హీరోలతో పోలిస్తే హీరోయిన్ల రెమ్యునరేషన్ చాలా తక్కువ. కొంతమంది హీరోలకు ఒక్క సినిమాకు వచ్చే రెమ్యునరేషన్ హీరోయిన్లకు పది సినిమాలు చేసిన రాదు. అలాగే వాళ్ల సినీ కెరీర్ కూడా తక్కువ కాలమే ఉంటుంది. వయసు 40 ఏళ్లు దాటితే సినిమా చాన్స్‌లు కూడా రావు. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్లుగా అవకాశం ఉన్నప్పుడే వరుస సినిమాలు చేస్తుంటారు.
అయితే ఎంత సంపాదించిన హీరోలతో పోలిస్తే చాలా తక్కువగానే ఉంటుంది. కానీ ఓ హీరోయిన్ ఆస్తులు మాత్రం స్టార్ హీరోల కంటే ఎక్కువగా ఉన్నాయి. అమితాబ్, హృతిక్ రోషన్ లాంటి బడా హీరోలు కూడా ఆస్తుల విషయం ఈ హీరోయిన్ వెనుకే ఉన్నారు. ఆమే జూహి చావ్లా. ఐశ్వర్య రాయ్, దీపికా పదుకొనే, ప్రియాంక చోప్రా వంటి స్టార్ హీరోయిన్స్ ను వెనక్కి నెట్టి.. భారతదేశంలో అత్యంత సంపన్నురాలైన సినీనటిగా జూహీ చావ్లా రికార్డు కెక్కింది.
అమితాబ్‌కు కంటే ఎక్కువ
మన దేశంలో ప్రతి ఏడాది సంపన్నుల జాబితాను వెల్లడించే ‘హురున్ ఇండియా’ సంస్థ 2024కు గాను విడుదల చేసిన సంపన్నుల జాబితాలో సినిమా హీరోయిన్లలో జూహి చావ్లా మొదటి స్థానంలో ఉంది. ఆమె ఆస్తుల మొత్తం విలువ 4600 కోట్లు. సినిమా రంగంలో షారుఖ్ ఖాన్ 7300 కోట్లతో మొదటి స్థానంలో ఉండగా.. రెండో స్థానంలో జుహి చావ్లానే ఉంది. మూడో స్థానంలో హృతిక్ రోషన్(2000 కోట్లు), నాలుగో స్థానంలో అమితాబ్ బచ్చన్(1200 కోట్లు) ఉన్నారు.
పలు వ్యాపారాల్లో పెట్టుబడులు
జూహి చావ్లా చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంది. బాలీవుడ్‌లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లు చాలా మందే ఉన్నా.. ఆస్తుల విషయంలో మాత్రం జుహినే మొదటి స్థానంలో ఉన్నారు. నటనకు దూరంగా ఉన్నా.. నిర్మాతగా కొనసాగుతున్నారు. తన జూహీ ప్రొడక్షన్స్ లో షారుఖ్ పార్టనర్. డ్రీమ్స్ అన్‌లిమిటెడ్, రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో జూహీ చావ్లా పార్టనర్ గా వ్యవహరిస్తున్నారు. షారుఖ్ కొనుగోలు చేసిన ఐపీఎల్ టీమ్ కోల్‌కటా నైట్‌రైడర్స్‌లో ఆమె కూడా పార్ట్‌నర్‌గా ఉంది. ఒక వైపు సినిమాల్లో నటిస్తూనే ఇలా పలు వ్యాపారాలు చేయడంతో జూహి చావ్లా ఆస్తులు విపరీతంగా పెరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment