చుట్టాలబ్బాయి పుట్టినరోజు | young hero aadi birthday | Sakshi
Sakshi News home page

చుట్టాలబ్బాయి పుట్టినరోజు

Published Wed, Dec 23 2015 8:32 AM | Last Updated on Sun, Sep 3 2017 2:27 PM

చుట్టాలబ్బాయి పుట్టినరోజు

చుట్టాలబ్బాయి పుట్టినరోజు

యంగ్ హీరో ఆది తన పుట్టిన రోజును మరింత ఆనందంగా జరుపుకుంటున్నాడు. తన లేటెస్ట్ సినిమా ఆడియో రిలీజ్తో పాటు మరో రెండు విశేషాలు ఈ రోజు(బుధవారం) పుట్టిన రోజుకు ఉన్నాయి. గత ఏడాది రాజమండ్రి అమ్మాయి అరుణను పెళ్లి చేసుకున్న ఆది, గత వారం తండ్రిగా ప్రొమోషన్ పొందాడు. అంతేకాదు ఆది తండ్రి ప్రముఖ నటుడు సాయికుమార్ లీడ్ రోల్లో తెరకెక్కిన కన్నడ సినిమా 'రంగితరంగ' ఈ ఏడాది ఆస్కార్ రేసులో నిలవటంతో ట్రిపుల్ హ్యాపీగా తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంటున్నాడు.

ఆది పుట్టిన రోజు సందర్భంగా 'గరం' చిత్ర ఆడియో ఇవాళ సాయంత్రం గ్రాండ్గా రిలీజ్ అవుతోంది. దీంతో పాటు ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న మరో సినిమా 'చుట్టాలబ్బాయి' ఫస్ట్ లుక్ను కూడా రిలీజ్ చేసి, ఆది అభిమానులకు గిఫ్ట్ ఇచ్చారు చిత్రయూనిట్. ఇలా యమా హ్యాపీగా ఉన్న ఆది జీవితంలోకి మంచి సక్సెస్ కూడా రావాలని శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు శ్రేయోభిలాషులు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement