టైటిల్: హత్య
నటీనటులు: విజయ్ ఆంటోనీ, మీనాక్షి చౌదరి, రితికా సింగ్, మురళీ శర్మ, రాధిక శరత్‌కుమార్, సిద్ధార్థ్ శంకర్, అర్జున్ చిదంబరం, కిషోర్ కుమార్, సంకిత్ బోరా తదితరులు
దర్శకత్వం: బాలాజీ కుమార్
సంగీతం: గిరీష్ గోపాలకృష్ణన్
సినిమాటోగ్రఫీ: శివకుమార్ విజయన్
విడుదల తేది: జులై 21, 2023
బిచ్చగాడు-2 మూవీతో రీసెంట్ సూపర్ హిట్ అందుకున్న తమిళ హీరో విజయ్ అంటోని.. నటించిన కొత్త మూవీ ‘కోలై’. తెలుగులో హత్య పేరుతో విడుదల చేశారు. మీనాక్షి చౌదరి, రితికా సింగ్ హీరోయిన్లుగా నటించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. ఓ మోస్తరు అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
‘హత్య’ కథేంటంటే..
హైదరాబాద్‌కు చెందిన ఫేమస్ మోడల్ లైలా(మీనాక్షి చౌదరి) తన ఇంట్లో హత్యకు గురవుతుంది. ఈ కేసు కొత్తగా డ్యూటీలో చేరిన ఐపీఎస్ సంధ్య(రితికా సింగ్) చేతికి వస్తుంది. ఆమె ప్రముఖ డిటెక్టివ్ వినాయక్(విజయ్ ఆంటోనీ) సహాయం కోరుతుంది. ఇద్దరు కలిసి ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు. లైగా బాయ్‌ఫ్రెండ్ సతీష్(సిద్ధార్థ శంకర్), ప్రముఖ ఫోటోగ్రాఫర్ అర్జున్ వాసుదేవ్(అర్జున్ చిదంబరం), మోడల్ కో ఆర్డినేటర్ ఆదిత్య కౌశిక్(మురళీ శర్మ)తో పాటు బబ్లూ అనేవ్యక్తి (కిషోర్ కుమార్)ని విచారిస్తారు. మరి ఈ నలుగురిలో లైలాను హత్య చేసిందెవరు? ఎందుకు చేశారు? ఈ కేసు విషయంలో ఐపీఎస్ అధికారి సంధ్యకు డిటెక్టివ్ వినాయక్ ఎలాంటి సహాయం చేశాడు. కేసు విచారణలో వీరిద్దరికి ఎదురైన సవాళ్లు ఏంటి? చివరకు హంతకుడిని ఎలా గుర్తించారు? అనేది తెలియాలంటే ‘హత్య’సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ ఇది. ఇలాంటి చిత్రాల్లో ప్రేక్షకుడు థ్రిల్‌కు గురయ్యే సన్నివేశాలు ఉంటేనే కథతో లీనమవుతారు. కానీ ‘హత్య’లో అలాంటి సన్నివేశాలు తక్కువనే చెప్పాలి. పైగా ఈ తరహా కథలు తెలుగులో బోలెడు వచ్చాయి. ఈ చిత్రంలో కొత్తగా చూపించిదేమి లేదు.ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కూడా రొటీన్‌గా ఉంటుంది. లైలా హత్యతో కథ ప్రారంభం అవుతుంది.
ఎలాంటి సాగదీత లేకుండా అసలు కథలోకి తీసుకెళ్లాడు దర్శకుడు. లైలా హత్య కేసు విచారణలో ఐపీఎస్ సంధ్య డెటెక్టివ్ వినాయక్ సహాయం కోరడం.. ఇద్దరు కలిసి విచారణ ప్రారంభించడం.. కొంతమంది అనుమానితుల్ని పిలిచి విచారించడం..ఇలా రొటీన్‌గా ఫస్టాఫ్ సాగుతుంది. ఇక మధ్యలో ఫ్యామిలీ ఆడియన్స్ కోసం విజయ్ ఆంటోనీ పాత్ర ఫ్యామిలీ నేపథ్యం, అతని కూతురు యాక్సిడెంట్ గురయ్యే సీన్స్‌ని చొప్పించారు.
అయితే అవి సాఫీగా సాగుతున్న కథను అతికించినట్లు ఉన్నాయే తప్పా.. ఆడియన్స్‌కి కనెక్ట్ కాలేవు. ఇంటర్వెల్ సీన్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సెకండాఫ్‌లో కూడా రొటీన్‌గా సాగుతుంది. లైలా హత్యలో కేసులో అనుమానితులు వరుసగా చనిపోవడంతో అసలు హంతకుడు ఎవడనే క్యూరియాసిటీని ప్రేక్షకుల్లో కలుగుతుంది. అయితే సినిమా స్టార్టింగ్‌లోనే కాస్త జాగ్రత్తగా గమనిస్తే హంతకుడు ఎవరో ఈజీగా కనిపెట్టగలరు. ఓవరాల్‌గా ‘హత్య’ ఓ రొటీన్ క్రైమ్ థ్రిల్లర్.
ఎవరెలా చేశారంటే..
డిటెక్టివ్ వినాయక్‌గా విజయ్ ఆంటోనీ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. పాత్రకు తగ్గట్టుగా సీరియస్ లుక్, గ్రే హెయిర్‌తో తెరపై కొత్తగా కనిపించాడు. ఇక మోడల్ లైలాగా మీనాక్షి చౌదరి తన పాత్ర పరిధిమేర నటించింది. కథంతా తన పాత్ర చుట్టే తిరుగుతుంది కానీ గుర్తిండిపోయే సన్నివేశాలేవి తనకు పడలేదు. ఐపీఎస్ సంధ్యగా రితికా సింగ్ నటన పర్వాలేదు. మురళీ శర్మ పాత్ర నిడివి తక్కువే అయినా ఉన్నంతగా బాగా నటించాడు. రాధికా శరత్ కుమార్, సిద్ధార్థ్ శంకర్, అజిత్ చిదంబరంతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.సాకేంతిక పరంగా సినిమా పర్వాలేదు.
Comments
Please login to add a commentAdd a comment