
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా, హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గబ్బర్ సింగ్’చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. 2011 మే 11న విడుదలైన ఈ చిత్రం.. టాలీవుడ్ రికార్డులను తిరగరాసింది. దబాంగ్ సినిమాకు రిమేక్ అయినా.. కానీ పవన్ నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా.. థియేటర్లలో కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన బండ్ల గణేశ్కు కూడా గుర్తింపు అందుకున్నాడు.
(చదవండి: హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న టాలీవుడ్ హీరో శ్రీకాంత్ కూతురు!)
కాగా, ఇప్పుడు ఆ సినిమాను మళ్ళీ విడుదల చేయనున్నారట. సెప్టెంబర్ 2న పవన్ పుట్టినరోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాలలో వందకు పైగా థియేటర్లలో మళ్ళీ గబ్బర్ సింగ్ సినిమా విడుదల చేయనున్నారట. సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వెల్లడించిన బండ్ల గణేశ్.. ‘సెప్టెంబర్ 2న బాస్ బర్త్ డే స్పెషల్ గా గబ్బర్ సింగ్ సినిమా చూడండి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 100 షోలు వేస్తున్నాను, మనం మన బాస్ పుట్టినరోజు థియేటర్లో జరుపుకుందాం, జై పవర్ స్టార్, జై దేవర ’అని బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment