బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పడే (47) అస్వస్థతకు లోనయ్యాడు. గురువారం సాయంత్రం ఆయనకు గుండెలో నొప్పి రావడంతో ముంబైలోని ఓ ఆస్పత్రికి తరలించారు. నటుడిని పరీక్షించిన వైద్యులు ఈరోజు ఉదయం పది గంటల ప్రాంతంలో యాంజియోప్లాస్టీ చేశారు. ఈ శస్త్ర చికిత్స విజయవంతం అయిందని, ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడని వైద్యులు పేర్కొన్నారు. మరో మూడు నాలుగు రోజుల్లో తనను డిశ్చార్జి చేస్తామని తెలిపారు.
సీరియల్స్ నుంచి సినిమాకు..
కాగా శ్రేయాస్ తల్పడే గురువారం నాడు 'వెల్‌కమ్ టు జంగల్' సినిమా షూటింగ్ ముగించుకున్న తర్వాత అలసటకు లోనయ్యాడు. ఇంతలోనే గుండెలో నొప్పి రావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించి సకాలంలో చికిత్స అందించారు. ఇదిలా ఉంటే శ్రేయాస్ తల్పడే మరాఠీ సీరియల్స్‌తో తన కెరీర్ ప్రారంభించాడు. ఆంఖెన్ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు. 2005లో వచ్చిన ఇక్బాల్ సినిమాతో విశేష గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమా విజయం తర్వాత మరిన్ని హిట్ మూవీస్‌లో నటించాడు.
పుష్పరాజ్ హిందీ వాయిస్ ఇతడిదే
ఓం శాంతి ఓం, గోల్‌మాల్ రిటర్న్స్, హౌస్‌ఫుల్ 2 తదితర చిత్రాల్లో యాక్ట్ చేశాడు. చివరగా కౌన్ ప్రవీణ్ తాంబే(ప్రవీణ్ తాంబే ఎవరు?) సినిమాలో కనిపించాడు. ప్రస్తుతం అతడు కంగనా రనౌత్ 'ఎమర్జెన్సీ' చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో అతడు మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి పాత్రలో కనిపించనున్నాడు. అలాగే వెల్‌కమ్ టు ద జంగిల్ సినిమాలోనూ భాగమయ్యాడు. శ్రేయాస్ తల్పడే డబ్బింగ్ ఆర్టిస్ట్‌గానూ సేవలందిస్తున్నాడు. పుష్ప సినిమా హిందీ వర్షన్‌లో అల్లు అర్జున్ పాత్రకు డబ్బింగ్ చెప్పాడు. పుష్ప 2లోనూ బన్నీకి ఇతడు గొంతు అరువివ్వనున్నాడు.
చదవండి: అమర్‌ను మళ్లీ టార్గెట్ చేసిన శివాజీ.. వెధవ.. ఏం రోగమంటూ..
Comments
Please login to add a commentAdd a comment