బిజీ బిజీగా కుర్రహీరో | young hero rajtarun busy with 3 films | Sakshi
Sakshi News home page

బిజీ బిజీగా కుర్రహీరో

Published Thu, May 19 2016 3:54 PM | Last Updated on Sun, Sep 3 2017 12:40 PM

బిజీ బిజీగా కుర్రహీరో

బిజీ బిజీగా కుర్రహీరో

ప్రస్తుతం టాలీవుడ్లో సూపర్ ఫాంలో కనిపిస్తున్న యంగ్ హీరో రాజ్ తరుణ్. చేసినవి రెండు సినిమాలే అయినా మినిమమ్ గ్యారెంటీ హీరోగా ముద్ర వేసుకున్నాడు ఈ వైజాగ్ కుర్రాడు. తొలి సినిమా 'ఉయ్యాల జంపాల'తో మంచి సక్సెస్ అందుకున్న రాజ్ తరుణ్, ఆ తరువాత 'సినిమా చూపిస్త మామ'తో హీరోగా సెటిల్ అయిపోయాడు.

'కుమారి 21ఎఫ్' రిలీజ్ తరువాత నెల గ్యాప్లో 'సీతమ్మ అందాలు - రామయ్య సిత్రాలు' అనే తెలుగింటి ప్రేమకథతో మరోసారి తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చాడు.  తాజాగా క్రియేటివ్ డైరెక్టర్ వంశీ దర్శకత్వంలో లేడీస్ టైలర్ సీక్వల్లో నటించనున్నాడు. ఈ సినిమాతో పాటు మంచు విష్ణు నిర్మాతగా తెరకెక్కుతున్న మరో సినిమాకు కూడా కమిట్ అయ్యాడు రాజ్ తరుణ్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement