రూట్‌ మార్చిన ‘కుమారి’ | Hebah Patel Enter Into Digital Space Shine In Two Web series | Sakshi
Sakshi News home page

బోల్డ్‌ క్యారెక్టర్‌కు ఓకే చెప్పిన హెబ్బా

Published Tue, May 5 2020 10:46 AM | Last Updated on Tue, May 5 2020 12:09 PM

Hebah Patel Enter Into Digital Space Shine In Two Web series - Sakshi

‘కుమారి 21 ఎఫ్‌’తో కుర్రకారు మనసు దోచుకున్న నటి హెబ్బా పటేల్‌. ఈ సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌ సాధించడంతో ఈ అమ్మడుకు అప్పట్లో వరస అవకాశాలే వచ్చాయి. కానీ అగ్రహీరోల సరసన నటించే అవకాశం రాకపోవడం, వరుసగా అపజయాలు చవిచూడటంతో హీరోయిన్‌గా నిలదొక్కులేకపోయింది. దీంతో సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. అయితే అడపాదడపాగా గెస్ట్‌ రోల్స్, ఐటమ్‌ సాంగ్స్‌‌ చేస్తూనే మరోవైపు డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్‌పై తన అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేస్తోంది.

ఇప్పటికే ఆహా యాప్‌లోని మస్తీస్‌ అనే వెబ్‌ సిరీస్‌లో నటించి ఆకట్టుకుంది. అంతేకాకుండా అదే యాప్‌లో మరె రెండు వెబ్‌సిరీస్‌లకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. ఇక వెబ్‌ సిరీస్‌లకు పెట్టింది పేరయిన నెట్‌ఫ్లిక్స్‌తో కూడా హెబ్బా జతకట్టినట్టు విశ్వసనీయం సమాచారం. త్వరలో నెట్‌​ఫ్లిక్స్‌ తీయబోయే రెండు వెబ్‌ సిరీస్‌లకు సైన్‌ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ రెండు వెబ్‌ సిరీస్‌లు అడల్ట్‌ కంటెంట్‌ స్టైయిల్లో ఉంటుందని.. హెబ్బా బోల్డ్‌ క్యారెక్టర్‌ చెయ్యబోతోందని ఫిలింనగర్‌ టాక్‌. ఈ వెబ్‌ సిరీస్‌లతో మళ్లీ క్రేజ్‌ సంపాదించుకోవాలని హెబ్బా భావిస్తుందట. రామ్‌ ‘రెడ్‌’ సినిమాలో ప్రత్యేకగీతం, రాజ్‌తరుణ్‌ ‘ఒరేయ్‌ బుజ్జిగా’లో ప్రత్యేక ప్రాతలో హెబ్బా మెరవనుంది. 

చదవండి:
పూజా హెగ్డే చిట్కాలు విన్నారా?
‘మీరెవరు నన్ను అడగడానికి.. అది నా ఇష్టం’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement