Hatya Movie
-
ఏపీ హైకోర్టులో సోషల్ మీడియా కార్యకర్త పవన్‌కు ఊరట
సాక్షి, విజయవాడ: ఏపీ హైకోర్టులో సోషల్ మీడియా కార్యకర్త పవన్‌కు ఊరట లభించింది. తాము చెప్పేవరకు కేసు విచారణ నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. హత్య సినిమాలో క్లిప్పింగ్‌లు షేర్ చేశాడని సోషల్ మీడియా కార్యకర్త పవన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే పలుమార్లు పవన్‌ను పులివెందుల పోలీసులు విచారించారుపవన్తో పాటు హత్య సినిమా డైరెక్టర్, నిర్మాత, రచయితపైనా కేసులు పెట్టారు. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌పైనా కేసు నమోదు చేశారు. సెన్సార్ సర్టిఫికెట్ ఉన్న సినిమా క్లిప్పింగ్ షేర్ చేయడం తప్పు ఎలా అవుతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. పవన్ కుమార్ హైకోర్టును ఆశ్రయించడంతో.. విచారణను నిలుపుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది. -
'హత్య' మూవీ రివ్యూ.. ఇది కదా అసలు నిజం!
టైటిల్: హత్య; నటీనటులు: ధన్యా బాలకృష్ణ, రవివర్మ, పూజా రామచంద్రన్, రఘు, భరత్ తదితరులు. నిర్మాత: ప్రశాంత్ రెడ్డి; కథ–స్క్రీన్ ప్లే–దర్శకత్వం: శ్రీవిద్య బసవ; సంగీతం: నరేశ్ కుమరన్.పి సినిమాటోగ్రఫీ: అభిరాజ్ నాయర్; ఎడిటర్: అనిల్ కుమార్ .పి; ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ వీడియో.అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ‘హత్య’ సినిమా ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇది కల్పిత కథ అని మేకర్స్ ప్రకటించినప్పటికీ... ఈ సినిమాలోనిపాత్రలు, స్థలాలు, హత్య ఘటన, కేసు దర్యాప్తు ప్రక్రియ అన్నీ కూడా సంచలనం అయిన ప్రముఖ రాజకీయ నాయకుడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును పోలి ఉన్నాయి. ఈ కేసుకి సంబంధించి దర్శక–నిర్మాతలు లోతైన పరిశోధన చేసి, దాగి ఉన్న పలు విషయాలను సేకరించినట్లుగా సినిమా చూసినవారికి అనిపించడం సహజం.ఈ హత్యకు సంబంధించిన అసలు నిజాలు చెప్పేలా కథ ఉండటంతో ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన వెంటనేపాపులర్ అయింది... నిజంగా ఏం జరిగింది? అనేదానికి ఈ సినిమా నిజమైన నమూనానా? హత్య వెనక ఉన్న నిజమైన హంతకులను ఈ సినిమా బయటపెట్టిందా? జరిగిన విషయాన్ని ఎలా తారుమారు చేసి, ప్రచారం చేస్తున్నారో ఈ సినిమా చూపించిందా? ‘హత్య’ సినిమా బయటపెట్టిన నిజాలు ఏంటి? ఇంతకీ ఈ సినిమా కథేంటి? ఎలా ఉంది? క్రైమ్ థ్రిల్లర్ మూవీస్‌ని ఇష్టపడేవారు, వివేకానంద రెడ్డి హత్య కేసుని ఫాలో అవుతున్నవారు చూడాల్సిన చిత్రం ఇది.ఇంతకీ ఈ చిత్ర కథేంటంటే...ఇల్లందులో రాజకీయ నాయకుడు ధర్మేంద్ర రెడ్డి (రవి వర్మ) దారుణ హత్యకు గురవుతాడు. అయితే తొలుత ఆయన మరణం గుండెపోటు వల్ల జరిగిందని వార్తలు వస్తాయి. కానీ ధర్మేంద్ర గొడ్డలి వేటుతో హత్యకు గురయ్యాడని నిర్ధారణ అవుతుంది. ఈ కేసును రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ రెడ్డి (భరత్) నిజాయితీ గల ఐపీఎస్ అధికారి సుధ (ధన్యా బాలకృష్ణ)కి అప్పగిస్తాడు. ఆమె తన టీమ్‌తో కలిసి ధర్మేంద్ర రెడ్డి హత్య కేసు విచారణ మొదలుపెడుతుంది. అజాత శత్రువు అయిన ధర్మేంద్ర రెడ్డిని అంత దారుణంగా నరికి చంపింది ఎవరు? ధర్మేంద్రకు, సలీమా (పూజా రామచంద్రన్)కు ఉన్న సంబంధం ఏంటి? పొలిటికల్ ఎజెండాతో ఈ హత్య చేశారా?\ఆర్థిక సమస్యలే కారణమా? ధర్మేంద్ర కుమార్తె కవితమ్మ (హిమబిందు)ను తప్పుదోవ పట్టించింది ఎవరు? చిన్నాన్న హత్య కేసులో నిజాలను నిగ్గు తేల్చడానికి సీఎం కిరణ్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? గత ప్రభుత్వం దగ్గర అమ్ముడుపోయిన కొంతమంది అధికారులు ఈ కేసును ఎలా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు? అనేక ఒత్తిడిలను తట్టుకొని ఐపీఎస్ అధికారి సుధ ఈ మర్డర్ మిస్టరీని ఎలా ఛేదించింది? కేసు విచారణ చివరి దశలో ఉన్న సమయంలో ఏం జరిగింది? అనేది తెలియాలంటే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ‘హత్య’ సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..ఈ సినిమా కథంతా కల్పితమే అని చిత్రబృందం పేర్కొన్నప్పటికీ.. సినిమాప్రారంభంలోనే ఇది వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించిన కథ అని అర్థమవుతుంది. దర్శకురాలు శ్రీవిద్య బసవ ఎంతో రీసెర్చ్ చేసి ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఆమె రాసుకున్న కథ, స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉన్నాయి. సినిమాప్రారంభం నుంచి ముగింపు వరకు ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. జేసీ ధర్మేంద్ర ఎవరన్నది చెబుతూ కథను మొదలుపెట్టారు దర్శకురాలు. ధర్మేంద్ర హత్య, ఆ తర్వాత జరిగిన పరిణామాలను చూపించారు. సుధ విచారణలో ఒక్కో కొత్త విషయం బయటకు వస్తుంటే.. ‘ఇది కదా అసలు నిజం’ అనిపిస్తుంది. సెకండాఫ్‌లో వచ్చే సలీమా, ధర్మేంద్రల మధ్య లవ్‌స్టోరీ సన్నివేశాలు సినిమాకే హైలెట్‌గా నిలుస్తాయి. దర్శకురాలు ఎంతో పకడ్బందీగా రీసెర్చ్ చేసి, లవ్‌స్టోరీ చెప్పినట్లు అనిపిస్తుంది. క్లైమాక్స్‌లో మంచి ఎమోషన్ పండించారు.ఎవరెలా చేశారంటే..ధర్మేంద్ర రెడ్డిపాత్రలో రవి వర్మ ఒదిగిపోయారు. ఐపీఎస్ ఆఫీసర్‌గా ధన్యా బాలకృష్ణ తనపాత్రకు న్యాయం చేశారు. సలీమాగా ఓ డిఫరెంట్ క్యారెక్టర్లో పూజా రామచంద్రన్ మెప్పించారు. భరత్, బిందు చంద్రమౌళి, శ్రీకాంత్ అయ్యంగార్... మిగిలిన నటీనటులు వారిపాత్రల్లో మెప్పించారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. నరేశ్ కుమరన్ .పి అందించిన నేపథ్య సంగీతం,పాటలు సినిమాకు ప్లస్ అయ్యాయి. అభిరాజ్ నాయర్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఫర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు.. హత్య మూవీలో అసలు ఏముంది?
అమెజాన్ ప్రైమ్‌లో ఓ సినిమా స్ట్రీమ్ అవుతోంది. దాదాపు 15 రోజుల క్రితం ఈ సినిమా ప్రైమ్‌లో రిలీజైనప్పటి నుంచిం తెలుగు రాష్ట్రాల్లో సీరియస్ డిస్కషన్‌కు కేంద్ర బిందువైంది. కొందరు ఈ సినిమా థ్రిల్లింగ్‌గా ఉంది.. చాలా ఫ్యాక్చువల్‌గా ఉందని చెబుతుంటేం మరికొంతమంది ఈ సినిమాను అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారు. అమెజాన్ ప్రైమ్‌లో టాప్-2గా ట్రెండ్ అవుతున్న హత్య సినిమా ఐదు భాషల్లో రిలీజైంది.👉అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతున్న హత్య సినిమా ఇప్పుడు ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ సినిమా బిట్స్ షేర్ చేసిన వారిపై పోలీసులు కేసులు పెడుతున్నారు. ఓ సీనియర్ పొలిటీషియన్ హత్య విచారణకు సంబంధించిన కథాంశంతోం సినిమా ప్రారంభం అవుతుంది. ఆ పొలిటీషియన్‌ను ఎవరు హత్యచేశారనే విషయంపై ఓ పోలీస్ అధికారి చేసే విచారణ సినిమాలో ప్రధాన అంశం. సినిమా ఎవరిని ఉద్దేశించింది కాదు అని నిర్మాతలు.. డైరెక్టర్ డిస్క్లైమర్ వేసినా ఈ సినిమా ఇతివృత్థం ఏంటో చూసే వారికి ఈజీగా అర్థం అయిపోతుంది.👉మాజీ మంత్రి హత్య నేపథ్యంలో ఈ సినిమా తీశారనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా మాజీమంత్రి హత్యకు దారితీసిన అంశాలను ఈ సినిమాలో చర్చించారనే డిస్కషన్ పెద్ద ఎత్తున జరుగుతోంది. కేసు విచారణ మొదలుం సాంకేతిక ఎవిడెన్సెస్ వరకు ప్రతీ అంశంపై చాలా నిశితంగా చర్చిస్తూ సినిమా స్క్రీన్‌ప్లేను నడిపించిన తీరుం అందరిని ఆకట్టుకుంటోంది. మాజీమంత్రి హత్యకేసులో డిస్కషన్‌కు వచ్చిన చాలా టెక్నికల్ అంశాలను సైతం ఈ సినిమాలో సామాన్యులకు అర్థమయ్యే తీరులో వివరించారనే ప్రశంసలు వస్తున్నాయి.👉ఒక సినిమా పూర్తి ఫిక్షన్ అయినపప్పటికీ ఆ సినిమా కథ ఏదో ఒక వాస్తవ ఘటన ఆధారంగా తీసుకున్నదే అయి ఉంటుంది. ఇప్పుడు హత్య సినిమా కూడా ఎంతో కొంత వాస్తవ ఘటనల ఆధారంగా తీసుకన్నారనే డిస్కషన్ ఉంది. హత్య సినిమాలో ఓ మాజీ ముఖ్యమంత్రి సోదరుడు హత్యకు గురవుతాడు. ఈ కేసులో వాస్తవాలు వెలికితీయాలనే ఉద్దేశంతోం హత్యకు గురైన వ్యక్తి బంధువు ముఖ్యమంత్రి అయ్యాక దీనిపై నిస్పక్ష విచారణకు ఆదేశిస్తారు. తన బాబాయి హంతకులు ఎవరనేది బయటకు తీసుకురావాలని ముఖ్యమంత్రి సిన్సియర్‌గా యత్నిస్తారు.👉దీనిపై ఓ నిబద్ధత ఉన్న మహిళా పోలీస్ ఆఫీసర్‌కుం విచారణ బాధ్యతలు అప్పగిస్తారు. ఈ కేసులో వాస్తవాలను బయటకు తెచ్చేందుకు ఆ మహిళా అధికారి అన్ని కోణాల్లో విచారణ చేపడుతుంది. ఈ కేసులో విచారణ సందర్భంగా ఎన్నో కీలకమైన విషయాలు బయటకు వస్తాయి. అయితే విచారణ చేసిన అధికారిని కొన్ని శక్తులు అడ్డుకునేందుకు యత్నిస్తాయి. కేసులో వాస్తవాలు బయటకు రాకుండా కొంతమంది అధికారులు ఆమెకు ద్రోహం చేస్తారు. విచారణ కీలక దశలో ఉన్నప్పుడు ఆమెను విచారణ నుంచి తప్పిస్తారు. మొత్తానికి వాస్తవాలు బయటకు రాకుండా ఆమెను అడ్డుకుంటారు.👉సినిమా ముందుకు కదులుతున్నకొద్దీ హత్యకు గురైన మాజీ మంత్రికి సంబంధించి చాలా కొత్త కొత్త విషయాలు రివీల్ అవుతాయి. ఈ సినిమాలో హత్య గురైన వ్యక్తికి ఉన్నటువంటి వివాహేతర సంబంధంపైం చాలా డీటేయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ముఖ్యంగా సినిమాలో హత్యకు గురైన మాజీమంత్రి ఆ మహిళతో పరిచయం అయిన తీరు ఆ పరిచయం ఏవిధంగా కుటుంబంలో చిచ్చుపెట్టిందో ఇందులో స్పష్టంగా వివరించారు. ఈ కేసు విచారణలో చనిపోయిన మాజీమంత్రికి ఉన్న వివాహేతర సంబంధం కీలకంగా మారిందనేది సినిమా చూస్తున్న వారందరికీ అర్ధం అవుతుంది. ముఖ్యంగా చనిపోయిన వ్యక్తి ఓ ముస్లిం మహిళను వివాహం చేసుకోవడం ఆయన కూతురు, అల్లుడితో పాటు బావమరిదికి నచ్చలేదనేది స్పష్టంగా కనిపిస్తుంది.👉ఒకవేళ రెండో వివాహానికి అంగీకారం తెలిపితే ఆస్తిలోవాటా ఇవ్వాల్సి వస్తుందనే భయం.. హత్యకు గురైన మాజీమంత్రి కూతురు, అల్లుడిని వెంటాడుతుంది. ఓ సందర్భంలో మాజీమంత్రి బావమరిది.. ఆమె రెండో భార్య దగ్గరకు వెళ్లి ఆమెపై దాడి చేసిన దృశ్యం సినిమాలో టర్నింగ్ పాయింట్. ఈ విషయం తెలిసిం హత్యకు గురికావడానికి ముందు ఆ మాజీమంత్రి తన మొదటి భార్య బంధువులతో సహా కూతురు అల్లుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తారు. హత్యకు గురికావడానికి ముందు తన ముస్లిం భార్యకు ఆస్తిలో వాటాతో పాటు ఆమెతో కలిగిన కుమారుడికి కాన్వెంట్ అడ్మిషన్ ఇప్పించాలని మాజీమంత్రి కోరుకుంటాడు అనే సినిమాలో చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. ఇదే హత్యకు కారణమైన ఉండొచ్చు అనే అనుమానాలు తరువాత విచారణలో ముందుకు వస్తాయి.👉ఈ సినిమాలో మాజీమంత్రి హత్యకు సంబంధించి రెండు కీలకమైన అంశాలను హైలైట్ చేశారు. ఒకటి హత్య జరిగిన సందర్భంగా హత్య చేసే సమయంలో దుండగులు మాజీమంత్రితో ఓ లేఖ రాయిస్తారు. సినిమాలో ఇది చాలా డ్రమటిక్ సీన్. లేఖలో తనను డ్రైవర్ తీవ్రంగా కొట్టాడంటూ రాయిస్తారు. అయితే ఉదయాన్నే మృతదేహం వద్ద ఈ లేఖను చూసిన పీఏ.. విషయం మాజీమంత్రి అల్లుడికి చెప్తాడు. ఈ విషయం బయట ఎవరికి చెప్పినాం ఇది హత్య అని అప్పుడే తెలిసే అవకాశం ఉండింది. కాని మాజీ మంత్రి అల్లుడు ఈ విషయం బయటకు రాకుండా మధ్యాహ్నం వరకు దాచిపెడతాడు. మొత్తం సినిమాలో ఇది చాలా కీలకమైన అంశం.👉ఎందుకు హత్యకు గురయిన మాజీ మంత్రి అల్లుడు ఇది హత్య అనే విషయం బయటకు రాకుండా అడ్డుకున్నాడనే సినిమా కథలో కీలకమైన అంశం. దీంతో మాజీమంత్రి మృతిపై రకరకాల పుకార్లు వస్తాయి. హత్య అని ముందే తెలిస్తే సాక్ష్యాలు భద్రపరిచే అవకాశం ఉన్నాం లేఖను ఎందుకు దాచిపెట్టారనే విషయం హత్య సినిమాలో కీలకం. ఇక పీఏను అబద్ధమపు సాక్ష్యం చెప్పమని మాజీమంత్రి కూతురు బలవంతపెడుతుంది. దీంతో తాను అబద్ధం చెప్పనని పీఏ తిరగబడతాడు. పీఏ అబద్ధం చెప్పకపోతే తన భర్త జైలుకు వెళ్లాల్సి వస్తుందనిం హత్యకు గురైన మాజీ మంత్రి కూతురు నోరుజారడం షాకింగ్ విషయం. అసలు హత్య వెనకాల మాజీమంత్రి కుటుంబం ఉందా? అనే విషయం ముందు నుంచీ ప్రతీ ఒక్కరికీ అనుమానం కలిగిస్తుంది. పరిస్థితులు సాక్ష్యాధారాలు సైతం మాజీ మంత్రి కూతురు,అల్లుడి వైపే అనుమానాలు కలిగిస్తాయి. హత్య వల్ల లాభం ఎవరికి అనేది సినిమా చూసిన వారికి స్పష్టంగా అర్థమైపోతుంది.👉హత్యకు సంబంధించిన అబద్ధాలు ప్రచారం చేసి ఏవిధంగా రాజకీయ రంగు పులుమే ప్రయత్నం జరుగుతుందో హత్య సినిమా చూస్తే ఇట్టే అర్థం అయిపోతుంది. తండ్రి హత్యను రాజకీయాల కోసం వాడుకున్న కూతురు కథ ఈ సినిమాలో కనిపిస్తుంది. రెండో వివాహం కుటుంబంలో చిచ్చురేపిం అది హత్య వరకు దారితీసిన ఘటనలు ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు. నిజాలు బయటకు రాకుండా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌కు ఏవిధంగా ద్రోహం చేశారో కూడా ఈ సినిమాలో మనం చూడొచ్చు. ఏది ఏమైనా ఓ బలమైన వర్గం సొంత కూతురు కలిసి మాజీ మంత్రి హత్య కేసును ఏ విధంగా దారితప్పించారో తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే. -
రెండు వారాల్లోనే ఓటీటీలోకి థ్రిల్లర్ సినిమా.. కాకపోతే!
ఏ సినిమా అయినా థియేటర్లలోకి రావడం లేటు.. బిగ్ స్క్రీన్‌పై చూసి ఆనందించేవాళ్లు కొందరైతే, ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేసేవాళ్లు మరికొందరు. వాళ్లకోసమా అన్నట్లు ప్రతివారం కొత్త మూవీస్ రిలీజ్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు అలానే ఓ చిత్రం ఓటీటీలో అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది. కాకపోతే మరీ రెండు వారాల్లోనే స్ట్రీమింగ్‌లోకి వచ్చేసిందనే టాక్ వినిపిస్తుంది. విజయ్ ఆంటోని పేరు చెప్పగానే 'బిచ్చగాడు' సినిమానే గుర్తొస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ఇతడు.. కొన్నాళ్లకు ఆ ప్రొఫెషన్ కొనసాగిస్తూనే.. నటుడిగానూ మారాడు. అలా 'బిచ్చగాడు'తో తెలుగు, తమిళ భాషల్లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. దీని తర్వాత హీరోగా మూవీస్ చేస్తున్నాడు గానీ పెద్దగా సక్సెస్ అయితే అందుకోలేకపోతున్నాడు. అలా ఈ ఏడాది 'బిచ్చగాడు' సీక్వెల్‌తో వచ్చాడు. (ఇదీ చదవండి: ఓటీటీల్లోకి ఈ శుక్రవారం 18 మూవీస్) అక్కడే స్ట్రీమింగ్? ఈ సినిమా ఓ మాదిరిగా ఉన్నప్పటికీ.. ఫస్ట్ పార్ట్ కి ఉన్న క్రేజ్ వల్ల మిక్స్డ్ టాక్ వచ్చినా మంచి కలెక్షన్స్ రాబట్టింది. గత నెలలో అంటే జూలై 21న 'హత్య' అనే థ్రిల్లర్ సినిమాతో విజయ్ ఆంటోని ప్రేక్షకుల్ని పలకరించాడు. పోస్టర్, ట్రైలర్ తో అంచనాలు పెరిగినప్పటికీ.. థియేటర్లలో మాత్రం బోల్తా కొట్టేసింది. ఇప్పుడీ సినిమా ఓవర్ సీస్ ఓటీటీలో రిలీజైపోయినట్లు తెలుస్తోంది. మనదేశంలో మాత్రం తెలుగు, తమిళంలో ఆగస్టు 20 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. 'హత్య' కథేంటి? మోడల్ లైలా(మీనాక్షి చౌదరి)ని ఎవరో హత్య చేస్తారు. అయితే ఎలాంటి ఆధారాలు దొరకవు. ఈ క్రమంలోనే ఆమె మర్డర్ కేసుని డిటెక్టివ్ వినాయక్(విజయ్ ఆంటోని)తోపాటు ఐపీఎస్ అధికారి సంధ్య దర్యాప్తు చేస్తారు. చివరకు ఈ హత్యని ఎలా పరిష్కరించారు? అసలు మోడల్ని చంపింది ఎవరు? అనేది మెయిన్ స్టోరీ. (ఇదీ చదవండి: ఓటీటీలోకి ఆ బ్లాక్‌బస్టర్ థ్రిల్లర్.. తెలుగులోనూ) -
Hatya Review: ‘హత్య’ మూవీ రివ్యూ
టైటిల్: హత్య నటీనటులు: విజయ్ ఆంటోనీ, మీనాక్షి చౌదరి, రితికా సింగ్, మురళీ శర్మ, రాధిక శరత్‌కుమార్, సిద్ధార్థ్ శంకర్, అర్జున్ చిదంబరం, కిషోర్ కుమార్, సంకిత్ బోరా తదితరులు దర్శకత్వం: బాలాజీ కుమార్ సంగీతం: గిరీష్ గోపాలకృష్ణన్ సినిమాటోగ్రఫీ: శివకుమార్ విజయన్ విడుదల తేది: జులై 21, 2023 బిచ్చగాడు-2 మూవీతో రీసెంట్ సూపర్ హిట్ అందుకున్న తమిళ హీరో విజయ్ అంటోని.. నటించిన కొత్త మూవీ ‘కోలై’. తెలుగులో హత్య పేరుతో విడుదల చేశారు. మీనాక్షి చౌదరి, రితికా సింగ్ హీరోయిన్లుగా నటించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. ఓ మోస్తరు అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. ‘హత్య’ కథేంటంటే.. హైదరాబాద్‌కు చెందిన ఫేమస్ మోడల్ లైలా(మీనాక్షి చౌదరి) తన ఇంట్లో హత్యకు గురవుతుంది. ఈ కేసు కొత్తగా డ్యూటీలో చేరిన ఐపీఎస్ సంధ్య(రితికా సింగ్) చేతికి వస్తుంది. ఆమె ప్రముఖ డిటెక్టివ్ వినాయక్(విజయ్ ఆంటోనీ) సహాయం కోరుతుంది. ఇద్దరు కలిసి ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు. లైగా బాయ్‌ఫ్రెండ్ సతీష్(సిద్ధార్థ శంకర్), ప్రముఖ ఫోటోగ్రాఫర్ అర్జున్ వాసుదేవ్(అర్జున్ చిదంబరం), మోడల్ కో ఆర్డినేటర్ ఆదిత్య కౌశిక్(మురళీ శర్మ)తో పాటు బబ్లూ అనేవ్యక్తి (కిషోర్ కుమార్)ని విచారిస్తారు. మరి ఈ నలుగురిలో లైలాను హత్య చేసిందెవరు? ఎందుకు చేశారు? ఈ కేసు విషయంలో ఐపీఎస్ అధికారి సంధ్యకు డిటెక్టివ్ వినాయక్ ఎలాంటి సహాయం చేశాడు. కేసు విచారణలో వీరిద్దరికి ఎదురైన సవాళ్లు ఏంటి? చివరకు హంతకుడిని ఎలా గుర్తించారు? అనేది తెలియాలంటే ‘హత్య’సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ ఇది. ఇలాంటి చిత్రాల్లో ప్రేక్షకుడు థ్రిల్‌కు గురయ్యే సన్నివేశాలు ఉంటేనే కథతో లీనమవుతారు. కానీ ‘హత్య’లో అలాంటి సన్నివేశాలు తక్కువనే చెప్పాలి. పైగా ఈ తరహా కథలు తెలుగులో బోలెడు వచ్చాయి. ఈ చిత్రంలో కొత్తగా చూపించిదేమి లేదు.ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కూడా రొటీన్‌గా ఉంటుంది. లైలా హత్యతో కథ ప్రారంభం అవుతుంది. ఎలాంటి సాగదీత లేకుండా అసలు కథలోకి తీసుకెళ్లాడు దర్శకుడు. లైలా హత్య కేసు విచారణలో ఐపీఎస్ సంధ్య డెటెక్టివ్ వినాయక్ సహాయం కోరడం.. ఇద్దరు కలిసి విచారణ ప్రారంభించడం.. కొంతమంది అనుమానితుల్ని పిలిచి విచారించడం..ఇలా రొటీన్‌గా ఫస్టాఫ్ సాగుతుంది. ఇక మధ్యలో ఫ్యామిలీ ఆడియన్స్ కోసం విజయ్ ఆంటోనీ పాత్ర ఫ్యామిలీ నేపథ్యం, అతని కూతురు యాక్సిడెంట్ గురయ్యే సీన్స్‌ని చొప్పించారు. అయితే అవి సాఫీగా సాగుతున్న కథను అతికించినట్లు ఉన్నాయే తప్పా.. ఆడియన్స్‌కి కనెక్ట్ కాలేవు. ఇంటర్వెల్ సీన్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సెకండాఫ్‌లో కూడా రొటీన్‌గా సాగుతుంది. లైలా హత్యలో కేసులో అనుమానితులు వరుసగా చనిపోవడంతో అసలు హంతకుడు ఎవడనే క్యూరియాసిటీని ప్రేక్షకుల్లో కలుగుతుంది. అయితే సినిమా స్టార్టింగ్‌లోనే కాస్త జాగ్రత్తగా గమనిస్తే హంతకుడు ఎవరో ఈజీగా కనిపెట్టగలరు. ఓవరాల్‌గా ‘హత్య’ ఓ రొటీన్ క్రైమ్ థ్రిల్లర్. ఎవరెలా చేశారంటే.. డిటెక్టివ్ వినాయక్‌గా విజయ్ ఆంటోనీ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. పాత్రకు తగ్గట్టుగా సీరియస్ లుక్, గ్రే హెయిర్‌తో తెరపై కొత్తగా కనిపించాడు. ఇక మోడల్ లైలాగా మీనాక్షి చౌదరి తన పాత్ర పరిధిమేర నటించింది. కథంతా తన పాత్ర చుట్టే తిరుగుతుంది కానీ గుర్తిండిపోయే సన్నివేశాలేవి తనకు పడలేదు. ఐపీఎస్ సంధ్యగా రితికా సింగ్ నటన పర్వాలేదు. మురళీ శర్మ పాత్ర నిడివి తక్కువే అయినా ఉన్నంతగా బాగా నటించాడు. రాధికా శరత్ కుమార్, సిద్ధార్థ్ శంకర్, అజిత్ చిదంబరంతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.సాకేంతిక పరంగా సినిమా పర్వాలేదు.