Chuttalabbai
-
సిటీలో చుట్టాలబ్బాయ్
డాబాగార్డెన్స్: చుట్టాలబ్బాయ్ సినిమా విజయోత్సవం శుక్రవారం వీ–మాక్స్ «థియేటర్లో సందడిగా సాగింది. విజయయాత్రలో భాగంగా ఆ చిత్ర యూనిట్, హీరో ఆది, నటుడు సాయికుమార్ వీ–మాక్స్ «థియేటర్‌కు విచ్చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా సాయికుమార్ మాట్లాడుతూ తన కుమారుడు ఆదితో తొలిసారిగా నటించడం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. విజయయాత్ర తిరుపతిలో ప్రారంభమైందని, శ్రీకాకుళంలో శనివారం ముగుస్తోందన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు సాయికుమార్ సినిమాలను ఎప్పుడూ ఆదరిస్తూనే ఉన్నారన్నారు. హీరో ఆది మాట్లాడుతూ ఈ చిత్రం తొలి షో నుంచి హిట్ టాక్ వచ్చిందన్నారు. ఎనిమిది సినిమాల తర్వాత తండ్రితో నటించానని చెప్పారు. చిత్ర దర్శకుడు వీరభద్ర మాట్లాడుతూ తాము ఊహించినదానికంటే ఎక్కువ విజయం సాధించడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. కార్యక్రమంలో శ్రీలక్ష్మీనారాయణ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ ప్రతినిధులు చంద్రశేఖర్, కిరణ్, శ్రీరామ్, వీ–మాక్స్ «థియేటర్ నిర్వాహకులు విజయ్, సురేంద్ర, వాసు పాల్గొన్నారు. -
‘చుట్టాలబ్బాయి’ సందడి
నెల్లూరు, సిటీ : నగరంలో చుట్టాలబ్బాయి చిత్ర బృందం గురువారం సందడి చేసింది. చిత్రం విజయోత్సవ కార్యక్రమంలో భాగంగా హీరో ఆది, డైరెక్టర్ వీరభద్ర నర్తకి థియేటర్లో హంగామా చేశారు. అభిమానుల అరుపులు, కోలాహాలం మధ్యన కొంతసేపు ప్రేక్షకులతో మాట్లాడారు. హీరో ఆది అభిమానులు కోరిక మేరకు చిత్రంలోని ఓ డ్యాన్స్ స్టెప్ వేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో డైరెక్టర్ వీరభద్ర మాట్లాడుతూ చిత్రాన్ని విజయవంతం చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. త్వరలో ఓ భారీ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు తెలిపారు. హీరో ఆది మాట్లాడుతూ నా తొలి చిత్రం ప్రేమకావాలి నర్తకీ «థియేటర్లో 50 రోజులు విజయవంతంగా ప్రదర్శించినట్లు తెలిపారు. విజయోత్సవ యాత్రలో భాగంగా అప్పట్లో ఇదే నర్తకీ థియేటర్‌కు వచ్చినట్లు గుర్తుచేసుకున్నారు. నా విజయయాత్ర ఇక్కడి నుంచే మొదలైందన్నారు. నాన్నతో కలిసి నటించిన మొదటి సినిమా చుట్టాలబ్బాయి విజయవంతం కావడం సంతోషంగా ఉందన్నారు. ప్రేక్షకుల ఆదరాభిమానాలతో రానున్న రోజుల్లో మంచి చిత్రాల్లో నటిస్తానన్నారు. ప్రస్తుతం ఏ చిత్రానికి ఒప్పందం కుదుర్చుకోలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో అమరావతి కృష్ణారెడ్డి, నర్తకీ థియేటర్ శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు. -
ఏట్టి రీమేక్‌లో ఆది..?
చుట్టాలబ్బాయి సినిమాతో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయిన యంగ్ హీరో ఆది, తరువాత చేయబోయే సినిమాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇప్పటి వరకు ఎక్కువగా లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న క్యారెక్టర్లలో మాత్రమే కనిపించిన ఆది, భవిష్యత్తులో ప్రయోగాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ముఖ్యంగా క్రీడా నేపథ్యం ఉన్న సినిమాల్లో నటించేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నాడు. స్కూల్ డేస్ నుంచి మంచి రన్నర్‌గా పేరున్న ఆది తమిళ్లో ఘన విజయం సాధించిన ఏట్టి సినిమాను రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు. ఓ వింత వ్యాదితో బాదపడుతున్న క్రీడాకారుడి కథగా తెరకెక్కిన ఈ సినిమాను ముందుగా నాగశౌర్యతో రీమేక్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే తాజాగా ఆది స్టేట్ మెంట్‌తో ఏమైనా మార్పులు జరుగుతాయేమో చూడాలి. -
రేసు నుంచి తప్పుకున్న ఆది
మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న యంగ్ హీరో ఆది.. భారీ పోటీలో సినిమాను రిలీజ్ చేయడానికి ఇంట్రస్ట్ చూపించటం లేదు. అందుకే ముందుగా ఆగస్టు 5న తన లేటెస్ట్ మూవీ చుట్టాలబ్బాయి రిలీజ్ ప్లాన్ చేసినా.. ఇప్పుడు రేసు నుంచి తప్పకున్నాడు. అదే రోజు మరో రెండు సినిమాలు రిలీజ్ అవుతుండటంతో రిస్క్ ఎందుకన్న ఉద్దేశంతో తన సినిమాను వాయిదా వేశాడు. ఆగస్ట్ 5న రిలీజ్ అవుతున్న సినిమాల్లో మంచి అంచనాలు ఉన్న సినిమా శ్రీరస్తు శుభమస్తు.. ఈసారి ఎలాగైన హిట్ కొట్టాలన్న ఉద్దేశంతో అల్లు వారబ్బాయి శిరీష్.. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాతో పాటు ప్రయోగాత్మక చిత్రాల దర్శకుడు చందశేఖర్ ఏలేటి దర్శకత్వంలో తెరకెక్కిన మనమంతా సినిమా కూడా అదే రోజు రిలీజ్ అవుతోంది. మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ తొలి సారిగా చేస్తున్న తెలుగు సినిమా కావటంతో ఈ సినిమాపై కూడా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ రెండు సినిమాలతో పోటి పడటం కన్నా సేఫ్ టైంలో సినిమా రిలీజ్ చేసుకోవటం బెటర్ అని ఫీల్ అవుతున్నాడు ఆది. అందుకే చుట్టాలబ్బాయి సినిమాను ఆగస్ట్ 19న తీరిగ్గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశాడు. -
చుట్టాలబ్బాయి రిస్క్ చేస్తున్నాడా..?
డైలాగ్ కింగ్ సాయికుమార్ వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో ఆది. ప్రేమకావాలి, లవ్లీ లాంటి సినిమాలతో ఆకట్టుకున్న ఆది, తరువాత వరుస ఫెయిల్యూర్స్‌తో వెనకపడ్డాడు. గత రెండేళ్లలో చేసిన ప్యార్ మే పడిపోయానే, రఫ్, గరం లాంటి సినిమాలు ఆది కెరీర్‌కు ఏమాత్రం కిక్ ఇవ్వలేదు. దీంతో తన ఆశలన్ని రాబోయే చుట్టాలబ్బాయి మీదే పెట్టుకున్నాడు. భాయ్ లాంటి డిజాస్టర్ తరువాత వీరభద్రం చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కావటంతో ఆది కెరీర్‌కు చుట్టాలబ్బాయి ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో అన్న ఆలోచనలో ఉన్నారు. ఇలాంటి సమయంలో రిలీజ్ డేట్ విషయంలో కూడా రిస్క్ చేస్తున్నాడీ యంగ్ హీరో. ఇప్పటికే నిర్మాణాంతర కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న చుట్టాలబ్బాయిని ఆగస్టు 5న రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. అయితే అదే రోజున మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ లీడ్ రోల్లో తెరకెక్కిన మనమంతాతో పాటు అల్లు శిరీష్ హీరోగా తెరకెక్కిన శ్రీరస్తు శుభమస్తు సినిమా కూడా రిలీజ్ అవుతోంది. ఈ రెండు సినిమాలకు కాస్త పాజిటివ్ టాక్ ఉండటంతో పాటు బిజినెస్ పరంగా కూడా చుట్టాలబ్బాయి కన్నా ఒకడుగు ముందే ఉన్నాయి. మరి ఈ కాంపిటీషన్లో చుట్టాలబ్బాయి పోటి పడి గెలుస్తాడా..? -
కన్నడ కార్తికేయలో ఆది?
డైలాగ్ కింగ్ సాయికుమార్ వారసుడిగా టాలీవుడ్‌కు పరిచయం అయిన యంగ్ హీరో ఆది. తొలి సినిమాలతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న ఆది.. తరువాత మాస్ యాక్షన్ సినిమాల మీద దృష్టి పెట్టి ఇబ్బందుల్లో పడ్డాడు. ప్రస్తుతం వీరభద్రం దర్శకత్వంలో చుట్టాలబ్బాయి సినిమాలో నటిస్తున్నాడు. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా పై చాలా ఆశలు పెట్టుకున్నాడు ఆది. అదే సమయంలో కన్నడ ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. సాయికుమార్‌కు టాలీవుడ్‌తో పాటు శాండల్‌వుడ్‌లో కూడా స్టార్ ఇమేజ్ ఉంది. సాయికుమార్ హీరోగా తెరకెక్కిన కన్నడ చిత్రాలు మంచి సక్సెస్‌లు సాధించాయి. దీంతో ఆదిని కూడా కన్నడలో హీరోగా పరిచయం చేసే ఆలోచనలో ఉన్నాడు సాయికుమార్. నిఖిల్ హీరోగా టాలీవుడ్లో మంచి సక్సెస్ సాధించిన కార్తీకేయ సినిమాను ఆది హీరోగా కన్నడలో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడట. తెలుగులో చందూ మొండేటి డైరెక్ట్ చేసిన ఈ థ్రిల్లర్ హీరోగా.. నిఖిల్‌కు మంచి బ్రేక్ ఇచ్చింది. ఆది విషయంలో కూడా అదే వర్క్ అవుట్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నాడు డైలాగ్ కింగ్. మరి తెలుగు నాట స్టార్ ఇమేజ్ కోసం కష్టపడుతున్న, ఆది శాండల్‌వుడ్ ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంటాడో చూడాలి. -
నవ్వించే అబ్బాయ్...
ఆది, నమితా ప్రమోద్ జంటగా వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో వెంకట్ తలారి, రామ్ తుళ్ళూరి నిర్మిసున్న చిత్రం ‘చుట్టాలబ్బాయ్’. ఒక్క పాట మినహా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం రీ-రికార్డింగ్ జరుగుతోంది. జూలై 6న పాటల్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. శనివారం హైదరాబాద్‌లో ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ - ‘‘అందర్నీ ఆకట్టుకునే కుటుంబ కథా చిత్రమిది. ప్రారంభం నుంచి ఈరోజు వరకూ చాలా పాజిటివ్ వైబ్స్‌తో షూటింగ్ ముందుకు సాగుతోంది. తమన్ అద్భుతమైన బాణీలు అందించారు’’ అన్నారు. ఆది మాట్లాడుతూ - ‘‘కన్ఫ్యూజ్ కామెడీతో పూర్తి వినోదాత్మకంగా దర్శకుడు చిత్రాన్ని రూపొందించారు. బ్రహ్మానందంగారు, నాకు మధ్య సన్నివేశాలు అందర్నీ నవ్విస్తాయి’’ అని చెప్పారు. ‘‘రాజమండ్రి, హైదరాబాద్, బ్యాంకాక్ తదితర ప్రదేశాల్లో చిత్రీకరణ జరిపాం’’ అని నిర్మాతలు చెప్పారు. ఈ వేడుకలో ఛాయాగ్రాహకుడు ఎస్.అరుణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
'వెటకారమే నా సక్సెస్‌కు కారణం'
రాజమండ్రి : ‘‘వెటకారంతో కూడిన హాస్యమే తన సక్సెస్‌కు కారణమని, అదే తనను సినీ ఇండస్ట్రీలో నిలిపింది’’ అని అన్నారు ప్రముఖ సినీదర్శకుడు ముళ్లపూడి వీరభద్రం. చుట్టాలబ్బాయ్ చిత్రం షూటింగ్ నిమిత్తం బుధవారం పల్లవెంకన్న నర్సరీకి వచ్చిన ఆయన షూటింగ్ విరామంలో ‘సాక్షి’కి పలు విషయాలు వెల్లడించారు. ఆ విషయాలు ఆయన మాటల్లోనే.. ‘‘డిగ్రీ పూర్తయ్యాక ఎంసీఏ చేద్దామనిహైదారాబాద్ వచ్చిన నాకు ఈవీవీ దగ్గర అసిస్టెంట్ డెరైక్టర్‌గా పనిచేసే అవకాశం వచ్చింది. అప్పటి నుంచి నా సినీజీవితం మొదలైంది. ఈవీవీ, తేజలతోపాటు పలువురు సక్సెస్ఫుల్ డెరైక్టర్ల వద్ద కో డెరైక్టర్‌గా చేశాను. అహనా పెళ్లంట, పూలరంగడు చిత్రాలు నాకు మంచి గుర్తింపునిచ్చాయి. ట్రెండ్‌కు అనుగుణంగా అప్‌గ్రేడ్ కావడంలో గోదావరి పరిసరప్రాంత ప్రజలు ముందుంటారు. అందుకే అన్ని రంగాల్లోనూ ముఖ్యంగా సినీ రంగంలో ఇక్కడి వారు బాగా రాణిస్తున్నారు. హాస్యనటుడు సునీల్‌ను సిక్స్‌ప్యాక్ బ్యాడీతో హీరోగా చూపించిన పూలరంగడు చిత్రాన్ని ఉభయగోదావరి జిల్లాల్లో ముఖ్యంగా కడియం నర్సరీ ప్రాంతంలో ప్లాన్ చేశాం. కానీ ఔట్ డోర్ షూటింగ్లో సునీల్ సిక్స్‌ప్యాక్ కసరత్తులకు ఇబ్బంది కలుగుతుందనే కారణంతో స్టూడియోలో చేయాల్సి వచ్చింది’’ అని చెప్పుకొచ్చారు. గోదావరివాసుల ఆదరణ నచ్చింది : ఆది ఉభయగోదావరి జిల్లా వాసుల ఆదరణ తనకెంతో నచ్చిందని యు వ హీరో ఆది అన్నారు. షూటింగ్ విరామంలో ఆయన స్థానిక విలేకరుల తో మాట్లాడారు. తన అత్తారిల్లు రాజమహేంద్రమైనా కడియం నర్సరీల్లోకి రావడం ఇదే మొదటిశారన్నారు. ఇప్పటి వరకు ఏడు సినిమాల్లో హీ రోగా నటించానని, అన్నింటికంటే భిన్నమైన కథతో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా విజయవంతమవుతుందన్నారు. ఇక్కడి వారి ఆదరాభిమానాలు ఎన్నటి మరువలేనన్నారు. ఇక్కడే బాగుంది : నమిత మళయాళంలో పలువురు అగ్రహీరోల సరసన 18 సినిమాల్లో హీరోయిన్గా నటించానని హీరోయిన్ నమిత అన్నారు. తెలుగులో చుట్టాలబ్బాయ్ తన తొలి చిత్రమన్నారు. షూటింగ్లో భాగంగా అనేక ప్రాంతాలు చూశానని, అయితే వాటన్నికంటే కడియం నర్సరీలు బాగున్నాయన్నారు. తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడే సినిరంగంలోకొచ్చిన తాను ప్రస్తుతం బీఏ లిటరేచర్ చేస్తున్నట్టు చెప్పారు. -
వెటకారమే నా సక్సెస్ కారణం
దర్శకుడు వీరభద్రమ్ కడియం : ‘‘వెటకారంతో కూడిన హాస్యమే తన సక్సెస్‌కు కారణమని, అదే తనను సినీ ఇండస్ట్రీలో నిలిపింది’’ అని అన్నారు ప్రముఖ సినీదర్శకుడు ముళ్లపూడి వీరభద్రం. చుట్టాలబ్బాయ్ చిత్రం షూటింగ్ నిమిత్తం బుధవారం పల్లవెంకన్న నర్సరీకి వచ్చిన ఆయన షూటింగ్ విరామంలో ‘సాక్షి’కి పలు విషయాలు వెల్లడించారు. ఆ విషయాలు ఆయన మాటల్లోనే.. ‘‘డిగ్రీ పూర్తయ్యాక ఎంసీఏ చేద్దామనిహైదారాబాద్ వచ్చిన నాకు ఈవీవీ దగ్గర అసిస్టెంట్ డెరైక్టర్‌గా పనిచేసే అవకాశం వచ్చింది. అప్పటి నుంచి నా సినీజీవితం మొదలైంది. ఈవీవీ, తేజలతోపాటు పలువురు సక్సెస్ఫుల్ డెరైక్టర్ల వద్ద కో డెరైక్టర్‌గా చేశాను. అహనా పెళ్లంట, పూలరంగడు చిత్రాలు నాకు మంచి గుర్తింపునిచ్చాయి. ట్రెండ్‌కు అనుగుణంగా అప్‌గ్రేడ్ కావడంలో గోదావరి పరిసరప్రాంత ప్రజలు ముందుంటారు. అందుకే అన్ని రంగాల్లోనూ ముఖ్యంగా సినీ రంగంలో ఇక్కడి వారు బాగా రాణిస్తున్నారు. హాస్యనటుడు సునీల్‌ను సిక్స్‌ప్యాక్ బ్యాడీతో హీరోగా చూపించిన పూలరంగడు చిత్రాన్ని ఉభయగోదావరి జిల్లాల్లో ముఖ్యంగా కడియం నర్సరీ ప్రాంతంలో ప్లాన్ చేశాం. కానీ ఔట్ డోర్ షూటింగ్లో సునీల్ సిక్స్‌ప్యాక్ కసరత్తులకు ఇబ్బంది కలుగుతుందనే కారణంతో స్టూడియోలో చేయాల్సి వచ్చింది’’ అని చెప్పుకొచ్చారు. గోదావరివాసుల ఆదరణ నచ్చింది : ఆది ఉభయగోదావరి జిల్లా వాసుల ఆదరణ తనకెంతో నచ్చిందని యు వ హీరో ఆది అన్నారు. షూటింగ్ విరామంలో ఆయన స్థానిక విలేకరుల తో మాట్లాడారు. తన అత్తారిల్లు రాజమహేంద్రమైనా కడియం నర్సరీల్లోకి రావడం ఇదే మొదటిశారన్నారు. ఇప్పటి వరకు ఏడు సినిమాల్లో హీ రోగా నటించానని, అన్నింటికంటే భిన్నమైన కథతో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా విజయవంతమవుతుందన్నారు. ఇక్కడి వారి ఆదరాభిమానాలు ఎన్నటి మరువలేనన్నారు. ఇక్కడే బాగుంది : నమిత మళయాళంలో పలువురు అగ్రహీరోల సరసన 18 సినిమాల్లో హీరోయిన్గా నటించానని హీరోయిన్ నమిత అన్నారు. తెలుగులో చుట్టాలబ్బాయ్ తన తొలి చిత్రమన్నారు. షూటింగ్లో భాగంగా అనేక ప్రాంతాలు చూశానని, అయితే వాటన్నికంటే కడియం నర్సరీలు బాగున్నాయన్నారు. తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడే సినిరంగంలోకొచ్చిన తాను ప్రస్తుతం బీఏ లిటరేచర్ చేస్తున్నట్టు చెప్పారు. -
తొమ్మిదేళ్లకే నటినయ్యా..
హీరోయిన్ నమితా ప్రమోద్ తొమ్మిదేళ్లకే తాను చిత్రపరిశ్రమలోకి ప్రవేశించానని అంటోంది మలయాళ భామ నమితా ప్రమోద్. ‘చుట్టాలబ్బాయి’ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న ఆమె విలేకరులతో మాట్లాడారు. ప్రశ్న : మీ సినీ రంగ ప్రవేశం ఎప్పుడు జవాబు : తొమ్మిదో ఏట ట్రాఫిక్ అనే మలయాళ చిత్రంలో నటించా. ఇది తెలుగులో కూడా విడుదలయ్యింది. ప్రశ్న : ఎన్ని సినిమాల్లో నటించారు జవాబు : ఇప్పటి వరకు 15 సినిమాల్లో హీరోయిన్గా చేశాను. తెలుగులో ‘చుట్టాలబ్బాయి’తో పరిచయమవుతున్నా. మలయాళంలో దిలీప్, ఉలిధర్, విపిన్పాళి, పృద్వీరాజ్, దుల్కర్ సల్మాన్ వంటి హీరోల సరసన నటించాను. ప్రశ్న :: ఎలాంటి పాత్రలు చేయాలనుకుంటున్నారు జవాబు : గ్లామర్ పాత్రలే కాకుండా నటనకు, గుర్తింపునకు ఆస్కారం ఉండే పాత్రలు చేయాలని ఉంది. ప్రశ్న : భాష ఇబ్బందులు ఉన్నాయా జవాబు : నటించడానికి భాషతో పనిలేదు. నటులకు భాష అడ్డుకాదు. గుర్తింపు వచ్చే పాత్రలు వస్తే ఏ భాషలోనైనా నటిస్తా. ఎన్ని చిత్రాల్లో నటించామన్నది ముఖ్యం కాదు. ఎన్ని మంచి సినిమాలు చేశామన్నదే ప్రధానం. ప్రశ్న : మీ విద్యాభ్యాసం జవాబు : బీఏ లిటరేచర్ చదువుతున్నా. -
'ఆ పేరు పెట్టడం అదృష్టంగా భావిస్తున్నా'
నిర్మాత రామ్ తాళ్లూరి ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగం చేస్తూ అమెరికాపై వ్యామోహంతో అక్కడకు వెళ్లి సాఫ్ట్వేర్ కంపెనీ స్థాపించినా సినిమా రంగంపై ప్యాషన్‌తో నిర్మాతగా మారానని అంటున్నారు ‘చుట్టాలబ్బాయి’ చిత్ర నిర్మాత రామ్ తాళ్లూరి. ఖమ్మం జిల్లాకు చెందిన తాను ఎస్ఆర్టీ మూవీ హౌస్ బ్యానర్‌పై ఏడాదికి రెండు సినిమాలు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నానని అన్నారు. ప్రశ్న: సాప్ట్వేర్ రంగం నుంచి సినీ రంగంలోకి ఎలా వచ్చారు? జవాబు : సినిమా అంటే నాకు ప్యాషన్. దీనిలో భాగంగా దర్శకుడు వీరభద్రం చెప్పిన కథ నచ్చడంతో ఎస్ఆర్టీ మూవీహౌస్ బ్యానర్‌పై ‘చుట్టాలబ్బాయి’ చిత్రం నిర్మిస్తున్నా. ప్రశ్న: మీ ఆరాధ్య సినీ నటుడు? జవాబు : చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం. సూపర్‌స్టార్ కృష్ణ అభిమానిని. నా మొదటి చిత్రానికి ఆయన సినిమా పేరు పెట్టడం అదృష్టంగా భావిస్తున్నా. ప్రశ్న: సినిమా పరిశ్రమ ఒడిదుడుకులలో ఉందంటున్నారు? జవాబు : మంచి కథలతో సినిమాలు తీస్తే తప్పకుండా విజయం వరిస్తుంది. -
చుట్టాలబ్బాయి పుట్టినరోజు
యంగ్ హీరో ఆది తన పుట్టిన రోజును మరింత ఆనందంగా జరుపుకుంటున్నాడు. తన లేటెస్ట్ సినిమా ఆడియో రిలీజ్‌తో పాటు మరో రెండు విశేషాలు ఈ రోజు(బుధవారం) పుట్టిన రోజుకు ఉన్నాయి. గత ఏడాది రాజమండ్రి అమ్మాయి అరుణను పెళ్లి చేసుకున్న ఆది, గత వారం తండ్రిగా ప్రొమోషన్ పొందాడు. అంతేకాదు ఆది తండ్రి ప్రముఖ నటుడు సాయికుమార్ లీడ్ రోల్లో తెరకెక్కిన కన్నడ సినిమా 'రంగితరంగ' ఈ ఏడాది ఆస్కార్ రేసులో నిలవటంతో ట్రిపుల్ హ్యాపీగా తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంటున్నాడు. ఆది పుట్టిన రోజు సందర్భంగా 'గరం' చిత్ర ఆడియో ఇవాళ సాయంత్రం గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. దీంతో పాటు ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న మరో సినిమా 'చుట్టాలబ్బాయి' ఫస్ట్ లుక్‌ను కూడా రిలీజ్ చేసి, ఆది అభిమానులకు గిఫ్ట్ ఇచ్చారు చిత్రయూనిట్. ఇలా యమా హ్యాపీగా ఉన్న ఆది జీవితంలోకి మంచి సక్సెస్ కూడా రావాలని శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు శ్రేయోభిలాషులు. -
చుట్టాలబ్బాయి కథ
‘ప్రేమ కావాలి’, ‘లవ్లీ’ చిత్రాలతో లవర్ బోయ్ ఇమేజ్ను సంపాదించుకున్న ఆది నటిస్తున్న తాజా చిత్రం ‘చుట్టాలబ్బాయి’. ‘పూలరంగడు’, ‘అహ నా పెళ్లంట’ చిత్రాల ఫేమ్ వీరభద్రమ్ దర్శకత్వంలో రాము తాళ్లూరి, వెంకట్ తలారి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో నమితా ప్రమోద్ కథానాయిక. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఆది కెరీర్లో ఇది ఓ డిఫరెంట్ మూవీ అవుతుంది. అన్ని వర్గాలను ఆకట్టుకునే చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. జనవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్. తమన్, ఛాయాగ్రహణం: ఎస్.అరుణ్‌కుమార్, మాటలు: భవానీ ప్రసాద్.