ఏ సినిమా అయినా థియేటర్లలోకి రావడం లేటు.. బిగ్ స్క్రీన్‌పై చూసి ఆనందించేవాళ్లు కొందరైతే, ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేసేవాళ్లు మరికొందరు. వాళ్లకోసమా అన్నట్లు ప్రతివారం కొత్త మూవీస్ రిలీజ్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు అలానే ఓ చిత్రం ఓటీటీలో అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది. కాకపోతే మరీ రెండు వారాల్లోనే స్ట్రీమింగ్‌లోకి వచ్చేసిందనే టాక్ వినిపిస్తుంది.
విజయ్ ఆంటోని పేరు చెప్పగానే 'బిచ్చగాడు' సినిమానే గుర్తొస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ఇతడు.. కొన్నాళ్లకు ఆ ప్రొఫెషన్ కొనసాగిస్తూనే.. నటుడిగానూ మారాడు. అలా 'బిచ్చగాడు'తో తెలుగు, తమిళ భాషల్లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. దీని తర్వాత హీరోగా మూవీస్ చేస్తున్నాడు గానీ పెద్దగా సక్సెస్ అయితే అందుకోలేకపోతున్నాడు. అలా ఈ ఏడాది 'బిచ్చగాడు' సీక్వెల్‌తో వచ్చాడు.
(ఇదీ చదవండి: ఓటీటీల్లోకి ఈ శుక్రవారం 18 మూవీస్)
అక్కడే స్ట్రీమింగ్?
ఈ సినిమా ఓ మాదిరిగా ఉన్నప్పటికీ.. ఫస్ట్ పార్ట్ కి ఉన్న క్రేజ్ వల్ల మిక్స్‌డ్ టాక్ వచ్చినా మంచి కలెక్షన్స్ రాబట్టింది. గత నెలలో అంటే జూలై 21న 'హత్య' అనే థ్రిల్లర్ సినిమాతో విజయ్ ఆంటోని ప్రేక్షకుల్ని పలకరించాడు. పోస్టర్, ట్రైలర్ తో అంచనాలు పెరిగినప్పటికీ.. థియేటర్లలో మాత్రం బోల్తా కొట్టేసింది. ఇప్పుడీ సినిమా ఓవర్ సీస్ ఓటీటీలో రిలీజైపోయినట్లు తెలుస్తోంది. మనదేశంలో మాత్రం తెలుగు, తమిళంలో ఆగస్టు 20 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది.
'హత్య' కథేంటి?
మోడల్ లైలా(మీనాక్షి చౌదరి)ని ఎవరో హత్య చేస్తారు. అయితే ఎలాంటి ఆధారాలు దొరకవు. ఈ క్రమంలోనే ఆమె మర్డర్ కేసుని డిటెక్టివ్ వినాయక్(విజయ్ ఆంటోని)తోపాటు ఐపీఎస్ అధికారి సంధ్య దర్యాప్తు చేస్తారు. చివరకు ఈ హత్యని ఎలా పరిష్కరించారు? అసలు మోడల్‌ని చంపింది ఎవరు? అనేది మెయిన్ స్టోరీ.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి ఆ బ్లాక్‌బస్టర్ థ్రిల్లర్.. తెలుగులోనూ)
Comments
Please login to add a commentAdd a comment