angioplasty
-
ఆస్పత్రిలో చేరిన మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే
ముంబై : గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సోమవారం రిలయన్స్ ఆసుపత్రిలో చేరారు. గతంలో ఉద్ధవ్ ఠాక్రే యాంజియోప్లాస్టీ ద్వారా రక్తనాళాల్లో బ్లాకుల్ని తొలగించుకున్నారు. తాజాగా, మరోసారి సమస్య ఉత్పన్నం కావడంతో అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరారని , డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఉద్ధవ్ ఠాక్రే మే 2016లో లీలావతి హాస్పిటల్లో యాంజియోగ్రఫీ ప్రక్రియ చేయించుకున్నారు. అంతకుముందు జూలై 20, 2012న గుండె ఎనిమిది స్టెంట్లను అమర్చారు. కాగా, శనివారం ముంబైలోని శివాజీ పార్క్‌లో దసరా ర్యాలీలో ఉద్ధవ్ ఠాక్రే బీజేపీపై నిప్పులు చెరిగారు. నేటి ‘హైబ్రిడ్ బీజేపీ’ అంశంపై ఆర్ఎస్ఎస్ ఆలోచించాలని అన్నారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేపట్టిన వెంటనే రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఛత్రపతి శివాజీ మహరాజ్ ఆలయాలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. 2019లో బీజేపీ హిందుత్వ సంస్కరణపై నమ్మకం లేనందునే ఆ పార్టీతో విడిపోయానని, అయితే తన తండ్రి బాలాసాహెబ్ ఠాక్రే సిద్ధాంతాన్ని తాను ఎప్పటికీ వదులుకోలేదని థాకరే చెప్పారు. -
సాయాజి షిండే హెల్త్ అప్డేట్ ప్రకటించిన వైద్యులు
ప్రముఖ నటుడు సాయాజి షిండేకు ఏప్రిల్ 12న ఛాతీలో తీవ్రమైన నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. మహారాష్ట్రలోని సతారాలో ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. సాయాజి షిండే కొద్దిరోజుల క్రితమే అస్వస్థతకు లోనయ్యారని డాక్టర్ సోమనాథ్ తెలిపారు. అందువల్ల ప్రస్తుతం ఆయనకు ఆంజియోప్లాస్టీ చేశామని ఆయన పేర్కొన్నారు. సాయాజి షిండే హృదయంలోని కుడివైపు సిరలు పూర్తిగా మూసుకుపోయాయి. దాంతో ఆయనకు వైద్యులు ఆంజియోప్లాస్టీ చేశారు. ఇప్పుడు ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే డిశ్చార్జి చేస్తామని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన పూర్తి ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు పేర్కొన్నారు. ఈ క్రమంలో సాయాజి షిండే కూడా ఇన్‌స్టాలో ఒక పోస్ట్ చేశారు. 'అందరికీ నమస్కారం, నేను చాలా బాగున్నాను. నన్ను ప్రేమించే నా శ్రేయోభిలాషులు చూపిన అభిమానానికి ఫిదా అవుతున్నాను. మీ అందరూ నాతోనే ఉన్నారు. చింతించాల్సిన పని లేదు. త్వరలోనే నేను మీ అందరి ముందుకు వస్తాను.' అని ఆయన అన్నారు. సాయాజి షిండే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, మరాఠీ, భోజ్‌పురి, హిందీ భాషల్లో అనేక సినిమాలు చేశారు. తెలుగులో.. గుడుంబా శంకర్, ఆంధ్రుడు, అతడు, పోకిరి, లక్ష్మి, ఆట, దుబాయ్ శీను, ఆర్య 2, అరుంధతి, మిస్టర్ పర్ఫెక్ట్, దూకుడు, బిజినెస్మెన్.. ఇలా అనేక చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. View this post on Instagram A post shared by Sayaji Shinde (@sayaji_shinde) -
ఆసుపత్రిలో బిగ్ బీ : ఆంజియోప్లాస్టీ అంటే ఏమిటి?
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనను ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేర్చారు కుటుంబ సభ్యులు. అక్కడ బిగ్‌బీకి వైద్యులు యాంజియోప్లాస్టీ చేసినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై మరింత సమాచారం అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. సాధారణ వైద్య పరీక్షల్లో భాగంగానే ఈ ప్రక్రియ జరిగిందని ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని పలు నివేదికలు పేర్కొన్నాయి. దీనికి సంబంధి ఒక కృతజ్ఞతా సందేశాన్ని కూడా బిగ్‌బీ రోజు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతేకాదు క్రికెటర్ గురించి కూడా ఒక ట్వీట్ చేయడం విశేషం. కాగా బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ప్రభాస్, దిశా పటానీ, దీపికా పదుకొణె నటిస్తున్న కల్కి సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ ఈ ఏడాది మే 9న థియేటర్లలోకి రానుంది. ఆంజియో ప్లాస్టీ అంటే ఏమిటి? ఎపుడు చేస్తారు? గుండెలోని క్లాట్స్‌ను తొలగించేందుకు వినియోగించే ఆధునిక టెక్నాలజీ ఆంజియోప్లాస్టీ. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో ఏర్పడిన అడ్డంకులను బెలూన్ డైలేషన్ ద్వారా తొలగించి, అవసరమనుకుంటే తొలగించిన అడ్డంకి స్థానంలో స్టెంట్‌ను అమర్చడాన్ని ఆంజియోప్లాస్టీ అంటారు. తద్వారా భవిష్యత్తులో తిరిగి రక్తనాళాలలో కొవ్వుపేరుకొని అడ్డంకులు ఏర్పడకుండా నివారించవచ్చు. రక్తనాళాల్లో బ్లాకేజీ 70 శాతం కంటే ఎక్కువగా ఉండే వారికి ఇది చేస్తారు. T 4950 - in gratitude ever .. — Amitabh Bachchan (@SrBachchan) March 15, 2024 ఛాతిలో నొప్పి, వ్యాయామం చేస్తున్న సమయంలో ఆయాసం రావడం, అలసిపోయినట్టు అనిపించడం బరువైన పనులు చేస్తున్న సమయంలో ఆయాసంగా ఉండడం లాంటి లక్షణాలు కనిపించినపుడు, హార్ట్ ఎటాక్ వచ్చిన వారికి ఆంజియోగ్రామ్ ద్వారా వ్యాధి నిర్ధారణ చేస్తారు. తరువాత హానికరమైన క్లాట్స్‌ను గురించినట్టయితే ఆంజియో ప్లాస్టీ ద్వారా చికిత్స అందించి భవిష్యత్తులో సమస్యలు రాకుండా నివారించడంతోపాటు, ప్రాణాపాయం నుంచి కాపాడతారు. -
'పుష్ప'లో అల్లు అర్జున్‌కు డబ్బింగ్ చెప్పిన నటుడికి గుండెజబ్బు
బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పడే (47) అస్వస్థతకు లోనయ్యాడు. గురువారం సాయంత్రం ఆయనకు గుండెలో నొప్పి రావడంతో ముంబైలోని ఓ ఆస్పత్రికి తరలించారు. నటుడిని పరీక్షించిన వైద్యులు ఈరోజు ఉదయం పది గంటల ప్రాంతంలో యాంజియోప్లాస్టీ చేశారు. ఈ శస్త్ర చికిత్స విజయవంతం అయిందని, ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడని వైద్యులు పేర్కొన్నారు. మరో మూడు నాలుగు రోజుల్లో తనను డిశ్చార్జి చేస్తామని తెలిపారు. సీరియల్స్ నుంచి సినిమాకు.. కాగా శ్రేయాస్ తల్పడే గురువారం నాడు 'వెల్కమ్ టు జంగల్' సినిమా షూటింగ్ ముగించుకున్న తర్వాత అలసటకు లోనయ్యాడు. ఇంతలోనే గుండెలో నొప్పి రావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించి సకాలంలో చికిత్స అందించారు. ఇదిలా ఉంటే శ్రేయాస్ తల్పడే మరాఠీ సీరియల్స్‌తో తన కెరీర్ ప్రారంభించాడు. ఆంఖెన్ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు. 2005లో వచ్చిన ఇక్బాల్ సినిమాతో విశేష గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమా విజయం తర్వాత మరిన్ని హిట్ మూవీస్‌లో నటించాడు. పుష్పరాజ్ హిందీ వాయిస్ ఇతడిదే ఓం శాంతి ఓం, గోల్మాల్ రిటర్న్స్, హౌస్‌ఫుల్ 2 తదితర చిత్రాల్లో యాక్ట్ చేశాడు. చివరగా కౌన్ ప్రవీణ్ తాంబే(ప్రవీణ్ తాంబే ఎవరు?) సినిమాలో కనిపించాడు. ప్రస్తుతం అతడు కంగనా రనౌత్ 'ఎమర్జెన్సీ' చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో అతడు మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి పాత్రలో కనిపించనున్నాడు. అలాగే వెల్కమ్ టు ద జంగిల్ సినిమాలోనూ భాగమయ్యాడు. శ్రేయాస్ తల్పడే డబ్బింగ్ ఆర్టిస్ట్‌గానూ సేవలందిస్తున్నాడు. పుష్ప సినిమా హిందీ వర్షన్లో అల్లు అర్జున్ పాత్రకు డబ్బింగ్ చెప్పాడు. పుష్ప 2లోనూ బన్నీకి ఇతడు గొంతు అరువివ్వనున్నాడు. చదవండి: అమర్‌ను మళ్లీ టార్గెట్ చేసిన శివాజీ.. వెధవ.. ఏం రోగమంటూ.. -
ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన పాకిస్తాన్ మాజీ కెప్టెన్..
Inzamam-ul-Haq discharged from hospital: గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్-ఉల్-హక్ మంగళవారం డిశ్చార్జ్ అయ్యారు. దీంతో అతడి అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా ప్రముఖ భారతీయ వ్యాఖ్యాత హర్షా భోగ్లే కూడా ఇంజమామ్-ఉల్-హక్ వేగంగా కోలుకోవాలని ట్వీట్ చేశారు. అయితే గత కొద్ది రోజులుగా ఛాతీ నొప్పితో భాద పడుతున్న అతడిని సోమవారం ఉదయం లాహోర్‌లోని ఆస్పత్రిలో చేర్పించారు. దీంతో అతడికి వైద్యులు ఆంజియోప్లాస్టి శస్రచికిత్స నిర్వహించారు. అనంతరం ఇంజమామ్ ఆరోగ్యం మెరుగు పడడంతో వైద్యులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఇక 1992 ప్రపంచకప్‌ను పాకిస్తాన్ గెలవడంలో ఇంజమామ్ కీలక పాత్ర పోషించాడు. అతడు 2007 లో అంతర్జాతీయ క్రికెట్‌కి వీడ్కోలు పలికాడు. గతంలో పాక్ జట్టు సారథ్య బాధ్యతలు నిర్వహించిన 51 ఏళ్ల ఇంజీ.. ప్రస్తుతం తన యూట్యూబ్ చానెల్ వేదికగా క్రికెట్‌కు సంబంధించిన విశ్లేషణలతో అభిమానులకు టచ్‌లో ఉంటున్నాడు. 1991లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఇంజమామ్ ఉల్ హక్.. తన కెరీర్లో 120 టెస్టులు... 378 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 8830 పరుగులు(25 సెంచరీలు).. వన్డేల్లో 11739(10 సెంచరీలు) రన్స్ చేశాడు. ఇక పాకిస్తాన్ ఆటగాళ్లలో వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఇంజీ గుర్తింపు పొందాడు. చదవండి: T20 World Cup: టీమిండియాలోకి శ్రేయస్..? ఆ నలుగురిపై వేటు పడనుందా..? -
Inzamam ul Haq: పాకిస్తాన్ మాజీ కెప్టెన్‌కు గుండెపోటు..
Inzamam-ul-Haq undergoes angioplasty: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఇంజమామ్-ఉల్-హక్కు గుండెపోటు వచ్చింది. వెంటనే అతడిని లాహోర్‌లోని ఆస్పత్రికి తరలించి ఆంజియోప్లాస్టి నిర్వహించారు. ప్రస్తుతం ఇంజమామ్ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని, అతడు కోలుకుంటున్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు జియో న్యూస్ జర్నలిస్టు ఆర్ఫా ఫిరోజ్ జేక్ ట్విటర్ వేదికగా తెలిపారు. కాగా ఇంజీకి గుండెపోటు వచ్చిందన్న వార్తల నేపథ్యంలో అతడి అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ‘‘నువ్వు త్వరగా కోలుకోవాలి. సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలి’’ అని సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షించారు. ఇక 1992 వరల్డ్‌కప్ గెలిచిన పాకిస్తాన్ జట్టులో సభ్యుడైన ఇంజమామ్... దేశంలోని అత్యుత్తమ బ్యాటర్స్‌లో ఒకడిగా గుర్తింపు పొందాడు. గతంలో పాక్ జట్టు సారథ్య బాధ్యతలు నిర్వహించిన 51 ఏళ్ల ఇంజీ.. ప్రస్తుతం తన యూట్యూబ్ చానెల్ వేదికగా క్రికెట్‌కు సంబంధించిన విశ్లేషణలతో అభిమానులకు టచ్‌లో ఉంటున్నాడు. అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా.. 1991లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఇంజమామ్ ఉల్ హక్.. తన కెరీర్లో 120 టెస్టులు... 378 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 8830 పరుగులు(25 సెంచరీలు).. వన్డేల్లో 11739(10 సెంచరీలు) రన్స్ చేశాడు. ఇక పాకిస్తాన్ ఆటగాళ్లలో వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఇంజీ గుర్తింపు పొందాడు. చదవండి: T20 World Cup 2021: సూర్య, ఇషాన్‌లు ఫామ్‌లో లేరు.. ఆ స్థానాల్లో వీరే కరెక్ట్ Really saddened to hear about Inzamam Ul Haq's heart attack. One of Pakistan's greatest ever batters and a bona-fide legend of the game...keeping him in my thoughts and praying for a speedy recovery. — Aatif Nawaz (@AatifNawaz) September 27, 2021 Former Pakistan captain Inzamam-ul-Haq suffered a heart attack and had to undergo angioplasty. He is said to be recovering in hospital. Our prayers for a complete and swift recovery for the legend. #InzamamUlHaq | #CricketTwitter pic.twitter.com/GMUwrjlcOd — Grassroots Cricket (@grassrootscric) September 27, 2021 -
ఛాతీ నొప్పితో ఆస్పత్రిలో చేరిన రాజస్థాన్ సీఎం
Ashok Gehlot Hospitalized: రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ ఛాతీ నొప్పితో ఆస్పత్రిలో చేరారు. శుక్రవారం ఉదయం ఆయన్ని జైపూర్ సవాయి మాన్సింగ్ ఆస్పత్రిలో చేర్పించారు. డెబ్భై ఏళ్ల వయసున్న గెహ్లోట్.. కరోనా సోకి తగ్గాక రకరకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.ఈ మేరకు గురువారం ఆయన ఛాతీ నొప్పికి గురికాగా.. ఈ ఉదయం ఆస్పత్రిలో చేర్పించారు . పోస్ట్ కొవిడ్ సమస్యలున్న ఆయనకు వైద్యులు యాంజియోప్లాస్టీ నిర్వహించనున్నట్లు సమాచారం. Post Covid I was having health issues & Since yesterday I was having severe pain in my chest. Just got my CT NGO done in SMS hospital.Angioplasty will be done.I am happy that I'm getting it done at SMS Hospital.I am fine & will be back soon.Your blessings & well wishes r with me. — Ashok Gehlot (@ashokgehlot51) August 27, 2021 తన ఆరోగ్య స్థితిగతులపై స్వయంగా అశోక్ గెహ్లోట్ శుక్రవారం ఉదయం ట్వీట్ చేయడం విశేషం. ప్రస్తుతం తనకు బాగానే ఉందని, త్వరగా కోలుకుని ప్రజల ముందుకు వస్తానని ఆయన ట్వీట్లో పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే అనారోగ్య పరిస్థితుల నేపథ్యంలో గెహ్లోట్ ఢిల్లీ పర్యటన రద్దైంది. ప్రస్తుతం ఆయన పరిస్థితి బాగానే ఉందని డాక్టర్లు చెప్తున్నారు. చదవండి: కేజ్రీవాల్‌ను కలిసిన సోనూసూద్ -
గంగూలీకి సర్జరీ.. అదనంగా రెండు స్టెంట్లు
కోల్‌కతా: టీమిండియా మాజీ ఆటగాడు, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి నిర్వహించిన యాంజియోప్లాస్టీ విజయవంతమైనట్లు గురువారం అపోలో ఆసుపత్రి యాజమాన్యం నిర్థారించింది. యాంజియోప్లాస్టీ ద్వారా రక్తానాళాల్లో పూడికలు తొలగించేందుకు అదనంగా మరో రెండు స్టెంట్లు వేసినట్లు వైద్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం దాదా ఆరోగ్యం నిలకడగా ఉందని.. రేపు డిశ్చార్జి అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అయితే జనవరి మొదటివారంలో గంగూలీ గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. ఆసుపత్రిలో చేరిన గంగూలీ గుండె రక్తనాళాల్లో మూడు చోట్ల పూడికలు ఉన్నట్లు అప్పట్లో వైద్యులు గుర్తించారు. యాంజియోప్లాస్టీ ద్వారా సమస్య అధికంగా ఉన్నచోట స్టంట్ అమర్చారు. దీంతో గంగూలీ ఆరోగ్యం కుదుటపడడంతో మిగతాచోట్ల స్టంట్ వేయడాన్ని వాయిదా వేశారు. కాగా బుధవారం(జనవరి 27న) కాస్త అసౌకర్యంగా కనిపించిన గంగూలీ సాధారణ చెకప్ పేరిట ఆసుపత్రికి రావడంతో మరోసారి ఆందోళన నెలకొంది. దీంతో గంగూలీని పరీక్షించిన వైద్యులు గురువారం మరోమారు యాంజియోప్లాస్టీ నిర్వహించి మిగతా రెండు స్టెంట్స్ వేశారు. చదవండి: నిలకడగా గంగూలీ ఆరోగ్యం కాగా గురువారం బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సౌరవ్ గంగూలీని పరామర్శించారు. సౌరవ్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని.. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. గంగూలీకి నిర్వహించిన ఆపరేషన్ విజయవంతం అయిందని.. అతని భార్య డోనా గంగూలీతో ఈ విషయం మాట్లాడినట్లు మమతా మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా గంగూలీకి నిర్వహించిన ఆపరేషన్ విజయవంతం కావడం పట్ల ఆమె వైద్యులను అభినందించారు. దాదా తన 16 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో 113 టెస్టుల్లో, 311 వన్డేల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. గంగూలీ కెప్టెన్సీలో భారత్ 49 టెస్టులు ఆడి 21 విజయాలు సాధించింది. 13 టెస్టుల్లో ఓడి, 15 మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకుంది. వన్డేల్లో గంగూలీ నాయకత్వంలో టీమిండియా 146 మ్యాచ్‌లు ఆడింది. 76 మ్యాచ్‌ల్లో గెలిచి, 65 మ్యాచ్‌ల్లో ఓడింది. మరో ఐదు మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. 2015 నుంచి 2019 వరకు బెంగాల్ క్రికెట్ సంఘం (సీఏబీ) అధ్యక్షుడిగా వ్యవహరించిన గంగూలీ 2019 అక్టోబర్‌లో బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. చదవండి: మళ్లీ ఆసుపత్రిలో చేరిన గంగూలీ -
ఆస్పత్రి నుంచి సౌరవ్ గంగూలీ డిశ్చార్జ్
న్యూఢిల్లీ: బీసీసీఐ అధ్యక్షడు, భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఆసుపత్రి వర్గాలు ఓ ప్రకటన విడుదల చేశాయి. గత శనివారం ఛాతి నొప్పితో కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్స్ ఆస్పత్రిలో చేరిన ఆయన యాంజియోప్లాస్ట్ చేయించుకున్న ఆరు రోజుల తర్వాత గురువారం డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా 'తనకు వైద్యం అందించిన వుడ్‌ల్యాండ్ ఆస్పత్రి వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంతో ఉన్నాను. ఆస్పత్రిలో వైద్యులు జాగ్రత్తగా చూసుకున్నారు. నా జీవితం తిరిగి పొందడానికి వారు సాయపడ్డారు. త్వరలోనే జీవితాన్ని యధాప్రకారంగా కొనసాగించేందుకు మానసికంగా సిద్ధంగా ఉంటానని ఆశిస్తున్నాను' అంటూ ఆయన పేర్కొన్నారు. -
గంగూలీకి మరో రెండు బ్లాక్స్.. 24 గంటలు అబ్జర్వేషన్లోనే
సాక్షి, కోల్‌కతా: బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. ఛాతీ నొప్పితో బాధపడుతూ కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్స్ ఆసుపత్రిలో చేరిన గంగూలీకి వైద్యులు శనివారం యాంజియోప్లాస్టీ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య స్థితి నిలకడగానే ఉందని, పూర్తిగా స్పృహలో ఉన్నారని డాక్టర్ అఫ్తాబ్ విలేకరులకు తెలిపారు. అయితే ఆయన మరో 24 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలన్నారు. గంగూలీ, తన కూతురు సనాతోనూ మాట్లాడారని, చికిత్స కొనసాగుతుందనీ వుడ్‌ల్యాండ్స్ ఆసుపత్రి సీఈవో డాక్టర్ రూపాలి బసు వెల్లడించారు. గంగూలీకి యాంజియోప్లాస్టీ నిర్వహించి ఒక స్టెంట్ వేశామని అఫ్తాబ్ తెలిపారు. ఇంకా ఆయన గుండెలో మరో రెండు బ్లాక్స్ ఉన్నాయని, వీటికి చికిత్స అందించనున్నామన్నారు. ఆది, సోమవారాల్లో మరో రెండు స్టంట్లు వేయనున్నామని చెప్పారు. ఈ నేపథ్యంలో మరో 48 గంటల పాటు దాదా హాస్పిటల్లోనే ఉంటారని ఆసుపత్రి యాజమాన్యం వెల్లడించింది. అలాగే గంగూలీకి చికిత్స నిమిత్తం ముగ్గురు డాక్టర్లతో ఒక టీమ్‌ను ఏర్పాటు చేసినట్లు కూడా తెలిపింది. కాగా గంగూలీకి ఆస్పత్రిలో చేరారన్న వార్తతో భారత క్రికెటర్లు, మాజీ క్రికెటర్లతో పాటు అభిమానుల్లో ఆందోళనలో మునిగిపోయారు. ముఖ్యంగా గంగూలీ నువ్వు త్వరగా కోలుకోవాలి అంటూ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ భావోద్వేగ ట్వీట్ చేశారు. అటు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా దాదా కోలుకోవాలంటూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. Sourav Ganguly has undergone angioplasty. He is stable now. He will be monitored for 24 hours. He is completely conscious. There are two blockages in his heart for which he will be treated: Dr Aftab Khan, Woodlands Hospital, Kolkata. pic.twitter.com/ackcaGwJKu — ANI (@ANI) January 2, 2021 Just got to know about your ailment Sourav. Hope each passing day brings you closer to a full and speedy recovery! Get well soon. pic.twitter.com/NIC6pFRRdv — Sachin Tendulkar (@sachin_rt) January 2, 2021 -
ఆస్పత్రిలో టాప్ డైరెక్టర్
ముంబై: ప్రముఖ సినీ దర్శకుడు, నిర్మాత, రచయిత రాజ్‌కుమార్ సంతోషి ఆస్పత్రిలో చేశారు. గుండె సంబంధింత సమస్యలతో నానావతి ఆస్పత్రిలో చేరిన ఆయనకు వైద్యులు యాంజియోప్లాస్టి చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. బాలీవుడ్లో రాజ్‌కుమార్ సంతోషి తెరకెక్కించిన సినిమాలు విశేష ప్రేక్షకాదరణ పొందాయి. ఘాయల్(1990), అందాజ్ అప్నా అప్నా(1993), ఘాతక్(1996), పుకార్ (2000), ద లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్ (2002), ఫటా పోస్టర్ నిక్లా హీరో(2013) సినిమాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. పుకార్, ద లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్ సినిమాలకు జాతీయ అవార్డులు దక్కాయి. -
స్టెంట్ల ధరల్లో మార్పులు
న్యూఢిల్లీ: దాదాపు ఏడాది అనంతరం గుండె శస్త్రచికిత్సల్లో(యాంజియోప్లాస్టీ) వాడే కరోనరీ స్టెంట్ల గరిష్ట ధరల్లో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది. సవరించిన ధరల మేరకు బేర్ మెటల్ స్టెంట్ల(బీఎంఎస్) ధర రూ. 7,400 నుంచి రూ. 7,660కి పెరగగా, డ్రగ్‌తో కూడిన స్టెంట్ల(డీఈఎస్)ధర రూ. 30,180 నుంచి రూ. 27,890కి తగ్గింది. ఈ ధరలు నేటి నుంచి అమల్లోకి వస్తాయని, 2019 మార్చి 31 వరకూ అమల్లో ఉంటాయని జాతీయ ఫార్మాస్యూటికల్ ధరల నియంత్రణ విభాగం (ఎన్పీపీఏ) తెలిపింది. ఇప్పటికే స్టోర్లలో అమ్మకానికి సిద్ధంగా ఉన్న స్టెంట్లకు కూడా తాజా ధరలే వర్తిస్తాయంది. డీపీసీఓ(డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్) 2013, షెడ్యూల్ 1 ప్రకారం కరోనరీ స్టెంట్లు ముఖ్యమైన డ్రగ్స్ కేటగిరీలోకి వస్తాయని, విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా వాటి ధరల నియంత్రణ కొనసాగాల్సిన అవసరముందని పేర్కొం ది. స్టెంట్లపై తయారీదారులు జీఎస్టీ విధించవచ్చని, అయితే ఎమ్మార్పీ ధరకు అదనంగా ఏ ఇతర చార్జీలు ఉండవంది. -
97 ఏళ్ల వృద్ధురాలికి యాంజియోప్లాస్టీ
కోయంబత్తూరు: ఇక్కడి ఓ ఆసుపత్రి వైద్యులు యాంజియోప్లాస్టీ చికిత్స ద్వారా 97 ఏళ్ల వృద్ధురాలికి ప్రాణం పోశారు. తొమ్మిది పదులు దాటిన ఆ మహిళకు సోమవారం సాయంత్రం తీవ్రమైన ఛాతీనొప్పి వచ్చింది. పొరుగునున్న వారు గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి వైద్యుల బృందం తగిన వైద్యమందించి ఆమె ప్రాణాలను కాపాడింది. ఇంత ముదిమి వయస్సున్న మహిళకు యాంజియోప్లాస్టీ చికిత్స చేయడం ఇదే ప్రథమమని ఆసుపత్రి చైర్మన్ జి.భక్తవత్సలం తెలిపారు.