
న్యూఢిల్లీ: బీసీసీఐ అధ్యక్షడు, భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఆసుపత్రి వర్గాలు ఓ ప్రకటన విడుదల చేశాయి. గత శనివారం ఛాతి నొప్పితో కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్స్ ఆస్పత్రిలో చేరిన ఆయన యాంజియోప్లాస్ట్ చేయించుకున్న ఆరు రోజుల తర్వాత గురువారం డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా 'తనకు వైద్యం అందించిన వుడ్‌ల్యాండ్ ఆస్పత్రి వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంతో ఉన్నాను. ఆస్పత్రిలో వైద్యులు జాగ్రత్తగా చూసుకున్నారు. నా జీవితం తిరిగి పొందడానికి వారు సాయపడ్డారు. త్వరలోనే జీవితాన్ని యధాప్రకారంగా కొనసాగించేందుకు మానసికంగా సిద్ధంగా ఉంటానని ఆశిస్తున్నాను' అంటూ ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment