స్క్విడ్‌ గేమ్‌ 3 రిలీజ్‌ డేట్‌.. నెట్‌ఫ్లిక్స్‌ కావాలనే లీక్‌ చేసిందా? | Squid Game 3: Netflix Accidentally Leaks Web Series Release Date, Post Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

Squid Game 3 Release Date: ఈసారి ఎక్కువ వెయిటింగ్‌ అక్కర్లేదు!

Published Fri, Jan 3 2025 3:47 PM | Last Updated on Fri, Jan 3 2025 4:35 PM

Squid Game 3: Netflix Accidentally Leaks Web Series Release Date

డబ్బు కోసం ఆశ.. అందుకోసం షార్ట్‌కట్స్‌ వెతికే జనాలు.. దీన్ని అలుసుగా తీసుకున్న ధనికులు.. వారి ప్రాణాలతో చెలగాటమాడే గేమ్‌ సృష్టిస్తారు. ఈ ఆటలో ఓడిపోయినవారు గేమ్‌లోనే కాదు జీవితంలోనే ఎలిమినేట్‌ ఆడతారు. అదే స్క్విడ్‌ గేమ్‌. ఈ కొరియన్‌ వెబ్‌ సిరీస్‌ సృష్టికర్త హ్వాంగ్‌ డాంగ్‌ హ్యుక్‌. 

అంతర్జాతీయ అవార్డులు
ఈ స్క్విడ్‌ గేమ్‌ సిరీస్‌ను 2021లో రిలీజ్‌ చేయగా అంతర్జాతీయ స్థాయిలో పాపులర్‌ అయింది. క్రిటిక్స్‌ ఛాయిస్‌, గోల్డెన్‌ గ్లోబ్‌, పీపుల్స్‌ ఛాయిస్‌.. ఇలా ఎన్నో అవార్డులు అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా హిట్‌ అయిన ఈ సిరీస్‌కు కొనసాగింపుగా 2024 డిసెంబర్‌లో సీక్వెల్‌ వచ్చింది. ఈ సిరీస్‌ కూడా ఆదరణ పొందింది కానీ క్లైమాక్స్‌ను సగంలోనే ముగించేసినట్లుగా ఉంటుంది.

గుడ్‌న్యూస్‌
దీంతో మూడో పార్ట్‌ ఎప్పుడొస్తుందా? అని ఫ్యాన్స్‌ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో నెట్‌ఫ్లిక్స్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. త్వరలోనే సీజన్‌ 3 ఉంటుందని ఓ టీజర్‌ వదిలింది. అయితే అందులో పొరపాటున 2025 జూన్‌ 27న రిలీజ్‌ అవుతుందని పేర్కొంది. ఈ విషయం క్షణాల్లో వైరలవగా.. నెట్‌ఫ్లిక్స్‌ కొరియా యూట్యూబ్‌ ఛానల్‌ వెంటనే ఆ టీజర్‌ను డిలీట్‌ చేసింది.

కావాలనే..?
నెట్‌ఫ్లిక్స్‌ పొరపాటు చేసిందా? లేదంటే అందరూ మాట్లాడుకునేలా చేయాలని కావాలనే అలా రిలీజ్‌ డేట్‌ పెట్టి డిలీట్‌ చేసిందా? అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఏదేమైనా ఈ సారి స్క్విడ్‌ గేమ్‌ కోసం ఏళ్ల తరబడి నిరీక్షించకుండా ఆరు నెలల్లోనే ఎంచక్కా చూసేయొచ్చని అభిమానులు సంతోషిస్తున్నారు.

 

చదవండి: ఆ హీరోయిన్‌ ఆస్తులు 4600 కోట్లు.. అమితాబ్‌ కంటే ఎక్కువే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement