hebah patel
-
హరుడు మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసిన డైరెక్టర్ ఆర్జీవీ.. ఫోటోలు
-
'ధూం ధాం' సక్సెస్ మీట్.. చీరలో హెబ్బా సూపర్! (ఫొటోలు)
-
Dhoom Dhaam Review: హెబ్బా పటేల్ ‘ధూం ధాం’ మూవీ రివ్యూ
టైటిల్: ధూం ధాంనటీనటులు: చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్, సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ, శివన్నారాయణ, బెనర్జీ, సాయి శ్రీనివాస్, ప్రవీణ్, నవీన్ నేని, గిరిధర్, భద్రమ్ తదితరులునిర్మాత:ఎంఎస్ రామ్ కుమార్స్టోరీ, స్క్రీన్‌ప్లే: గోపీ మోహన్దర్శకత్వం: సాయి కిషోర్ మచ్చాసంగీతం: గోపీ సుందర్సినిమాటోగ్రఫీ - సిద్ధార్థ్ రామస్వామిఎడిటింగ్ - అమర్ రెడ్డి కుడుముల విడుదల తేది: నవంబర్ 8, 2024కథేంటంటే..రామరాజు(సాయి కుమార్)కి అతని కొడుకు కార్తిక్(చేతన్ కృష్ణ)అంటే చాలా ఇష్టం. కొడుకు సంతోషం కోసం ఏ పనైనా చేస్తాడు. అన్ని విషయాలు కొడుకుతో చర్చించుకుంటాడు. కార్తిక్ కూడా అంతే. నాన్నను చాలా ప్రేమిస్తాడు. అమ్మా నాన్న, స్నేహితులే ప్రపంచంగా బతుకున్న కార్తిక్ జీవితంలోకి సుహానా(హెబ్బా పటేల్) వస్తుంది. ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడతారు. ఇంట్లో వాళ్లకి చెప్పి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అప్పుడు ఇరు కుటుంబాల్లో కొన్ని సమస్యలు వస్తాయి. అవేంటి? కార్తిక్, సుహానా కుటుంబాల మధ్య ఉన్న వైరం ఏంటి? తండ్రి కోసం కార్తిక్ చేసిన తప్పేంటి? అంతకు ముందు కొడుకు కోసం రామరాజు చేసిన మిస్టేక్ ఏంటి? ఆ తప్పు కారణంగా సుహాన ఫ్యామిలీ పడిన ఇబ్బందులు ఏంటి? ఈ కథలో వెన్నెక కిశోర్ పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాలకు టాలీవుడ్లో మంచి ఆదరణ ఉంటుంది. అయితే ఈ మధ్యకాలంలో కుటుంబం మొత్తం కలిసి చూసే సినిమాలు రావడం లేదు. ఎక్కువ రా, రస్టిక్, యాక్షన్ సినిమాలే వస్తున్నాయి. చాలా కాలం తర్వాత తెలుగు తెరపై వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం ‘ధూం ధాం’. దర్శకుడు సాయి కిషోర్ ఎంచుకున్న కథ పాతదే అయినా.. దానికి ఇచ్చిన ట్రీట్మెంట్ కొత్తగా ఉంది. ఫాదర్-సన్ ఎమోషన్, తండ్రీ- కూతుళ్ల బాండింగ్‌తో ఫ్యామిలీ మొత్తం కలిసి చూసేలా ఓ మంచి ప్రేమ కథను ఈ చిత్రం ద్వారా చెప్పారు. ఫస్టాప్ అంతా హీరోహీరోయిన్ల లవ్ ట్రాక్ చుట్టూ సరదాగా సాగుతుంది. పరిచయమే లేని ఓ అమ్మాయి వచ్చి ప్రేమిస్తున్నానంటూ హీరోకి చెప్పడం.. ఆమె ఎవరో తెలియక హీరో పడే తిప్పలు, ఈక్రమంలో వచ్చే పాటలు, ఫన్నీ సీన్లు ఆకట్టుకుంటాయి. అయితే హీరోహీరోయిన్ల మధ్య సాగే లవ్‌స్టోరీ పాత సినిమాలను గుర్తు చేసినా.. దాని చుట్టు అల్లుకున్న సీన్లు కథకి ఫ్రెస్నెస్ని తెచ్చాయి. ఇక సెకండాఫ్‌లో వెన్నెల కిశోర్ పాత్ర ఎంట్రీ ఇచ్చిన తర్వాత కథనం హిలేరియస్‌గా సాగుతుంది. ముఖ్యంగా మందు సిట్టింగ్ సీన్లో ‘ఎక్స్ప్రెషన్స్’ పేరుతో సీనియర్ నటులు ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ సినిమాల్లోని డైలాగ్స్‌ని వెన్నెల కిశోర్ చెప్పడం సినిమాకే హైలెట్. వెన్నెల కిశోర్‌కి సంబంధించిన ప్రతీ సీన్ థియేటర్లో నవ్వులు పూయిస్తుంది. ఎక్కడా వల్గారిటీ లేకుండా క్లీన్ కామెడీతో కథనాన్ని నడిపించడం సినిమాకు ప్లస్ అయిందనే చెప్పాలి. కొత్తదనం కోరుకోకుండా.. ఎంటర్టైమెంట్ ఉంటే చాలు అనుకునే ప్రేక్షకులకు ధూం ధాం సినిమా నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. హీరో చేతన్ కృష్ణకి ఇది తొలి సినిమా. అయినా కూడా ఉన్నంతలో చక్కగానే నటించాడు. అయితే నటన పరంగా ఇంకొంత కసరత్తు చేస్తే..భవిష్యత్తులో మంచి హీరో అయ్యే చాన్స్ ఉంది. హెబ్బా పటేల్ ఈ తరహా పాత్రలు గతంలో చాలానే చేసింది కాబట్టి సుహాన పాత్రలో ఈజీగా నటించేసింది. హీరోహీరోయిన్ల ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఇక ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన మరో పాత్ర వెన్నెల కిశోర్‌ది. హీరో కజిన్‌గా ఆయన పండించిన కామెడీ సినిమా స్థాయిని పెంచేసింది. సెకండాఫ్ మొత్తం ఆయన పాత్ర చుట్టే తిరుగుతుంది. ఓ రకంగా ఈ సినిమాకు వెన్నెల కిశోరే హీరో అని చెప్పొచ్చు. హీరో తండ్రిగా సాయి కుమార్ మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక హీరో స్నేహితులుగా ప్రవీణ్, నవీన్ పండించిన కామెడీ సినిమాకు ప్లస్ అయింది. గోపరాజు రమణ, వినయ్ వర్మ, బెనర్జీతో పాటు మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు.సాంకేతికంగా సినిమా బాగుంది. గోపీ సుందర్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం సినిమా స్థాయి పెంచేసింది. చివరిలో వచ్చే మంగ్లీ సాంగ్ అందరిని ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. పోలెండ్ అందాలను తెరపై చక్కగా చూపించారు. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. క్వాలిటీ విషయంలో నిర్మాత రామ్ కుమార్ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదని సినిమా చూస్తే అర్థమవుతుంది. రేటింగ్: 2.75/5 -
ట్రెండ్‌కు భిన్నంగా ‘ధూం ధాం’.. నవ్వులు గ్యారెంటీ: హీరో చేతన్ కృష్ణ
‘ఇప్పుడు థ్రిల్లర్స్ ట్రెండ్ నడుస్తోంది. నేనూ అదే చేస్తే వాటిలో మరొక థ్రిల్లర్ అవుతుంది. అందుకే ఇప్పుడున్న ట్రెండ్‌కు భిన్నంగా కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ‘ధూం ధాం’ చేశాను’ అన్నారు యంగ్ హీరో చేతన్ కృష్ణ. సాయి కిషోర్ మచ్చా దర్శకత్వంలో చేతన్ కృష్ణ-హెబ్బా పటేల్ జంటగా నటించిన చిత్రం ‘ధూం ధాం’. సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ కీలక పాత్రలు పోషించారు. లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరో చేతన్ కృష్ణ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. → నాకు యాక్టింగ్ అంటే ప్యాషన్. సినిమాల్లోకి రావాలని ఎప్పటినుంచో కోరిక. ఫస్ట్ ర్యాంక్ రాజు, బీచ్ రోడ్ చేతన్, రోజులు మారాయి, గల్ఫ్ అనే మూవీస్ చేశాను. ఆ సినిమాల్లో కొన్నింటికి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ప్రేక్షకుల నుంచి గుర్తింపు వచ్చింది.→ నాకు గోపీ మోహన్ గారి స్క్రిప్ట్స్ ఇష్టం. సకుటుంబంగా ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేసేలా ఆయన స్క్రిప్ట్స్ ఇస్తారు. అలాంటి మూవీ ఒకటి నేనూ చేయాలని అనుకున్నాను. ఇప్పటిదాకా విభిన్న తరహా చిత్రాల్లో నటించాను. ఒకసారి ఒక బిగ్ మూవీ చేద్దామని "ధూం ధాం" మొదలుపెట్టాం.→ తండ్రీ కోసం కొడుకు, కొడుకు కోసం తండ్రి ఎక్కడిదాకా అయినా వెళ్తారు అనే కాన్సెప్ట్ తో ఈ సినిమాను రూపొందించాం. దానికి అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించాం. మా మూవీలో ఫాదర్ తన కొడుకు అన్నింట్లో ది బెస్ట్ గా ఉండాలనుకుంటాడు. ఆయన చేసిన గారాబంతో కొడుకు మరింత అల్లరిగా తయారవుతాడు. తన వల్ల ఒక అమ్మాయి జీవితంలో ఏర్పడిన సమస్యకు తనే పరిష్కారం చూపించాలని ప్రయత్నం చేస్తాడు.→ మా మూవీలో చాలా మంది పేరున్న ఆర్టిస్టులు ఉన్నారు. వారితో పాటు నటించడానికి బాగా ప్రిపేర్ అయ్యేవాడిని. వాళ్ల టైమింగ్ తో మ్యాచ్ చేసేందుకు ప్రయత్నించా. వెన్నెల కిషోర్ గారి టైమింగ్ పట్టుకోవడం కష్టమైంది. ఆయన సినిమా సెకండాఫ్ లో వస్తారు. సినిమా మొత్తం ఉంటారు. ఈ సెకండాఫ్ మొత్తం పెళ్లి ఇంట సందడితో సాగుతుంది. ఇదే మా "ధూం ధాం" సినిమాకు ఆకర్షణగా నిలుస్తుంది. సెకండాఫ్ లో థియేటర్ నిండా నవ్వులు నిండిపోతాయి.→ అదుర్స్ లాంటి సినిమాల్లో హీరో ఒక ఫేమస్ కమెడియన్ పక్కనే ఉంటూ కథ సాగుతుంది. అలా "ధూం ధాం"లో కూడా నేను వెన్నెల కిషోర్ గారి పక్కనే ఉంటాను. మూవీ షూటింగ్ టైమ్ లో కిషోర్ గారు చాలా సపోర్ట్ చేశారు. సీన్స్ చేసే ముందు నాతో డిస్కస్ చేసేవారు. హెబ్బా పటేల్ తో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. తను షూటింగ్ స్టార్ట్ కాక ముందు చాలా ఎనర్జిటిక్ గా యాక్టివ్ గా ఉంటుంది. కెమెరా రోల్ కాగానే తన క్యారెక్టర్ లోకి మారిపోతుంది.→ మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లు రిలీజ్ చేయడం మా సినిమాకు మరో అడ్వాంటేజ్. గోపీ సుందర్ గారు ఛాట్ బస్టర్ సాంగ్స్ చేశారు. ఒక సెంటర్ లో ఒక మంచి థియేటర్ ఉంటుంది. ఏ సినిమా అయినా అక్కడే ప్రేక్షకులు చూసేందుకు ఇష్టపడతారు. అలాంటి ఒకట్రెండు థియేటర్స్ చిన్న డబ్బింగ్ సినిమాలకు ఇచ్చారు. ఆ విషయంపై నేను ప్రీ రిలీజ్ లో స్పందించాను. అయితే మాకు కావాల్సినన్ని మంచి థియేటర్స్ దొరికాయి. -
‘ధూమ్ ధామ్’ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ (ఫొటోలు)
-
Hebah patel : హెబ్బా పటేల్ గ్లామరస్ పోజులు (ఫొటోలు)
-
‘ధూం ధాం’లో ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ: డైరెక్టర్ సాయికిషోర్
ఈ మధ్య మనం థ్రిల్లర్, పేట్రియాటిక్, స్కామ్ మూవీస్ చూస్తున్నాం. వాటిలో కామెడీ మిస్ అయ్యాం. ఆ మిస్ అయిన ఎంటర్టైన్మెంట్ని మా "ధూం ధాం" సినిమాలో చూస్తారు. తండ్రీ కొడుకుల మధ్య అనుబంధం నేపథ్యంలో సాగే కథ ఇది. దాంతో పాటు మంచి ప్రేమ కథ ఉంటుంది’ అన్నారు డైరెక్టర్ సాయికిషోర్ మచ్చా. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘ధూం ధాం’. చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం నవంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా డైరెక్టర్ సాయికిషోర్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ నేను శ్రీను వైట్ల గారి దగ్గర వర్క్ చేశాను. ఉషా కిరణ్ మూవీస్ లో ఓ సినిమాకు ప్లాన్ చేశాం. అది కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత శర్వానంద్ హీరోగా నటించిన శ్రీకారం మూవీకి డైరెక్షన్ టీమ్ ను లీడ్ చేశాను. ఆ తర్వాత త్రిష హీరోయిన్ గా నటించిన బృందా సిరీస్ కు వర్క్ చేశాను. ఇలా మూవీస్ కు వర్క్ చేస్తున్న టైమ్ లో రైటర్ గోపీమోహన్ గారు "ధూం ధాం" సినిమా ప్రాజెక్ట్ గురించి చెప్పారు. కథ నాకు బాగా కనెక్ట్ అయ్యింది. అలా ఈ సినిమా మొదలైంది.→ మొత్తం షూటింగ్ అమెరికాలో చేయాలని ముందుగా అనుకున్నాం. అయితే అనుమతుల కోసం ఆరు నెలలు ప్రయత్నించినా కుదరలేదు. ఆ తర్వాత యూరప్ లో షూటింగ్ చేద్దామని పోలెండ్ ను సెలెక్ట్ చేసుకున్నాం. అక్కడ చిత్రీకరణ జరిపాం. పోలెండ్ లో కూడా మాకు ఇండియా ఉన్నట్లు భోజన, ఇతర వసతులు కల్పించారు నిర్మాత రామ్ కుమార్. ఆయన గురించి, ఆయన మంచితనం గురించి, సినిమా మీద ఉన్న ప్యాషన్ గురించి నేను ఎంత చెప్పినా తక్కువే.→ తండ్రీ కొడుకుల అనుబంధం కారణంగా వల్ల నాయిక జీవితంలో ఒక అనుకోని ఘటన జరుగుతుంది. దాన్ని సరిదిద్దేందుకు హీరో ఎలాంటి ప్రయత్నం చేశాడు అనేది కథ. సినిమా సరదాగా మొదలై ఇంటర్వెల్ దాకా మంచి సాంగ్స్, లవ్ ట్రాక్ తో ప్లెజెంట్ గా వెళ్తుంది. ఇంటర్వెల్ నుంచి పెళ్లి ఇంట జరిగే సందడి మిమ్మల్ని హిలేరియస్ గా నవ్విస్తుంది. వెన్నెల కిషోర్ సెకండాఫ్ లో బాగా నవ్విస్తాడు.→ ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేస్తున్నారు. మా ప్రొడ్యూసర్ రామ్ కుమార్ గారికి మైత్రీ నవీన్ గారు మంచి ఫ్రెండ్. అలా కాంటాక్ట్ అయి సినిమా చూపించాం. వారికి బాగా నచ్చి రిలీజ్ చేసేందుకు ముందుకొచ్చారు.→ హీరో చేతన్ మంచి టాలెంటెడ్ హీరో. అతనిలో నటుడిగా మంచి టైమింగ్ ఉంది. తండ్రి కోసం కొడుకు పడే ఒక ఆరాటాన్ని తన పాత్రలో చూస్తారు. కామెడీ, ఫైట్స్, రొమాంటిక్, ఎమోషనల్..ఇలా ప్రతి సీన్ లో చేతన్ బాగా నటించాడు. అతనికి ఈ సినిమా మంచి ల్యాండ్ మార్క్ మూవీ అవుతుంది. హెబా పటేల్ కూడా తన క్యారెక్టర్ లో ఆకట్టుకునేలా నటించింది. సెట్ లో కూడా తను చాలా యాక్టివ్ గా ఉండేది.→ "ధూం ధాం" సినిమా మీరు కొనే టికెట్ ధరకు విలువైన ఎంటర్ టైన్ మెంట్ ఇస్తుంది. రీసెంట్ గా వైజాగ్ లో పెయిడ్ ప్రీమియర్స్ వేశాం. ఆ ప్రీమియర్స్ లో దాదాపు ప్రతి సీన్ కు ప్రేక్షకులు బాగా నవ్వుకున్నారు. వాళ్ల దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్ తో చాలా హ్యాపీగా అనిపించింది. ఈనెల 8వ తేదీన అన్ని థియేటర్స్ నుంచి ఇలాంటి సూపర్బ్ రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నాం. -
'ధూం ధాం'గా హెబ్బా పటేల్ కొత్త సినిమా ట్రైలర్
చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా కొత్త సినిమా 'ధూం ధాం'. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ విడుదలైంది. ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్‌పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా దర్శకుడు సాయి కిషోర్ మచ్చా తెరకెక్కిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు గోపీ మోహన్ కథ అందిస్తున్నారు. నవంబర్ 8న థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది.ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్‌ను ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేశారు. 'మల్లెపూల టాక్సీ..' అంటూ సాగే పాటకు సోషల్‌మీడియాలో మంచి గుర్తింపు దక్కింది. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా.. గోపీ సుందర్ కంపోజ్ చేశారు. గాయని మంగ్లీ ఈ పాటను ఎనర్జిటిక్ పాడటమే కాదు లిరికల్ వీడియోలో స్టెప్స్ వేసి ఆకట్టుకుంది. ఈ చిత్రంలో సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ, వన్నారాయణ, బెనర్జీ, సాయి శ్రీనివాస్, ప్రవీణ్, నవీన్ నేని, గిరిధర్, భద్రమ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
ఓటీటీలో టాలీవుడ్ మూవీకి ఊహించని రెస్పాన్స్..!
చైతన్య రావ్, హెబ్బా పటేల్ జంటగా నటించిన చిత్రం 'హనీమూన్ ఎక్స్‌ప్రెస్'. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కించిన ఈ మూవీ అభిమానులను ఆడియన్స్‌ను అలరిస్తోంది. జూన్ 21న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం అభిమానులను పెద్దగా మెప్పించలేకపోయింది. తాజాగా ఈ మూవీ ఎలాంటి ప్రకటన లేకుండానే సడన్‌గా అమెజాన్ప్రైమ్లోకి వచ్చేసింది.ఈ రోజు నుంచే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ చిత్రానికి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. థియేటర్లలో పెద్దగా రాణించలేకపోయిన చిత్రం ఓటీటీ ప్రియులను తెగ ఆకట్టుకుంటోంది. ఒక్కరోజులోనే ఈ సినిమా ట్రెండింగ్‌లో వచ్చేసింది. ప్రస్తుతం తరం ఎదుర్కొంటోన్న ప్రేమ, పెళ్లి, విడాకులు అనే కాన్సెప్టులతో బాల రాజశేఖరుని దర్శకత్వంలో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, సుహాసిని, అరవింద్ కృష్ణ, అలీ, సురేఖ వాణి, రవి వర్మ కీలక పాత్రల్లో నటించారు. -
విల్లులా ఒళ్లు వంచేసిన షాలినీ.. బిగ్‌బాస్ స్రవంతి గ్లామర్ ట్రీట్!
గులాబీ పెట్టుకున్న గులాబీలో కీర్తి సురేశ్గోల్డ్ కంటే బ్రైట్‌గా మెరిసిపోతున్న శ్రీలీలఒళ్లుని విల్లులా వంచేసి హోయలు పోతున్న షాలీనీ పాండేఅద్దాల డ్రస్సులో జిగేలుమనేలా హెబ్బా పటేల్అందాల కుందనపు బొమ్మలా యాంకర్ విష్ణుప్రియజడతో పరాచకాలు ఆడేస్తున్న శ్రుతిహాసన్చీరలో అందాలన్నీ చూపించేస్తున్న బిగ్‌బాస్ స్రవంతిAngel in Gold 💫 Our @sreeleela14 as showstopper, show openerThrowback to @TimesFashionWk @BangaloreTimes1 By @studiobhargavi #Sreeleela pic.twitter.com/9a6qaKvunH— Team Sreeleela (@Teamsreeleela) July 30, 2024 View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Shalini Pandey (@shalzp) View this post on Instagram A post shared by Hebah P (@ihebahp) View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by sravanthi_chokarapu (@sravanthi_chokarapu) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Jyothi Poorvaj (Jayashree Rai K K) (@jyothipoorvaj) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by mon (@imouniroy) -
అబ్బా అనేంత అందంతో హెబ్బా.. సూపర్ క్యూట్‌నెస్ (ఫొటోలు)
-
రిలేషన్ షిప్ పై కామెంట్స్ చేసిన హెబ్బా పటేల్..
-
చీరకట్టులో హెబ్బా పటేల్ క్యూట్ లుక్స్.. (ఫొటోలు)
-
‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఎన్ని కోట్లు పెట్టినా అది ఉంటేనే థియేటర్లకు వస్తారు: టాలీవుడ్ డైరెక్టర్
చైతన్య రావ్, హెబ్బా పటేల్ జంటగా నటించిన తాజా చిత్రం 'హనీమూన్ ఎక్స్ ప్రెస్;. ఈ చిత్రాన్ని న్యూ రీల్ ఇండియా బ్యానర్‌పై కేకేఆర్, బాలరాజ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను రొమాంటిక్ కామెడీ కథాంశంగా దర్శకుడు బాల రాజశేఖరుని తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 21న థియేటర్లలో సందడి చేయనుంది. తాజాగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టాలీవుడ్ రచయిత విజయేంద్రప్రసాద్, ప్రసాద్ సంస్థల అధినేత రమేష్ ప్రసాద్ ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు.విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. 'హనీమూన్ ఎక్స్ ప్రెస్ మూవీ దర్శకుడు బాల మంచి డైరెక్టర్. హాలీవుడ్ లో మూవీస్ చేశాడు. ఇప్పుడు తెలుగులో దర్శకుడిగా అడుగుపెడుతున్నాడు. అతనితో పాటు టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్'అని అన్నారు. కేఎల్ ప్రసాద్ మాట్లాడుతూ..'హనీమూన్ ఎక్స్ ప్రెస్ సినిమా కంటెంట్ చాలా ఇన్నోవేటివ్‌గా ఉంది. ఈతరం ప్రేక్షకులు బాగా ఇష్టపడే సినిమా. చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్' చెప్పారు.దర్శకుడు బాల రాజశేఖరుని మాట్లాడుతూ..'హనీమూన్ ఎక్స్ ప్రెస్ సినిమాకు నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వారివల్లే హనీమూన్ ఎక్స్ ప్రెస్‌ను మీ ముందుకు తీసుకొస్తున్నాం. ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ప్రసాద్ ల్యాబ్స్నే సెలెక్ట్ చేసుకున్నా. ఎందుకంటే ఇది మన తెలుగు సినిమా లెగసీని కొనసాగిస్తున్న ప్లేస్. ఈ సినిమా యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ అందరికీ నచ్చేలా రూపొందించాం. ఎన్ని కోట్ల రూపాయల సినిమా అయినా కంటెంట్ బాగుంటేనే ప్రేక్షకులు చూస్తారు. థియేటర్‌కు వెళ్లాక ఒక ప్రేక్షకుడిని మెప్పించేది కంటెంట్ మాత్రమే. మంచి రొమాంటిక్ కామెడీ మూవీగా హనీమూన్ ఎక్స్ ప్రెస్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మా సినిమాకు మీ ఆదరణ దక్కుతుందని కోరుకుంటున్నా' అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, సుహాసిని, అరవింద్ కృష్ణ, అలీ, సురేఖ వాణి, రవి వర్మ కీలక పాత్రలు పోషించారు. -
ఫన్నీగా, రొమాంటిక్‌గా ‘హనీమూన్ ఎక్స్ ప్రెస్’టీజర్
చైతన్య రావ్, హెబ్బా పటేల్ జంటగా నటిస్తున్న సినిమా "హనీమూన్ ఎక్స్ ప్రెస్". ఈ చిత్రాన్ని న్యూ రీల్ ఇండియా బ్యానర్ పై కేకేఆర్, బాలరాజ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాని ప్రయోగాత్మకంగా ఫ్యూచరిస్టిక్ రొమాంటిక్ కామెడీ గా దర్శకుడు బాల రాజశేఖరుని రూపొందించారు. హనీమూన్ ఎక్స్ ప్రెస్ సినిమా ఈ నెల జూన్ 21న వరల్డ్ వైడ్ థియేటర్లలో రిలీజ్ అవుతుంది.ఈ నేపథ్యంలో చిత్ర టీజర్ ను అమల అక్కినేని విడుదల చేశారు. ఈ సందర్భంగా అమల అక్కినేని మాట్లాడుతూ, “యాక్టింగ్, స్క్రీన్ ప్లే రైటింగ్ లో ప్రొఫెసర్ గా బాల అమెరికాలో చాలా కాలం పనిచేశారు. అమెరికాలో ఉన్న, ఆయనకు ఏదో ఒకరోజు తెలుగు సినిమాకు దర్శకత్వం వహించాలని ఉండేది. ఆయన కల ఈ హనీమూన్ ఎక్స్‌ప్రెస్ సినిమాతో నెరవేరినందుకు సంతోషంగా ఉంది. టీచింగ్ ఒక బాధ్యత అయితే ఫిల్మ్ మేకింగ్ మరో సవాలు లాంటిది. మా అన్నపూర్ణ కాలేజ్ ఫాకల్టీలు, స్టాఫ్, స్టూడెంట్స్ ను బాల హనీమూన్ ఎక్స్ ప్రెస్ మూవీ టీమ్ లోకి తీసుకున్నందుకు సంతోషంగా ఉంది. సినిమా టీజర్ ఫన్నీగా, రొమాంటిక్ గా ఉంది. ఈ రోజు సమాజంలోని రొమాంటిక్, వివాహ బంధాలను గురించి ఒక బలమైన కథను చూపించబోతున్నట్లు టీజర్ ద్వారా తెలుస్తోంది. ఈరోజు పరిస్థితులకు అద్దం పట్టేలా ఉండే సబ్జెక్ట్ ఇది. ఈ నెల జూన్ 21న, హనీమూన్ ఎక్స్ ప్రెస్ సినిమా రిలీజ్ అవుతుంది. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమా ని ఆదరించి, విజయాన్ని అందిస్తారని కోరుకుంటున్నాను. బాల, ఆయన టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను,” అన్నారు. మంచి రొమాంటిక్ కామెడీ మూవీగా హనీమూన్ ఎక్స్ ప్రెస్ తెరకెక్కించామని, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆట్టుకుంటుందని దర్శకుడు బాల రాజశేఖరుని అన్నారు. -
హెబ్బా పటేల్ తాజా చిత్రం.. మంగ్లీ సాంగ్ వచ్చేసింది!
చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా 'ధూం ధాం'. ఈ చిత్రాన్ని ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్‌పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా దర్శకుడు సాయి కిషోర్ మచ్చా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి గోపీ మోహన్ కథ అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది.తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. 'మల్లెపూల టాక్సీ..' అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా.. గోపీ సుందర్ కంపోజ్ చేశారు. గాయని మంగ్లీ ఈ పాటను ఎనర్జిటిక్ పాడటమే కాదు లిరికల్ వీడియోలో స్టెప్స్ వేసి ఆకట్టుకుంది. కాగా.. ఈ చిత్రంలో సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ, వన్నారాయణ, బెనర్జీ, సాయి శ్రీనివాస్, ప్రవీణ్, నవీన్ నేని, గిరిధర్, భద్రమ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
హనీమూన్ ఎక్స్‌ప్రెస్: టైటిల్ సాంగ్ రిలీజ్
చైతన్య రావు, హెబ్బా పటేల్ హీరో, హీరోయిన్ గా నటించిన చిత్రం "హనీమూన్ ఎక్స్‌ప్రెస్". ఎన్ ఆర్ ఐ ఎంటర్టైన్మెంట్స్ (యు ఎస్ ఎ) సమర్పణలో న్యూ రీల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై కె.కె.ఆర్, బాల రాజ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. తనికెళ్ల భరణి, సుహాసిని ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి బాల రాజశేఖరుని దర్శకుడు. కళ్యాణి మాలిక్ సంగీతం అందించారు.ఇప్పటికే హనీమూన్ ఎక్స్‌ప్రెస్ చిత్రం నుంచి మూడు పాటలు విడుదలై ఆకట్టుకున్నాయి. ఆదివారం నాడు ఈ చిత్రంలోని టైటిల్ ట్రాక్‌ను దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "దర్శకుడు బాల నాకు బాగా కావాల్సిన మనిషి. అమెరికాలో చాలా మందికి సినిమా గురించి శిక్షణ ఇచ్చి తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్‌లో డీన్ గా పనిచేశాడు.ఇప్పుడు సొంత డైరెక్షన్ లో హనీమూన్ ఎక్స్‌ప్రెస్ అనే మంచి టైటిల్ తో చిత్రాన్ని నిర్మించారు. పాప్ సింగర్ స్ఫూర్తి జితేందర్ ఈ టైటిల్ పాటను స్వరపరచి ఆలపించింది. సాంగ్ బాగుంది. మా దర్శకుడు బాలకు, సినిమాలోని నటీనటులకు అందరికి శుభాకాంక్షలు, ఈ చిత్రం మంచి విజయం సాధించాలి" అని కోరుకున్నారు. -
హెర్బల్ ప్రొటీన్ ఉత్పత్తులను ఆవిష్కరించిన..హెబ్బాపటేల్ (ఫొటోలు)
-
హనీమూన్ ఎక్స్‌ప్రెస్: 'క్యూట్‌గా స్వీట్‌గా' సాంగ్ వచ్చేసింది..
చైతన్యా రావు, హెబ్బా పటేల్ ‘క్యూట్‌గా... స్వీట్‌గా...’ అంటూ పాట పాడుకున్నారు. ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ చిత్రం కోసమే ఇలా పాడుకున్నారు. చైతన్యా రావు, హెబ్బా పటేల్ జంటగా రూపొందిన చిత్రం ఇది. ఎన్ఆర్ఐ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో బాల రాజశేఖరుని దర్శకత్వంలో కేకేఆర్, బాల రాజ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలోని ‘క్యూట్‌గా... స్వీట్‌గా...’ అంటూ సాగే పాటను హీరో అడివి శేష్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాట స్వీట్‌గా ఉంది. సినిమా హిట్టవ్వాలన్నారు. చిత్ర సంగీతదర్శకుడు కల్యాణీ మాలిక్ స్వరపరిచిన ఈ సాంగ్‌కు కిట్టూ విస్సాప్రగడ సాహిత్యం అందించగా దీపు పాడారు. ‘‘ఇదొక మంచి మ్యూజికల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ’’ అని బాల రాజశేఖరుని అన్నారు. -
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
సురేఖావాణి కూతురు సుప్రీత అందాల జాతరచీరకట్టులో ఎక్స్ట్రా క్యూట్‌గా నయని పావనిగ్లామర్ చూపిస్తూ పిచ్చెక్కిస్తున్న సీరత్ కపూర్లేటు వయసులోనే ఆ రేంజ్ హాట్‌గా శ్రియచీరలో సంప్రదాయంగా 'గుంటూరు కారం' మీనాక్షిమత్తెక్కించేలా చూస్తూ రెచ్చగొడుతున్న అనుకృతి View this post on Instagram A post shared by Bandaru Supritha Naidu (@_supritha_9) View this post on Instagram A post shared by 𝐒𝐀𝐀𝐍𝐕𝐈𝐄 𝐓𝐀𝐋𝐋𝐖𝐀𝐑 (@saanvitalwar9) View this post on Instagram A post shared by Sai Pavani Raju (@nayani_pavani) View this post on Instagram A post shared by Seerat Kapoor (@iamseeratkapoor) View this post on Instagram A post shared by swathishta R (@swathishta_krishnan) View this post on Instagram A post shared by Deepak Vijay (@deepak_vijay_photography) View this post on Instagram A post shared by Jamie Lever (@its_jamielever) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Preethi Anju Asrani (@thepreethiasrani) View this post on Instagram A post shared by Pooja Bhalekar (@ipoojabhalekar) View this post on Instagram A post shared by Keira Rathore (@kiran_rathore_official) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Hebah P (@ihebahp) View this post on Instagram A post shared by तरुण चौहान (@tarunchouhan_ph) View this post on Instagram A post shared by Dhivya Duraisamy (@dhivya__duraisamy) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Anukreethy Vas (@anukreethy_vas) View this post on Instagram A post shared by Sukrithi Ambati (@itsmesukrithi) View this post on Instagram A post shared by Larissa Bonesi (@larissabonesi) -
సముద్రం తీరంలో తేజస్వీ ప్రకాశ్ చిల్.. హెబ్బా పటేల్ స్మైలీ లుక్స్..!
మెక్సికోలో చిల్ అవుతోన్న తేజస్వీ ప్రకాశ్.. మంచుకొండల్లో భూమిక చావ్లా చిల్.. లైట్ బ్లూ డ్రెస్‌లో హెబ్బా పటేల్ స్మైలీ లుక్స్.. పింక్ డ్రెస్‌లో రీతూ చౌదరి హోయలు.. View this post on Instagram A post shared by Suma Kanakala (@kanakalasuma) View this post on Instagram A post shared by Subhashree Rayaguru ( Subha ) (@subhashree.rayaguru) View this post on Instagram A post shared by Hebah P (@ihebahp) View this post on Instagram A post shared by Bhumika Chawla (@bhumika_chawla_t) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Tejasswi Prakash (@tejasswiprakash) -
Odela 2: నాగ సాధువుగా తమన్నా!
తమన్నా లీడ్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘ఓదెల 2’. హీరోయిన్ హెబ్బా పటేల్ లీడ్ రోల్లో నటించిన ‘ఓదెల రైల్వేస్టేషన్’ సినిమాకి సీక్వెల్‌గా ‘ఓదెల 2’ తెరకెక్కుతోంది. అశోక్ తేజ దర్శకత్వంలో డైరెక్టర్ సంపత్ నంది క్రియేటర్‌గా ఈ మూవీ రూపొందుతోంది. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్ బ్యానర్లపై డి. మధు నిర్మిస్తున్నారు. శివరాత్రి కానుకగా ‘ఓదెల 2’ నుంచి శివ శక్తిగా తమన్నా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఒక చేతిలో దండకం, మరో చేతిలో డమరుకంతో నాగ సాధువు వేషంలో కనిపించారు తమన్నా. ‘‘ఓదెల మల్లన్న స్వామి తన గ్రామాన్ని దుష్ట శక్తుల నుండి ఎలా కాపాడారు? అనే అంశంతో ‘ఓదెల 2’ తెరకెక్కుతోంది. అత్యధిక బడ్జెట్‌తో బహు భాషల్లో ఈ మూవీ రూపొందుతోంది. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం కాశీలో జరుగుతోంది. శివ శక్తి పాత్ర కోసం తమన్నా పూర్తిగా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారు. యూనివర్సల్ అప్పీల్ ఉండే ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తాం’’ అన్నారు మేకర్స్. హెబ్బా పటేల్, వశిష్ట ఎన్. సింహ, యువ, నాగ మహేశ్, వంశీ, గగన్ విహారి, సురేందర్ రెడ్డి, భూ΄ాల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సౌందర్ రాజన్. ఎస్, సంగీతం: అజనీష్ లోక్‌నాథ్. -
అనసూయ మరింత అందంగా.. హెబ్బా మాత్రం చీరలో వేరేలా!
బీచ్ ఒడ్డున హీరోయిన్ కేతిక అందాల జాతర వైట్ షర్టుతో మడోన్నా సెబాస్టియన్ కిరాక్ పోజులు చూపులతో చంపేస్తున్న యాంకర్ అనసూయ బ్లాక్ అండ్ వైట్ ఫొటోలతో కేక పుట్టిస్తున్న సిమ్రన్ చీరకట్టులో మరింత అందంగా హీరోయిన్ హెబ్బా పటేల్ చీరలో నడుముం అందాలు చూపిస్తున్న తాప్సీ పన్ను అందాలన్నీ చూపిస్తూ గ్లామర్ ట్రీట్ ఇచ్చిన ఐశ్వర్య మేనన్ ఫొటో బ్లర్ ఉంది కానీ కృతి కర్బంగా అందం మాత్రం అబ్బో! View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by Madonna B Sebastian (@madonnasebastianofficial) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Simran Choudhary (@simranchoudhary) View this post on Instagram A post shared by VOGUE India (@vogueindia) View this post on Instagram A post shared by Taapsee Pannu (@taapsee) View this post on Instagram A post shared by ISWARYA MENON (@iswarya.menon) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Kriti Kharbanda (@kriti.kharbanda) View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95) View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) View this post on Instagram A post shared by Vaani Kapoor (@_vaanikapoor_) View this post on Instagram A post shared by Vaani Kapoor (@_vaanikapoor_) View this post on Instagram A post shared by Anveshi Jain (@anveshi25) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) -
నా స్నేహితుడి సినిమా హిట్ అవ్వాలి: ఆర్జీవీ
చైతన్య రావు, హెబ్బా పటేల్ జంటగా నటించిన చిత్రం "హనీమూన్ ఎక్స్‌ప్రెస్". ఈ చిత్రానికి బాల రాజశేఖరుని దర్శకత్వం వహిస్తున్నారు. న్యూ రీల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై కేకేఆర్, బాలరాజ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఫుల్ రొమాంటిక్ కామెడీగా తెరకెక్కించనున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్. టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ చేతుల మీదుగా 'నిజమా' అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. అనంతరం రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. 'నా స్నేహితుడు బాల దర్శకత్వం వహించిన హనీమూన్ ఎక్స్‌ప్రెస్ చిత్రంలోని 'నిజమా' పాటను ఇప్పుడే చూశా. పాటను చాలా బాగా చిత్రీకరించారు. నేను విడుదల చేయడం ఇంకా సంతోషంగా ఉంది. కొత్త కాన్సెప్ట్‌తో వస్తోన్న ఈ చిత్రం మంచి విజయం సాధించాలి" అని అన్నారు. దర్శకుడు బాల రాజశేఖరుని మాట్లాడుతూ.. "రామ్ గోపాల్ వర్మతో బ్యూటీ ఆఫ్ ప్యాషన్, ఆట అనే రెండు చిత్రాలకు పని చేశా. ఆయన చిత్రాలు మా లాంటి దర్శకులకు మంచి స్ఫూర్తి. శివ చిత్రం నాకు దర్శకుడు అవటానికి మంచి స్ఫూర్తినిచ్చింది. ఈరోజు హనీమూన్ ఎక్స్‌ప్రెస్ చిత్రంతో దర్శకుడిగా ఆయన పక్కన ఉన్నా. హనీమూన్ ఎక్స్‌ప్రెస్ చిత్రం మంచి రొమాంటిక్ కామెడీ చిత్రం. రామ్ గోపాల్ వర్మ మా చిత్రంలోని మొదటి పాట లిరికల్ వీడియోని విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేస్తాం" అని తెలిపారు. కాగా.. ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, సుహాసిని ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కళ్యాణి మాలిక్ సంగీతం అందిస్తున్నారు.