నైలోని ఓ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ గా ఉద్యోగం వస్తుంది. దాని కోసంగా కరుక్కవేల్ అనే స్నేహితుడి రూమ్ కి వస్తాడు సెల్వ. కరుక్కవేల్ తన కాలేజ్ స్నేహితుడని గుర్తు చేస్తాడు సెల్వ. కాని కరుక్కవేల్ తాను సెల్వని ఇప్పుడే చూస్తున్నానని చెప్తాడు.
ఇంతలో సారా సెల్వకి ఓ రైల్వే స్టేషన్ లో అనుకోకుండా పరిచయమవుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. మరో పక్క నగరంలో పేరు మోసిన రౌడీ షీటర్లను ఎవరో బైక్ లో వచ్చి ఓ రేర్ పిస్టల్ తో చంపుతుంటారు. దానిని శక్తి ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు. ఆ విచారణలో భాగంగా ఎన్నికలలో పోటీ చేయబోతున్న రాజకీయవేత్త రాజవేలు బ్లాక్ మనీ దాదాపు 500 కోట్లు పోయిందని తెలుస్తుంది.
ఓ పక్క సెల్వ సారా లవ్ ట్రాక్, మరో పక్క రౌడీ షీటర్ హత్యలు, ఆ పైన డబ్బు పోవడం. ఈ మూడూ పేర్లల్ గా నడుపుతూ కథను అనూహ్యమైన మలుపులతో ఈ సినిమా స్క్రీన్ ప్లే చూసే ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఊహించని ట్విస్టులే ఈ సినిమాకి ప్రాణం. ఈ వీకెండ్ చూడదగ్గ సినిమా ఈ హిట్లర్. కాకపోతే పిల్లలకు ఈ సినిమాని దూరంగా ఉంచాలి. పేరుకే ఈ సినిమా హిట్లర్ కాని సినిమా మాత్రం సూపర్ హిట్టు.
Comments
Please login to add a commentAdd a comment