ట్రెండ్‌కు భిన్నంగా ‘ధూం ధాం’.. నవ్వులు గ్యారెంటీ: హీరో చేతన్‌ కృష్ణ | Hero Chetan Krishna Talks About 'Dhoom Dhaam' Movie | Sakshi
Sakshi News home page

ట్రెండ్‌కు భిన్నంగా ‘ధూం ధాం’.. వెన్నెల కిషోర్ టైమింగ్‌ పట్టుకోవడం చాలా కష్టమైంది

Published Wed, Nov 6 2024 3:07 PM | Last Updated on Wed, Nov 6 2024 3:32 PM

Hero Chetan Krishna Talks About 'Dhoom Dhaam' Movie

‘ఇప్పుడు థ్రిల్లర్స్ ట్రెండ్ నడుస్తోంది. నేనూ అదే చేస్తే వాటిలో మరొక థ్రిల్లర్ అవుతుంది. అందుకే ఇప్పుడున్న ట్రెండ్‌కు భిన్నంగా కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో ‘ధూం ధాం’ చేశాను’ అన్నారు యంగ్‌ హీరో చేతన్‌ కృష్ణ. సాయి కిషోర్ మచ్చా దర్శకత్వంలో చేతన్ కృష్ణ-హెబ్బా పటేల్‌ జంటగా నటించిన చిత్రం ‘ధూం ధాం’. సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ  కీలక పాత్రలు పోషించారు. లవ్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్‌ 8న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరో చేతన్‌ కృష్ణ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. 

నాకు యాక్టింగ్ అంటే ప్యాషన్. సినిమాల్లోకి రావాలని ఎప్పటినుంచో కోరిక. ఫస్ట్ ర్యాంక్ రాజు, బీచ్ రోడ్ చేతన్, రోజులు మారాయి, గల్ఫ్ అనే మూవీస్ చేశాను. ఆ సినిమాల్లో కొన్నింటికి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ప్రేక్షకుల నుంచి గుర్తింపు వచ్చింది.

నాకు గోపీ మోహన్ గారి స్క్రిప్ట్స్ ఇష్టం. సకుటుంబంగా ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేసేలా ఆయన స్క్రిప్ట్స్ ఇస్తారు. అలాంటి మూవీ ఒకటి నేనూ చేయాలని అనుకున్నాను. ఇప్పటిదాకా విభిన్న తరహా చిత్రాల్లో నటించాను. ఒకసారి ఒక బిగ్ మూవీ చేద్దామని "ధూం ధాం" మొదలుపెట్టాం.

తండ్రీ కోసం కొడుకు, కొడుకు కోసం తండ్రి ఎక్కడిదాకా అయినా వెళ్తారు అనే కాన్సెప్ట్ తో ఈ సినిమాను రూపొందించాం. దానికి అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించాం. మా మూవీలో ఫాదర్ తన కొడుకు అన్నింట్లో ది బెస్ట్ గా ఉండాలనుకుంటాడు. ఆయన చేసిన గారాబంతో కొడుకు మరింత అల్లరిగా తయారవుతాడు. తన వల్ల ఒక అమ్మాయి జీవితంలో ఏర్పడిన సమస్యకు తనే పరిష్కారం చూపించాలని ప్రయత్నం చేస్తాడు.

మా మూవీలో చాలా మంది పేరున్న ఆర్టిస్టులు ఉన్నారు. వారితో పాటు నటించడానికి బాగా ప్రిపేర్ అయ్యేవాడిని. వాళ్ల టైమింగ్ తో మ్యాచ్ చేసేందుకు ప్రయత్నించా. వెన్నెల కిషోర్ గారి టైమింగ్ పట్టుకోవడం కష్టమైంది. ఆయన సినిమా సెకండాఫ్ లో వస్తారు. సినిమా మొత్తం ఉంటారు. ఈ సెకండాఫ్ మొత్తం పెళ్లి ఇంట సందడితో సాగుతుంది. ఇదే మా "ధూం ధాం" సినిమాకు ఆకర్షణగా నిలుస్తుంది. సెకండాఫ్ లో థియేటర్ నిండా నవ్వులు నిండిపోతాయి.

అదుర్స్ లాంటి సినిమాల్లో హీరో ఒక ఫేమస్ కమెడియన్ పక్కనే ఉంటూ కథ సాగుతుంది. అలా "ధూం ధాం"లో కూడా నేను వెన్నెల కిషోర్ గారి పక్కనే ఉంటాను. మూవీ షూటింగ్ టైమ్ లో కిషోర్ గారు చాలా సపోర్ట్ చేశారు. సీన్స్ చేసే ముందు నాతో డిస్కస్ చేసేవారు. హెబ్బా పటేల్ తో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. తను షూటింగ్ స్టార్ట్ కాక ముందు చాలా ఎనర్జిటిక్ గా యాక్టివ్ గా ఉంటుంది. కెమెరా రోల్ కాగానే తన క్యారెక్టర్ లోకి మారిపోతుంది.

మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లు రిలీజ్ చేయడం మా సినిమాకు మరో అడ్వాంటేజ్. గోపీ సుందర్ గారు ఛాట్ బస్టర్ సాంగ్స్ చేశారు. ఒక సెంటర్ లో ఒక మంచి థియేటర్ ఉంటుంది. ఏ సినిమా అయినా అక్కడే ప్రేక్షకులు చూసేందుకు ఇష్టపడతారు. అలాంటి ఒకట్రెండు థియేటర్స్ చిన్న డబ్బింగ్ సినిమాలకు ఇచ్చారు. ఆ విషయంపై నేను ప్రీ రిలీజ్ లో స్పందించాను. అయితే మాకు కావాల్సినన్ని మంచి థియేటర్స్ దొరికాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement