'ఆ పేరు పెట్టడం అదృష్టంగా భావిస్తున్నా'
నిర్మాత రామ్ తాళ్లూరి
ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగం చేస్తూ అమెరికాపై వ్యామోహంతో అక్కడకు వెళ్లి సాఫ్ట్‌వేర్ కంపెనీ స్థాపించినా సినిమా రంగంపై ప్యాషన్‌తో నిర్మాతగా మారానని అంటున్నారు ‘చుట్టాలబ్బాయి’ చిత్ర నిర్మాత రామ్ తాళ్లూరి. ఖమ్మం జిల్లాకు చెందిన తాను ఎస్‌ఆర్‌టీ మూవీ హౌస్ బ్యానర్‌పై ఏడాదికి రెండు సినిమాలు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నానని అన్నారు.
ప్రశ్న: సాప్ట్‌వేర్ రంగం నుంచి సినీ రంగంలోకి ఎలా వచ్చారు?
జవాబు : సినిమా అంటే నాకు ప్యాషన్. దీనిలో భాగంగా దర్శకుడు వీరభద్రం చెప్పిన కథ నచ్చడంతో ఎస్‌ఆర్‌టీ మూవీహౌస్ బ్యానర్‌పై ‘చుట్టాలబ్బాయి’ చిత్రం నిర్మిస్తున్నా.
ప్రశ్న: మీ ఆరాధ్య సినీ నటుడు?
జవాబు : చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం. సూపర్‌స్టార్ కృష్ణ అభిమానిని. నా మొదటి చిత్రానికి ఆయన సినిమా పేరు పెట్టడం అదృష్టంగా భావిస్తున్నా.
ప్రశ్న: సినిమా పరిశ్రమ ఒడిదుడుకులలో ఉందంటున్నారు?
జవాబు : మంచి కథలతో సినిమాలు తీస్తే తప్పకుండా విజయం వరిస్తుంది.