Chetan Krishna
-
వినోదానికి ప్రేక్షకులు కనెక్ట్ అవుతున్నారు: చేతన్ కృష్ణ
‘‘ధూం ధాం’ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. సినిమా బాగుంటే తప్ప థియేటర్స్‌కి రాని ఈ ట్రెండ్‌లో మా సినిమా ఆడుతున్న థియేటర్లు 70 నుంచి 80 శాతం మంది ప్రేక్షకులతో నిండటం సంతోషంగా ఉంది. మా చిత్రంలోని వినోదానికి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నారు’’ అని హీరో చేతన్ కృష్ణ అన్నారు. సాయి కిషోర్ మచ్చా దర్శకత్వంలో చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ జోడీగా నటించిన చిత్రం ‘ధూం ధాం’.ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్‌పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 8న విడుదలైంది. ఈ సందర్భంగా శనివారం నిర్వహించిన సక్సెస్ మీట్లో సాయి కిషోర్ మచ్చా మాట్లాడుతూ– ‘‘ధూం ధాం’ రిలీజైన ప్రతి సెంటర్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్నందుకు సంతోషంగా ఉంది’’ అని తెలిపారు. ‘‘పెద్ద సినిమాల పోటీలో మా ‘ధూం ధూం’లాంటి చిన్న సినిమా నిలదొక్కుకోవడమే గొప్ప విషయం’’ అన్నారు ఎంఎస్ రామ్ కుమార్. రచయిత గోపీ మోహన్ , నటుడు గిరిధర్ మాట్లాడారు. -
Dhoom Dhaam Review: హెబ్బా పటేల్ ‘ధూం ధాం’ మూవీ రివ్యూ
టైటిల్: ధూం ధాంనటీనటులు: చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్, సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ, శివన్నారాయణ, బెనర్జీ, సాయి శ్రీనివాస్, ప్రవీణ్, నవీన్ నేని, గిరిధర్, భద్రమ్ తదితరులునిర్మాత:ఎంఎస్ రామ్ కుమార్స్టోరీ, స్క్రీన్‌ప్లే: గోపీ మోహన్దర్శకత్వం: సాయి కిషోర్ మచ్చాసంగీతం: గోపీ సుందర్సినిమాటోగ్రఫీ - సిద్ధార్థ్ రామస్వామిఎడిటింగ్ - అమర్ రెడ్డి కుడుముల విడుదల తేది: నవంబర్ 8, 2024కథేంటంటే..రామరాజు(సాయి కుమార్)కి అతని కొడుకు కార్తిక్(చేతన్ కృష్ణ)అంటే చాలా ఇష్టం. కొడుకు సంతోషం కోసం ఏ పనైనా చేస్తాడు. అన్ని విషయాలు కొడుకుతో చర్చించుకుంటాడు. కార్తిక్ కూడా అంతే. నాన్నను చాలా ప్రేమిస్తాడు. అమ్మా నాన్న, స్నేహితులే ప్రపంచంగా బతుకున్న కార్తిక్ జీవితంలోకి సుహానా(హెబ్బా పటేల్) వస్తుంది. ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడతారు. ఇంట్లో వాళ్లకి చెప్పి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అప్పుడు ఇరు కుటుంబాల్లో కొన్ని సమస్యలు వస్తాయి. అవేంటి? కార్తిక్, సుహానా కుటుంబాల మధ్య ఉన్న వైరం ఏంటి? తండ్రి కోసం కార్తిక్ చేసిన తప్పేంటి? అంతకు ముందు కొడుకు కోసం రామరాజు చేసిన మిస్టేక్ ఏంటి? ఆ తప్పు కారణంగా సుహాన ఫ్యామిలీ పడిన ఇబ్బందులు ఏంటి? ఈ కథలో వెన్నెక కిశోర్ పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాలకు టాలీవుడ్లో మంచి ఆదరణ ఉంటుంది. అయితే ఈ మధ్యకాలంలో కుటుంబం మొత్తం కలిసి చూసే సినిమాలు రావడం లేదు. ఎక్కువ రా, రస్టిక్, యాక్షన్ సినిమాలే వస్తున్నాయి. చాలా కాలం తర్వాత తెలుగు తెరపై వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం ‘ధూం ధాం’. దర్శకుడు సాయి కిషోర్ ఎంచుకున్న కథ పాతదే అయినా.. దానికి ఇచ్చిన ట్రీట్మెంట్ కొత్తగా ఉంది. ఫాదర్-సన్ ఎమోషన్, తండ్రీ- కూతుళ్ల బాండింగ్‌తో ఫ్యామిలీ మొత్తం కలిసి చూసేలా ఓ మంచి ప్రేమ కథను ఈ చిత్రం ద్వారా చెప్పారు. ఫస్టాప్ అంతా హీరోహీరోయిన్ల లవ్ ట్రాక్ చుట్టూ సరదాగా సాగుతుంది. పరిచయమే లేని ఓ అమ్మాయి వచ్చి ప్రేమిస్తున్నానంటూ హీరోకి చెప్పడం.. ఆమె ఎవరో తెలియక హీరో పడే తిప్పలు, ఈక్రమంలో వచ్చే పాటలు, ఫన్నీ సీన్లు ఆకట్టుకుంటాయి. అయితే హీరోహీరోయిన్ల మధ్య సాగే లవ్‌స్టోరీ పాత సినిమాలను గుర్తు చేసినా.. దాని చుట్టు అల్లుకున్న సీన్లు కథకి ఫ్రెస్నెస్ని తెచ్చాయి. ఇక సెకండాఫ్‌లో వెన్నెల కిశోర్ పాత్ర ఎంట్రీ ఇచ్చిన తర్వాత కథనం హిలేరియస్‌గా సాగుతుంది. ముఖ్యంగా మందు సిట్టింగ్ సీన్లో ‘ఎక్స్ప్రెషన్స్’ పేరుతో సీనియర్ నటులు ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ సినిమాల్లోని డైలాగ్స్‌ని వెన్నెల కిశోర్ చెప్పడం సినిమాకే హైలెట్. వెన్నెల కిశోర్‌కి సంబంధించిన ప్రతీ సీన్ థియేటర్లో నవ్వులు పూయిస్తుంది. ఎక్కడా వల్గారిటీ లేకుండా క్లీన్ కామెడీతో కథనాన్ని నడిపించడం సినిమాకు ప్లస్ అయిందనే చెప్పాలి. కొత్తదనం కోరుకోకుండా.. ఎంటర్టైమెంట్ ఉంటే చాలు అనుకునే ప్రేక్షకులకు ధూం ధాం సినిమా నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. హీరో చేతన్ కృష్ణకి ఇది తొలి సినిమా. అయినా కూడా ఉన్నంతలో చక్కగానే నటించాడు. అయితే నటన పరంగా ఇంకొంత కసరత్తు చేస్తే..భవిష్యత్తులో మంచి హీరో అయ్యే చాన్స్ ఉంది. హెబ్బా పటేల్ ఈ తరహా పాత్రలు గతంలో చాలానే చేసింది కాబట్టి సుహాన పాత్రలో ఈజీగా నటించేసింది. హీరోహీరోయిన్ల ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఇక ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన మరో పాత్ర వెన్నెల కిశోర్‌ది. హీరో కజిన్‌గా ఆయన పండించిన కామెడీ సినిమా స్థాయిని పెంచేసింది. సెకండాఫ్ మొత్తం ఆయన పాత్ర చుట్టే తిరుగుతుంది. ఓ రకంగా ఈ సినిమాకు వెన్నెల కిశోరే హీరో అని చెప్పొచ్చు. హీరో తండ్రిగా సాయి కుమార్ మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక హీరో స్నేహితులుగా ప్రవీణ్, నవీన్ పండించిన కామెడీ సినిమాకు ప్లస్ అయింది. గోపరాజు రమణ, వినయ్ వర్మ, బెనర్జీతో పాటు మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు.సాంకేతికంగా సినిమా బాగుంది. గోపీ సుందర్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం సినిమా స్థాయి పెంచేసింది. చివరిలో వచ్చే మంగ్లీ సాంగ్ అందరిని ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. పోలెండ్ అందాలను తెరపై చక్కగా చూపించారు. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. క్వాలిటీ విషయంలో నిర్మాత రామ్ కుమార్ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదని సినిమా చూస్తే అర్థమవుతుంది. రేటింగ్: 2.75/5 -
ట్రెండ్‌కు భిన్నంగా ‘ధూం ధాం’.. నవ్వులు గ్యారెంటీ: హీరో చేతన్ కృష్ణ
‘ఇప్పుడు థ్రిల్లర్స్ ట్రెండ్ నడుస్తోంది. నేనూ అదే చేస్తే వాటిలో మరొక థ్రిల్లర్ అవుతుంది. అందుకే ఇప్పుడున్న ట్రెండ్‌కు భిన్నంగా కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ‘ధూం ధాం’ చేశాను’ అన్నారు యంగ్ హీరో చేతన్ కృష్ణ. సాయి కిషోర్ మచ్చా దర్శకత్వంలో చేతన్ కృష్ణ-హెబ్బా పటేల్ జంటగా నటించిన చిత్రం ‘ధూం ధాం’. సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ కీలక పాత్రలు పోషించారు. లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరో చేతన్ కృష్ణ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. → నాకు యాక్టింగ్ అంటే ప్యాషన్. సినిమాల్లోకి రావాలని ఎప్పటినుంచో కోరిక. ఫస్ట్ ర్యాంక్ రాజు, బీచ్ రోడ్ చేతన్, రోజులు మారాయి, గల్ఫ్ అనే మూవీస్ చేశాను. ఆ సినిమాల్లో కొన్నింటికి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ప్రేక్షకుల నుంచి గుర్తింపు వచ్చింది.→ నాకు గోపీ మోహన్ గారి స్క్రిప్ట్స్ ఇష్టం. సకుటుంబంగా ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేసేలా ఆయన స్క్రిప్ట్స్ ఇస్తారు. అలాంటి మూవీ ఒకటి నేనూ చేయాలని అనుకున్నాను. ఇప్పటిదాకా విభిన్న తరహా చిత్రాల్లో నటించాను. ఒకసారి ఒక బిగ్ మూవీ చేద్దామని "ధూం ధాం" మొదలుపెట్టాం.→ తండ్రీ కోసం కొడుకు, కొడుకు కోసం తండ్రి ఎక్కడిదాకా అయినా వెళ్తారు అనే కాన్సెప్ట్ తో ఈ సినిమాను రూపొందించాం. దానికి అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించాం. మా మూవీలో ఫాదర్ తన కొడుకు అన్నింట్లో ది బెస్ట్ గా ఉండాలనుకుంటాడు. ఆయన చేసిన గారాబంతో కొడుకు మరింత అల్లరిగా తయారవుతాడు. తన వల్ల ఒక అమ్మాయి జీవితంలో ఏర్పడిన సమస్యకు తనే పరిష్కారం చూపించాలని ప్రయత్నం చేస్తాడు.→ మా మూవీలో చాలా మంది పేరున్న ఆర్టిస్టులు ఉన్నారు. వారితో పాటు నటించడానికి బాగా ప్రిపేర్ అయ్యేవాడిని. వాళ్ల టైమింగ్ తో మ్యాచ్ చేసేందుకు ప్రయత్నించా. వెన్నెల కిషోర్ గారి టైమింగ్ పట్టుకోవడం కష్టమైంది. ఆయన సినిమా సెకండాఫ్ లో వస్తారు. సినిమా మొత్తం ఉంటారు. ఈ సెకండాఫ్ మొత్తం పెళ్లి ఇంట సందడితో సాగుతుంది. ఇదే మా "ధూం ధాం" సినిమాకు ఆకర్షణగా నిలుస్తుంది. సెకండాఫ్ లో థియేటర్ నిండా నవ్వులు నిండిపోతాయి.→ అదుర్స్ లాంటి సినిమాల్లో హీరో ఒక ఫేమస్ కమెడియన్ పక్కనే ఉంటూ కథ సాగుతుంది. అలా "ధూం ధాం"లో కూడా నేను వెన్నెల కిషోర్ గారి పక్కనే ఉంటాను. మూవీ షూటింగ్ టైమ్ లో కిషోర్ గారు చాలా సపోర్ట్ చేశారు. సీన్స్ చేసే ముందు నాతో డిస్కస్ చేసేవారు. హెబ్బా పటేల్ తో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. తను షూటింగ్ స్టార్ట్ కాక ముందు చాలా ఎనర్జిటిక్ గా యాక్టివ్ గా ఉంటుంది. కెమెరా రోల్ కాగానే తన క్యారెక్టర్ లోకి మారిపోతుంది.→ మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లు రిలీజ్ చేయడం మా సినిమాకు మరో అడ్వాంటేజ్. గోపీ సుందర్ గారు ఛాట్ బస్టర్ సాంగ్స్ చేశారు. ఒక సెంటర్ లో ఒక మంచి థియేటర్ ఉంటుంది. ఏ సినిమా అయినా అక్కడే ప్రేక్షకులు చూసేందుకు ఇష్టపడతారు. అలాంటి ఒకట్రెండు థియేటర్స్ చిన్న డబ్బింగ్ సినిమాలకు ఇచ్చారు. ఆ విషయంపై నేను ప్రీ రిలీజ్ లో స్పందించాను. అయితే మాకు కావాల్సినన్ని మంచి థియేటర్స్ దొరికాయి.