ఎన్టీఆర్‌ని భయపెడుతున్న కుమారి | Ntr fear about kumari 21f result | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్‌ని భయపెడుతున్న కుమారి

Published Wed, Nov 18 2015 9:24 AM | Last Updated on Sun, Sep 3 2017 12:40 PM

ఎన్టీఆర్‌ని భయపెడుతున్న కుమారి

ఎన్టీఆర్‌ని భయపెడుతున్న కుమారి

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్లో 'నాన్నకు ప్రేమతో..' సినిమాలో నటిస్తున్నాడు. ఈ ఏడాది 'టెంపర్' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న జూనియర్ అదే జోష్లో సుకుమార్ సినిమాలో నటిస్తున్నాడు. సుకుమార్ మాత్రం 'వన్ నేనొక్కడినే' లాంటి డిజాస్టర్ తరువాత ఎలాగైనా పెద్ద హిట్ కొట్టాలనే కసితో 'నాన్నకు ప్రేమతో..' సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే సుకుమార్ నిర్మాతగా, కథ, స్క్రీన్ ప్లే అందించిన 'కుమారి 21ఎఫ్' సినిమా విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పుడు ఈ విషయమే 'నాన్నకు ప్రేమతో..' యూనిట్ను ఆలోచనలో పడేసింది. 'వన్ నేనొక్కడినే' రిజల్ట్ తరువాత దాదాపు మూడు నెలల పాటు సుకుమార్ ఎవరినీ కలవకుండా ఇంటికే పరిమితమయ్యాడట. ఇప్పుడు 'కుమారి 21ఎఫ్' రిజల్ట్ తేడా పడితే 'నాన్నకు ప్రేమతో..' పరిస్థితి ఏంటి..? అని కంగారుపడుతున్నారట యూనిట్.

రాజ్ తరుణ్, హీబాపటేల్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న 'కుమార్ 21ఎఫ్' ఈ శుక్రవారం (నవంబర్ 20)న రిలీజ్ అవుతోంది. 'సినిమా చూపిస్త మామ' లాంటి హిట్ తరువాత రాజ్ తరుణ్ చేస్తున్న సినిమా కావటం, తొలిసారిగా సుకుమార్ నిర్మాణ బాధ్యతలు చేపట్టడం, ఓ చిన్న సినిమాలకు దేవీశ్రీ ప్రసాద్, రత్నవేలు లాంటి టాప్ టెక్నీషియన్స్ పనిచేయటం లాంటి హంగులతో భారీ అంచనాల మధ్య ఈ సినిమా రిలీజ్ కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement