కుమారి దర్శకుడితో మరో సినిమా | Palnati Surya Pratap New movie with Raj Tarun | Sakshi
Sakshi News home page

Published Thu, Dec 21 2017 3:57 PM | Last Updated on Thu, Dec 21 2017 3:57 PM

Palnati Surya Pratap New movie with Raj Tarun - Sakshi

‘కుమారి 21ఎఫ్’ లాంటి యూత్ ఫుల్ & సెన్సేషనల్ హిట్ తరువాత ఆ చిత్ర దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్, కథానాయకుడు రాజ్ తరుణ్ ల క్రేజీ కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కనుంది. ఎస్.ఆర్.టి ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.2గా రామ్ తాళ్ళూరి ఈ క్రేజీ ప్రొజెక్ట్ ను నిర్మిస్తున్నారు. ‘కుమారి 21ఎఫ్’ తరహాలోనే యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కనుంది. త్వరలో ప్రారంభం కానున్న ఈసినిమా విశేషాలను చిత్రయూనిట్ వెల్లడించారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత రామ్ తాళ్ళూరి మాట్లాడుతూ.. ‘హిట్ కాంబినేషన్ పల్నాటి సూర్య ప్రతాప్-రాజ్ తరుణ్ ల కాంబినేషన్ లో మా బ్యానర్ లో ప్రొడక్షన్ నెం.2గా రూపొందించనుండడం ఆనందంగా ఉంది. సూర్యప్రతాప్ చెప్పిన కథ విని ఎంతగానో ఎగ్జైట్ అయ్యాను, యూత్ ఫుల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ ఇది. ‘కుమారి 21ఎఫ్‌’ను మించిన స్థాయిలో ఈ సినిమా ఉండబోతోంది’ అన్నారు. రామ్ తళ్లూరి ఇప్పటికే రవితేజ, కళ్యాణ్ కృష్ణల కాంబినేషన్ లో ఓ సినిమాను ఎనౌన్స్ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement