Garam
-
గరం మసాలా
కొత్త సినిమా గురూ! చిత్రం: ‘గరం’ తారాగణం: ఆది, అదాశర్మ, చైతన్యకృష్ణ కథ, మాటలు: శ్రీనివాస్ గవిరెడ్డి కెమేరా: టి. సురేందర్ రెడ్డి సంగీతం: అగస్త్య సమర్పణ: వసంత శ్రీనివాస్ నిర్మాత: సురేఖ పి స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఆర్.ఆర్. మదన్ పిల్లలు పెరుగుతున్నప్పుడు వాళ్ల ఈడువాళ్ళయిన పక్కింటి అబ్బాయితోనో, అమ్మాయితోనో తల్లి తండ్రులు పోల్చడం సహజం. ఆ క్రమంలో ఒకర్ని తక్కువ చేస్తూ, వేరొకర్ని ఎక్కువ చేయడమూ సహజం. అలా ప్రత్యర్థులుగా పెరిగిన ఇద్దరు సమ వయస్కుల్లో ఒకరు అనుకోకుండా చిక్కుల్లో పడితే? అప్పుడు రెండోవాడే సహాయానికొస్తే? ఇదీ స్థూలంగా ‘గరం’ ఇతివృత్తం. ఇటీవలే ‘సీతమ్మ అందాలు - రామయ్య సిత్రాలు’తో దర్శకుడైన రచయిత శ్రీనివాస్ గవిరెడ్డి మాటలతో సహా అందించిన కథ ఇది. నటుడు సాయికుమార్ తొలిసారిగా నిర్మాణ బాధ్యతలు తలకెత్తుకొని, స్వయంగా నిర్మించిన సినిమా. వివరంగా కథ చెప్పాలంటే, అనగనగా ఒక ఊరు. అందులో బలరామ్ (తనికెళ్ళ భరణి), మూర్తి (సీనియర్ నరేశ్)లవి పక్క పక్క ఇళ్ళు. బలరామ్ కొడుకు వరాల బాబు అలియాస్ వరం (ఆది). మూర్తి కొడుకు రవి (చైతన్యకృష్ణ). పక్కింటి రవి బాగా చదువుతున్నాడనీ, ప్రయోజకుడనీ చిన్నప్పటి నుంచి పోలికలు తేవడంతో రవి అంటే వరానికి పడదు. దానికితోడు మూర్తి కూడా తన కొడుకు గురించి నలుగురితో గొప్పగా చెబుతూ ఉంటాడు. పెద్దయిన మన హీరో వరం చివరకు ‘మీ అందరితో గొప్పవాణ్ణి అనిపించుకుంటా’ అంటూ తన ఫ్రెండ్ (‘షకలక’ శంకర్)తో కలసి, సిటీకి బస్సెక్కేస్తాడు. అక్కడ బురఖాలోని అమ్మాయి (అదా శర్మ)ను చూసి ప్రేమి స్తాడు. ఆ అమ్మాయి కోసం ఏమైనా చేయడానికి సిద్ధమంటాడు. అదే సమయంలో బిజూ (కబీర్ దుహన్ సింగ్) అనుచరులు (సత్యప్రకాశ్ వగైరా) ఒక ఫోటో చేతిలో పెట్టుకొని, వెతుకుతుంటారు. ఆ వెతుకుతు న్నది ఎవరి కోసమనేది సస్పెన్స్‌గా నడుస్తుంటుంది. వారు ఎవరి కోసం, ఎందుకు వెతుకుతున్నారనే ఆసక్తికరమైన ట్విస్ట్ దగ్గర ఇంటర్వెల్ కార్డు పడుతుంది. సెకండాఫ్‌లో ఈ సస్పెన్స్ స్టోరీలోని ఒక్కో కోణం గురించి విడతలవారీగా వేర్వేరు ఫ్లాష్ బ్యాక్‌లతో విషయం బయటకు రావడం మొదలవు తుంది. హీరో తాను సిటీకి రావడం వెనుక ఉన్న అసలు కథ వివరిస్తాడు. తర్వాత కథాక్రమంలో - హీరో ప్రేమిస్తున్న హీరోయిన్‌కూ, విలన్లు వెతుకుతున్న వ్యక్తికీ లింక్ ఏమిటనే మరో ఇంట్రెస్టింగ్ కథ బయటకొస్తుంది. అవన్నీ ఏమిటన్నది తెరపై చూడాల్సిన విషయాలు. ‘లవ్లీ రాక్‌స్టార్’ బిరుదుతో ముందుకొచ్చిన ఆది ఇటీవలి చిత్రాలన్నిటి యువ హీరోల ఫక్కీలోనే... హుషారుగా నర్తించారు. ఫైట్లు చేశారు. కథలో ట్విస్టులకు అదాశర్మ, కీలకపాత్రగా సీనియర్ నరేశ్, కామెడీకి పోసాని, ‘థర్టీ ఇయర్స్’ పృథ్వి- ఇలా చాలామంది ఈ సినిమాలో ఉన్నారు. ఆమిర్‌ఖాన్ ‘పీకే’ సిన్మాకూ, పాత్రకూ పేరడీగా బ్రహ్మానందం చేసిన కామెడీ, హీరో ఫ్రెండ్‌గా ‘షకలక’ శంకర్ కొన్నిచోట్లా బాగా నవ్విస్తారు. సినిమా చివరలో వచ్చే మంచి సెంటిమెంట్ కోణానికి నరేశ్ నటన కలిసొచ్చింది. గతంలో ‘పెళ్ళయిన కొత్తలో’ లాంటి చిత్రాలకు బాణీలు కూర్చిన యువ సంగీత దర్శకుడు అగస్త్య చాలాకాలం తర్వాత మళ్ళీ వినిపించిన చిత్రం ఇది. ‘గరవ్ు గరవ్ు...’ లాంటి మాస్ గీతాలు, ‘సహారా సహారా సమీరా’ లాంటి సాఫ్ట్ పాటలు, ‘ఒయ్యారిభామా సయ్యాడదామా’ లాంటి బీట్లూ ఉన్నాయి. సమయ, సందర్భాల ఆలోచన లేకుండా వాటిని విని, చూసి ఆనందించాలి. గతంలో పలు హిందీ చిత్రాలకు ఛాయాగ్రహణం అందించిన కెమేరామన్ టి. సురేందర్‌రెడ్డి అనుభవం సినిమాకు పనికొచ్చేదే. చంద్రసిద్ధార్థ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఆ నలుగురు’కి కథారచయిత మదన్. ఆ తరువాత దర్శకుడిగా మారి, ‘పెళ్ళయిన కొత్తలో’, ‘ప్రవరాఖ్యుడు’ అందించిన ఆయన చావో, రేవోగా భావించి, ఈ ‘గరం’ కోసం సర్వశక్తులూ ఒడ్డారు. సామాన్య జనం మెచ్చడం కోసం అన్ని రకాల విన్యాసాలూ చేశారు. ఫస్టాఫ్ అంతా క్యారెక్టర్ల పరిచయం, కథకు తగ్గ పునాది సెట్ చేయడానికి పనికొచ్చింది. తొలి గంటలోనే ఐటమ్ సాంగ్ సహా మూడు పాటలు, రెండు ఫైట్లు వచ్చేస్తాయి. ఇక, అసలు కథ ఇంటర్వెల్ దగ్గర్నుంచి ఊపందుకుంటుంది. తీసుకున్న పాయింట్ కొత్తగా ఉన్నా, మాస్కు దూరం జరగకుండా అలవాటైన చిత్రాల ధోరణిలో వెళ్ళాలని చేసిన ప్రయత్నంగా ఈ ‘గరం’ చిత్రం ఒక మాస్ మసాలా! -
ఆ వీడియోలు చూస్తే టెన్షన్ మొత్తం ఎగిరిపోతుంది!
‘‘ఆదికి మంచి హిట్ రావాలని చాలామంది కోరుకుంటున్నారు. ఆ కోరికను ‘గరం’ నెరవేరుస్తుంది’’ అంటున్నారు ఆది. మదన్ దర్శకత్వంలో ఆయన నటించిన ‘గరం’ నేడు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. యూత్, మాస్, ఫ్యామిలీస్‌ని ఆకట్టుకునే లవబుల్ ఎంటర్టైనర్ ఇదని ఆది పేర్కొన్నారు. ‘సాక్షి’తో ఆయన చెప్పిన ముచ్చట్లు... మీదేమో ‘పక్కింటి అబ్బాయి’ ఇమేజ్. మరి... మీకు ‘గరం’ టైటిల్ ఎలా సూటబుల్ అనుకున్నారు? యాక్చువల్‌గా ఈ సినిమాకి ముందు ‘పక్కింటి అబ్బాయి’ టైటిల్ పెడదామనుకున్నాం. మరీ సాఫ్ట్‌గా ఉందని పెట్టలేదు. ‘గరం’ టైటిల్‌తో సినిమా చేసినప్పటికీ ఫ్యామిలీస్‌కి ఇంకా దగ్గరైపోతాను. క్యారెక్టర్ అలా ఉంటుంది. ఇందులో నా పాత్ర పేరు వరాలబాబు. వంద మందిలో 80 మంది కుర్రాళ్లు వరాలబాబులా ఉంటారు. అందుకని యూత్‌కి కూడా ఇంకా దగ్గరవుతాను. ఆది బాగా యాక్ట్ చేస్తాడు.. బాగుంటాడనే పేరు తెచ్చుకున్నప్పటికీ రావాల్సిన స్థాయి మీకింకా రాలేదేమో అనిపిస్తోంది..? ఒకే సినిమాతో చిరంజీవిగారు, మహేశ్‌బాబు, రామ్‌చరణ్ అయిపోవాలంటే కష్టం. మా డాడీ, రవితేజ గారు కష్టపడి స్లోగా ఎదిగినవాళ్లే. ఇప్పుడు నాకొచ్చిన స్థాయికి నేను హ్యాపీగానే ఉన్నాను. వాస్తవానికి ఇలా సినిమా సినిమాకీ మెల్లిగా ఎదగడమే కరెక్ట్ అని నా ఫీలింగ్. ఓవర్‌నైట్ స్టార్డమ్ అనేది వచ్చినంత వేగంగానే వెళ్లిపోతుంది. ‘ఆది బాగా చేస్తాడు.. బాగుంటాడు’ అనే పాజిటివ్ ఒపీనియన్ తెచ్చుకోవడం అనేది నా కెరీర్‌కి బలమైన బేస్మెంట్లాంటిది. స్క్రిప్ట్ సెలక్షన్లో కొన్ని తప్పులు చేస్తున్నాడని కొంతమంది అనుకుంటు న్నారు తప్ప, నా మీద వేరే విధంగా బ్యాడ్ ఒపీనియన్ లేదు. అందుకే, ఇకపై స్క్రిప్ట్ సెలక్షన్ విషయంలో కేర్ తీసుకోవాలనుకుంటున్నా. పవన్ కల్యాణ్, మహేశ్‌బాబు, ఎన్టీఆర్, ప్రభాస్... ఇలా చాలామంది హీరోలకు ఏడో సినిమా హిట్. మరి.. ‘గరం’ మీకు ఏడో సినిమానే కదా..? నాకు ఏడో నంబర్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఏడుకొండలవాడంటే నాకు నమ్మకం. ఈ రోజు ఉదయం (గురువారం) గుడికి వెళ్లి, వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాను. ఇక.. సెవన్త్ నంబర్ సెంటిమెంట్ గురించి చెప్పాలంటే.. నాకా నంబర్ హ్యాపీయే. సెంటిమెంట్ వర్కవుట్ అయితే బాగానే ఉంటుంది. ఆ సెంటిమెంట్‌ని పక్కన పెడితే.. మంచి కథ-దర్శకుడితో సినిమా చేస్తే ఏడో సినిమా కాకపోయినా హిట్టవుతుంది. ‘గరం’లో మంచి కంటెంట్ ఉంది. మదన్‌గారు మంచి దర్శకుడు. చూసినవాళ్లందరూ చాలా బాగుందని ప్రశంసిస్తున్నారు. మీ నాన్న సాయికుమార్ తాను పడిన కష్టాల గురించి చెబుతుంటారా? నాన్నగారి కష్టాలను నేను స్వయంగా చూశాను. మా బాబాయ్ (రవిశంకర్, అయ్యప్ప పి. శర్మ)ల కష్టం కూడా తెలుసు. సోలో హీరోగా అవకాశం తెచ్చుకోవడం కోసం నాన్నగారు పడిన తపన తెలుసు. ‘పోలీస్ స్టోరీ’ హిట్టయ్యాక ఆ విజయం తాలూకు విలువ తెలుసు. మా నాన్నగారు సో గ్రేట్. ఎందుకంటే మా తాతగారు నాన్నకు ఇచ్చినది ఏమీ లేదు. తాతగారు (పీజే శర్మ) కూడా చాలా కష్టాలు పడ్డారు. నాన్నగారు పదో తరగతి టైమ్ నుంచే సంపాదించడం మొదలుపెట్టారు. తాతయ్య, నాన్న కలిసి మా అత్తయ్య పెళ్లి చేశారు. తోడబుట్టిన వాళ్లందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి మా నాన్నగారు. నాన్నగారి జీవితాన్ని విశ్లేషిస్తే మొత్తం త్యాగాలే ఉంటాయి. తోడబుట్టినవాళ్లు బాగుండాలనీ, ఇప్పుడు నా కెరీర్ బాగుండాలనీ.. ఇలా ఎప్పటికప్పుడు నాన్నగారు కుటుంబం కోసం ఆరాటపడుతుంటారు. మరి.. ఆయన కష్టపడి సంపాదించిన డబ్బుని ఇప్పుడిలా మీ సినిమాకి పెట్టుబడిగా పెట్టిన విషయంలో మీకు టెన్షన్ అనిపించడం లేదా? టెన్షన్ ఉంది. సేమ్ టైమ్ కాన్ఫిడెన్స్ కూడా ఉంది. మంచి కథతో సినిమా చేశాం. పబ్లిసిటీ బాగా చేశాం. నాన్నగారికి ఒక ప్రాజెక్ట్‌ని ప్రజల దగ్గరకు ఎలా తీసుకెళ్లాలో బాగా తెలుసు. రాజీపడకుండా నిర్మించారు. అంతే రాజీపడకుండా ప్రమోట్ చేశారు. నా గత చిత్రాలతో పోల్చితే పబ్లిసిటీ వైజ్‌గా ఈ సినిమా చాలా భారీగా ఉంది. మార్నింగ్ షోకే మంచి టాక్ వస్తే చాలు.. ఇక ఎవరూ ఆపలేరు. అది జరుగుతుందనే నమ్మకంతోనే నాన్నగారు రాజీపడలేదు. పాటలను ఇక్కడే తీద్దామని నేనంటే, నో కాంప్రమైజ్ అంటూ.. మూడు పాటలను ఇటలీలో తీద్దామన్నారు. అలాగే, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ల విషయంలో రాజీపడకుండా, మోస్ట్ వాంటెడ్ అనదగ్గ వాళ్లనే తీసుకున్నారు. నా గత చిత్రాల్లో ఏదో ఒక విషయంలో రాజీ పడాల్సి వచ్చేది. నాన్నగారే నిర్మాత కావడంవల్ల ఆ అవసరంలేకుండా పోయింది. మీ వయసుకి తగ్గట్టుగా మంచి లవ్‌స్టోరీలు చేయొచ్చు కదా..? ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, ఆషికీ లాంటి లవ్ స్టోరీస్ చేయాలనే ‘ప్యార్ మే పడిపోయానె’ చేశాను. కానీ, అది ఎక్కడో తడబడింది. ఇప్పటికీ నాకో లవ్‌స్టోరీ చేయాలని ఉంది. కానీ, మంచి కథ, దర్శకుడు కుదరాలి. పాటలు, ఫైట్లు అంటూ కమర్షియల్ మూవీస్‌కే పరిమితమవుతున్నారెందుకు? చిన్నప్పుడు నేను విపరీతంగా సినిమాలు చూసేవాణ్ణి. ఫైట్స్, సాంగ్స్ లేని సినిమాలకు తీసికెళితే చూడబుద్ధయ్యేది కాదు. హీరో అనేవాడు డ్యాన్సులు చేయాలి.. ఫైట్స్ చేయాలని అనుకునేవాణ్ణి. చిరంజీవిగారు, బాలకృష్ణగారు, నాగార్జునగారు, వెంకటేశ్‌గార్ల సినిమాలు చూసేవాణ్ణి. ‘గ్యాంగ్ లీడర్’, ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ని ఎన్నిసార్లు చూశానో నాకే తెలియదు. హీరో డల్‌గా ఉంటే నాకు నచ్చదు. చాలా ఎనర్జిటిక్‌గా ఉండాలనుకుంటాను. అందుకే, ఎక్కువగా ఎనర్జిటిక్ క్యారెక్టర్స్ ఎంపిక చేసుకుంటాను. ఇంతకీ మీ పాప ముచ్చట్లు చెబుతారా? నా మిసెస్, పాప ఇంకా రాజమండ్రిలో మా అత్తగారింట్లోనే ఉన్నారు. పాప పుట్టి రెండు నెలలు అయ్యుంటుంది. నేను మాత్రం తనతో ఓ పది రోజులు ఉండి ఉంటానేమో. ఎప్పటికప్పుడు వీడియో తీసి మా ఆవిడ పంపిస్తుంటుంది. ‘గరం’ షూటింగ్, ప్రమోషన్స్‌తో బిజీగా ఉండి, పాపను చాలానే మిస్సయ్యాను. పాప వీడియోలు చూస్తే నా టెన్షన్ మొత్తం ఎగిరిపోతుంది. -
చూస్తే... డిజప్పాయింట్ కారు!
‘‘మదన్ ఈ చిత్రాన్ని బాగా డెరైక్ట్ చేశాడు. సినిమా బాగా వచ్చింది. ఫీల్‌గుడ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇది. ఇందులో మంచి సోల్ ఉంటుంది. ఆది డ్యాన్స్, ఫైట్స్, అదా శర్మ నటన హైలైట్ ’’ అని సాయికుమార్ తెలిపారు. ఆది, అదాశర్మ జంటగా వసంత శ్రీనివాస్ సమర్పణలో శ్రీనివాస సాయి స్క్రీన్స్ పతాకంపై మదన్ దర్శకత్వంలో పి.సురేఖ నిర్మించిన ‘గరం’ ఈ శుక్రవారం విడుదల అవుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడింది. ‘‘ఈ చిత్రానికి మంచి టెక్నీషియన్స్, నటులు పనిచేశారు. ‘గరం’ చిత్రం అమెరికాలో కూడా పెద్ద రేంజ్లో విడుదలవుతోంది. ఓ మంచి సినిమాను అందరూ ఆదరించాలి’’ అని సాయికుమార్ పేర్కొన్నారు. దర్శకుడు మదన్ మాట్లాడుతూ- ‘‘నా దృష్టిలో ఈ సినిమా ఇప్పటికే హిట్. తనికెళ్ల, పోసాని వంటి నట-రచయితలతో పనిచేసే అవకాశం ఈ చిత్రంతో వచ్చింది. సాయికుమార్ గారు నాకు స్వేచ్ఛనిచ్చి, మంచి పని రాబట్టుకున్నారు’’ అని చెప్పారు. ‘‘సీనియర్లతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. సినిమాపై మంచి అంచనాలున్నాయి. యూత్, ఫ్యామిలీ ప్రేక్షకులందరికీ నచ్చే సినిమా ఇది. ‘గరం’ చూసినవారెవరూ డిజప్పాయింట్ అవరు’’ అని ఆది తెలిపారు. అదాశర్మ, తనికెళ్ల, పోసాని, పృథ్వి, నాజర్, చైతన్య కృష్ణ, కథారచయిత శ్రీనివాస్ గవిరెడ్డి పాల్గొన్నారు. -
సంక్రాంతి మూడ్‌లో ఎయిర్ పోర్ట్
సంక్రాంతి పండక్కి రెల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లే కాదు ఎయిర్ పోర్ట్‌లు కూడా కిక్కిరిసి కనిపిస్తున్నాయి. దీంతో సెలబ్రిటీలకు కూడా క్యూలో నిలబడటం తప్పేలా లేదు. ఈ రోజు( మంగళవారం) శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో పరిస్థితి ఎలా ఉందో తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు హీరో ఆది. భారీ క్యూ లైన్ల ముందు నిలబడి సెల్పీ దిగి ట్వీట్ చేశాడు. ఎయిర్ పోర్ట్‌లో కూడా సంక్రాంతి మూడ్ అంటూ సరదాగా కామెంట్ చేశాడు. ఈ మధ్యే తండ్రిగా ప్రమోషన్ పొందిన ఆది ప్రస్తుతం తన తాజా చిత్రం 'గరం' రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు సాఫ్ట్ చిత్రాలకు మాత్రమే దర్శకత్వం వహించిన మదన్ ఈ సినిమాతో తొలిసారిగా మాస్ ఫార్ములాను ట్రై చేస్తున్నాడు. అంతేకాదు ఈ ఏడాది తండ్రి సాయి కుమార్ తో కలిసి నటించడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు ఈ యంగ్ హీరో. Happy holidays airport all in sankranti mood :) pic.twitter.com/caeqne97Lx — Actor Aadi (@Aadi_Offl) January 12, 2016 -
ఈ గరం... అందరికీ ప్రియం!
‘‘మదన్ మంచి టేస్ట్‌ఫుల్ డెరైక్టర్. సాయికుమార్ గారు నిర్మాతగానూ, ఆది హీరోగానూ ఈ సినిమాతో బిగ్ కమర్షియల్ సక్సెస్ సాధించాలి’’ అని హీరో గోపీచంద్ ఆకాంక్షించారు. ఆది, అదాశర్మ జంటగా మదన్ దర్శకత్వంలో వసంతా శ్రీనివాస్ సమర్పణలో శ్రీనివాసాయి స్క్రీన్స్ బ్యానర్‌పై పి. సురేఖ నిర్మించిన చిత్రం ‘గరం’. అగస్త్య స్వరాలందించిన ఈ సినిమా పాటల సీడీని బుధవారం రాత్రి హైదరాబాద్‌లో గోపీచంద్ ఆవిష్కరించి, హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్‌కు అందించారు. ఈ సందర్భంగా ఆది మాట్లాడుతూ - ‘‘మదన్‌గారు ఈ చిత్రాన్ని చాలా కమర్షియల్‌గా హ్యాండిల్ చేశారు. నరేశ్‌గారి పాత్ర హైలైట్. అగస్త్య ఇచ్చిన ట్యూన్లు, రీరికార్డింగ్ బ్యూటిఫుల్’’ అని చెప్పారు. హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ - ‘‘ఆది డ్యాన్స్‌లు చితగ్గొట్టేశాడు. ఈ సంస్థలో నేను కూడా సినిమా చేయాలనుకుంటున్నా’’ అని తెలిపారు. ఆది లాంటి హార్డ్ వర్కింగ్ హీరోని ఇంతవరకూ చూడలేదని హీరో నిఖిల్ పేర్కొన్నారు. సాయి కుమార్ ఈ సినిమాతో గొప్ప నిర్మాత అవుతారని సీనియర్ నరేశ్ అన్నారు. ఆది రియల్‌గా ఎనర్జిటిక్ హీరో అని ఫైట్ మాస్టర్ థ్రిల్లర్ మంజు చెప్పారు. ‘గరం’ అందరికీ ప్రియం అని సాయికుమార్ నమ్మకం వ్యక్తపరిచారు. ఈ వేడుకలో రానా, అభిరామ్ దగ్గుబాటి, సందీప్ కిషన్, అచ్చిరెడ్డి, రాధామోహన్, కేవీవీ సత్యనారాయణ, సుశాంత్, రఘు కారుమంచి, భాస్కరభట్ల, షకలక శంకర్, సత్యప్రకాశ్, బీఏ రాజు, వీరభద్రమ్, బాబ్జీ, ‘గరం’ టీమ్ నుంచి దర్శకుడు మదన్, కెమేరామన్ సురేందర్‌రెడ్డి, ఇతర సభ్యులు మాట్లాడారు. -
చుట్టాలబ్బాయి పుట్టినరోజు
యంగ్ హీరో ఆది తన పుట్టిన రోజును మరింత ఆనందంగా జరుపుకుంటున్నాడు. తన లేటెస్ట్ సినిమా ఆడియో రిలీజ్‌తో పాటు మరో రెండు విశేషాలు ఈ రోజు(బుధవారం) పుట్టిన రోజుకు ఉన్నాయి. గత ఏడాది రాజమండ్రి అమ్మాయి అరుణను పెళ్లి చేసుకున్న ఆది, గత వారం తండ్రిగా ప్రొమోషన్ పొందాడు. అంతేకాదు ఆది తండ్రి ప్రముఖ నటుడు సాయికుమార్ లీడ్ రోల్లో తెరకెక్కిన కన్నడ సినిమా 'రంగితరంగ' ఈ ఏడాది ఆస్కార్ రేసులో నిలవటంతో ట్రిపుల్ హ్యాపీగా తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంటున్నాడు. ఆది పుట్టిన రోజు సందర్భంగా 'గరం' చిత్ర ఆడియో ఇవాళ సాయంత్రం గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. దీంతో పాటు ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న మరో సినిమా 'చుట్టాలబ్బాయి' ఫస్ట్ లుక్‌ను కూడా రిలీజ్ చేసి, ఆది అభిమానులకు గిఫ్ట్ ఇచ్చారు చిత్రయూనిట్. ఇలా యమా హ్యాపీగా ఉన్న ఆది జీవితంలోకి మంచి సక్సెస్ కూడా రావాలని శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు శ్రేయోభిలాషులు. -
ఆ మ్యాజిక్కే వేరు!
ఆది ఇప్పుడు ఫుల్ ఖుషీగా ఉన్నాడు. నాలుగు రోజుల క్రితం తండ్రిగా ప్రమోటయ్యాడు. అందుకే ఈ రోజు జరుపుకునే తన బర్త్‌డేను చాలా స్పెషల్‌గా ఫీలవుతున్నాడు. ‘తండ్రి హోదాలో నేను ఫస్ట్ బర్త్‌డే జరుపుకోబోతున్నాను’’ అని సంబరపడిపోతూ చెప్పాడు ఆది. మదన్ దర్శకత్వంలో ఆది నటించిన ‘గరం’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆది చెప్పిన బర్త్‌డే కబుర్లు... ♦ ఫస్ట్ టైమ్ ఆ యాసలో మాట్లాడా... ‘గరం’ నాకు ఏడో సినిమా. తొలుత వేరే నిర్మాత మొదలుపెట్టారు. ఆయన తప్పుకోవడంతో మేమే టేకోవర్ చేశాం. అమ్మ పి.సురేఖ నిర్మాతగా ఈ సినిమా ప్రొడ్యూస్ చేశాం. కథ మాకు అంత బాగా న చ్చింది. మదన్‌కు క్లాస్ డెరైక్టర్ అనే ఇమేజ్ ఉంది. కానీ ఆయనలో కూడా మంచి మాస్ డెరైక్టర్ ఉన్నాడని ఈ సినిమా నిరూపిస్తుంది. ఇందులో నా పాత్ర పేరు వరాలబాబు. ముక్కుసూటిగా ఉండే పల్లెటూరు కుర్రాడినన్నమాట. ‘ప్రేమిస్తే చెప్పేయ్..బాధ అనిపిస్తే ఏడ్చేయ్... కోపం వస్తే కొట్టేయ్’ అనే టైప్ క్యారెక్టర్ నాది. నేను ఫస్ట్ టైమ్ తూర్పుగోదావరి జిల్లా యాసలో మాట్లాడాను. ఈ యాస కోసం చాలా కసరత్తులు చేశా. రవితేజ సినిమాలు, రామ్ నటించిన ‘కందిరీగ’ సినిమా చూడమని చాలా మంది సలహా ఇచ్చారు.అవి చూశాను గానీ, నా స్టయిల్ నే ఫాలో అయిపోయాను. నా శ్రీమతిది రాజమండ్రి. అక్కడి వాళ్ల మాటల్లో చిన్నపాటి వెటకారం ఉంటుంది. చాలా సెన్సాఫ్ హ్యూమర్ ఎక్కువ. మా మావగారైతే బాగా జోక్స్ పేలుస్తుంటారు. ♦ మా పేరెంట్స్ మీద గౌరవం పెరిగింది నా పెళ్లి తర్వాత రిలీజవుతున్న సినిమా ఇదే. అలాగే మా పాప పుట్టాక వస్తున్న మూవీ కూడా ఇదే. నా కూతురు లక్ ఇస్తుందని నమ్ముతున్నా. మా పాపకు ఏం పేరు పెట్టాలనే విషయంలో చాలా పేర్లు పరిశీలిస్తున్నాం. పాప పుట్టాక మా పేరెంట్స్ మీద ఇంకా గౌరవం పెరిగింది. అమ్మా, నాన్న ఎంత బాగా పెంచితే నేనీ స్థాయిలో ఉన్నానా..అనిపిస్తోంది. ఫాదర్‌హుడ్ అనే మ్యాజిక్కే వేరు. ఐయామ్ ఎంజాయింగ్ ఫాదర్‌హుడ్. ♦ కథల ఎంపిక కష్టమే! ప్రస్తుతం వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో ‘చుట్టాలబ్బాయి’ చేస్తున్నా. ఇంకా చాలా అవకాశాలొస్తున్నాయి కానీ, బెటర్వి రావడం లేదు. ఏడాదికి 300 సినిమాలు రిలీజవుతుంటే... అందులో 8-9 సినిమాలు మాత్రమే విజయం సాధిస్తున్నాయి. సో...కథలు ఎంపిక చేసుకోవడం కొంచెం కష్టంగానే ఉంటోంది. -
రాజమౌళి అప్పుడే చెప్పారు : ప్రభాస్
‘‘ ‘గరం’ టైటిల్, ట్రైలర్ బాగున్నాయి. మదన్ చాలా ఇంటెలిజెంట్, టాలెంటెడ్ అని రాజమౌళి నాతో నాలుగేళ్ళ క్రితమే చెప్పారు. హీరో ఆది ఎనర్జిటిక్‌గా కనిపిస్తున్నాడు. ఆదికీ, మదన్‌కూ ఈ సినిమా పెద్ద బ్రేక్ నివ్వాలి.’’ అని హీరో ప్రభాస్ అన్నారు. ఆది, అదా శర్మ జంటగా మదన్ దర్శకత్వంలో శ్రీమతి వసంతా శ్రీనివాస్ సమర్పణలో శ్రీనివాసాయి స్క్రీన్స్ బేనర్‌పై పి. సురేఖ నిర్మించిన చిత్రం ‘గరం’. ఈ సినిమా ఫస్ట్ టీజర్‌ను హైద రాబాద్‌లో ప్రభాస్ ఆవిష్క రించారు. ఆది మాట్లాడుతూ - ‘‘ఇండస్ట్రీలో ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్న హీరో అయిన ప్రభాస్ చేతుల మీదుగా ‘గరం’ టీజర్ ఆవిష్కరణ జరగడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా కచ్చితంగా అందరికీ నచ్చుతుంది’’ అని పేర్కొన్నారు. ‘‘ప్రభాస్ మా ‘గరం’ టీజర్‌ను ఆవిష్కరించినందుకు ఆనందంగా ఉంది. త్వరలోనే ‘గరం’ ప్రేక్షకుల ముందుకొస్తుంది’’ అని సాయికుమార్ తెలిపారు. నాలుగేళ్ల క్రితం ప్రభాస్‌ను కలిశాననీ, ఇప్పటికీ తనను గుర్తుపెట్టుకున్నారనీ, ‘గరం’ క్లాస్‌నీ, మాస్‌నీ హ్యాపీ చేస్తుందనీ మదన్ పేర్కొన్నారు. ఈ వేడుకలో కెమెరామ్యాన్ టి. సురేంద్రరెడ్డి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. -
‘గరం’ టీజర్‌ను ఆవిష్కరించిన ప్రభాస్
-
సీనియర్ యాక్టర్ కొత్త క్యారెక్టర్
నటుడిగా ఎన్నో విభిన్న పాత్రలు పోషించిన నటుడు సాయికుమార్. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హీరోగా, విలన్‌గా అలరించిన సాయి కుమార్, ఇప్పుడు తన కుమారుడి కోసం కొత్త అవతారం ఎత్తాడు. హీరోగా ప్రూవ్ చేసుకోవడానికి కష్టపడుతున్న తనయుడు ఆదిని ప్రమోట్ చేయటం కోసం నిర్మాతగా మారాడు ఈ సీనియర్ నటుడు. ప్రస్తుతం ఆది హీరోగా 'గరం' సినిమాను నిర్మిస్తున్నాడు సాయికుమార్. ఈ సినిమాకు నిర్మాతగా సాయికుమార్ భార్య సురేఖ వ్యవహరిస్తున్నారు. ఆదికి జంటగా ఆదాశర్మ నటిస్తున్న ఈ సినిమాను పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు. ఇంట్రస్టింగ్ పాయింట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా, ఆది కెరీర్‌కు మంచి బ్రేక్ ఇస్తుందని నమ్ముతున్నాడు సాయికుమార్. రొటీన్ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్, రొమాన్స్ లాంటి అన్ని రకాల ఎలిమెంట్స్ ఈ సినిమాలో పర్ఫెక్ట్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అంతేకాదు సినిమా రిలీజ్ విషయంలో కూడా బడా డిస్ట్రిబ్యూటర్స్ సాయం తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు. మరి నటుడిగా మంచి విజయాలు సాధించిన సాయికుమార్, నిర్మాతగా ఎంత వరకు సక్సెస్ అవుతాడో చూడాలి. -
'పీకే' గెటప్‌లో బ్రహ్మానందం
చెన్నై: బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ 'పీకే' విడుదలకు ముందే సంచలనం సృష్టించింది. రైల్వే ట్రాక్ మధ్యలో ట్రాన్సిస్టర్ అడ్డంపెట్టుకుని, నగ్నంగా నిలబడ్డ ఆమీర్ ఖాన్ పోస్టర్ చర్చనీయాంశమైంది. తెలుగు సినీ అభిమానులు కామెడీ కింగ్ బ్రహ్మానందాన్ని 'పీకే' లుక్‌లో చూడవచ్చు. మన బ్రహ్మానందం ఆమీర్లా నగ్నంగా కాదు కానీ విభిన్న గెటప్‌లో దర్శనమిస్తారు. 'గరం' సినిమాలో బ్రహ్మానందంపై ఇలాంటి సన్నివేశాన్ని చిత్రీకరించినట్టు ఈ సినిమా వర్గాలు తెలిపాయి. బ్రహ్మానందం స్కర్ట్ ధరించి ట్రాన్సిస్టర్ చేతపట్టుకుని.. ఆమీర్ ఖాన్‌ను అనుకరిస్తూ ఓ సన్నివేశంలో నటించినట్టు వెల్లడించాయి. ఈ సీన్ తీసినపుడు కడుపుబ్బ నవ్వుకున్నామని, థియేటర్లలో ప్రేక్షకులు మరింత ఎంజాయ్ చేసినట్లు తెలిపాయి. 'పీకే'లో ఆమీర్ ఖాన్ గెటప్‌లో ఉన్న బ్రహ్మానందం పోస్టర్‌ను ఆదివారం రాత్రి విడుదల చేశారు. మదన్ దర్శకత్వం వహిస్తున్న గరం సినిమాలో ఆది, ఆదాశర్మ నటిస్తున్నారు. -
హార్ట్ ఎటాక్ వచ్చినంత పనైంది!
‘‘పల్లవి పాత్రను అందరికీ నచ్చేలా త్రివిక్రమ్ తీస్తారనే నమ్మకంతో ‘సన్నాఫ్ సత్యమూర్తి’ ఒప్పుకున్నాను. నాది నిడివి తక్కువ పాత్ర అయినా మంచి గుర్తింపు వచ్చింది. అల్లు అర్జున్ నటన, డాన్సులతో చాలా ఇన్‌స్పయిర్ అయ్యా. ఈ ఏడాది నేను ఫుల్ బిజీ. ప్రస్తుతం ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ సినిమాలో మంచి పాత్ర చేస్తున్నాను. ఆది సరసన ‘గరమ్’, పీవీపీ సంస్థ నిర్మిస్తున్న ఓ చిత్రం, తమిళంలో ఓ సినిమా, హిందీలో ఒకటి, కన్నడంలో ఒక సినిమా చేస్తున్నా. మా కుటుంబంలో సినీ రంగానికి చెందినవాళ్లెవరూ లేరు. అందరూ ఉన్నత చదువులు చదువుకున్నవాళ్లే. నేను సినిమాల్లోకి వెళతాననగానే వాళ్లకి హార్ట్ ఎటాక్ వచ్చినంత పనైంది. అయినా నన్ను బాగా ప్రోత్సహించారు’’. - అదా శర్మ -
గరం చిత్ర ప్రారంభోత్సవం