ఈ గరం... అందరికీ ప్రియం! | Garam Movie Audio Launched | Sakshi
Sakshi News home page

ఈ గరం... అందరికీ ప్రియం!

Published Thu, Dec 24 2015 10:58 PM | Last Updated on Sun, Sep 3 2017 2:31 PM

ఈ గరం... అందరికీ ప్రియం!

ఈ గరం... అందరికీ ప్రియం!

 ‘‘మదన్ మంచి టేస్ట్‌ఫుల్ డెరైక్టర్. సాయికుమార్ గారు నిర్మాతగానూ, ఆది హీరోగానూ ఈ సినిమాతో బిగ్ కమర్షియల్ సక్సెస్ సాధించాలి’’ అని హీరో గోపీచంద్ ఆకాంక్షించారు. ఆది, అదాశర్మ జంటగా మదన్ దర్శకత్వంలో వసంతా శ్రీనివాస్ సమర్పణలో శ్రీనివాసాయి స్క్రీన్స్ బ్యానర్‌పై పి. సురేఖ నిర్మించిన చిత్రం ‘గరం’. అగస్త్య స్వరాలందించిన ఈ సినిమా పాటల సీడీని బుధవారం రాత్రి హైదరాబాద్‌లో గోపీచంద్ ఆవిష్కరించి, హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్‌కు అందించారు.
 
 ఈ సందర్భంగా ఆది మాట్లాడుతూ - ‘‘మదన్‌గారు ఈ చిత్రాన్ని చాలా కమర్షియల్‌గా హ్యాండిల్ చేశారు. నరేశ్‌గారి పాత్ర హైలైట్. అగస్త్య ఇచ్చిన ట్యూన్లు, రీరికార్డింగ్ బ్యూటిఫుల్’’ అని చెప్పారు. హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ - ‘‘ఆది డ్యాన్స్‌లు చితగ్గొట్టేశాడు. ఈ సంస్థలో నేను కూడా సినిమా చేయాలనుకుంటున్నా’’ అని తెలిపారు. ఆది లాంటి హార్డ్ వర్కింగ్ హీరోని ఇంతవరకూ చూడలేదని హీరో నిఖిల్ పేర్కొన్నారు.
 
  సాయి కుమార్ ఈ సినిమాతో గొప్ప నిర్మాత అవుతారని సీనియర్ నరేశ్ అన్నారు. ఆది రియల్‌గా ఎనర్జిటిక్ హీరో అని ఫైట్ మాస్టర్ థ్రిల్లర్ మంజు చెప్పారు. ‘గరం’ అందరికీ ప్రియం అని సాయికుమార్ నమ్మకం వ్యక్తపరిచారు. ఈ వేడుకలో రానా, అభిరామ్ దగ్గుబాటి, సందీప్ కిషన్, అచ్చిరెడ్డి, రాధామోహన్, కేవీవీ సత్యనారాయణ, సుశాంత్, రఘు కారుమంచి, భాస్కరభట్ల, షకలక శంకర్, సత్యప్రకాశ్, బీఏ రాజు, వీరభద్రమ్, బాబ్జీ, ‘గరం’ టీమ్ నుంచి దర్శకుడు మదన్, కెమేరామన్ సురేందర్‌రెడ్డి, ఇతర సభ్యులు మాట్లాడారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement