Kumari 21F
-
రూట్ మార్చిన ‘కుమారి’
‘కుమారి 21 ఎఫ్’తో కుర్రకారు మనసు దోచుకున్న నటి హెబ్బా పటేల్. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ సాధించడంతో ఈ అమ్మడుకు అప్పట్లో వరస అవకాశాలే వచ్చాయి. కానీ అగ్రహీరోల సరసన నటించే అవకాశం రాకపోవడం, వరుసగా అపజయాలు చవిచూడటంతో హీరోయిన్గా నిలదొక్కులేకపోయింది. దీంతో సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. అయితే అడపాదడపాగా గెస్ట్ రోల్స్, ఐటమ్ సాంగ్స్ చేస్తూనే మరోవైపు డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌పై తన అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే ఆహా యాప్‌లోని మస్తీస్ అనే వెబ్ సిరీస్‌లో నటించి ఆకట్టుకుంది. అంతేకాకుండా అదే యాప్‌లో మరె రెండు వెబ్‌సిరీస్‌లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇక వెబ్ సిరీస్‌లకు పెట్టింది పేరయిన నెట్‌ఫ్లిక్స్‌తో కూడా హెబ్బా జతకట్టినట్టు విశ్వసనీయం సమాచారం. త్వరలో నెట్‌ఫ్లిక్స్ తీయబోయే రెండు వెబ్ సిరీస్‌లకు సైన్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ రెండు వెబ్ సిరీస్‌లు అడల్ట్ కంటెంట్ స్టైయిల్లో ఉంటుందని.. హెబ్బా బోల్డ్ క్యారెక్టర్ చెయ్యబోతోందని ఫిలింనగర్ టాక్. ఈ వెబ్ సిరీస్‌లతో మళ్లీ క్రేజ్ సంపాదించుకోవాలని హెబ్బా భావిస్తుందట. రామ్ ‘రెడ్’ సినిమాలో ప్రత్యేకగీతం, రాజ్‌తరుణ్ ‘ఒరేయ్ బుజ్జిగా’లో ప్రత్యేక ప్రాతలో హెబ్బా మెరవనుంది. చదవండి: పూజా హెగ్డే చిట్కాలు విన్నారా? ‘మీరెవరు నన్ను అడగడానికి.. అది నా ఇష్టం’ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_541241401.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
21ఎఫ్కి మించి
హిట్ కాంబినేషన్స్ రిపీట్ అవ్వటం మనం తరచూ చూస్తూనే ఉంటాం. ‘కుమారి 21ఎఫ్’ వంటి యూత్‌ఫుల్ హిట్ ఇచ్చిన హీరో రాజ్ తరుణ్ – దర్శకుడు సూర్య ప్రతాప్ పల్నాటి మరో సినిమా చేయడానికి రెడీ అయ్యారు. ఎస్.ఆర్.టి ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ తాళ్ళూరి ఈ హిట్ కాంబినేషన్ ప్రాజెక్ట్‌కు నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ – ‘‘దర్శకుడు చెప్పిన కథ విని బాగా ఎగై్జట్ అయ్యాను. ‘కుమారి 21ఎఫ్’ లాగే యూత్‌ని ఆకట్టుకునే అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి. 21ఎఫ్ మించిన స్థాయిలో ఈ సినిమా ఉంటుంది’’ అని అన్నారు. రామ్ తాళ్ళూరి ఇటీవలే రవితేజ హీరోగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని కూడా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. రాజ్ తరుణ్ నటించిన ‘రాజుగాడు’ ఈ సంక్రాంతికి విడుదల కానుందట. -
కుమారి దర్శకుడితో మరో సినిమా
‘కుమారి 21ఎఫ్’ లాంటి యూత్ ఫుల్ & సెన్సేషనల్ హిట్ తరువాత ఆ చిత్ర దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్, కథానాయకుడు రాజ్ తరుణ్ ల క్రేజీ కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కనుంది. ఎస్.ఆర్.టి ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.2గా రామ్ తాళ్ళూరి ఈ క్రేజీ ప్రొజెక్ట్ ను నిర్మిస్తున్నారు. ‘కుమారి 21ఎఫ్’ తరహాలోనే యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కనుంది. త్వరలో ప్రారంభం కానున్న ఈసినిమా విశేషాలను చిత్రయూనిట్ వెల్లడించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత రామ్ తాళ్ళూరి మాట్లాడుతూ.. ‘హిట్ కాంబినేషన్ పల్నాటి సూర్య ప్రతాప్-రాజ్ తరుణ్ ల కాంబినేషన్ లో మా బ్యానర్ లో ప్రొడక్షన్ నెం.2గా రూపొందించనుండడం ఆనందంగా ఉంది. సూర్యప్రతాప్ చెప్పిన కథ విని ఎంతగానో ఎగ్జైట్ అయ్యాను, యూత్ ఫుల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ ఇది. ‘కుమారి 21ఎఫ్’ను మించిన స్థాయిలో ఈ సినిమా ఉండబోతోంది’ అన్నారు. రామ్ తళ్లూరి ఇప్పటికే రవితేజ, కళ్యాణ్ కృష్ణల కాంబినేషన్ లో ఓ సినిమాను ఎనౌన్స్ చేశారు. -
కుమారి లేకుండా మరో సినిమా..!
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తొలిసారిగా నిర్మాతగా మారి తెరకెక్కించిన సినిమా కుమారి 21 ఎఫ్. రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. సూర్య ప్రతాప్ దర్శకుడిగా పరిచయం అయిన ఈ సినిమాతో హీరోయిన్ హెబ్బా పటేల్, హీరో రాజ్ తరుణ్ లు బిజీ ఆర్టిస్ట్ లుగా మారిపోయారు. సుకుమార్ కు కూడా నిర్మాతగా మరిన్ని సినిమాలు చేసే ధైర్యాన్నిచ్చింది కుమారి 21ఎఫ్. ఇప్పుడు ఇదే కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతోంది. సుకుమార్ నిర్మాణంలో సూర్య ప్రతాప్ దర్శకుడిగా రాజ్ తరుణ్ హీరోగా మరో సినిమా ప్లాన్ చేస్తున్నారు. సంగీత దర్శకుడిగా మరోసారి దేవీ శ్రీ ప్రసాద్ నే తీసుకుంటున్నారు. పూర్తిగా కుమారి 21 ఎఫ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ ను మాత్రం మారుస్తున్నారు. ఇప్పటికే రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ ల కాంబినేషన్ చాలా సార్లు రిపీట్ అవ్వటంతో కొత్త సినిమా కోసం మరో హీరో హీరోయిన్ ను తీసుకునే ఆలోచనలో ఉన్నారు. -
సుకుమార్ ఫ్యామిలీ నుంచి మరో బ్యానర్
మూస మాస్ సినిమాల టైంలో కొత్త తరహా చిత్రాలతో ఆకట్టుకున్న దర్శకుడు సుకుమార్. తన ప్రతి కథలోనూ సైన్స్‌కు కీలక పాత్ర కల్పించే ఈ లెక్కల మాస్టరు, నిర్మాతగానూ మంచి విజయం సాధించాడు. సుకుమార్ రైటింగ్స్ పేరుతో బ్యానర్‌ను స్థాపించి తొలి ప్రయత్నంగా కుమారి 21ఎఫ్ సినిమాను తెరకెక్కించాడు. సుక్కు స్వయంగా కథా కథనాలు అందించిన ఈ సినిమా ఘన విజయం సాధించటంతో నిర్మాతగానూ కొనసాగాలని నిర్ణయించుకున్నాడు. అయితే సుకుమార్ నిర్మాతగా తన రెండో సినిమా కోసం మరో బ్యానర్‌ను స్థాపిస్తున్నాడు. తన తండ్రి పేరుతో బీటీఆర్ క్రియేషన్స్ స్థాపించిన ఆ బ్యానర్‌పై తన అన్న కొడుకు అశోక్‌ను హీరోగా పరిచయం చేయబోతున్నాడు. ఇప్పటికే కథ కూడా ఫైనల్ అయిన ఈ సినిమాకు దర్శకుడు అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన హరిప్రసాద్, ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. ఈ నెల 9 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. -
'ఏంజిల్'గా కుమారి
అలా ఎలా సినిమాతో హీరోయిన్గా పరిచయం అయిన హేబాపటేల్ తరువాత కుమారి 21 ఎఫ్ సినిమాతో హాట్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో బోల్డ్ క్యారెక్టర్లో కనిపించిన ఈ బ్యూటి నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఆ తరువాత మరోసారి రాజ్ తరుణ్ సరసన నటించిన ఆడో రకం ఈడోరకం సినిమా కూడా సక్సెస్ సాధించటంతో ఇక హేబాకు వరుస అవకాశాలు క్యూ కడతాయని భావించారు. కానీ అలా జరగలేదు. సీనియర్ హీరోల సరసన సూట్ అవ్వకపోవటంతో పాటు యంగ్ హీరోల సరసన నటించడానికి భారీ పోటి ఉండటంతో పెద్దగా అవకాశాలు రాలేదు. ఆడోరకం ఈడోరకం తరువాత యంగ్ హీరో నాగాన్వేష్ సరసన హీరోయిన్గా నటిస్తుంది హేబా. ఇంట్లో ఇల్లాలు వంటిట్లో ప్రియురాలు సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా పరిచయం అయిన నాగాన్వేష్ తరువాత వినవయ్యా రామయ్య సినిమాతో హీరోగా మారాడు. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయి విజయం సాధించకపోవటంతో కాస్త గ్యాప్ తీసుకొని మరో సినిమాతో ఆడియన్స్ ముందుకు రానున్నాడు. రాజమౌళి దగ్గర దర్శకత్వం శాఖలో పనిచేసిన పళని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు ఏంజిల్ అనే టైటిల్‌ను ఫైనల్ చేశారు. -
బిజీ బిజీగా కుర్రహీరో
ప్రస్తుతం టాలీవుడ్లో సూపర్ ఫాంలో కనిపిస్తున్న యంగ్ హీరో రాజ్ తరుణ్. చేసినవి రెండు సినిమాలే అయినా మినిమమ్ గ్యారెంటీ హీరోగా ముద్ర వేసుకున్నాడు ఈ వైజాగ్ కుర్రాడు. తొలి సినిమా 'ఉయ్యాల జంపాల'తో మంచి సక్సెస్ అందుకున్న రాజ్ తరుణ్, ఆ తరువాత 'సినిమా చూపిస్త మామ'తో హీరోగా సెటిల్ అయిపోయాడు. 'కుమారి 21ఎఫ్' రిలీజ్ తరువాత నెల గ్యాప్‌లో 'సీతమ్మ అందాలు - రామయ్య సిత్రాలు' అనే తెలుగింటి ప్రేమకథతో మరోసారి తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చాడు. తాజాగా క్రియేటివ్ డైరెక్టర్ వంశీ దర్శకత్వంలో లేడీస్ టైలర్ సీక్వల్లో నటించనున్నాడు. ఈ సినిమాతో పాటు మంచు విష్ణు నిర్మాతగా తెరకెక్కుతున్న మరో సినిమాకు కూడా కమిట్ అయ్యాడు రాజ్ తరుణ్. -
కుమారి డైరెక్టర్‌తో శర్వా
రన్ రాజా రన్ సినిమాతో సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చిన శర్వానంద్, వరుసగా మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, ఎక్స్ ప్రెస్ రాజా సినిమాలతోనూ అదే జోరు కొనసాగించాడు. ఎక్స్ ప్రెస్ రాజా సినిమా తరువాత కాస్త గ్యాప్ తీసుకున్న ఈ యంగ్ హీరో, ప్రస్తుతం తన తదుపరి సినిమా మీద దృష్టిపెట్టాడు. కెరీర్ స్టార్టింగ్ నుంచి డిఫరెంట్ సినిమాలతో అలరిస్తున్న శర్వా, నెక్ట్స్ సినిమా విషయంలో కూడా అదే ఫార్ములాను ఫాలో అవుతున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ నిర్మాతగా యువనటుడు రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కిన బోల్డ్ ఎంటర్టైనర్ కుమారి 21ఎఫ్. కథా కథనాలు సుకుమార్ అందించినా.. తనదైన టేకింగ్‌తో సినిమాను సక్సెస్‌ఫుల్‌గా తెరకెక్కించిన దర్శకుడు పలనాటి సూర్యప్రతాప్కు మంచి గుర్తింపు వచ్చింది. దీంతో తన నెక్ట్స్ సినిమాను సూర్య ప్రతాప్‌తో చేయాలనుకుంటున్నాడు శర్వానంద్. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించనున్న ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది. -
యమా బిజీగా కుమారి
'అలా ఎలా' సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన హేబా పటేల్, సుకుమార్ నిర్మాణంలో తెరకెక్కిన కుమారి 21ఎఫ్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ఈ సినిమాతో నటన పరంగానే కాకుండా బోల్డ్ సీన్స్‌లో కూడా ఎలాంటి తడబాటు లేకుండా నటించిన హేబా, దర్శక నిర్మాత దృష్టిలో పడింది. దీంతో ఇప్పుడు వరుస ఆఫర్లతో బిజీ అయ్యింది ఈ బ్యూటీ. ఇప్పటికే జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో మరోసారి రాజ్ తరుణ్‌తో కలిసి నటిస్తోంది. మంచు విష్ణు, రాజ్ తరుణ్ హీరోలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో మరో సక్సెస్ గ్యారెంటీ అన్ననమ్మకంతో ఉంది హేబా. ఈ సినిమాతో పాటు క్రియేటివ్ డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి, మళయాల సూపర్ స్టార్ మోహల్ హీరోగా తెరకెక్కిస్తున్న సినిమాలో కూడా ఓ కీలక పాత్రలో నటిస్తోంది. వీటితో పాటు శర్వానంద్ హీరోగా పి.మహేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు కూడా హేబానే హీరోయిన్గా సెలెక్ట్ చేసుకున్నారు. ఈ మూడు సినిమాలతో పాటు మరో లేడి ఓరియంటెడ్ సినిమాకు కూడా కమిట్ అయ్యింది. ఈ సినిమాతో వినాయక్ అసిస్టెంట్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇలా ఒకేసారి నాలుగు సినిమాలను లైన్లో పెట్టి యమా బిజీగా కనిపిస్తోంది కుమారి. -
సుకుమార్ రైటింగ్స్ నుంచి 'డైరెక్టర్'
ఆర్య, 100% లవ్, వన్ నేనొక్కడినే లాంటి సినిమాలతో దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సుకుమార్.. ఆ తర్వాత నిర్మాతగా మారి తన మార్క్ చూపించాడు. యంగ్ హీరో రాజ్ తరుణ్, హేబాపటేల్ హీరో హీరోయిన్లుగా తన శిష్యుడు పల్నాటి సూర్యప్రతాప్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ కుమారి 21ఎఫ్ సినిమాను తెరకెక్కించాడు. సందేశాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా పక్కాగా ఉండటంతో ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ విజయంతో నిర్మాతగా కూడా సక్సెస్ సాధించిన సుకుమార్ ఇప్పుడు 'డైరెక్టర్' పేరుతో మరో సినిమాకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే కథాకథనాలను రెడీ చేసిన సుకుమార్.. డైరెక్టర్ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమాను మరోసారి సూర్యప్రతాప్ చేతిలో పెడతాడా..? లేక మరో దర్శకుణ్ని పరిచయం చేస్తాడా..? అన్న విషయం తెలియాల్సి ఉంది. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాకు నటీనటులతో పాటు సాంకేతిక నిపుణుల ఎంపిక జరగాల్సి ఉంది. -
వర్మ కథతో రాజ్‌తరుణ్ డైరెక్షన్
వరుసగా వార్తల్లో వ్యక్తిగా ఉంటున్న రామ్‌గోపాల్ వర్మ మరో సంచలనానికి తెర తీశాడు. ఇప్పటికే తన దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన చాలా మందిని దర్శకులుగా పరిచయం చేసిన వర్మ తాజాగా ఓ యంగ్ హీరోను దర్శకుడిగా పరిచయం చేయబోతున్నాడు. హ్యాట్రిక్ హిట్స్‌తో టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోగా క్రేజ్ సొంతం చేసుకున్న రాజ్ తరుణ్, రామ్‌గోపాల్ వర్మ కథతో సినిమాను తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు. రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కిన సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతోంది. ఈ సినిమా తరవాత మంచు విష్ణు నిర్మిస్తున్న సినిమాతో పాటు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించనున్న మూకీ సినిమాలో హీరోగా నటించనున్నాడు. హీరోగా బిజీగా ఉండగానే దర్శకత్వం మీద దృష్టిపెడుతున్నాడు రాజ్ తరుణ్. వర్మ రాసిన ఓ ప్రేమకథను డైరెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ విషయాన్ని రాజ్ తరుణ్ స్వయంగా తెలిపాడు. దాదాపు 50 షార్ట్ ఫిలింస్‌కు దర్శకత్వ శాఖలో పని చేసిన రాజ్ తరుణ్ సినీరంగంలోకి కూడా దర్శకుడు కావాలనే ఉద్దేశంతోనే అడుగుపెట్టాడు. అయితే అనుకోకుండా వచ్చిన అవకాశం రాజ్ తరుణ్‌ను హీరోని చేసింది. ఇప్పటికీ కాలీ సమయం కథలు రాస్తూనే గడుపుతాననే రాజ్ తరుణ్, వర్మ స్కూల్ నుంచి దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. -
సుకుమార్ బాటలో హరీష్
దర్శకుడిగా మంచి ఇమేజ్ సొంతం చేసుకున్న సుకుమార్, కుమారి 21 ఎఫ్ సినిమాతో నిర్మాతగా మారి సూపర్ హిట్ సాధించాడు. యూత్‌ను ఆకట్టుకునే సినిమాలను తెరకెక్కించటంతో స్పెషలిస్ట్‌గా పేరున్న సుక్కు నిర్మాతగా కూడా అదే తరహా సినిమాతో అలరించాడు. తన శిష్యుడు పల్నాటి సూర్యప్రతాప్‌ను దర్శకుడి పరిచయం చేసి మరిన్ని మార్కులు సాధించాడు. భవిష్యత్తులో ఇదే సాంప్రదాయాన్ని కంటిన్యూ చేస్తూ సినిమాలు నిర్మించాలని భావిస్తున్నాడు సుక్కు. ఇప్పుడు ఇదే బాటలో నడవడానికి మరో దర్శకుడు రెడీ అవుతున్నాడు. గబ్బర్‌సింగ్ లాంటి భారీ బ్లాక్‌బస్టర్‌తో ఆకట్టుకున్న హరీష్ శంకర్ తరువాత రామయ్య వస్తావయ్య సినిమాతో నిరాశపరిచాడు. ఈ ఫెయిల్యూర్‌తో లాంగ్ గ్యాప్ తీసుకున్న హరీష్ ఇటీవలే సాయిధరమ్ తేజ్ హీరోగా సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చాడు. అదే జోష్‌లో ఇప్పుడు నిర్మాణ రంగం మీద దృష్టి పెడుతున్నాడు. అంతేకాదు నిర్మాతగా తన తొలి సినిమాను తనే డైరెక్ట్ చేయాలన్న ఆలోచనలో ఉన్నాడట హరీష్. -
అవికా గోర్ స్థానంలో హేబా పటేల్
సినీరంగం సక్సెస్ వెంటే పరిగెడుతోందన్న విషయం మరోసారి రుజువైంది. సుకుమార్ నిర్మాణంలో రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కి ఘన విజయం సాధించిన సినిమా కుమారి 21 ఎఫ్. విడుదల సమయంలో డివైడ్ టాక్ వచ్చినా కలెక్షన్ల విషయంలో మాత్రం ఇండస్ట్రీ వర్గాలను కూడా ఆశ్చర్యపరిచింది. దీంతో ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించిన రాజ్ తరుణ్, హేబా పటేల్‌లు లీడ్ రోల్స్‌లో మరో సినిమాను ప్లాన్ చేస్తున్నారు. మంచు విష్ణు హీరోగా తనే నిర్మిస్తున్న సినిమాలో సెకండ్ హీరో క్యారెక్టర్‌కు రాజ్ తరుణ్‌ను ఎంపిక చేశారు. జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాజ్ తరుణ్‌కు జోడీగా తొలుత అవికా గోర్‌ను తీసుకున్నారు. అయితే కుమారి 21 ఎఫ్ సక్సెస్ తరువాత మనసు మార్చుకున్న చిత్రయూనిట్, అవికా ప్లేస్‌లో హేబాను సెలెక్ట్ చేశారు. ప్రస్తుతం సీతమ్మ అందాలు, రామయ్య సిత్రాలు సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న రాజ్ తరుణ్ ఆ తరువాత జి నాగేశ్వరరెడ్డి సినిమా షూటింగ్లో పాల్గొననున్నాడు. -
దేవి హీరో అవుతున్నాడోచ్!
ఎప్పటినుంచో ఊరిస్తున్న వార్త నిజమైంది. తన మ్యూజిక్‌తోనూ, స్టేజ్ షోలతోనూ ఆడియన్స్‌ను మంత్రముగ్ధుల్ని చేస్తున్న దేవిశ్రీ ప్రసాద్‌ను హీరోగా పరిచయం చేయాలని తెలుగు, తమిళ నిర్మాతలు చాలామంది ప్రయత్నించారు. సరైన కథ దొరికితే హీరోగా చేస్తానని దేవి కూడా ప్రకటించారు. దేవిని హీరోగా పరిచయం చేసే అవకాశం ‘దిల్’రాజుకు దక్కింది. ఆ చిత్రాన్ని సుకుమార్ డెరైక్ట్ చేయనున్నారట. ఈ విశేషాలను ‘దిల్’ రాజు స్వయంగా వెల్లడించారు. సుకుమార్ నిర్మాతగా మారి తీసిన తొలి సినిమా ‘కుమారి 21ఎఫ్’ సంచలన విజయాన్ని లిఖిస్తోంది. ఈ సినిమా విజయోత్సవాన్ని శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని ఓ థియేటర్లో ప్రేక్షకుల మధ్య నిర్వహించారు. హీరో, హీరోయిన్లు రాజ్ తరుణ్, హేభా పటేల్, కెమెరామ్యాన్ రత్నవేలు, దర్శకుడు సూర్యప్రతాప్ తదితర చిత్రబృందం ఈ వేడుకలో పాల్గొన్నారు. -
కలెక్షన్స్ కొల్లగొడుతున్న సుకుమార్ ’కుమారి’
-
కాపీ కొట్టమంటే సినిమానే వదులుకుంటా!
‘‘నాకు నచ్చిన దర్శకుల్లో సుకుమార్ ఒకరు. ఆయన నిర్మాతగా చేసిన ‘కుమారి 21 ఎఫ్’ ఘనవిజయం సాధించాలని కోరుకున్నా. ఈ సినిమా క్లైమాక్స్ ప్రేక్షకులకు నచ్చుతుందా అని టెన్షన్ ఉండేది. సుకుమార్ మాత్రం బలంగా నమ్మారు. రీ-రికార్డింగ్ కూడా పూర్తి చేశాక, ‘బ్లాక్ బస్టర్ ఖాయం’ అని సుకుమార్‌తో అన్నాను. మా నమ్మకం హిట్టయ్యింది’’ అని సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ అన్నారు. రాజ్‌తరుణ్‌తో సూర్యప్రతాప్ దర్శకత్వంలో రూపొందిన ‘కుమారి 21 ఎఫ్’ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రం విజయానందంతో దేవిశ్రీ ప్రసాద్ మీడియాతో ముచ్చటించారు.. * నాకు చిన్నా, పెద్దా తేడా లేదు. ఏ సినిమా అయినా ఒకటే. మంచి పాటలివ్వడానికి సబ్జెక్ట్‌లో స్కోప్ ఉండాలి. నా కెరీర్ స్టార్టింగ్‌లో ‘అభి’ వంటి చిత్రాలు చేశాను. ఆ సినిమాలో ‘వంగ తోట మలుపు కాడ...’ పాట నాకు బాగా నచ్చుతుందని ఇప్పటికీ అల్లు అరవింద్‌గారు అంటుంటారు. పాటల కంపోజింగ్‌కి నేను విదేశాలకు వెళ్లను. నా రికార్డింగ్ స్టూడియోలోనే నాకు సౌకర్యవంతంగా ఉంటుంది. కానీ, దర్శక-నిర్మాతల ఇష్టం మేరకు ‘అత్తారింటికి దారేది’కి బార్సిలోనా వెళ్లాను. మూడు రోజుల్లో మూడు పాటలు పూర్తి చేశాను. తాజాగా ‘నాన్నకు ప్రేమతో’ కోసం విదేశాలకు వెళ్లాను. నాలుగు రోజుల్లో మూడు పాటలు చేసేశాను. * ఏ ట్యూన్ చేసినా అది స్వయంగా నేనే చేయాలనుకుంటాను. కాపీ ట్యూన్స్ జోలికి వెళ్లను. నా కెరీర్ కొత్తలో ఓ దర్శకుడు ఓ హాలీవుడ్ సాంగ్ చూపించి, అలా చేయమన్నాడు. అప్పుడు నేను ‘సారీ సార్.. మనం భవిష్యత్తులో కలిసి పని చేద్దాం. ఇప్పుడు నా వల్ల కాదు’ అన్నాను. ‘మరీ ఇంత యాటిట్యూడా? పైకి రావు’ అన్నారు. నవ్వుకున్నాను. మొన్నా మధ్య ఫలానా సంగీతదర్శకుడు చేసిన పాట ఫలానా పాటకు కాపీ అంటూ ఎవరో సర్వే నిర్వహించారు. అందులో నా పేరు లేదు. ‘నవ్వు దొరకవా?’ అన్నారు. ఎవరైనా దర్శకులు నా దగ్గర మరో ట్యూన్‌ని కాపీ కొట్టమంటే, సినిమానే వదులుకుంటాను తప్ప ఎప్పటికీ కాపీ చేయను. మనకున్నవి ఏడే స్వరాలు. ఆ స్వరాల చుట్టూ పాట తిరిగే క్రమంలో ఏదో చిన్న సౌండ్ మరేదో పాటలో విన్నట్లు అనిపించవచ్చు. దాన్నేం చేయలేం. * పవన్ కల్యాణ్ హీరోగా రూపొందుతున్న ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ కోసం ఓ సాంగ్ చేశాను. ఒక మంచి మాస్ బీట్ విని, ‘నీ ట్యూన్‌తో నాకు చాలా కిక్ ఇచ్చావ్. నువ్వు చేసినదానికన్నా డబుల్ డ్యాన్స్ చేస్తాను’ అని పవన్ కల్యాణ్ ఫోన్ చేసి, అన్నారు. * అల్లు అరవింద్, అశ్వనీదత్ వంటివాళ్లు నన్ను హీరోగా పెట్టి, సినిమాలు చేస్తామంటున్నారు. తమిళం నుంచి ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. ‘100% లవ్’ చిత్రంలో నన్ను హీరోగా నటించమని అడిగారు. అప్పుడు చెయ్యలేదు. సంగీతదర్శకుణ్ణి కాబట్టి, మ్యూజిక్ బేస్డ్ సినిమా చేశామా? అన్నట్లు కాకుండా కథాబలం ఉన్న చిత్రాలైతే చేస్తా. ఇప్పుడు మనకు చాలామంది హీరోలున్నారు. అందుకని అత్యవసరంగా నేను హీరోగా రంగంలోకి దిగాల్సిన పని లేదు. -
'సినీ వారసులు అతణ్ని చూసి నేర్చుకోవాలి'
దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ యువ కథానాయకులకు చురకలంటించాడు. సుకుమార్ నిర్మాణంలో తెరకెక్కిన కుమారి 21 ఎఫ్ సినిమా రిలీజ్ సందర్భంగా టాలీవుడ్ స్టార్ వారసులను టార్గెట్ చేస్తూ తన మార్క్ ట్వీట్లతో చెలరేగిపోయాడు. రాజ్ తరుణ్‌ను చూసి మిగతా హీరోలు నేర్చుకోవలంటూ మరోసారి ఈ కుర్ర హీరోను ఇరకాటంలో పడేశాడు. గతంలో కూడా రాజ్ తరుణ్ వర్మను కామెంట్ చేసినట్టుగా తన మీద తానే ట్వీట్లు పోస్ట్ చేసుకున్నాడు వర్మ. 'తెలుగు సినిమా హద్దులు చెరిపేస్తున్న రాజ్ తరుణ్‌ను చూస్తే గర్వంగా ఉంది. ఇప్పటికీ పాత తరహా సినిమాలకే పరిమితమైన కుర్ర హీరోలు రాజ్ తరుణ్‌ను చూసి నేర్చుకోవాలి. ప్రేక్షకులను ఇడియట్స్గా భావించి సినిమాలు చేసే స్టార్ వారసులు రాజ్ తరుణ్ నుంచి పాఠాలు నేర్చుకోవాలి. కుమారి 21ఎఫ్ విజయం సాధించిన సందర్భంగా రాజ్ తరుణ్, హేబా పటేల్, సూర్య ప్రతాప్‌లకు శుభాకాంక్షలు. వెండితెర మీద బాహుబలి లాంటి భారీ చిత్రాలు లేదా కథాబలం ఉన్న భలే భలే మొగాడివోయ్, కుమారి 21ఎఫ్ లాంటి సినిమాలు మాత్రమే విజయాలు సాధిస్తాయి.' అంటూ యువకథానాయకులకు చురకలంటించాడు. గతంలో వర్మ పై కామెంట్ చేశాడన్న అపవాదుతోనే విమర్శలు ఎదుర్కొన్న రాజ్ తరుణ్, మరోసారి వర్మ ట్వీట్లతో ఇరకాటంలో పడ్డాడని భావిస్తున్నారు ఇండస్ట్రీ జనాలు. -
ఎన్టీఆర్ కు తెగ నచ్చేసిన 'కుమారి'
సున్నితమైన ఫీలింగ్స్‌ను స్టోరీ లైన్‌గా ఎంచుకుని స్క్రీన్‌ను షేక్ చేసే డైరెక్టర్ సుకుమార్. అతడు మొదటిసారి నిర్మాతగా మారి కథాకథనాలు అందించిన చిత్రం 'కుమారి 21 ఎఫ్'. శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం వసూళ్ల కన్నా ముందు ప్రశంసలను అందుకుంటోంది. పలువురు సినీ ప్రముఖులు ఈ చిత్ర విజయం పట్ల ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమాల్లో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కుమారి 21 ఎఫ్... యంగ్ టైగర్ ఎన్టీఆర్ మనసు కూడా దోచేసిందట. గురువారమే సినిమా చూసిన ఎన్టీఆర్.. కథ హృదయానికి హత్తుకునేలా ఉందని.. ఇలాంటి బ్రేవ్ అండ్ బోల్డ్ రైటింగ్‌కు గాను సుకుమార్‌కు హ్యాట్సాఫ్ అంటూ ట్వీట్ చేశాడు. సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, దర్శకుడు సూర్య ప్రతాప్‌లు ఓ రేంజ్ లో రాణించారని.. అలాగే హీరోయిన్ హెబ్బా, హీరో తరుణ్ నటన బెస్ట్ అంటూ అభినందించాడు యంగ్ టైగర్. సో సుకుమార్ మార్క్ సున్నితమైన, స్వచ్ఛమైన భావోద్వేగాలను బోల్డ్ గా చూపించడంలో దర్శకుడు సూర్య ప్రతాప్ విజయం సాధించినట్టే. A new age luv story..KUMARI 21F.throughly loved it!!!Pratap Devi and Randy excelled to the highest.heebah and raj were at their best. — tarakaram n (@tarak9999) November 19, 2015 Last but not the least a very heart touching story from the master himself SUKKU Garu..hats off for the brave and bold writing sir. — tarakaram n (@tarak9999) November 19, 2015 -
నచ్చకపోతే...వెళ్లిపోతానన్నా!
‘కుమారి 21 ఎఫ్’ పేరుకు చిన్న సినిమా అయినా ప్రతి సన్నివేశం రిచ్‌గా, పెద్ద సినిమాలకు దీటుగా ఉంటుంది’’ అని ప్రముఖ కెమేరామన్ రత్నవేలు చెప్పారు. రాజ్‌తరుణ్, హేబా పటేల్ జంటగా సుకుమార్ నిర్మాతగా మారి కథ, స్క్రీన్‌ప్లే అందించిన చిత్రం ‘కుమారి 21ఎఫ్’. సూర్యప్రతాప్ పల్నాటి దర్శకుడు. ‘రోబో, 1-నేనొక్కడినే’ లాంటి భారీ చిత్రాలకు పనిచేసిన రత్నవేలు ఈ చిత్రానికి ఛాయాగ్రాహకుడు. నేడు రిలీజయ్యే ఈ చిత్రవిశేషాలు ఆయన మాటల్లోనే... సుకుమార్‌తో నాది పదేళ్ల అనుబంధం. ఆయన ఈ కుమారి కథ చెబుతానన్నప్పుడు - ‘నచ్చితే చేస్తా. లేకపోతే చెన్నై వెళిపోతా’నన్నా. కానీ కథ విన్నాక వెంటనే ఓకే చెప్పేశా. కథను నమ్మే సినిమాలు అంగీకరిస్తా గానీ అది చిన్నదా? పెద్దదా అనే తేడా లేదు. ‘రోబో’ చిత్రానికి వర్క్ చేశాక, తమిళంలో ‘హరిదాస్’ అనే లో-బడ్జెట్ చిత్రానికి పనిచేశా. కథానుగుణంగానే ఈ చిత్రానికి రెగ్యులర్ లైటింగ్‌లో 80 శాతం వరకు తగ్గించి పనిచేశా. అందుబాటులో ఉన్న డిజిటల్ లోలైటింగ్ ఫొటోగ్రఫీని ప్రయోగాత్మకంగా వాడాం. క్లయిమాక్స్ సన్నివేశం తక్కువ సంభాషణలతో హీరో హీరోయిన్ల భావోద్వేగాలను బేస్ చేసుకుని ఉంటుంది. ఈ సినిమా కోసం పారితోషికం తీసుకోకుండా ఎందుకు పనిచేశావని చాలామంది అడుగుతున్నారు. 20 ఏళ్లుగా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్నా. ఇప్పటివరకూ సంపాదించింది చాలు. అందుకే నాకు అలాంటి పట్టింపులు ఉండవు. మంచి సినిమా అయితే చాలు. ప్రస్తుతం మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న ‘బ్రహ్మోత్సవం’కి పనిచేస్తున్నా. ఒకేసారి నాలుగైదు సినిమాలు చేయను. ఒక్క సినిమా అయినా నిబద్ధతతో చేయాలనేదే నా అభిప్రాయం. -
ఎన్టీఆర్‌ని భయపెడుతున్న కుమారి
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్లో 'నాన్నకు ప్రేమతో..' సినిమాలో నటిస్తున్నాడు. ఈ ఏడాది 'టెంపర్' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న జూనియర్ అదే జోష్‌లో సుకుమార్ సినిమాలో నటిస్తున్నాడు. సుకుమార్ మాత్రం 'వన్ నేనొక్కడినే' లాంటి డిజాస్టర్ తరువాత ఎలాగైనా పెద్ద హిట్ కొట్టాలనే కసితో 'నాన్నకు ప్రేమతో..' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే సుకుమార్ నిర్మాతగా, కథ, స్క్రీన్ ప్లే అందించిన 'కుమారి 21ఎఫ్' సినిమా విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పుడు ఈ విషయమే 'నాన్నకు ప్రేమతో..' యూనిట్‌ను ఆలోచనలో పడేసింది. 'వన్ నేనొక్కడినే' రిజల్ట్ తరువాత దాదాపు మూడు నెలల పాటు సుకుమార్ ఎవరినీ కలవకుండా ఇంటికే పరిమితమయ్యాడట. ఇప్పుడు 'కుమారి 21ఎఫ్' రిజల్ట్ తేడా పడితే 'నాన్నకు ప్రేమతో..' పరిస్థితి ఏంటి..? అని కంగారుపడుతున్నారట యూనిట్. రాజ్ తరుణ్, హీబాపటేల్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న 'కుమార్ 21ఎఫ్' ఈ శుక్రవారం (నవంబర్ 20)న రిలీజ్ అవుతోంది. 'సినిమా చూపిస్త మామ' లాంటి హిట్ తరువాత రాజ్ తరుణ్ చేస్తున్న సినిమా కావటం, తొలిసారిగా సుకుమార్ నిర్మాణ బాధ్యతలు చేపట్టడం, ఓ చిన్న సినిమాలకు దేవీశ్రీ ప్రసాద్, రత్నవేలు లాంటి టాప్ టెక్నీషియన్స్ పనిచేయటం లాంటి హంగులతో భారీ అంచనాల మధ్య ఈ సినిమా రిలీజ్ కానుంది. -
లవ్‌కి బయోడేటాతో పనేంటి?
ఎవరినైనా ప్రేమించాలంటే ఎదుటి వాళ్ల మనసు మంచిదా? కాదా? వాళ్ల బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? లాంటివి వెరిఫై చేస్తారు. ఓ కుర్రాడు తన గాళ్‌ఫ్రెండ్ కుమారిని కూడా ఇలాగే అడిగితే...‘‘లవ్ చేయడానికి నా ఫిజిక్ చాలదా? నా బయోడేటా మొత్తం కావాలా?’’ అని ఎదురు ప్రశ్నిస్తుంది. మరి ఈ కుమారిని లవ్ చేయాలా? వద్దా? అని డైలామాలో పడతాడు ఈ ప్రేమికుడు. చివరకు ఈ ప్రేమకథ ఎన్ని మలుపులు తీసుకుందనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘కుమారి 21ఎఫ్’. సుకుమార్ తొలిసారి నిర్మాతగా మారి కథ, స్క్రీన్‌ప్లే అందించిన ఈ లవ్‌స్టోరీకి సూర్యప్రతాప్ పల్నాటి దర్శకుడు. రాజ్‌తరుణ్, హేభా పటేల్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని విజయ్‌ప్రసాద్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి ఆదూరి నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది. నిర్మాతలు మాట్లాడుతూ-‘‘సుకుమార్ శైలిలో సాగే డిఫరెంట్ లవ్‌స్టోరీ ఇది. రాజ్‌తరుణ్ అభినయం, దేవిశ్రీప్రసాద్ సంగీతం ఈ చిత్రానికి హైలైట్’’ అని చెప్పారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: రత్నవేలు, ఆర్ట్: బి.రామచంద్రసింగ్. -
డాక్టర్ అయాన్.. S/O అల్లు అర్జున్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. తన తనయుడు చిన్నారి అయాన్ డాక్టర్ గెటప్‌లో ఉన్న ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. శనివారం 'హాలోవీన్స్ డే' సందర్భంగా అయాన్‌ను డాక్టర్లా రెడీ చేసి అల్లు అర్జున్ తన సంతోషాన్ని ట్విట్టర్లో పంచుకున్నారు. దాంతో అయాన్ నెట్లో లిటిల్ స్టైలిష్ స్టార్ అయిపోయాడు. హాలోవీన్స్ డే అనేది అమెరికాతో పాటు కొన్ని పాశ్చాత్య దేశాల్లో జరుపుకొనే ఓ ఫెస్టివల్. 'హాలోవీన్స్ డే' ని 'సెయింట్స్ డే' అని కూడా అంటారు. కాగా ప్రముఖ దర్శకుడు సుకుమార్ తొలిసారి నిర్మాతగా మారి కొత్త దర్శకుడు సూర్యప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం 'కుమారి 21ఎఫ్'. ఆ చిత్ర ఆడియో విడుదల సందర్భంగా అల్లు అర్జున్ చిత్ర టీంకు విషెస్ తెలిపారు. శనివారం జరిగిన ఆడియో రిలీజ్‌కు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆడియో సీడీని అల్లు అర్జున్ ఆవిష్కరించగా, ప్రముఖ నిర్మాత దిల్‌రాజు చేతుల మీదుగా చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి దేవీశ్రీప్రసాద్ సంగీతం అందించగా.. రాజ్ తరుణ్, హెబా పటేల్ హీరోహీరోయిన్లుగా నటించారు. Fun Stuff with my lil son ! Happy Halloween's Day ! pic.twitter.com/MEpToujAQE — Allu Arjun (@alluarjun) October 31, 2015 -
'ప్రిన్స్'కు నచ్చిన కుమారి
'ప్రిన్స్' మహేష్ బాబు రూటు మార్చాడు. తన సినిమాల విషయంలోనే కాదు ఇతర హీరోలు, దర్శకుల సినిమాలను ప్రశంసిస్తూ తన పెద్ద మనసు చాటుకుంటున్నాడు. బాహుబలి రిలీజ్ సమయంలో తన సినిమాను వాయిదా వేసుకున్న మహేష్ అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల మనసు కూడా గెలుచుకున్నాడు. అంతేకాదు ఇటీవల చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని చిత్రయూనిట్లకు అభినందనలు తెలియజేస్తున్నాడు. సుకుమార్ తొలిసారిగా నిర్మాతగా మారి తెరకెక్కిస్తున్న కుమారి 21ఎఫ్ సినిమా విషయంలో ఇలాగే స్పందించాడు మహేష్. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ పై ప్రశంసల జల్లు కురింపించాడు. 'కుమారి 21ఎఫ్ టీజర్ చాలా ఇంప్రెసివ్‌గా ఉంది. రత్నవేలు ఛాయాగ్రహణం, దేవీశ్రీ ప్రసాద్ సంగీతం చాలా బాగున్నాయి. సుకుమార్ టీమ్ కు నా అభినందనలు' అంటూ ట్విట్టర్ లో తన శుభాకాంక్షలు తెలియజేశాడు. The teaser of kumari 21F is http://t.co/C06E9JIBhP notch work by Rathnavelu sir and DSP. — Mahesh Babu (@urstrulyMahesh) October 3, 2015 Wishing Sukumar garu & the entire team all the very best :) — Mahesh Babu (@urstrulyMahesh) October 3, 2015 -
కొరియోగ్రాఫర్‌గా దేవీశ్రీ ప్రసాద్
సౌత్ సినిమా ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా మంచి ఫాంలో ఉన్న దేవీ శ్రీ ప్రసాద్ మరో కొత్త అవతారం ఎత్తుతున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోలకు సంగీతం అదించటంతో పాటు అప్పుడప్పుడు బాలీవుడ్ లో కూడా మెరుస్తున్న దేవీ తాజాగా కొరియోగ్రాఫర్‌గా మారాడు. రెగ్యులర్‌గా తన సినిమాల ఆడియో ఫంక్షన్స్‌తో పాటు, ప్రమోషనల్ వీడియోస్‌లో కూడా తన డ్యాన్సింగ్ ట్యాలెంట్ చూపిస్తున్న ఈ సంగీత తరంగం.. 'కుమారి 21 ఎఫ్' సినిమా కోసం నృత్య దర్శకుడిగా మారాడు. తనే సంగీతం అందించిన ఓ ఫంకీ సాంగ్ కోసం స్టెప్స్ కూడా కంపోజ్ చేస్తున్నాడు. దేవీ శ్రీ ప్రసాద్ మిత్రుడు, ప్రముఖ దర్శకుడు సుకుమార్ నిర్మిస్తున్న 'కుమారి 21 ఎఫ్' సినిమాలో రాజ్ తరుణ్, హేభ పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. కథ స్క్రీన్ ప్లే మాటలు సుకుమార్ అందిస్తుండగా, ఆయన శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నాడు. -
భిన్న పార్శ్వాలున్న పాత్రలో...
‘ఉయ్యాల జంపాల’ ఫేం రాజ్ తరుణ్ హీరోగా దర్శకుడు సుకుమార్ ‘కుమారి 21 ఎఫ్’ చిత్రం నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ యువహీరో నటిస్తున్న మూడో చిత్రం ఆదివారం ప్రారంభమైంది. రచయిత శ్రీనివాస్ గవిరెడ్డిని దర్శకునిగా పరిచయం చేస్తూ, శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై శైలేంద్రబాబు, శ్రీధర్‌రెడ్డి, హరీశ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి బేబి గౌతమి కెమెరా స్విచాన్ చేయగా, ఐపీఎస్ అధికారి రావులపాటి సీతారామారావు క్లాప్ ఇచ్చారు. యువదర్శకుడు విరించి వర్మ గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాత తల్లిదండ్రులు స్క్రిప్ట్ అందించారు. ఈ వేడుకలో దర్శకులు ఎన్. శంకర్, మారుతి, మదన్, హీరో ఆది అతిథులుగా పాల్గొన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్లో రాజ్ తరుణ్‌ది భిన్న పార్శ్వాలున్న పాత్ర’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్, కెమెరా: విశ్వ.