ఓటీటీలో 'హెబ్బా పటేల్‌' రొమాంటిక్ సినిమా | Hebah Patel Dhoom Dhaam Movie Released In OTT, Check Streaming Platform Details Inside | Sakshi
Sakshi News home page

ఓటీటీలో 'హెబ్బా పటేల్‌' రొమాంటిక్ సినిమా

Jan 31 2025 12:23 PM | Updated on Jan 31 2025 2:02 PM

Hebah Patel Dhoom Dhaam Movie OTT Streaming Now

టాలీవుడ్‌లో భారీ తారాగణంతో గతేడాది నవంబర్‌లో విడుదలైన ‘‘ధూం ధాం’(Dhoom Dhaam Movie) సినిమా తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. చేతన్‌ కృష్ణ, హెబ్బా పటేల్‌ (hebah patel) జోడీగా నటించిన చిత్రాన్ని దర్శకుడు సాయి కిషోర్‌ మచ్చా ( Sai Kishore Macha) తెరకెక్కించారు. ఫ్రైడే ఫ్రేమ్‌ వర్క్స్‌ బ్యానర్‌పై ఎంఎస్‌ రామ్‌ కుమార్‌ భారీ అంచనాలతో నిర్మించారు. థ్రిల్లర్, పేట్రియాటిక్, స్కామ్ సినిమా కథలకు కాస్త కామెడీ యాడ్‌ చేస్తే ఎలా ఉంటుందో ఇందులో 'ధూం ధాం'గా చూపించారు. గతంలో  శ్రీను వైట్ల దగ్గర పనిచేసిన డైరెక్టర్‌ సాయి కిషోర్‌ ఈ చిత్రంతో ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేయడంతో కాస్త బెటర్‌గానే ఓపెనింగ్స్‌ వచ్చాయి.

ఎలాంటి ప్రకటన లేకుండానే సడెన్‌గా అమెజాన్‌ ప్రైమ్‌లో ధూం ధాం చిత్రం స్ట్రీమింగ్‌ అవుతుంది. ఈ మూవీలో హెబ్బా ప‌టేల్ కాస్త గ్లామ‌ర్ రోల్‌లో క‌నిపించి అందరినీ ఆకట్టుకుంది. మారుతి సినిమా  'రోజులు మారాయి'తో హీరోగా  ఎంట్రీ ఇచ్చిన చేత‌న్ కృష్ణ‌ ధూం ధాం అనేలా మెప్పించాడు. తండ్రీ కొడుకుల అనుబంధం కారణంగా  నాయిక జీవితంలో ఒక అనుకోని ఘటన జరుగుతుంది. దాన్ని సరిదిద్దేందుకు హీరో ఎలాంటి ప్రయత్నం చేశాడు అనేది కథ. సినిమా సరదాగా మొదలై ఇంటర్వెల్ దాకా మంచి సాంగ్స్, లవ్ ట్రాక్ తో ప్లెజెంట్ గా వెళ్తుంది. ఇంటర్వెల్ నుంచి పెళ్లి ఇంట జరిగే సందడి మిమ్మల్ని హిలేరియస్ గా నవ్విస్తుంది. వెన్నెల కిషోర్ సెకండాఫ్ లో బాగా నవ్విస్తాడు.

కథేంటంటే..
రామరాజు(సాయి కుమార్‌)కి అతని కొడుకు కార్తిక్‌(చేతన్‌ కృష్ణ)అంటే చాలా ఇష్టం. కొడుకు సంతోషం కోసం ఏ పనైనా చేస్తాడు. అన్ని విషయాలు కొడుకుతో చర్చించుకుంటాడు. కార్తిక్‌ కూడా అంతే. నాన్నను చాలా ప్రేమిస్తాడు. అమ్మా నాన్న, స్నేహితులే ప్రపంచంగా బతుకున్న కార్తిక్‌ జీవితంలోకి సుహానా(హెబ్బా పటేల్‌) వస్తుంది. ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడతారు. ఇంట్లో వాళ్లకి చెప్పి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అప్పుడు ఇరు కుటుంబాల్లో కొన్ని సమస్యలు వస్తాయి. అవేంటి? కార్తిక్‌, సుహానా కుటుంబాల మధ్య ఉన్న వైరం ఏంటి? తండ్రి కోసం కార్తిక్‌ చేసిన తప్పేంటి? అంతకు ముందు కొడుకు కోసం రామరాజు చేసిన మిస్టేక్‌ ఏంటి? ఆ తప్పు కారణంగా సుహాన ఫ్యామిలీ పడిన ఇబ్బందులు ఏంటి? ఈ కథలో వెన్నెక కిశోర్‌ పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement