ram talluri
-
పండగకి టైటిల్
మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు, ‘విజేత’ ఫేమ్ కళ్యాణ్ దేవ్ హీరోగా నటించనున్న కొత్త చిత్రం హైదరాబాద్ లో ప్రారంభమైంది. ఈ సినిమాకి ‘అశ్వథ్థామ’ ఫేమ్ రమణ తేజ దర్శకత్వం వహించనున్నారు. రామ్ తళ్లూరి నిర్మాణ సారథ్యంలో ఎస్.ఆర్.టి. ఎంటర్టైన్మెంట్స్, శుభమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై రజనీ తళ్లూరి, రవి చింతల నిర్మిస్తున్నారు. రామ్ తళ్లూరి మాట్లాడుతూ– ‘‘ప్రస్తుతం ‘సూపర్ మచ్చి’ అనే కమర్షియల్ ఎంటర్టైనర్లో నటిస్తున్న కళ్యాణ్ దేవ్ నటించనున్న మూడో చిత్రమిది. ‘కల్కి’ చిత్రానికి స్టోరీ అందించిన దేశరాజ్ సాయితేజ కథ, కథనం అందిస్తున్నారు. ‘ఛలో, భీష్మ’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు సంగీతాన్ని అందించిన మహతి సాగర్ మా చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు త్వరలోనే పూర్తి చేసుకొని సెట్స్ మీదకు వెళతాం. దీపావళి సందర్భంగా శనివారం ఉదయం 10 గంటలకు ఈ సినిమా టైటిల్‌ని ప్రకటించనున్నాం’’ అన్నారు. ఈ ప్రారంభోత్సవంలో దర్శకులు వెంకీ కుడుముల, ప్రణీత్, వేణు ఊడుగుల పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సురేశ్ రఘుతు. -
ఇంకో రాణి ఎవరు?
డిస్కో రాజా ఫుల్ జోష్‌గా ఉన్నాడు. ఎర్రటి ఎండల్లో హుషారుగా షూటింగ్ చేస్తున్నాడు. డిస్కో రాజా అంటే రవితేజ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం టైటిల్ ‘డిస్కో రాజా’. వీఐ ఆనంద్ దర్శకత్వంలో రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తయింది. రెండో షెడ్యూల్ కూడా మొదలైంది. డిస్కో రాజా సరసన ముగ్గురు రాణులు కనిపిస్తారు. ఒకరు నభా నటేష్. ఇంకో హీరోయిన్ ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ పాయల్ రాజ్‌పుత్. మరో హీరోయిన్ ఎంపిక జరుగుతోంది. మరి.. ఇంకో రాణిగా ఎవరికి అవకాశం దక్కుతుందో చూడాలి. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌కి మంచి స్పందన లభించిందని చిత్రబృందం పేర్కొంది. -
పవన్ మళ్లీ మేకప్ వేసుకుంటున్నాడా..!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అజ్ఞాతవాసి సినిమా తరువాత నటనకు దూరమయ్యారు. పూర్తి రాజకీయాలకే సమయం కేటాయించటంతో ఇక వెండితెర మీద కనిపించటం అసాధ్యం అన్న ప్రచారం జరిగింది. అయితే తాజాగా టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న వార్తలు పవన్ అభిమానులను ఖుషీ చేస్తున్నాయి. పవన్ త్వరలో ఓ సినిమాలో నటించేందుకు సూచన ప్రాయంగా అంగీకరించారట. అధికారిక సమాచారం లేకపోయినా పవన్ ఓ సినిమా చేసేందుకు ఓకె చెప్పారన్న టాక్ టాలీవుడ్ సర్కిల్స్‌లో గట్టిగా వినిపిస్తోంది. పవన్ మేనల్లుడు, సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ త్వరలో హీరోగా పరిచయం అయ్యేందుకు రెడీ అవుతున్నాడు. పవన్‌తో గోపాల గోపాల కాటమరాయుడు సినిమాలను తెరకెక్కించిన డాలీ (కిశోర్ పార్థసాని) దర్శకత్వంలో ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ అధినేత రామ్ తళ్లూరి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో ఓ పవర్ ఫుల్ రోల్ కోసం పవన్ సంప్రదించినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. మేనల్లుడి కోసమనే కాకుండా దర్శకుడు డాలీ, నిర్మాత రామ్ తళ్లూరిలతో ఉన్న సత్సంబంధాల కారణంగా ఈ సినిమాలో గెస్ట్ రోల్లో నటించేందుకు పవన్ అంగీకరించినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై చిత్రయూనిట్ గాని, పవన్ సన్నిహితులు గాని ఎలాంటి ప్రకటనా చేయలేదు. -
కుమారి దర్శకుడితో మరో సినిమా
‘కుమారి 21ఎఫ్’ లాంటి యూత్ ఫుల్ & సెన్సేషనల్ హిట్ తరువాత ఆ చిత్ర దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్, కథానాయకుడు రాజ్ తరుణ్ ల క్రేజీ కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కనుంది. ఎస్.ఆర్.టి ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.2గా రామ్ తాళ్ళూరి ఈ క్రేజీ ప్రొజెక్ట్ ను నిర్మిస్తున్నారు. ‘కుమారి 21ఎఫ్’ తరహాలోనే యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కనుంది. త్వరలో ప్రారంభం కానున్న ఈసినిమా విశేషాలను చిత్రయూనిట్ వెల్లడించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత రామ్ తాళ్ళూరి మాట్లాడుతూ.. ‘హిట్ కాంబినేషన్ పల్నాటి సూర్య ప్రతాప్-రాజ్ తరుణ్ ల కాంబినేషన్ లో మా బ్యానర్ లో ప్రొడక్షన్ నెం.2గా రూపొందించనుండడం ఆనందంగా ఉంది. సూర్యప్రతాప్ చెప్పిన కథ విని ఎంతగానో ఎగ్జైట్ అయ్యాను, యూత్ ఫుల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ ఇది. ‘కుమారి 21ఎఫ్’ను మించిన స్థాయిలో ఈ సినిమా ఉండబోతోంది’ అన్నారు. రామ్ తళ్లూరి ఇప్పటికే రవితేజ, కళ్యాణ్ కృష్ణల కాంబినేషన్ లో ఓ సినిమాను ఎనౌన్స్ చేశారు. -
'ఆ పేరు పెట్టడం అదృష్టంగా భావిస్తున్నా'
నిర్మాత రామ్ తాళ్లూరి ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగం చేస్తూ అమెరికాపై వ్యామోహంతో అక్కడకు వెళ్లి సాఫ్ట్వేర్ కంపెనీ స్థాపించినా సినిమా రంగంపై ప్యాషన్‌తో నిర్మాతగా మారానని అంటున్నారు ‘చుట్టాలబ్బాయి’ చిత్ర నిర్మాత రామ్ తాళ్లూరి. ఖమ్మం జిల్లాకు చెందిన తాను ఎస్ఆర్టీ మూవీ హౌస్ బ్యానర్‌పై ఏడాదికి రెండు సినిమాలు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నానని అన్నారు. ప్రశ్న: సాప్ట్వేర్ రంగం నుంచి సినీ రంగంలోకి ఎలా వచ్చారు? జవాబు : సినిమా అంటే నాకు ప్యాషన్. దీనిలో భాగంగా దర్శకుడు వీరభద్రం చెప్పిన కథ నచ్చడంతో ఎస్ఆర్టీ మూవీహౌస్ బ్యానర్‌పై ‘చుట్టాలబ్బాయి’ చిత్రం నిర్మిస్తున్నా. ప్రశ్న: మీ ఆరాధ్య సినీ నటుడు? జవాబు : చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం. సూపర్‌స్టార్ కృష్ణ అభిమానిని. నా మొదటి చిత్రానికి ఆయన సినిమా పేరు పెట్టడం అదృష్టంగా భావిస్తున్నా. ప్రశ్న: సినిమా పరిశ్రమ ఒడిదుడుకులలో ఉందంటున్నారు? జవాబు : మంచి కథలతో సినిమాలు తీస్తే తప్పకుండా విజయం వరిస్తుంది.