యమా బిజీగా కుమారి | Hebah patel busy with four films | Sakshi
Sakshi News home page

యమా బిజీగా కుమారి

Published Sat, Feb 13 2016 1:48 PM | Last Updated on Sun, Sep 3 2017 5:34 PM

యమా బిజీగా కుమారి

యమా బిజీగా కుమారి

'అలా ఎలా' సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన హేబా పటేల్, సుకుమార్ నిర్మాణంలో తెరకెక్కిన కుమారి 21ఎఫ్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ఈ సినిమాతో నటన పరంగానే కాకుండా బోల్డ్ సీన్స్లో కూడా ఎలాంటి తడబాటు లేకుండా నటించిన హేబా, దర్శక నిర్మాత దృష్టిలో పడింది. దీంతో ఇప్పుడు వరుస ఆఫర్లతో బిజీ అయ్యింది ఈ బ్యూటీ.

ఇప్పటికే జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో మరోసారి రాజ్ తరుణ్తో కలిసి నటిస్తోంది. మంచు విష్ణు, రాజ్ తరుణ్ హీరోలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో మరో సక్సెస్ గ్యారెంటీ అన్ననమ్మకంతో ఉంది హేబా. ఈ సినిమాతో పాటు క్రియేటివ్ డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి, మళయాల సూపర్ స్టార్ మోహల్ హీరోగా తెరకెక్కిస్తున్న సినిమాలో కూడా ఓ కీలక పాత్రలో నటిస్తోంది.

వీటితో పాటు శర్వానంద్ హీరోగా పి.మహేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు కూడా హేబానే హీరోయిన్గా సెలెక్ట్ చేసుకున్నారు. ఈ మూడు సినిమాలతో పాటు మరో లేడి ఓరియంటెడ్ సినిమాకు కూడా కమిట్ అయ్యింది. ఈ సినిమాతో వినాయక్ అసిస్టెంట్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇలా ఒకేసారి నాలుగు సినిమాలను లైన్లో పెట్టి యమా బిజీగా కనిపిస్తోంది కుమారి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement