
‘అలా ఎలా’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన హెబ్బా పటేల్ కుమారి 21 ఎఫ్ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమాలో బోల్డ్ యాక్టింగ్ తో ఆకట్టుకున్న హెబ్బా తరువాత వరుసగా బబ్లీ రోల్స్‌లో అలరించింది. అయితే వరుస ఫెయిల్యూర్స్ అమ్మడి కెరీర్‌ను కష్టాల్లో పడేశాయి. తాజాగా హెబ్బా మరో బోల్డ్ క్యారెక్టర్‌కు ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది.
సూపర్ స్టార్ కిడ్నాప్ ఫేం సుశాంత్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం రాడికల్. ప్రిన్స్ హీరోగా తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో హెబ్బా హీరోయిన్‌గా నటించనుంది. ఈ సినిమాలో హెబ్బా పటేల్‌తో పాటు మరో ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో ప్రారంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment