పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘గబ్బర్ సింగ్’ దర్శకనిర్మాతుల హరీష్ శంకర్, బండ్ల గణేష్‌ల మధ్య వివాదం ముదురుతున్నట్లు కనిపిస్తోంది. ఇరువురు ఒకరిపై ఒకరు కౌంటర్లు వేసుకుంటుండటంతో అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ ఇద్దరు దర్శకనిర్మాతల కెరీర్‌లో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ‘గబ్బర్‌సింగ్’ విడుదలై 8 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఆ సినిమాకి పని చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ హరీష్ శంకర్ ట్విటర్‌లో ఓ లేఖ విడుదల చేశారు. అయితే ఆ లెటర్‌లో నిర్మాత బండ్ల గణేష్ పేరు ప్రస్తావించలేదు. అయితే నిజానికి ఆయన మరిచిపోయారో లేక కావాలనే చెప్పలేదో తెలియదు కాని.. దీనిపై బండ్ల గణేష్ సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు.
‘అది ఆయన సంస్కారం. అంతకన్నా ఏం చెప్పను. ఆయన రీమేక్‌లు మాత్రమే చేయగలరు. స్ట్రయిట్ సినిమా తీసి హిట్ చేసి చూపించమనండి. ఇండస్ట్రీ వదిలేసి వెళ్లిపోతా. హరీష్ శంకర్ అనే వ్యక్తికి పవన్ కల్యాణ్ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం కల్పించింది నేను. ఎన్టీఆర్ సినిమా ఇస్తానన్న ఓ నిర్మాత ఆ సినిమా ఇవ్వకపోవడంతో డిప్రెషన్ లో వుంటే పిలిచి అవకాశం వచ్చేలా చేసాను నేను. గబ్బర్ సింగ్ కూడా అంత పెద్ద హిట్ అయ్యిందంటే అందులో పవన్ సలహాలు చాలా ఉన్నాయి.
అంతాక్ష్యరి ఎపిసోడ్ పవన్ సలహానే. హీరోయిన్ శృతి హాసన్ ఎంపిక కూడా పవర్‌స్టార్‌దే. అనుకున్న బడ్జెట్‌లో సినిమా తీయడంలో డైరెక్టర్‌గా హరీష్ విజయం సాధించాడు’ అని ఓ ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇక బండ్ల గణేష్ వ్యాఖ్యలపై హరీష్ శంకర్ ధీటుగానే స్పందించినట్లు తెలుస్తోంది. ‘గబ్బర్ సింగ్’ విజయంలో ఎవరి పాత్ర ఏంటిదో అందరికీ తెలుసని తన సన్నిహితుల దగ్గర హరీష్ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ వివాదం ఎక్కడివరకు వెళుతుందో వేచిచూడాలి.
Thanks again for the overwhelming appreciations and celebrations.... 🙏🙏🙏 thanks to all the fans who made this 🙏🙏🙏🙏🙏 pic.twitter.com/ZVyHrdGASg — Harish Shankar .S (@harish2you) May 11, 2020
చదవండి:
భార్యకు విడాకులు.. గాయనితో 9 ఏళ్లుగా
పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కౌశల్
Comments
Please login to add a commentAdd a comment