సుకుమార్ బాటలో హరీష్ | Harish Shankar planing to launch a production house | Sakshi
Sakshi News home page

సుకుమార్ బాటలో హరీష్

Published Sun, Dec 6 2015 8:27 AM | Last Updated on Sun, Sep 3 2017 1:36 PM

సుకుమార్ బాటలో హరీష్

సుకుమార్ బాటలో హరీష్

దర్శకుడిగా మంచి ఇమేజ్ సొంతం చేసుకున్న సుకుమార్, కుమారి 21 ఎఫ్ సినిమాతో నిర్మాతగా మారి సూపర్ హిట్ సాధించాడు. యూత్ను ఆకట్టుకునే సినిమాలను తెరకెక్కించటంతో స్పెషలిస్ట్గా పేరున్న సుక్కు నిర్మాతగా కూడా అదే తరహా సినిమాతో అలరించాడు. తన శిష్యుడు పల్నాటి సూర్యప్రతాప్ను దర్శకుడి పరిచయం చేసి మరిన్ని మార్కులు సాధించాడు. భవిష్యత్తులో ఇదే సాంప్రదాయాన్ని కంటిన్యూ చేస్తూ సినిమాలు నిర్మించాలని భావిస్తున్నాడు సుక్కు.

ఇప్పుడు ఇదే బాటలో నడవడానికి మరో దర్శకుడు రెడీ అవుతున్నాడు. గబ్బర్సింగ్ లాంటి భారీ బ్లాక్బస్టర్తో ఆకట్టుకున్న హరీష్ శంకర్ తరువాత రామయ్య వస్తావయ్య సినిమాతో నిరాశపరిచాడు. ఈ ఫెయిల్యూర్తో లాంగ్ గ్యాప్ తీసుకున్న హరీష్ ఇటీవలే సాయిధరమ్ తేజ్ హీరోగా సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చాడు. అదే జోష్లో ఇప్పుడు నిర్మాణ రంగం మీద దృష్టి పెడుతున్నాడు. అంతేకాదు నిర్మాతగా తన తొలి సినిమాను తనే డైరెక్ట్ చేయాలన్న ఆలోచనలో ఉన్నాడట హరీష్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement