బ్లూ వేల్‌ గేమ్‌ నేపథ్యంలో సినిమా, హీరోయిన్‌గా అదా శర్మ | Adah Sharma to play cop in Shreyas Talpade The Game of Girgit | Sakshi
Sakshi News home page

బ్లూ వేల్‌ గేమ్‌ నేపథ్యంలో సినిమా, హీరోయిన్‌గా అదా శర్మ

Published Fri, May 12 2023 3:42 AM | Last Updated on Fri, May 12 2023 8:00 AM

Adah Sharma to play cop in Shreyas Talpade The Game of Girgit - Sakshi

‘ది కేరళ స్టోరీ’ వంటి వివాదాత్మక సినిమా తర్వాత హీరోయిన్‌ అదా శర్మ ఓ పోలీస్‌ పాత్రలో కనిపించనున్నారు. ‘హేట్‌ స్టోరీ 2’ ఫేమ్‌ విశాల్‌ పాండ్య దర్శకత్వంలో శ్రేయాస్‌ తల్పాడే హీరోగా నటిస్తున్న చిత్రం ‘ది గేమ్‌ ఆఫ్‌ గిర్జిట్‌’. ఈ చిత్రంలో అదా శర్మ నటిస్తున్నట్లు చిత్రయూనిట్‌ గురువారం ప్రకటించింది.

ఇటీవల కాలంలో యువతలో బాగా ప్రాచుర్యం పొందిన ‘బ్లూ వేల్‌ గేమ్‌’ (బ్లూ వేల్‌ ఛాలెంజ్‌) నేపథ్యంలో థ్రిల్లర్‌గా ఈ కథ సాగుతుంది. ఇందులో అదా శర్మ పోలీస్‌ పాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ– ‘‘గతంలో ‘కమాండో’ సినిమాలో భావనా రెడ్డి అనే పోలీస్‌ పాత్ర చేశాను. ఆ పాత్ర మంచి ప్రజాదరణ పొందింది. ఇప్పుడు ‘ది గేమ్‌ ఆఫ్‌ గిర్జిట్‌’లో గాయత్రీ భార్గవ్‌ అనే పోలీస్‌ పాత్ర చేస్తున్నాను. నా పాత్ర సరదాగా, విభిన్నంగా ఉంటుంది’’ అన్నారు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement