Shreyas Talpade
-
'పుష్ప'లో అల్లు అర్జున్‌కు డబ్బింగ్ చెప్పిన నటుడికి గుండెజబ్బు
బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పడే (47) అస్వస్థతకు లోనయ్యాడు. గురువారం సాయంత్రం ఆయనకు గుండెలో నొప్పి రావడంతో ముంబైలోని ఓ ఆస్పత్రికి తరలించారు. నటుడిని పరీక్షించిన వైద్యులు ఈరోజు ఉదయం పది గంటల ప్రాంతంలో యాంజియోప్లాస్టీ చేశారు. ఈ శస్త్ర చికిత్స విజయవంతం అయిందని, ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడని వైద్యులు పేర్కొన్నారు. మరో మూడు నాలుగు రోజుల్లో తనను డిశ్చార్జి చేస్తామని తెలిపారు. సీరియల్స్ నుంచి సినిమాకు.. కాగా శ్రేయాస్ తల్పడే గురువారం నాడు 'వెల్కమ్ టు జంగల్' సినిమా షూటింగ్ ముగించుకున్న తర్వాత అలసటకు లోనయ్యాడు. ఇంతలోనే గుండెలో నొప్పి రావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించి సకాలంలో చికిత్స అందించారు. ఇదిలా ఉంటే శ్రేయాస్ తల్పడే మరాఠీ సీరియల్స్‌తో తన కెరీర్ ప్రారంభించాడు. ఆంఖెన్ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు. 2005లో వచ్చిన ఇక్బాల్ సినిమాతో విశేష గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమా విజయం తర్వాత మరిన్ని హిట్ మూవీస్‌లో నటించాడు. పుష్పరాజ్ హిందీ వాయిస్ ఇతడిదే ఓం శాంతి ఓం, గోల్మాల్ రిటర్న్స్, హౌస్‌ఫుల్ 2 తదితర చిత్రాల్లో యాక్ట్ చేశాడు. చివరగా కౌన్ ప్రవీణ్ తాంబే(ప్రవీణ్ తాంబే ఎవరు?) సినిమాలో కనిపించాడు. ప్రస్తుతం అతడు కంగనా రనౌత్ 'ఎమర్జెన్సీ' చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో అతడు మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి పాత్రలో కనిపించనున్నాడు. అలాగే వెల్కమ్ టు ద జంగిల్ సినిమాలోనూ భాగమయ్యాడు. శ్రేయాస్ తల్పడే డబ్బింగ్ ఆర్టిస్ట్‌గానూ సేవలందిస్తున్నాడు. పుష్ప సినిమా హిందీ వర్షన్లో అల్లు అర్జున్ పాత్రకు డబ్బింగ్ చెప్పాడు. పుష్ప 2లోనూ బన్నీకి ఇతడు గొంతు అరువివ్వనున్నాడు. చదవండి: అమర్‌ను మళ్లీ టార్గెట్ చేసిన శివాజీ.. వెధవ.. ఏం రోగమంటూ.. -
బ్లూ వేల్ గేమ్ నేపథ్యంలో సినిమా, హీరోయిన్గా అదా శర్మ
‘ది కేరళ స్టోరీ’ వంటి వివాదాత్మక సినిమా తర్వాత హీరోయిన్ అదా శర్మ ఓ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. ‘హేట్ స్టోరీ 2’ ఫేమ్ విశాల్ పాండ్య దర్శకత్వంలో శ్రేయాస్ తల్పాడే హీరోగా నటిస్తున్న చిత్రం ‘ది గేమ్ ఆఫ్ గిర్జిట్’. ఈ చిత్రంలో అదా శర్మ నటిస్తున్నట్లు చిత్రయూనిట్ గురువారం ప్రకటించింది. ఇటీవల కాలంలో యువతలో బాగా ప్రాచుర్యం పొందిన ‘బ్లూ వేల్ గేమ్’ (బ్లూ వేల్ ఛాలెంజ్) నేపథ్యంలో థ్రిల్లర్‌గా ఈ కథ సాగుతుంది. ఇందులో అదా శర్మ పోలీస్ పాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ– ‘‘గతంలో ‘కమాండో’ సినిమాలో భావనా రెడ్డి అనే పోలీస్ పాత్ర చేశాను. ఆ పాత్ర మంచి ప్రజాదరణ పొందింది. ఇప్పుడు ‘ది గేమ్ ఆఫ్ గిర్జిట్’లో గాయత్రీ భార్గవ్ అనే పోలీస్ పాత్ర చేస్తున్నాను. నా పాత్ర సరదాగా, విభిన్నంగా ఉంటుంది’’ అన్నారు. -
41 ఏళ్లప్పుడు ఐపీఎల్లో ఎంట్రీ.. ఇప్పుడు బయోపిక్‌గా మూవీ
ఈ మధ్య కాలంలో క్రీడాకారుల జీవిత చరిత్ర నేపథ్యంలో వస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద వరుసపెట్టి సందడి చేస్తున్నాయి. ఇదివరకే భాగ్ మిల్కా భాగ్, ఎంఎస్ ధోని, మేరి కోమ్, 86 వంటి చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. ఇండియన్స్‌కు అమితంగా ఇష్టమైన ఆటల్లో క్రికెట్ ఎప్పుడూ ముందుంటుంది. అందుకే దర్శకనిర్మాతలు ఎక్కువగా ఈ క్రికేట్ నేపథ్యమున్న క్రీడకారుల బయోపిక్‌లు తీసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. తాజాగా ఇప్పుడు మరో క్రికెటర్ జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించనున్నారు. ఇండియన్ క్రికెటర్ ప్రవీన్ తాంబే జీవితం ఆధారంగా రూపొందుతున్న మూవీ 'ప్రవీన్ తాంబే ఎవరు?'. 41 ఏళ్ల వయసులో ఐపీఎల్ రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ఆటగాడే ప్రవీన్ తాంబే. ఈ సినిమా టైటిల్ రోల్ శ్రేయాస్ తల్పడే నటిస్తున్నాడు. సుమారు 17 ఏళ్ల తర్వాత ఒక లీడ్ రోల్లో నటించడం తనకు దక్కిన అదృష్టమని శ్రేయాస్ తల్పడే తెలిపాడు. ఇలాంటి అవకాశం జీవితంలో ఒకసారి మాత్రమే వస్తుందన్నాడు. ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాని, నిర్మాతలు, దర్శకుడు జయప్రద్కు కృతజ్ఞతలు తెలిపాడు. ఈ సినిమా గురించి ప్రవీన్ తాంబే 'నా జీవిత కథ ఎందరికో స్ఫూర్తిగా నిలవడం ఆనందంగా ఉంది. కలలను సాకారం చేసేందుకు ప్రతి ఒక్కరూ ఎల్లప్పుడూ ప్రయత్నించాలి. వారి శక్తిని వారు తక్కువగా అంచనా వేసుకోవద్దు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వెనకడుగు వేయొద్దు.' అని పేర్కొన్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా నేరుగా ఓటీటీ వేదికగా విడుదల చేయనున్నారు. ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఏప్రిల్ 1 నుంచి స్ట్రీమింగ్ కానుంది ఈ చిత్రం. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు మేకర్స్. pic.twitter.com/NaDvkIDdTs — Disney+ Hotstar (@DisneyPlusHS) March 7, 2022 -
నమ్మిన స్నేహితులే వెన్నుపోటు పొడిచారు: నటుడు
శ్రేయాస్ తల్పాడే.. 'ఇక్బాల్' సినిమాతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడీ నటుడు. మూగ క్రికెటర్‌గా అతడి పర్ఫామెన్స్‌కుగానూ జాతీయ అవార్డు సైతం వచ్చింది. నగేశ్ కుకునూర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా వచ్చి 16 ఏళ్లు దాటిపోయింది. కానీ శ్రేయాస్‌కు మళ్లీ అలాంటి స్ట్రాంగ్ పాత్రలో నటించే ఛాన్స్ ఇంతవరకు రానేలేదు. ఈ క్రమంలో ఆయన తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను పంచుకున్నాడు. చాలాసార్లు స్నేహితులు కూడా తనను పక్కన పెట్టేసేవారని, ఆ సమయంలో ఎంతో కుమిలిపోయేవాడినని బాధపడ్డాడు. కానీ ఆ వెంటనే ఇక్బాల్ సినిమాలో చేసిన పాత్రను గుర్తు చేసుకుని తనను తాను ఓదార్చుకునేవాడినని చెప్పాడు. అమితాబ్ బచ్చన్‌లాంటి వారు కూడా ఇలాంటి కష్టాల కడలిని దాటినవారేనని, అలాంటివారితో పోలిస్తే తానెంత అని చెప్తున్నాడు. ఒత్తిడికి లోనైన ప్రతిసారి ఇక్బాల్ సినిమాను గుర్తుకు చేసుకునేవాడినన్నాడు. ప్రస్తుతం తనకు లభించిన స్థానానికి సంతోషంగానే ఉన్నానని, కానీ ఇప్పటికీ మంచి పాత్రల కోసం ఎదురు చూస్తున్నానని శ్రేయాస్‌పేర్కొన్నాడు. ఇండస్ట్రీలో ఎవరూ నిజమైన స్నేహితులు కారని, ఎప్పటికప్పుడు అక్కడ సమీకరణాలు మారిపోతుంటాయని తెలిపాడు. ఏదో మాట వరసకు ఫ్రెండ్ అంటారే తప్ప, సినిమా తీసే సమయానికి మాత్రం మనల్ని దూరంగా ఉంచాలని చూస్తారని బాధపడ్డాడు. కొందరు నటులకైతే ఈగో ఓ రేంజ్లో ఉంటుందన్నాడు. వాళ్లకు తనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం అస్సలు ఇష్టముండదని తెలిపాడు. తన స్నేహితుల కోరిక మేరకు పనిగట్టుకుని కొన్ని సినిమాలు చేశానని, కానీ చివరకు వాళ్లు తనను ఒంటరిని చేసి సినిమాలు తీసుకుంటూ వెన్నుపోటు పొడిచారని బాధపడ్డాడు. ఇండస్ట్రీలో 90 శాతం మంది ఇలాంటి వారే ఉంటే, 10 శాతం మాత్రమే మనం ఎదుగుతుంటే సంతోషిస్తారని శ్రేయాస్ చెప్పుకొచ్చాడు. చదవండి: ఆమె చనిపోయింది, నిలువెల్లా వణికిపోతున్నాను: నటుడు -
మరాఠీ సినిమాలే నయం
బాలీవుడ్‌తో పోలిస్తే మరాఠీ సినిమాల్లోనే సరుకు ఎక్కువని నటుడు నటుడు శ్రేయాస్ తల్పాడే పేర్కొన్నాడు. ‘హిందీ సినిమాలు అందులోని స్టార్లపై ఆధారపడి ఉంటాయి. అయితే మరాఠీ సినిమాలు అలా కాదు. వీటిలో కథాబలం ఎక్కువగా ఉంటుంది. కథ నచ్చితే ప్రేక్షకులు ఆ సినిమాకు పట్టం కడతారు. ఇటీవలి కాలంలో మరాఠీ సినిమాలు చూసేవారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. నటన, దర్శకత్వం, నిర్మాణ బాధ్యతలను చేపట్టేందుకు అనేకమంది ముందుకొస్తున్నారు’ అని అన్నాడు. కాగా తల్పాడే నిర్మిస్తున్న ‘పోస్టర్ బోయ్జ్’ సినిమా త్వరలో విడుదల కానుంది. ‘ఇదొక కుటుంబ కథాచిత్రం. వినోదాత్మకంగా ఉంటుంది. వివిధ వయస్సుల్లో ఉన్న ముగ్గురి మధ్యే ఈ సినిమా తిరుగుతుంది. ఆ ముగ్గురి పాత్రలను దిలీప్ ప్రభావల్కర్, హృషికేశ్ జోషి, అనికేత్ విశ్వాస్రావ్లు పోషిస్తున్నారు. విచిత్రమైన పరిస్థితులు వారికి ఎదురవుతాయి. వాటిని వారంతా ఏవిధంగా విజయవంతంగా అధిగమించారనేదే ఈ సినిమా కథ’ అని అన్నాడు. శ్రేయాస్ తల్పాడే నిర్మాణంలో విడుదలైన తొలి మరాఠీ సినిమా ‘సనయ్ చౌగుడే’. ‘ఇక్బాల్’ సినిమా ద్వారా శ్రేయాస్ తొలిసారిగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత మల్టీస్టారర్ హాస్యకథాచిత్రాల వైపు మళ్లాడు. అప్నా సప్నా మనీ మనీ, గోల్మాల్ రిటర్న్స్, హౌస్‌ఫుల్ 2 తదితర సినిమాల్లో నటించిన తల్పాడే ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. తల్పాడే నటించిన ‘దోర్, వెల్కం టు సజ్జన్‌పూర్’ సినిమాలు విమర్శకుల మెప్పు పొందాయి. అయితే అతడు నటించిన ‘జోకర్’, కమాల్ ఢమాల్ మాలామాల్’ సినిమాలు అంతబాగా ఆడలేదు. దీంతో బాలీవుడ్‌కు కొంచెం విరామమివ్వాలని నిర్ణయించుకున్నాడు. -
'షారుక్ టెక్ట్స్ బుక్ లాంటి వాడు'
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ ను అభిమానులే కాదు, సహచర నటీనటులు కూడా అభిమానిస్తారు. షారుక్ ను అభిమానించే జాబితాలో తాజాగ బాలీవుడ్ హీరో శ్రేయాస్ తల్పాడే చేరిపోయాడు. ఓం శాంతి ఓం చిత్ర షూటింగ్ సమయంలో షారుక్ పనితీరు తనకు స్పూర్తిగా నిలిచింది అని తల్పాడే అన్నాడు. భావి తరాల హీరోలకు షారుక్ ఓ టెక్ట్స్ బుక్ లాంటి వాడు అని శ్రేయాస్ ప్రశంసలతో ముంచెత్తాడు. ఓ నటుడిగానే కాకుండా ఓ నిర్మాతగా కూడ తనకు స్పూర్తిగా నిలిచాడు అని అన్నారు. 'ఓం శాంతి ఓం' చిత్రంలో షారుక్ స్నేహితుడిగా శ్రేయాస్ తల్పాడే నటించారు. 'ఇక్బాల్', 'వెల్ కమ్ టూ సజ్జన్ పూర్', 'గోల్ మాల్ 3', 'హౌజ్ ఫుల్ 2' చిత్రాల్లో శ్రేయాస్ తన నటనతో ఆకట్టుకున్నారు. మరాఠి చిత్ర సీమంలో ఇటీవల సనాయ్ చాఘదే, బాజీ చిత్రాల్ని నిర్మించారు. బాజీ చిత్రంలో శ్రేయాస్ సూపర్ హీరోగా కనిపించనున్నారు.