Ada Sharma
-
Criminal or Devil Review: అదా శర్మ హారర్ మూవీ ఎలా ఉందంటే.. ?
టైటిల్: C.D (క్రిమినల్ ఆర్ డెవిల్) నటీనటులు: అదా శర్మ, విశ్వంత్, జబర్దస్త్ రోహిణి, భరణి శంకర్, రమణ భార్గవ్, మహేష్ విట్టా నిర్మాణ సంస్థ: SSCM ప్రొడక్షన్స్దర్శకుడు: కృష్ణ అన్నంసంగీతం: ఆర్ఆర్ ధృవన్సినిమాటోగ్రఫీ: సతీష్ ముత్యాలఎడిటర్: సత్య గిడుతూర్విడుదల తేది: మే 24, 2024ది కేరళ ఫైల్స్, బస్తర్ వంటి సినిమాలతో అదా శర్మ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా అంతటా ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇక చాలా కాలం తర్వాత మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ బ్యూటీ. ఆమె నటించిన తాజా చిత్రం ‘C.D క్రిమినల్ ఆర్ డెవిల్’ నేడు (మే 24) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..సిద్ధు(విశ్వంత్)కి దెయ్యాలు అంటే చాలా భయం. ఓ సారి అమ్మానాన్నలు ఊరికి వెళ్లడంతో ఒంటరిగానే ఇంట్లో ఉండాల్సి వస్తుంది. పని మనిషి (జబర్దస్త్ రోహిణి) అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటుంది. ఒంటరిగా డెవిల్ అనే దెయ్యం సినిమా చూసి సిద్ధు మరింత బయపడిపోతాడు. సినిమాలోని దెయ్యం బయటకు వచ్చి తనను చంపేస్తుందని బయపడుతుంటాడు. ఇలా సిద్దు ఇంట్లో ఒంటరిగా ఉంటున్న సమయంలోనే అమ్మాయిలను కిడ్నాప్ చేసే ఓ లేడీ సైకో రక్ష (అదా శర్మ) బయట అందరిలోనూ భయాన్ని పుట్టిస్తుంది. ఐ విల్ కిల్ యూ అని రాస్తూ కిడ్నాపులు చేస్తుంటుంది. పోలీసులు ఎంత ప్రయత్నించినా..ఆమె దొరకదు. అలా తప్పించుకుంటూ చిరవకు విశ్వంత్ కోసం వచ్చి, అతని ఇంట్లోనే ఉంటుంది. విశ్వంత్‌కి ఉన్న సమస్య ఏంటి? రక్షగా అదా శర్మ ఎందుకు వచ్చింది? అసలు అమ్మాయిల్ని కిడ్నాప్ చేస్తుంది ఎవరు? చివరకు పోలీసులు ఏం చేశారు? అన్నది కథ.ఎలా ఉందంటే.. హారర్, సస్పెన్స్, కామెడీ, థ్రిల్లింగ్ అంశాలతో తెరకెక్కిన సినిమానే ఈ C.D. దర్శకుడు రాసుకున్న పాయింట్ బాగుంది కానీ దాన్ని తెరపై ఆసక్తికరంగా చూపించడంలో కాస్త తడబడ్డాడు. ఈ కథంతా ఒకే చోట జరుగుతుంది. దీంతో కథనం కాస్త సాగదీతగా అనిపిస్తుంది. అలాగే కొన్ని సీన్లు మరీ సినిమాటిక్‌గా అనిపిస్తాయి కానీ ఆకట్టుకుంటాయి. ప్రేక్షకులను భయపెట్టడంలో దర్శకుడు సఫలం అయ్యాడు. సినిమా ప్రారంభంలో వచ్చే కొన్ని సన్నివేశాలు ఇల్లాజికల్‌గా అనిపిస్తాయి కానీ అవి ఎందుకు పెట్టారనేది చివర్లో తెలుస్తుంది. ఇంటర్వెల్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచేలా ఉంటుంది. ఇక ద్వితియార్థంలో హీరో హీరోయిన్ల మధ్య వచ్చే సన్ని వేశాలు కొన్ని రొమాంటిక్‌గా అనిపిస్తే.. ఇంకొన్ని సార్లు హారర్ ఎలిమెంట్స్‌ని తలపిస్తాయి. ఇక మధ్య మధ్యలో రోహిణి పాత్ర చేసే కామెడీ నవ్విస్తుంది. చివర్లో ఇచ్చిన ట్విస్ట్ బాగుంటుంది. నగరంలో అమ్మాయిల మిస్సింగ్ విషయంలో చివరన ఇచ్చిన ట్విస్ట్ అదిరిపోతుంది. క్లైమాక్స్‌లో ఎవరూ ఊహించని ట్విస్ట్ ఉంటుంది.ఎవరెలా చేశారంటే.. ఆదా వర్మ మరోసారి తనదైన నటనతో ఆకట్టుకుంది. రక్ష పాత్రలో ఆమె ఒదిగిపోయింది. చూపుల్తోనే అందరిని భయపెట్టేసింది. యాక్షన్ సీక్వెన్స్‌లో అదరగొట్టేస్తుంది. ఇక విశ్వంత్ అయితే తన వేరియేషన్స్ చూపించాడు. విశ్వంత్ పాత్ర ఈ సినిమాకు హైలెట్ అవుతుంది. రోహిణి కామెడీ సినిమాకు ప్లస్ అయింది. పోలీస్ ఆఫీసర్‌గా భరణి మెప్పిస్తాడు. ఇక మిగిలిన పాత్రలు పర్వాలేదనిపిస్తాయి. సాంకేతిక విషయాలకొస్తే..ఈ సినిమాకు ప్రధాన బలం ఆర్ఆర్ ధృవన్ సంగీతం. తనదైన బీజీఎంతో కొన్ని చోట్ల భయపెట్టాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
గ్లామర్‌తోనే 'హార్ట్ ఎటాక్' ! అదా శర్మ' అరుదైన ఫోటోలు
-
కరచరణో రసి మణిగణ భూషణ... లుక్... ఐ వాజ్ గోనా గో
శాస్త్రీయ నృత్య వేషధారణ అనగానే శాస్త్రీయ నృత్యమే కళ్ల ముందు కదలాడుతుంది. అలా కాకుండా ర్యాప్ వినిపిస్తే ఎలా ఉంటుంది అని చెప్పడానికి ఈ వీడియో ఉదాహరణ. నటి అదా శర్మ క్లాసికల్ డ్యాన్సర్ వేషంలో అమెరికన్ ర్యాపర్ ఎమెనెమ్ ఐకానిక్ ర్యాప్ ‘ర్యాప్ గాడ్’ ట్రాక్‌తో ‘వావ్’ అనిపించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ రీల్ వైరల్‌గా మారింది. శర్మను ప్రశంసలతో ముంచెత్తిన వారిలో హీరో అయుష్మాన్ ఖురాన, నటి ఊర్వశీ రౌటేల, ఇండియన్ ర్యాపర్ రఫ్తార్లాంటి సెలబ్రిటీ కూడా ఉన్నారు. యూట్యూట్ ద్వారా 2013లో విడుదలైన ‘ర్యాప్ గాడ్’ సాంగ్ సూపర్ హిట్ కావడమే కాదు ‘మోస్ట్ వర్డ్స్’ విశేషంతో ‘గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్’లోకి ఎంటర్ అయింది. ఎన్నో అవార్డ్లు గెలుచుకుంది. ‘లుక్, ఐ వాజ్ గోనా గో ఈజీ ఆన్ యూ నాట్ టు హార్ట్ యువర్ ఫీలింగ్స్ బట్ ఐయామ్ వోన్లీ గోయింగ్ టు గెట్ దిస్ వన్ చాన్స్ సమ్‌థింగ్ రాంగ్. ఐ కెన్ ఫీల్ ఇట్’ అని శాస్త్రీయ నృత్య వేషధారణతో కనిపిస్తున్న అదా శర్మ పాడుతుంటే ‘వాహ్వా’ అనకుండా ఉండలేము. View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) -
నా నిజాయితీని అపహాస్యం చేశారు.. ‘ది కేరళ స్టోరీ’పై అదా శర్మ ఆసక్తికర పోస్ట్
పలు వివాదాల మధ్య మే 5 విడుదలైన ‘ది కేరళ స్టోరీ’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. సుదీప్తోసేన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పటికే రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాలో షాలినీ ఉన్నికృష్ణన్ పాత్రలో నటించిన ఆదా శర్మ తో పాటు మిగిలిన నటీనటులపై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. (చదవండి: వారసత్వం కోసం బిడ్డను కనడం లేదు.. ఉపాసన ఆసక్తికర పోస్ట్ ) అదా శర్మ కృతజ్ఞతలు తమ చిత్రానికి భారీ విజయం అందించిన ప్రేక్షకులను కృతజ్ఞతలు చెప్పింది అదా శర్మ. ఇన్స్టాగ్రామ్ వేదికగా తన ఆనందాన్ని పంచుకుంది. ‘నా నిజాయతీని కొందరు అపహాస్యం చేశారు. మా చిత్తశుద్దిని చులకనగా చూశారు. ‘ది కేరళ స్టోరీ టీజర్ వచ్చాక ఈ సినిమాను రిలీజ్ చేయొద్దని బెదిరింపులు కూడా వచ్చాయి. కొన్ని రాష్ట్రాలు ఈ చిత్రాన్ని బ్యాన్ చేశాయి. అయినా కూడా ప్రేక్షకులు భారీ విజయాన్ని అందించారు. ఒక మహిళ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఇంతగా ఆదరించినందుకు అందరికి ధన్యవాదాలు. ఈ మూవీ విషయంలో ఆడియన్స్ గెలిచారు’ అని అదా శర్మ రాసుకొచ్చింది. ‘కేరళ స్టోరీ’లో ఏం చూపించారు కేరళలోని లవ్ జిహాద్, రాడికలైజేషన్, ఐసిస్ రిక్రూట్ మెంట్, లైంగిక బానిసత్వం లాంటి అంశాల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. లవ్ జిహాద్ వల్ల ముగ్గురు అమ్మాయిలు ఎలాంటి దయనీయ పరిస్థితుల్ని ఎదుర్కొన్నారనే నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) -
బ్లూ వేల్ గేమ్ నేపథ్యంలో సినిమా, హీరోయిన్గా అదా శర్మ
‘ది కేరళ స్టోరీ’ వంటి వివాదాత్మక సినిమా తర్వాత హీరోయిన్ అదా శర్మ ఓ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. ‘హేట్ స్టోరీ 2’ ఫేమ్ విశాల్ పాండ్య దర్శకత్వంలో శ్రేయాస్ తల్పాడే హీరోగా నటిస్తున్న చిత్రం ‘ది గేమ్ ఆఫ్ గిర్జిట్’. ఈ చిత్రంలో అదా శర్మ నటిస్తున్నట్లు చిత్రయూనిట్ గురువారం ప్రకటించింది. ఇటీవల కాలంలో యువతలో బాగా ప్రాచుర్యం పొందిన ‘బ్లూ వేల్ గేమ్’ (బ్లూ వేల్ ఛాలెంజ్) నేపథ్యంలో థ్రిల్లర్‌గా ఈ కథ సాగుతుంది. ఇందులో అదా శర్మ పోలీస్ పాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ– ‘‘గతంలో ‘కమాండో’ సినిమాలో భావనా రెడ్డి అనే పోలీస్ పాత్ర చేశాను. ఆ పాత్ర మంచి ప్రజాదరణ పొందింది. ఇప్పుడు ‘ది గేమ్ ఆఫ్ గిర్జిట్’లో గాయత్రీ భార్గవ్ అనే పోలీస్ పాత్ర చేస్తున్నాను. నా పాత్ర సరదాగా, విభిన్నంగా ఉంటుంది’’ అన్నారు. -
కాంట్రవర్సీ స్టోరీ దెబ్బకి మార్వెల్ హీరోస్ మటాష్
-
The Kerala Story: ‘ది కేరళ స్టోరీ’ వివాదం ఏంటి? సీఎం ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?
వాస్తవ సంఘటనల ఆధారంగా సినిమాలను తెరకెక్కించడం ఇప్పుడు ఇండస్ట్రీలో ట్రెండింగ్‌గా మారింది. ప్రేక్షకులు కూడా ఆ తరహా సినిమాలపై ఆసక్తి చూపుతున్నారు. దానికి కారణం.. ఆ సంఘటన జరిగినప్పుడు మనకు ఎవ్వరికీ తెలియని నిజాలను థియేటర్ లో చూపిస్తారని. ఇక ఇలాంటి సినిమాలు వస్తున్నాయి అని తెలియడంతోనే వివాదాలు చుట్టుముడతాయి. సాధారణంగా జరిగిన ఒక హత్యపై బయోపిక్ తీస్తేనే.. ఇలాంటివి ప్రేక్షకులకు ఎలా చూపిస్తారు అని కొంతమంది మీడియా ముందే నిగ్గుతీసి అడుగుతున్నారు. అలాంటింది దేశాలు మొత్తం హడలిపోయే టాపిక్ ను సినిమాగా తీస్తే వివాదాలను ఆపడం ఎవరి వల్ల కాదు. (చదవండి: మహిళల శరీరాలు ఎంతో విలువైనవి.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు ) కానీ కొంతమంది ధైర్యంగల దర్శకులు.. నిజాలను ప్రేక్షకులకు చూపించడమే పనిగా పెట్టుకున్నారు. అలా నిజాన్ని బయట పెట్టిన సినిమాల్లో ఒకటి ది కాశ్మీర్ ఫైల్స్.. కాశ్మీర్ లో పండితులు ఎలాంటి ఊచకోతకు గురయ్యారో.. డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి కళ్ళకు కట్టినట్లు చూపించాడు. ఈ వివాదం ఇప్పటికీ హాట్ టాపిక్ గా ఉంది అంటే .. అందులో ఎలాంటి కథను చూపించి ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇంకా ఈ హీట్ తగ్గనే లేదు.. మరో బాలీవుడ్ డైరెక్టర్ మరో సంచలన ఘటనను తెరమీదకు తీసుకొచ్చాడు. అదే ది కేరళ స్టోరీ. ‘కేరళ స్టోరీ’లో చూపించేది ఏంటి? మూడేళ్ళ క్రితం అనగా 2018- 2019 లో కేరళనే కాదు భారతదేశాన్ని మొత్తం ఒక ఊపు ఊపేసిన కథ ఇది. దాదాపు 32, 000 మంది అమ్మాయిలు కనపడకుండా పోతే.. వారు ఎక్కడ ఉన్నారు..? ఏమైపోయారు..? అని అడిగినవారు లేరు అంటే నమ్ముతారా..? ఇక ఆ కథనే డైరెక్టర్ సుదీప్తోసేన్.. ది కేరళ స్టోరీగా తెరకెక్కించాడు. ఇందులో బాలీవుడ్ హీరోయిన్ అదా శర్మ హీరోయిన్ గా నటించింది. ఈ మధ్యనే ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఆ టీజర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి వివాదాలు ఒక్కొక్కటిగా ముసురుతున్నాయి. టీజర్లో ఏంముంది? కేరళకు చెందిన నలుగురు అమ్మాయిలు నర్సింగ్ కాలేజ్ లో చేరతారు. అక్కడ వారిని ట్రాప్ చేయడానికి ఐసీసీ ఎన్నో పధకాలు వేసి వారిని ఇస్లాం మతంలోకి రప్పిస్తుంది. అందుకోసం ఎంతటి నీచమైన పనికి అయిన సిద్ధమవుతుంది. ఆ అమ్మాయిలను ప్రేమ పేరుతో లొంగదీసుకుని, వారిని పెళ్లి వరకు తీసుకొచ్చి.. పెళ్లి చేసుకొనే సమయంలో వారి పేర్లు మార్చాలని చెప్పి వారిని బలవంతంగా ఇస్లాంమతంలోకి దింపుతారు. ఇక పెళ్లి తరువాత వారిని ఐఎస్ఐఎస్ తీవ్రవాదులుగా మారుస్తారు. ఏడాదిలో బంధించి చిత్రహింసలకు గురి చేస్తారు. చూచాయగా చెప్పుకోవాలంటే ఇది కథ. ఇలాంటి కథను చూపించాలంటే డైరెక్టర్ కు ఘట్స్ ఉండాలి. సుదీప్తోసేన్ లో ఆ ఘట్స్ కనిపిస్తున్నాయి. వివాదం ఏంటి? ఇక ఇందులో వివాదం ఏంటి.. అంటే .. ఈ విషయంపై కొంతమంది మాజీ ముఖ్యమంత్రికి చెప్పడం, వారు పట్టించుకోలేదని టీజర్ లో చెప్పుకొచ్చారు. ఇలాగే చేస్తే కేరళ ఇస్లామిక్ స్టేట్ గా మారిపోతుంది అని ఒక జర్నలిస్ట్ చెప్పడాన్ని టీజర్ లో చూపించారు. అదే ఇప్పుడు రాజకీయ వివాదానికి పునాది వేసింది. అసలు ఇలాంటి ఘటన కేరళలో జరగలేదని రాజకీయ నేతలు అంటున్నారు. భావ స్వేచ్ఛ ఉంటే మాత్రం ఇలాంటి సినిమాలు తీయొచ్చా అని ప్రశ్నిస్తున్నారు. సీఎం పినరయి ఆగ్రహం ఇక కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సైతం ఈ సినిమాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేరళను తీవ్రవాదులకు హెల్ప్ చేసే రాష్ట్రంగా చూపిస్తున్నారు.. ప్రపంచం ముందు మమ్మల్ని దోషులుగా నిలబెడుతున్నారు. విద్వేషాన్ని రగల్చడమే ధ్యేయంగా రూపొందిచిన ఈ చిత్రాన్ని నిషేదించాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తనికి ది కేరళ స్టోరీ ఎన్నో వివాదాలకు నెలవుగా మారింది. ఇంకోపక్క ఈ సినిమను తెరకెక్కించిన సుదీప్తో మాట్లాడుతూ.. ‘నేను ఈ కథ కోసం దాదాపు ఏడేళ్లు రీసెర్చ్ చేశాను.. కేరళ ప్రజలు నిరక్ష్యరాసులు అయితే కాదు. విద్య సహనాన్ని ఇస్తుంది.. టీజర్ కే ఎందుకు ఇంత గొడవ చేస్తున్నారు.. సినిమా చూడండి .. చూశాకా మాట్లాడండి’ అని చెప్పుకొచ్చాడు. ఇక హీరోయిన్ అదా సైతం.. ఈ కథ నిజమైంది అని, తాను కూడా ఆబాధిత యువతులతో మాట్లాడానని, సినిమా చూశాక అందరు కంటతడి పెడతారని చెప్పుకొచ్చింది . ఇన్ని వివాదాలు రేకెత్తించిన ఈ సినిమా మే 5 అన్ని భాషల్లో రిలీజ్ అవుతుంది. మరి ఈ సినిమా ఎన్ని సంచలనాలను క్రియేట్ చేస్తుందో..? ఎంతమంది రాజకీయ నాయకులకు చెమటలు పట్టిస్తుందో చూడాలి. -
తుపాకీ పట్టిన హీరోయిన్లు.. బాక్సాఫీస్‌పై గురి
తుపాకీ పట్టారు.. విలన్లపై గురి పెట్టారు...రెచ్చిపోయి ఫైట్స్ చేస్తున్నారు... బాక్సాఫీస్ కలెక్షన్లపై గురి పెట్టారు... ప్రస్తుతం కొందరు కథానాయికలు సిన్సియర్ పోలీసాఫీసర్లుగా, లేడీ జేమ్స్ బాండ్ తరహా పాత్రల్లో నటిస్తున్నారు. ఆ చిత్రాల గురించి తెలుసుకుందాం. సీనియర్ నటి టబు మరో రెండు నెలల్లో ఇన్స్పెక్టర్ డయానా జోసెఫ్‌గా కనిపించనున్నారు. అజయ్ దేవగన్ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న హిందీ చిత్రం ‘భోలా’లోనే ఆమె పోలీస్ ఇన్స్పెక్టర్ డయానా జోసెఫ్ పాత్ర చేస్తున్నారు. మూడు రోజుల క్రితం ఈ చిత్రంలో టబు లుక్ విడుదలైంది. మార్చి 30న ఈ చిత్రం విడుదల కానుంది. ఇక గత ఏడాది సెప్టెంబర్‌లో ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రంలో యువరాణి పాత్రలో కనిపించిన త్రిష త్వరలో విడుదల కానున్న వెబ్ సిరీస్ ‘బృందా’లో తుపాకీ తూటాలను అలవోకగా వదిలే పోలీస్‌గా కనిపించనున్నారు. త్రిష నటించిన తొలి వెబ్ సిరీస్ ఇది. సూర్య వంగల దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్ సీజన్ వన్ షూటింగ్ ఇటీవలే పూర్తయింది. త్వరలో స్ట్రీమింగ్ కానుంది. ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ చుట్టూ తిరిగే కథతో ఈ సిరీస్ రూపొందింది. ఇక కాజల్ అగర్వాల్ కూడా సిన్సియర్ పోలీసాఫీసర్‌గా కనిపించనున్నారు. ‘ఘోస్టీ’ అనే చిత్రంలోనే ఈ పాత్ర చేశారామె. తన తండ్రి అడుగుజాడలను అనుసరించి, పోలీస్‌గా మారుతుంది ఆర్తి (కాజల్). ఇరవయ్యేళ్ల క్రితం తన తండ్రి కస్టడీ నుంచి తప్పించుకున్న ఖైదీని పట్టుకోవాలన్నదే ఆర్తి ఆకాంక్ష. ఈ క్రమంలో ఆమెకు విచిత్రమైన ఘటనలు ఎదురవుతుంటాయి. కాజల్ నటించిన తొలి హారర్ సినిమా ఇది. కల్యాణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. మరోవైపు అధికారిక ప్రకటన రాలేదు కానీ ఓ హిందీ షోలో తమన్నా పోలీస్‌గా చేస్తున్నారనే వార్త ప్రచారంలోకి వచ్చింది. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ షో సాగుతుందని సమాచారం. ఇంకోవైపు దాదాపు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తున్న నయనతార తన తొలి హిందీ చిత్రం ‘జవాన్’లో పోలీసాఫీసర్ పాత్ర చేస్తున్నారు. షారుక్ ఖాన్ హీరోగా తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న తొలి హిందీ చిత్రం ఇది. ఈ చిత్రంలో అన్యాయంగా జైలుపాలైన మహిళలను విడిపించి, వారిని సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడే ఒక టీమ్‌గా మార్చే కామన్ మేన్ పాత్రను షారుక్ ఖాన్ చేస్తున్నారని సమాచారం. ఈ కేసును ఛేదించే పోలీసాఫీసర్ పాత్రలో నయనతార కనిపిస్తారని టాక్. ఈ ఏడాది జూన్ 2న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఇక అభినయానికి ఆస్కారం ఉన్న పాత్రలంటే దర్శకులకు గుర్తొచ్చే కథానాయికల్లో కీర్తీ సురేష్ ముందు వరుసలో ఉంటారు. ప్రస్తుతం కీర్తి చేస్తున్న చిత్రాల్లో ‘రివాల్వర్ రీటా’ ఒకటి. రెండు చేతులతో రెండు తుపాకీలు పట్టుకుని అలవోకగా షూట్ చేసే రీటా పాత్రలో కనిపించనున్నారు కీర్తి. కె. చంద్రు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో లేడీ జేమ్స్ బాండ్ తరహా పాత్ర చేస్తున్నారామె. మరోవైపు హిందీ చిత్రం ‘కమాండో’ సీక్వెల్స్‌లో పోలీస్ ఇన్స్పెక్టర్ భావనా రెడ్డిగా కనిపించిన అదా శర్మ ప్రస్తుతం ఓ హిందీ చిత్రంలో పోలీస్ ఆఫీసర్‌గా చేస్తున్నారు. విశాల్ పాండ్య దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. మరోసారి పోలీస్‌గా నటించే అవకాశం రావడం ఆనందంగా ఉంది అంటున్నారు అదా. ఇక ‘సీతారామం’ చిత్రంతో పాపులర్ అయిన మృణాల్ ఠాకూర్ నటించిన హిందీ చిత్రం ‘గూమ్రా’. ‘సీతారామం’లో సున్నిత మనసు ఉన్న సీత పాత్రలో అందర్నీ ఆకట్టుకున్న మృణాల్ ‘గూమ్రా’లో శక్తిమంతమైన పోలీసాఫీసర్‌గా కనిపించనున్నారు. ఈ పాత్ర చేయడానికి శిక్షణ తీసుకున్నారు మృణాల్. తమిళ చిత్రం ‘తడమ్’కి రీమేక్‌గా వర్థన్ కట్కర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఈ తారలే కాదు.. మరికొందరు కథానాయికలు కూడా పోలీసాఫీసర్ పాత్రలో విజృంభించనున్నారు. -
పచ్చని ఆకులే డ్రెస్‌గా.. అదాశర్మ రచ్చ.. ఫోటోలు వైరల్
‘హార్ట్ ఎటాక్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ అదాశర్మ. ఆ తర్వాత అడపదడప సినిమాల్లో నటించినా అంతగా గుర్తింపు రాలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ ముద్దుగుమ్మకి యమ క్రేజీ ఉంది. నిత్యం కొత్త కొత్త స్టైల్లో రెడీ అయి ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ అభిమానులకు కిక్కెక్కిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ ఆకులతో డిజైన్ చేసిన గౌను ధరించి ఫోటోషూట్ చేయించుకుంది. ఆ ఫొటోలను సోషల్ మీడియా షేర్ చేస్తూ.. ‘‘ప్రకృతి చాలా గొప్పది. మనం ఎలా ఉండాలనుకుంటే అలా ఉండనిస్తుంది. అన్ని జీవరాసులను స్వీకరించే శక్తి మానవులకే ఇచ్చింది’’ అని రాసుకొచ్చారు. అదా షేర్ చేసిన ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. -
పట్టరాని సంతోషం... ఆ వెంటనే తెలియని దిగులు..
కాసేపు పట్టరాని సంతోషం... ఆ వెంటనే తెలియని దిగులు. బైపోలార్ డిజార్డర్ సమస్యకు సంబంధించిన లక్షణం ఇది. తాజా సినిమాలో బైపోలార్ డిజార్డర్‌తో బాధపడుతున్న అమ్మాయిలా కనిపించనున్నారు అదా శర్మ. ‘చుహా బిల్లీ’ అనే హిందీ సినిమా చేస్తున్నారీ బ్యూటీ. ప్రసాద్ కడమ్ దర్శకుడు. ఈ సినిమాలో మానసికంగా బాధపడుతూ, డిప్రెషన్లో ఉండే పాత్రలో కనిపిస్తారామె. ‘‘ఈ పాత్ర నాకో చాలెంజ్’’ అంటున్నారు అదా. ఈ సినిమా గురించి ఆమె మాట్లాడుతూ –‘‘చుహా బిల్లీ’ అనేది చాలా డార్క్ కథాంశం. ఈ సినిమాలో పాత్ర స్వభావానికి నేను పూర్తి విరుద్ధంగా ఉంటాను. అందుకే చేయాలనుకున్నాను. ఈ పాత్ర కోసం చాలా వర్క్‌షాప్స్ చేస్తున్నాం. నేనిప్పటివరకూ చేసిన సినిమాల్లో ఇది చాలా భిన్నంగా ఉంటుంది’’ అన్నారు. -
సందేశంతో ప్రశ్న
‘‘కరోనా వైరస్ ప్రభావంతో ప్రేక్షకులకు వినోదం కరువైంది. ఇలాంటి తరుణంలో ఒక మంచి సందేశంతో వస్తోన్న ‘క్వచ్చన్ మార్క్’ చిత్రం విజయం సాధించి దర్శక–నిర్మాతలకు, హీరోయిన్, ఇతర యూనిట్ సభ్యులకు మంచి పేరు తీసుకురావాలి’’ అని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అదా శర్మ లీడ్ రోల్లో విప్రా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘క్వశ్చన్ మార్క్’ (?). గౌరు ఘనా సమర్పణలో శ్రీ కృష్ణ క్రియేష¯Œ ్స పతాకంపై గౌరీ కృష్ణ నిర్మించిన ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని తలసాని శ్రీనివాస్ విడుదల చేశారు. ఈ సందర్భంగా గౌరీకృష్ణ మాట్లాడుతూ– ‘‘కరోనా టైమ్‌లో చిత్రీకరణ ప్రారంభించి పూర్తి చేశాం. త్వరలో సినిమాని విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘క్వశ్చన్ మార్క్ టైటిల్‌కు మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రం చూస్తే ఈ టైటిల్ కరెక్ట్ అని అంటారు’’ అన్నారు విప్రా. ‘‘మా సినిమా చాలా బాగా వచ్చింది. నా పాత్రకు నేనే డబ్బింగ్ చెబుతున్నాను. విప్రా పేరుతో ప్రతిభావంతులైన ఇద్దరు దర్శకులు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు’’ అన్నారు అదా శర్మ. ఈ చిత్రానికి కెమెరా: వంశీ ప్రకాష్, సంగీతం: రఘు కుంచె. -
అడవుల్లో క్వారంటైన్
హీరోయిన్లు ఒకేసారి రెండు మూడు సినిమాలు చేస్తుంటారు. ఒక సెట్ నుంచి మరో సెట్‌కు వెళ్తూ సినిమాలు త్వరగా పూర్తి చేయగలుగుతారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇలా ఒక సెట్ నుంచి ఇంకో సెట్‌కి వెళ్లడం అంటే కొంచెం రిస్కే. అందుకే ఒక సినిమా యూనిట్ నుంచి మరో యూనిట్లో జాయిన్ అయ్యే మధ్యలో సెల్ఫ్ క్వారంటైన్లో ఉంటున్నారు అదా శర్మ. తన స్టాఫ్ మొత్తాన్ని కూడా క్వారంటైన్లో ఉంచుతున్నారామె. ఇటీవలే రెండు తెలుగు సినిమాలు అంగీకరించారు అదా. ఆల్రెడీ ఈ సినిమాల చిత్రీకరణ ప్రారంభం అయింది. ఒక సినిమాకు సంబంధించిన ఓ షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో పూర్తి చేశారు. మరో సినిమా చిత్రీకరణ నీలగిరి అడవుల్లో జరగనుంది. ఈ అడవుల్లోనే ఓ మేన్షన్‌లో ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నారు అదా. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ – ‘‘నీలగిరి అడవులు భలే అందంగా ఉన్నాయి. మేం ఉండే బంగ్లా అడవి మధ్యలో ఉంది. ఇది భయంకరమైన ప్రదేశమని చాలా మంది చెప్పారు. కానీ చాలా అందంగా ఉంది. ఒక యూనిట్ నుంచి మరో యూనిట్‌తో కలసి పని చేసేటప్పుడు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. సెట్లో భౌతిక దూరం పాటించడం కొంచెం కష్టం. కానీ ముందే ఇలా క్వారంటైన్లో ఉండి చిత్రీకరణ ప్రారంభిస్తే ఇబ్బంది ఉండదని మా అభిప్రాయం’’ అన్నారు అదా. ఈ రెండు సినిమాలే కాకుండా ‘కమాండో 4, మ్యాన్ టూ మ్యాన్’ అనే హిందీ సినిమాల్లో అదా కనిపించనున్నారు. -
యుద్ధభూమికి వెళ్లినట్లుంది!
‘‘షూటింగ్ కోసం సెట్లోకి వెళ్తుంటే యుద్ధభూమిలోకి వెళ్తున్న భావన కలుగుతోంది’’ అంటున్నారు హీరోయిన్ అదా శర్మ. లాక్డౌన్ తర్వాత తొలిసారి షూటింగ్లో పాల్గొంటున్నారామె. ఈ విషయం గురించి అదా మాట్లాడుతూ – ‘‘బ్యాక్ టు సెట్. లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత నేను తొలిసారి సెట్లోకి అడుగుపెట్టాను. ఓ వాణిజ్య ప్రకటన కోసం ఒక్కరోజు షూటింగ్ చేయాలి. సెట్లో ఇరవైమంది మాత్రమే ఉన్నారు. అందరూ మాస్క్‌లు ధరించారు. శానిటైజ్ అయ్యారు. ఇలా అన్ని జాగ్రత్తలు తీసుకుని సెట్లోకి అడుగుపెడుతుంటే యుద్ధభూమిలోకి వెళ్తున్నట్లు ఉంది. లాక్డౌన్ తర్వాత షూటింగ్‌కు వెళ్తున్న అతికొద్ది నటీనటుల జాబితాలో నా పేరు కూడా ఉంటుందనుకుంటున్నాను’’ అని అన్నారు. ∙సెట్లో అదా శర్మ -
నా స్టైల్ ఏంటో తెలియదు
‘‘ఏ కథ తీసుకున్నా ముందు క్లైమాక్స్ రాసుకుంటాను. ముగింపు పూర్తయితే మిగతా కథను ఈజీగా రాసుకోవచ్చని నమ్ముతాను. కథ తయారవుతూ క్లైమాక్స్ కోసం ఎదురుచూస్తే ఆలస్యం అవుతుందనుకుంటాను. ముగింపు ఎలా ఉంటుందో తెలిస్తే కథను ఎలా అయినా అక్కడి వరకూ తీసుకెళ్లొచ్చు’’అని ప్రశాంత్ వర్మ అన్నారు. రాజశేఖర్ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కల్కి’. ఆదాశర్మ, నందితా శ్వేత, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలు పోషించారు. సి. కల్యాణ్ నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం రిలీజైంది. ఈ సందర్భంగా ప్రశాంత్ వర్మ పంచుకున్న విశేషాలు... ► ‘అ!, కల్కి’ సినిమాలకు క్లైమాక్స్‌లో వచ్చే సన్నివేశాలే బలం. అలాగని అన్ని సినిమాల్లో క్లైమాక్స్ ట్విస్ట్ ఉండేలా ప్లాన్ చేయలేము. నెక్ట్స్ అనుకున్న కథలో ఇంటర్వెల్ బ్యాంగ్ సూపర్‌గా ఉండొచ్చు? అలాగే నా సినిమాలు ఇలానే ఉంటాయి అని ఆడియన్స్ కూడా ఓ ముద్ర వేయకూడదు. ప్రస్తుతానికి నా జానర్ ఏంటి? నా స్టైల్ ఏంటో నాకే తెలియదు. మెల్లిగా తెలుసుకుంటున్నాను. ► ‘అ!’ సినిమాకు మంచి అప్లాజ్ వచ్చింది కానీ పెద్ద ఆఫర్స్ రాలేదు. పెద్ద హీరోల సినిమాల్లో ఆఫర్ రావాలంటే చాలా విషయాలను పరిగణించాలి. వాళ్లను హ్యాండిల్ చేయగలనా? కమర్షియల్ ఎలిమెంట్స్ డీల్ చేస్తానా?అనేవి చూస్తారు. ఆ ఉద్దేశంతోనే ‘కల్కి’ లాంటి కమర్షియల్ సబ్జెక్ట్ టేకప్ చేశాను. ► ‘కల్కి’ కథను ముందు నేను డైరెక్ట్ చేయాలనుకోలేదు. స్క్రిప్ట్ పూర్తి స్థాయిలో తయారయ్యేసరికి నాకే మంచి ఎగై్జటింగ్‌గా అనిపించింది. అలాగే స్క్రిప్ట్‌ను ఎలా డైరెక్ట్ చేయాలనుకున్నప్పుడు కొన్ని కమర్షియల్ సినిమాలు రిఫరెన్స్ కోసం చూశా. ‘కేజీఎఫ్’ లాంటి ట్రీట్మెంట్ అయితే బావుంటుందని స్టైలిష్‌గా తీశాం. ► నేను ఐటమ్ సాంగ్స్‌కు వ్యతిరేకిని. కానీ ఇలాంటి సినిమాలో ఉండాలి. అందుకే పెట్టడం జరిగింది. అన్ని సినిమాలు రివ్యూవర్స్‌కి నచ్చాలని లేదు. ‘అ!’ సినిమాకు బాగా రాశారు. ఈ సినిమా ఎవరి కోసం తీశామో వాళ్లు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఒకవేళ ఈ సినిమాకు నన్నే రివ్యూ రాయమన్నా తప్పులు బడతానేమో? ► రాజశేఖర్‌గారు షూటింగ్ స్పాట్‌కి లేట్‌గా వస్తారని విన్నాను. కానీ వాళ్ల ఫ్యామిలీతో వర్క్ చేయడం నాకు సౌకర్యంగానే అనిపించింది. సినిమా స్టార్ట్ అవ్వకముందు కొన్నిరోజులు వాళ్లతో ట్రావెల్ అయ్యాను. చాలా స్మూత్‌గా జర్నీ నడిచింది. వీళ్లను భరించొచ్చు అని ముందుకెళ్లిపోయా(నవ్వుతూ). ► శ్రావణ్ భరద్వాజ్ నాకు కాలేజ్ టైమ్ నుంచి ఫ్రెండ్. నేను తీసిన యావరేజ్ షార్ట్ ఫిల్మ్స్‌కి కూడా మంచి మ్యూజిక్ ఇచ్చేవాడు. ఇప్పుడు మా అందరి కంటే తనకే మంచి పేరొస్తుంది. ► ‘దటీజ్ మహాలక్ష్మీ’ సినిమా దర్శకుడు తప్పుకోవడంతో నేను జాయిన్ అయ్యాను. 31రోజుల్లో మొత్తం రీషూట్ చేశాను. దర్శకుడిగా క్రెడిట్ ఉండకూడదనేది అగ్రిమెంట్. ‘కల్కి’ స్టార్ట్ అవ్వడానికి టైమ్ ఉందనడంతో ఆ సినిమా పూర్తి చేశాను. రీమేక్ సినిమా చేయడం కూడా ఓ ఎక్స్పీరియన్స్. ► ప్రస్తుతానికి కథలైతే సిద్ధంగానే ఉన్నాయి. ‘కల్కి’ సినిమా థియేట్రికల్ రన్ పూర్తయ్యాక కలెక్షన్స్ అన్నీ చూసి నెక్ట్స్ సినిమా ఏంటో అనౌన్స్ చేస్తా. హాట్‌స్టార్ వాళ్లకి ఓ వెబ్ సిరీస్ డైరెక్ట్ చేస్తున్నాను. ఫ్యామిలీ థ్రిల్లర్. ఇప్పటి వరకు అలాంటి కథ రాలేదు. -
ఇప్పుడు ఆ భయమే లేదు
‘‘సినిమాలో నా స్క్రీన్ టైమ్ ఎంతసేపు?’ అని ఆలోచించే యాక్టర్‌ని కాదు నేను. మనకిచ్చిన రోల్లో, మనకున్న స్క్రీన్ టైమ్‌లో ఒప్పుకున్న పాత్రకు, ఆ సినిమాకు మనమేం కొత్తదనం తీసుకురాగలం అని మాత్రమే ఆలోచిస్తాను. యాక్టర్‌గా చేసే ప్రతిదీ ఫుల్ లెంగ్త్ రోల్ అయ్యుండాలనీ సినిమా మొత్తం కనిపించాలనీ అనుకోను’’ అన్నారు అదా శర్మ. రాజశేఖర్, అదా శర్మ జంటగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సి.కల్యాణ్ నిర్మించిన చిత్రం ‘కల్కి’. ఈ సినిమా గత శుక్రవారం రిలీజ్ అయింది. ఈ సందర్భంగా అదా శర్మ పలు విశేషాలు పంచుకున్నారు. ► ప్రశాంత్ డైరెక్ట్ చేసిన ‘అ!’ సినిమా నచ్చింది. తనతో సినిమా చేయాలనుకున్నా. ప్రశాంత్ ‘కల్కి’ కథ చెప్పగానే నచ్చింది. హీరోయిన్ పాత్రలను ఆయన విభిన్నంగా రాస్తారు. ఈ సినిమాలోనూ నా పాత్ర డిఫరెంట్‌గా ఉంటుంది. తొలిసారి డాక్టర్ పాత్ర చేశా. ఈ పాత్ర అన్నీ కళ్ల ద్వారానే వ్యక్తపరుస్తుంది. తక్కువ మాట్లాడుతుంది. నిజజీవితంలో అందుకు పూర్తి విరుద్ధంగా ఉంటాను నేను. అందుకే ఈ పాత్ర చాలెంజింగ్‌గా అనిపించింది. ఇది పీరియాడికల్ మూవీ కాబట్టి రిఫరెన్స్ కోసం కొన్ని పాత సినిమాలు చూశాను. అప్పటి హీరోయిన్ల బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది? అనే విషయాలను గమనించాను. పాత తరం నటీమణుల్లో వహీదా రెహమాన్, వైజయంతి మాల నాకు ఇష్టమైన హీరోయిన్లు. ► రాజశేఖర్గారిలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న యాక్టర్‌తో వర్క్ చేయడం సంతోషంగా ఉంది. ఎంతో అనుభవం ఉన్నప్పటికీ తొలి సినిమా చేస్తున్న హీరోకి ఉండే ఎగై్జట్‌మెంట్‌తో ఈ సినిమాకు వర్క్ చేశారాయన. తను సీనియర్, నేను జూనియర్ అనే ఫీలింగ్ సెట్లో ఎప్పుడూ లేదు. చాలా పాజిటివ్ పర్సన్. ► ‘క్షణం’ తర్వాత ఎలాంటి సినిమాలు చేయాలనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నాను. తెలుగు సినిమాలు వరుసగా ఎందుకు చేయడం లేదని తెలుగు ఫ్యాన్స్ అడుగుతుంటారు. హిందీ, తెలుగు, తమిళం ఇలా అన్ని భాషల్లో సినిమాలు చేస్తున్నాను. సో.. హిందీలో వరుసగా రెండు సినిమాలు చేస్తే తెలుగు సినిమాల్లో కనిపించడం తగ్గుతుంది. ఇప్పుడు తెలుగు సినిమా చేయాలి, ఆ తర్వాత హిందీ సినిమా చేయాలి అనే స్ట్రాటజీతో ప్లానింగ్ చేయలేను. ► ప్రస్తుతం హిందీలో ‘కమాండో 3’, మ్యాన్ టు మ్యాన్’ సినిమాలు కమిట్ అయ్యాను. ‘కమాండో’ సిరీస్‌లో వస్తున్న మూడో చిత్రమిది. సాధారణంగా ఫ్రాంచైజీ సినిమాల్లో హీరోయిన్స్‌ను మారుస్తారు. కానీ మూడో సినిమాలోనూ నేనే హీరోయిన్‌గానే కొనసాగుతున్నాను. ‘మ్యాన్ టు మ్యాన్’లో అబ్బాయిగా నటిస్తున్నాను. వీటితో పాటు ఓ వెబ్ సిరీస్, రెండు షార్ట్ ఫిల్మ్స్‌లో నటిస్తున్నాను. ► నా వర్క్‌ని బాగా ఎంజాయ్ చేస్తాను. ఎందుకంటే యాక్టర్ అవ్వాలన్నది నా డ్రీమ్. కొందరు వాళ్ల ప్రొఫెషన్ని ఇష్టపడరు. ఉదయాన్నే లేచి అబ్బా.. ఇవాళ కూడా ఆఫీస్‌కి వెళ్లాలా? అని బాధపడతారు. నేను మాత్రం వీకెండ్స్ కూడా వర్క్ చేయడానికి ఇష్టపడతాను. అందరికీ హీరోయిన్ అయ్యే చాన్స్ రాకపోవచ్చు. మనకి వచ్చిన చాన్స్‌ని కష్టపడి నిలబెట్టుకోవాలి. అందుకే నా జాబ్‌ను లక్కీగా ఫీల్ అవుతాను. ► ఏ కథ అంగీకరించినా అది నా నిర్ణయమే. ‘క్షణం’ ఓకే చేసినప్పుడు చిన్న సినిమా ఎందుకు? అన్నారు. కానీ నా నిర్ణయాలను ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఏదైనా కొత్త పాత్రలో కనిపించాలన్నా, కొత్త కొత్త డ్రస్సులతో రెడ్ కార్పెట్ మీద నడవాలన్నా ఏ భయం లేకుండా ధైర్యంగా చేస్తున్నాను. కొత్త కాస్ట్యూమ్స్‌తో స్టైల్ స్టేట్మెంట్లు ఇవ్వగలుగుతున్నాను. మిగతా హీరోయిన్స్ ఇవి చేయాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాలేమో? కానీ ఇప్పుడు నాకా భయం పోయింది. -
అమ్మాయే అబ్బాయి అయితే!
ఓ అబ్బాయి, అమ్మాయి ఒకరినొకరు ఇష్టపడ్డారు. పెళ్లి చేసుకున్నారు. వివాహం జరిగిన తర్వాత అబ్బాయికి తెలిసిందేంటంటే తను పెళ్లి చేసుకున్న అమ్మాయి లింగ మార్పిడి చేసుకున్న అబ్బాయి అని. అప్పుడు పెళ్లి కొడుకు ఏం చేశాడన్నదే చిత్రకథ. దర్శకుడు అభిర్ సేన్ గుప్తా తెరకెక్కిస్తున్న ‘మ్యాన్ టు మ్యాన్’ కథ ఇది. విచిత్రంగా ఉంది కదూ. ఇందులో అదా శర్మ, నవీన్ జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాలో అదా శర్మ అబ్బాయి పాత్రలో నటించడం విశేషం. లింగ మార్పిడి కాన్సెప్ట్‌తో రూపొందుతున్న కామెడీ చిత్రమిది. ఇందులో అబ్బాయి పాత్రలో నటించడం గురించి అదా మాట్లాడుతూ – ‘‘నా కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా విభిన్న పాత్రలు ఎంపిక చేసుకోవడం మీదే ఎక్కువ దృష్టి పెట్టాను. ఫస్ట్ టైమ్ అబ్బాయిగా నటిస్తున్నాను’’ అన్నారు. ‘‘కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాకుండా ఓ మెసేజ్ కూడా ఇందులో చెప్పబోతున్నాం’’ అన్నారు దర్శకుడు అభిర్ సేన్‌గుప్తా. -
మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్
పురాతన కట్టడాలు, కోటలు, కొండలు... అడవులు, కొండ కోనలు, మంచు కొండల మధ్య ప్రయాణాలు... బాంబులు ఉన్నాయి.. బాణాలతో వేటాడే మనుషులు, ప్రాణాల కోసం పరుగులు తీసే మనుషులు ఉన్నారు.. గ్రామ పెద్దలు, గుమిగూడిన మనుషులున్నారు.. నీటిలో గుట్టలుగా పడిన శవాలు ఉన్నాయి. ఇటువంటి విపత్కర పరిస్థితుల నడుమ, వివిధ వర్గాల ప్రజల మధ్య ‘కల్కి’ కదిలాడు.. కదనరంగంలోకి గొడ్డలి పట్టి దిగాడు. అతడి కథేంటో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. రాజశేఖర్ హీరోగా ‘అ!’ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘కల్కి’. శివాని–శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్‌ని బుధవారం విడుదల చేశారు. పైన చెప్పినందంతా టీజర్లో వచ్చిన సన్నివేశాలే. అయితే ఈ టీజర్లో ఒక్క డైలాగ్ లేకపోవడం విశేషం. ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ– ‘‘1980 నేపథ్యంలో సాగే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఇది. రాజశేఖర్‌గారు పోలీస్ అధికారి పాత్రలో నటిస్తున్నారు. ఆయనతో పని చేయడం చాలా సంతోషంగా ఉంది. నేను ఇప్పటివరకూ పని చేసిన యాక్టర్స్‌లో మోస్ట్ కంఫర్టబుల్ యాక్టర్ రాజశేఖర్‌గారు. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి టీజర్‌కు మంచి స్పందన వస్తోంది’’ అన్నారు. ‘‘టీజర్‌కు వస్తున్న స్పందన వింటుంటే సంతోషంగా ఉంది. రెండు మూడు రోజుల ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలతో బిజీగా ఉన్నాం. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’’ అన్నారు సి.కళ్యాణ్. అదా శర్మ, నందితా శ్వేత, పూజిత పొన్నాడ, స్కార్లెట్ విల్సన్, రాహుల్ రామకృష్ణ, నాజర్, సిద్ధూ జొన్నలగడ్డ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: దాశరథి శివేంద్ర, సంగీతం: శ్రవణ్ భరద్వాజ్, లైన్ ప్రొడ్యూసర్: వెంకట్ కుమార్ జెట్టి. -
ప్రేమికుడి వినోదం
ప్రభుదేవా హీరోగా, అదాశర్మ, నిక్కీగల్రాని హీరోయిన్లుగా శక్తి చిదంబరం దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘చార్లీ చాప్లిన్’. ఈ చిత్రాన్ని ఎమ్.వి. కృష్ణ సమర్పణలో శ్రీ తారకరామ పిక్చర్స్ పతాకంపై వి.శ్రీనివాసరావు తెలుగులోకి ‘మిస్టర్ ప్రేమికుడు’ పేరుతో అనువదిస్తున్నారు. వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ– ‘‘ప్రభుదేవా హీరోగా నటించిన సినిమాలంటే తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకమైన అభిమానం. అందుకే ఆయన నటించిన లేటెస్ట్ చిత్రాన్ని తెలుగులోకి అనువదిస్తున్నాం. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది. పాటలు, సెకండాఫ్‌లో వచ్చే సన్నివేశాలు హైలెట్‌గా నిలుస్తాయి. తెలుగు అనువాద కార్యక్రమాలు ఫైనల్ దశలో ఉన్నాయి. త్వరలో ఆడియోను, ఈ నెలలోనే సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అమ్రీష్; కెమెరా: సౌందర్ రాజన్, సహ నిర్మాతలు: మహేష్ చౌదరి గుర్రం, శంకరరావు సారికి. -
సోల్‌మేట్ కోసం తపన!
బుధవారం వేలంటైన్స్ డే. సోలోగా ఉన్నవారికి సోల్‌మేట్ దొరికితే ఫుల్ ఖుష్ అవుతారు. లేనివాళ్లు సోల్‌మేట్‌ని వెతికే పనిలో ఉంటారు. సింగిల్‌గా ఉన్న ‘హార్ట్ ఎటాక్’ గాళ్ అదా శర్మ కూడా తన సోల్‌మేట్‌ను వెతికే పనిలో బిజీగా ఉన్నారు. అతగాడు ఎప్పుడెప్పుడు కలుస్తాడా? అని తపన పడుతున్నారు. ఏంటీ.. అదా పెళ్లికి తొందరపడుతున్నారా? అంటే కాదు. సోల్‌మేట్‌ను వెతుకుతున్నది రియల్‌లైఫ్‌లో కాదు. రీల్ లైఫ్‌లో. రెండేళ్ల క్రితం ‘క్షణం’ చిత్రంతో తెలుగు తెరపై మెరిసిన అదా వేలంటైన్స్ డే రోజున ‘సోల్‌మేట్’ అనే చిత్రంలో నటించనున్నట్లు తెలిపారు. అబిర్‌సేన్ గుప్తా దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాలో అదా డ్యూయెల్ రోల్ చేయనున్నారు. ‘‘ఎంతో తపనతో సోల్‌మేట్‌ను వెతుక్కునే మోడ్రన్ గాళ్ క్యారెక్టర్లో నటించనున్నాను. ఇంకా మరిన్ని విషయాలు షేర్ చేసుకోవాలని ఉంది. కానీ అందుకు టైమ్ ఉంది’’ అన్నారు అదా శర్మ. తెలుగులో ఈ చిత్రంతో పాటు అటు తమిళంలో ప్రభుదేవా హీరోగా రూపొందుతున్న ఓ సినిమాలో అదా కథానాయికగా నటిస్తున్నారు. నిక్కీ గల్రానీ మరో కథానాయిక. -
చార్లీ చాప్లిన్తో స్టెప్పులు.. ప్రేమలు!
ఇప్పుడు చార్లీ చాప్లిన్ లేరు. కానీ, ఆయన పంచిన నవ్వులు ఈ లోకంలో ఉన్నాయి. చాప్లిన్‌లా పీపుల్ని ఫుల్లుగా నవ్వించడానికి తమిళంలో ఓ సిన్మా రూపొందుతోంది. శక్తీ చిదంబరం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రభుదేవాకి జోడీగా ‘హార్ట్ ఎటాక్’ ఫేమ్ అదా శర్మ నటిస్తున్నారు. 2002లో ప్రభు, ప్రభుదేవా హీరోలుగా వచ్చిన ‘చార్లీ చాప్లిన్’కి సీక్వెల్ ఇది. గురువారం గోవాలో చిత్రీకరణ మొదలైంది. ఆల్రెడీ అదా శర్మ సెట్స్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఫస్ట్‌డే ప్రభుదేవా, అదాలపై కొన్ని సీన్స్ తీశారు. ప్రభుదేవా అంటే జస్ట్ కామెడీ మాత్రమేనా? సాంగుల్లో స్టెప్పులు ఇరగదీసేస్తారు కదా! అండ్ రొమాంటిక్ లవ్ ట్రాక్ తప్పకుండా ఉంటుంది.సో, చార్లీ చాప్లిన్గా రాబోతున్న ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవాతో అదా ఏ విధంగా స్టెప్పులు వేస్తారో! ప్రేమలు పండిస్తారో! అన్నట్టు... ఫస్ట్ పార్ట్ ‘చార్లీ చాప్లిన్’ని తెలుగులో శ్రీకాంత్, వేణు హీరోలుగా ‘పెళ్లాం ఊరెళితే’ పేరుతో రీమేక్ చేశారు. మరి, ఈ సీక్వెల్‌ని రీమేక్ చేస్తారో? లేదా ప్రభుదేవా, అదా శర్మ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులు కావడంతో డబ్ చేస్తారో? వెయిట్ అండ్ సీ!! తమిళ్లో అదాకి హీరోయిన్గా ఇదే మొదటి సినిమా. అంతకు ముందు శింబు ‘ఇదు నమ్మ ఆళు’లో అతిథి పాత్ర చేశారు. -
నేల మీద... గాల్లో తేలుతూ..!
మంచి పాత్ర దొరకాలే కానీ, దానికోసం ఎంతైనా కష్టపడతానంటున్నారు అదా శర్మ. ‘హార్ట్ ఎటాక్’ నుంచి మొన్నటి ‘క్షణం’ వరకూ గ్లామరస్ పాత్రలు ఎక్కువగా చేసిన అదా ఇప్పుడు తనలో మరో కోణాన్ని చూపించనున్నారు. హిందీ చిత్రం ‘కమాండో 2’లో పవర్ఫుల్ అదాని చూడబోతున్నాం. ఈ చిత్రంలో ఈ బ్యూటీ డ్యూయెట్లు పాడతారో లేదో కానీ, ఫైట్లు మాత్రం చేస్తారు. అది కూడా రిస్కీ ఫైట్స్ అన్న మాట. అందుకే కసరత్తులు చేస్తున్నారు. ఈ పాత్ర కోసం జిమ్నాస్టిక్స్ నేర్చుకుంటున్నారు. ఆ ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడు ఫొటోలు కూడా దిగారు. నేల మీద మాత్రమే కాదు.. గాల్లో కూడా అదా రిస్కులు చేసేస్తున్నారు. దీన్నిబట్టి ‘కమాండో 2’లో అదా అదరిపోయే ఫైట్స్ చేస్తారని ఊహించవచ్చు. ఈ చిత్రంతో పాటు హిందీలో ‘జగ్గా జాసూస్’లో కూడా అదా నటిస్తున్నారు. ‘‘నా మటుకు నేను ఏ పాత్రకైనా న్యాయం చేయాలనుకుంటా. అది గ్లామరస్ అయినా.. పవర్ఫుల్ అయినా. ఒకే రకం పాత్రలకే పరిమితం కాను. అలాగే నాకు భాష గురించి కూడా పట్టింపు లేదు. ఎక్కడ మంచి అవకాశాలొస్తే అక్కడ చేస్తా’’ అని అదా శర్మ పేర్కొన్నారు. -
హిందీ ‘క్షణం’లో సల్మాన్!
ఈ మధ్యకాలంలో విడుదలైన థ్రిల్లర్ మూవీస్‌లో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రం ‘క్షణం’. మామూలు బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం భారీ వసూళ్లు కురిపించింది. అడివి శేష్, అదా శర్మ, అనసూయ, సత్య ముఖ్య తారలుగా రవికాంత్ దర్శకత్వంలో పొట్లూరి వి. ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం రీమేక్ హక్కులను ప్రముఖ బాలీవుడ్ నిర్మాత సాజిద్ నడియాడ్వాలా దక్కించుకోనున్నారట. హిందీ రీమేక్‌లో సల్మాన్ ఖాన్ని నటింపజేయాలనుకుంటున్నారని సమాచారం. సాజిద్ ఇంతకుముందు రవితేజ ‘కిక్’ చిత్రాన్ని సల్మాన్‌ఖాన్‌తో హిందీలో రీమేక్ చేసి, ఘనవిజయాన్నందుకున్నారు. ఇప్పుడు ‘క్షణం’ని కూడా ఆయనతోనే తీయాలని బలంగా అనుకుంటున్నారట. -
ప్రతి క్షణం థ్రిల్ చేస్తుంది - నిర్మాత పీవీపీ
‘‘పీవీపీ సంస్థ నా ఒక్కడిదే కాదు... చాలా మంది కలిసి పని చేస్తున్నాం. యువ ప్రతిభావంతుల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రవికాంత్, అడివి శేష్‌లతో కలిసి ఈ సినిమా నిర్మించాం. కంటెంట్, ఎనర్జీ ఉంటే కొత్తవాళ్లతో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాం’’ అని నిర్మాత పరమ్ వి.పొట్లూరి అన్నారు. అడివి శేష్, అదా శర్మ, అనసూయ భరద్వాజ ప్రధాన పాత్రల్లో రవికాంత్ పేరెపు దర్శకత్వంలో పీవీపీ, కెవిన్ అన్నె సంయుక్తంగా నిర్మించిన ‘క్షణం’ ఫస్ట్ లుక్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘‘ప్రతి క్షణం థ్రిల్ చేసే సినిమా ఇది. మార్చి 4న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని పీవీపీ తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ - ‘‘నేను, అడివి శేష్ ఈ చిత్రకథ తయారు చేసి, పీవీపీ గారిని కలిస్తే మూడు రోజుల్లోనే ఓకే చేసి నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. సస్పెన్స్ డ్రామాగా ఈ చిత్రం తీశాం. మూడేళ్ల పాప కనిపించకుండా పోతుంది. ఈ పాపను వెతికే ప్రయాణమే ఈ చిత్రం’’ అని పేర్కొన్నారు. ‘‘ఈ చిత్రకథ విన్న తర్వాత నన్ను పోలీసాఫీసర్ పాత్రకు ఎంపిక చేస్తారనుకోలేదు. ఇందులో ఉన్న మరో పాత్ర (అదా శర్మ చేసిన పాత్ర)కు తీసుకుంటారనుకున్నాను. కానీ, పోలీ సాఫీసర్ పాత్ర ఇచ్చి నన్ను కొత్తగా చూపించారు. రియలిస్టిక్ కాన్సెప్ట్‌తో రూపొందించిన చిత్రమిది’’ అని అనసూయ భరద్వాజ చెప్పారు. చిత్ర సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల, కెమేరామ్యాన్ షనిల్ డియో తదితరులు పాల్గొన్నారు. -
ఈ గరం... అందరికీ ప్రియం!
‘‘మదన్ మంచి టేస్ట్‌ఫుల్ డెరైక్టర్. సాయికుమార్ గారు నిర్మాతగానూ, ఆది హీరోగానూ ఈ సినిమాతో బిగ్ కమర్షియల్ సక్సెస్ సాధించాలి’’ అని హీరో గోపీచంద్ ఆకాంక్షించారు. ఆది, అదాశర్మ జంటగా మదన్ దర్శకత్వంలో వసంతా శ్రీనివాస్ సమర్పణలో శ్రీనివాసాయి స్క్రీన్స్ బ్యానర్‌పై పి. సురేఖ నిర్మించిన చిత్రం ‘గరం’. అగస్త్య స్వరాలందించిన ఈ సినిమా పాటల సీడీని బుధవారం రాత్రి హైదరాబాద్‌లో గోపీచంద్ ఆవిష్కరించి, హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్‌కు అందించారు. ఈ సందర్భంగా ఆది మాట్లాడుతూ - ‘‘మదన్‌గారు ఈ చిత్రాన్ని చాలా కమర్షియల్‌గా హ్యాండిల్ చేశారు. నరేశ్‌గారి పాత్ర హైలైట్. అగస్త్య ఇచ్చిన ట్యూన్లు, రీరికార్డింగ్ బ్యూటిఫుల్’’ అని చెప్పారు. హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ - ‘‘ఆది డ్యాన్స్‌లు చితగ్గొట్టేశాడు. ఈ సంస్థలో నేను కూడా సినిమా చేయాలనుకుంటున్నా’’ అని తెలిపారు. ఆది లాంటి హార్డ్ వర్కింగ్ హీరోని ఇంతవరకూ చూడలేదని హీరో నిఖిల్ పేర్కొన్నారు. సాయి కుమార్ ఈ సినిమాతో గొప్ప నిర్మాత అవుతారని సీనియర్ నరేశ్ అన్నారు. ఆది రియల్‌గా ఎనర్జిటిక్ హీరో అని ఫైట్ మాస్టర్ థ్రిల్లర్ మంజు చెప్పారు. ‘గరం’ అందరికీ ప్రియం అని సాయికుమార్ నమ్మకం వ్యక్తపరిచారు. ఈ వేడుకలో రానా, అభిరామ్ దగ్గుబాటి, సందీప్ కిషన్, అచ్చిరెడ్డి, రాధామోహన్, కేవీవీ సత్యనారాయణ, సుశాంత్, రఘు కారుమంచి, భాస్కరభట్ల, షకలక శంకర్, సత్యప్రకాశ్, బీఏ రాజు, వీరభద్రమ్, బాబ్జీ, ‘గరం’ టీమ్ నుంచి దర్శకుడు మదన్, కెమేరామన్ సురేందర్‌రెడ్డి, ఇతర సభ్యులు మాట్లాడారు. -
హార్ట్ ఎటాక్ వచ్చినంత పనైంది!
‘‘పల్లవి పాత్రను అందరికీ నచ్చేలా త్రివిక్రమ్ తీస్తారనే నమ్మకంతో ‘సన్నాఫ్ సత్యమూర్తి’ ఒప్పుకున్నాను. నాది నిడివి తక్కువ పాత్ర అయినా మంచి గుర్తింపు వచ్చింది. అల్లు అర్జున్ నటన, డాన్సులతో చాలా ఇన్‌స్పయిర్ అయ్యా. ఈ ఏడాది నేను ఫుల్ బిజీ. ప్రస్తుతం ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ సినిమాలో మంచి పాత్ర చేస్తున్నాను. ఆది సరసన ‘గరమ్’, పీవీపీ సంస్థ నిర్మిస్తున్న ఓ చిత్రం, తమిళంలో ఓ సినిమా, హిందీలో ఒకటి, కన్నడంలో ఒక సినిమా చేస్తున్నా. మా కుటుంబంలో సినీ రంగానికి చెందినవాళ్లెవరూ లేరు. అందరూ ఉన్నత చదువులు చదువుకున్నవాళ్లే. నేను సినిమాల్లోకి వెళతాననగానే వాళ్లకి హార్ట్ ఎటాక్ వచ్చినంత పనైంది. అయినా నన్ను బాగా ప్రోత్సహించారు’’. - అదా శర్మ