కుమారి డైరెక్టర్‌తో శర్వా
కుమారి డైరెక్టర్‌తో శర్వా
Published Thu, Apr 7 2016 2:37 PM | Last Updated on Sun, Sep 3 2017 9:25 PM
రన్ రాజా రన్ సినిమాతో సక్సెస్ ట్రాక్లోకి వచ్చిన శర్వానంద్, వరుసగా మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, ఎక్స్ ప్రెస్ రాజా సినిమాలతోనూ అదే జోరు కొనసాగించాడు. ఎక్స్ ప్రెస్ రాజా సినిమా తరువాత కాస్త గ్యాప్ తీసుకున్న ఈ యంగ్ హీరో, ప్రస్తుతం తన తదుపరి సినిమా మీద దృష్టిపెట్టాడు. కెరీర్ స్టార్టింగ్ నుంచి డిఫరెంట్ సినిమాలతో అలరిస్తున్న శర్వా, నెక్ట్స్ సినిమా విషయంలో కూడా అదే ఫార్ములాను ఫాలో అవుతున్నాడు.
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ నిర్మాతగా యువనటుడు రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కిన బోల్డ్ ఎంటర్టైనర్ కుమారి 21ఎఫ్. కథా కథనాలు సుకుమార్ అందించినా.. తనదైన టేకింగ్తో సినిమాను సక్సెస్ఫుల్గా తెరకెక్కించిన దర్శకుడు పలనాటి సూర్యప్రతాప్కు మంచి గుర్తింపు వచ్చింది. దీంతో తన నెక్ట్స్ సినిమాను సూర్య ప్రతాప్తో చేయాలనుకుంటున్నాడు శర్వానంద్. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించనున్న ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది.
Advertisement
Advertisement