Discharged From Hospital
-
అందరికీ ధన్యవాదాలు
సూపర్ స్టార్ రజనీకాంత్ అస్వస్థత కారణంగా గత సోమవారం రాత్రి చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆయన గుండెలోని రక్తనాళానికి వాపు రావడంతో వైద్యులు శస్త్ర చికిత్స లేకుండా స్టెంట్ అమర్చారు. శుక్రవారం ఉదయం డిశ్చార్జ్ అయ్యారు రజనీ. వైద్యులు ఆయనకు 15 రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. కాగా రజనీ అనారోగ్యానికి గురైన విషయం తెలిసి ప్రధాని నరేంద్ర మోదీ, తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్‌తో సహా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇక అభిమానులైతే గుళ్లు, గోపురాలు, చర్చిలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన రజనీకాంత్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో ‘‘నేను ఆస్పత్రిలో ఉన్నప్పుడు త్వరగా కోలుకోవాలని శుభాకాంక్షలు తెలిపిన రాజకీయ నాయక మిత్రులకు, సినీ రంగానికి చెందిన స్నేహితులకు, నా క్షేమం కోరిన మీడియా మిత్రులకు, నన్ను బతికిస్తున్న ఫ్యాన్స్‌కి హృదయపూర్వక ధన్యవాదాలు’’ అని రజనీకాంత్ పేర్కొన్నారు. – సాక్షి ప్రతినిధి, చెన్నైఆస్పత్రి నుంచి గోవిందా డిశ్చార్జ్బాలీవుడ్ నటుడు గోవిందా ఈ నెల 1న తన వ్యక్తిగత తుపాకీ పొరపాటున పేలడంతో కాలికి గాయాలై ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. శుక్రవారం వైద్యులు ఆయన్ను డిశ్చార్జ్ చేసి, కొన్ని రోజులపాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని సూచించారు. వీల్‌ఛైర్‌లో ఆస్పత్రి నుంచి బయటకు వచ్చిన గోవిందాను పలువురు అభిమానులు పరామర్శించారు. ‘‘ప్రస్తుతం క్షేమంగా ఉన్నాను. నేను త్వరగా కోలుకోవాలనిప్రార్థించినవారికి కృతజ్ఞతలు’’ అని గోవిందా తెలిపారు. -
ఈ రోజే ఉపాసన డిశ్చార్జ్.. అందరికీ ఉన్న ఆ సందేహం రివీల్ చేస్తారా?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్- ఉపాసన కొణిదెల దంపతులు తల్లిదండ్రులు కావడంతో మెగా కుటుంబంతో పాటు ఫ్యాన్స్ కూడా సంబరాలు చేసుకున్నారు. జూన్ 20వ తేదీ, మంగళవారం పండంటి ఆడబిడ్డకు ఉపాసన జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఆరోజు నుంచి అపోలో ఆస్పత్రి వైద్యుల పర్యవేక్షణలో ఆమె ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం మెగా ప్రిన్సెస్‌తో ఆమె ఈరోజు జూన్ 23న డిశ్చార్జ్ అవుతారని తెలుస్తోంది. (ఇదీ చదవండి: కోలీవుడ్ సూపర్‌స్టార్ ఎవరు?) ఉపాసనతో పాటు బేబీ కూడా ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలపడంతో ఈ రోజు మధ్యాహ్నం డిశ్చార్జ్ కానున్నారు. ఇప్పటికే అందుకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. మెగా అభిమానులతో పాటు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కొందరికి ఓ సందేహం ఉంది. ఉపాసనకు నార్మల్ డెలివరీనా..? సిజేరియన్ చేశారా? అని! దీంతో నేడు ఈ దంపతులిద్దరూ సమాధానం చెప్పే అవకాశం ఉంది! ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లే ముందు రామ్ చరణ్- ఉపాసన దంపతులు అపోలో ఆస్పత్రి వదద మీడియాతో మాట్లాడనున్నారు. మెగా ప్రిన్సెస్ రాకతో శుభాకాంక్షలు చెప్పిన వారందరికీ థాంక్స్ తెలపనున్నారు. ఇదే సమయంలో బేబీకి చెందిన కొన్ని ఫోటోలు వైరల్ అయ్యాయి. దీంతో రియాక్ట్ అయిన మెగా ఫ్యామిలీ అవన్నీ ఫేక్ అని తెలిపింది. మరీ ఈరోజు బేబీ ఫోటో రివీల్ చేస్తారేమోనని మెగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. (ఇదీ చదవండి: పిల్లలు ఎందుకు కలగలేదో ఓపెన్‌గానే చెప్పేసిన నటి) -
యశోద ఆస్పత్రి నుంచి సీఎం కేసీఆర్ డిశ్చార్జ్
-
హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన రజనీకాంత్
Superstar Rajinikanth Discharged From Hospital: ప్రముఖ నటుడు రజనీకాంత్ ఆదివారం రాత్రి కావేరి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అక్టోబరు 28(గురువారం) సాయంత్రం చెన్నైలోని కావేరి హాస్పిటల్లో ఆయన చేరారు. సాధారణ వైద్య పరీక్షల కోసమేనని ఆయన కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. అయితే రజనీకాంత్ మెదడులోని రక్తనాళాల్లో కొన్ని బ్లాక్స్ గుర్తించి చికిత్స చేసినట్లు చెన్నైలోని కావేరి ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోమని రజనీకి వైద్యులు సూచించారు. ఆదివారం రాత్రి రజనీకాంత్ ఇంటికి చేరుకోవడంతో ఆయన ఫ్యాన్స్ సంతోష పడుతున్నారు. -
నటుడు దిలీప్ కుమార్ ఆరోగ్యంపై అప్డేట్ ఇదే..
శ్వాస సంబంధిత సమస్యలతో బాలీవుడ్ ప్రముఖ నటులు దిలీప్‌కుమార్ ఇటీవల ముంబైలోని ఓ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దిలీప్‌కుమార్ ఆరోగ్యం నిలకడగానే ఉంది. బుధవారం ఆయనకు ‘ప్లూరల్ యాస్పిరేషన్’ (ఊపిరితిత్తుల్లో చేరిన నీటిని తొలగించడం) ప్రొసిజర్ జరిగింది. దిలీప్ కుమార్ బాగున్నారని ఆయన ఫ్యామిలీ ఫ్రెండ్ ఫైజల్ ఫరూకి తెలిపారు. ‘‘వైద్యులు నితిన్ గోఖలే, జలీల్ పార్కర్‌తో నేను మాట్లాడాను. దిలీప్‌గారి ఆరోగ్యం నిలకడగా ఉందని వారు పేర్కొన్నారు. దిలీప్ని ఇవాళ (గురువారం) డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది’’ అని ఫైజల్ పేర్కొన్నారు. ఆయన చెప్పిన ఈ విషయం దిలీప్ కుమార్ అధికారిక ట్విటర్ ఖాతాలో కూడా పోస్ట్ అయ్యింది. -
మళ్లీ జైలుకు: కరోనాతో కోలుకున్న గ్యాంగ్‌స్టర్ చోటా రాజన్
ఢిల్లీ: కరోనా బారిన పడిన గ్యాంగ్‌స్టర్ చోటా రాజన్ కోలుకున్నాడు. అతడు కరోనా నుంచి కోలుకున్నట్లు అధికారులు బుధవారం వెల్లడించారు. అతడి ఆరోగ్యం మెరుగవడంతో అధికారులు ఢిల్లీ ఎయిమ్స్ నుంచి తిహార్ జైలుకు తరలించారు. ఏప్రిల్ 22వ తేదీన చోట రాజన్ కరోనా వైరస్ బారినపడ్డాడు. తీవ్ర అస్వస్థతకు గురవడంతో వెంటనే ఆ నెల 24వ తేదీన ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. అయితే చికిత్స పొందుతున్న సమయంలో ఒక్కసారిగా చోట రాజన్ మృతి చెందాడనే వార్తలు గుప్పుమన్నాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చోటా రాజన్ మృతి చెందారనే వార్త వైరల్‌గా మారింది. ఈ పుకార్లపై పోలీస్, ఆస్పత్రి అధికారులు స్పందించి ‘లేదు.. లేదు. చోట రాజన్ చనిపోలేదు. చికిత్స పొందుతున్నాడు’ అన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. చివరకు ఆయన కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యంతో తిహార్ జైలుకు తిరిగి వెళ్లాడు. చదవండి: మృత్యుఘోష: బాంబుల మోతతో దద్దరిల్లిన గాజా చదవండి: దారుణం.. వేశ్యను వాడుకుని డ్రైనేజీలో పారవేత -
కోలుకున్న క్రికెట్ దేవుడు: ఆస్పత్రి నుంచి ఇంటికి
ముంబై: కరోనా వైరస్ బారిన పడిన క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకున్నాడు. ఆరు రోజుల అనంతరం ఆస్పత్రి నుంచి నివాసానికి సచిన్ వచ్చాడు. మార్చి 27వ తేదీన కరోనా వైరస్ బారినపడగా ఆరు రోజుల అనంతరం సచిన్‌కు ఏప్రిల్ 2వ తేదీన కొన్ని లక్షణాలు కనిపించాయి. దీంతో వెంటనే ఆరోజే ఆస్పత్రిలో చేరాడు. 6 రోజులపాటు ఆస్పత్రిలో చికిత్స పొందారు. అనంతరం గురువారం ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జయ్యి నివాసానికి చేరుకున్నాడు. ఈ సందర్భంగా ఓ ట్వీట్ చేశాడు. ‘ఇప్పుడే ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చా. నేను స్వీయ నిర్బంధంలోనే కొన్నాళ్లు విశ్రాంతి తీసుకుంటా. నా కోసం ప్రార్థించిన వారు, ఆ నా ఆరోగ్యంపై శ్రద్ధ చూపెట్టిన వారందరికీ కృతజ్ఞతలు. వైద్యుల సేవలను మరోసారి గుర్తుచేస్తున్నా. ఏడాది నుంచి వైద్యులు, సిబ్బంది అలుపెరగకుండా మనకోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. వాళ్లు ఎంతో గొప్పవారు’ అని ట్వీట్ చేశారు. చదవండి: నిన్న ఎన్నికలు.. నేడు సీఎంకు కరోనా చదవండి: మంత్రి ప్రకటన: 13వ తేదీనే ఉగాది pic.twitter.com/h3gLviUblI — Sachin Tendulkar (@sachin_rt) April 8, 2021 -
వరవరరావు విడుదల
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ కవి వరవరరావుకు స్వేచ్ఛ లభించింది. శనివారం రాత్రి 11.45 గంటలకు ముంబైలోని నానావతి ఆస్పత్రి నుంచి వరవరరావు బయటికి వచ్చారని ఆయన న్యాయవాది ఇందిరా జైసింగ్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. భీమా కోరేగాం కేసులో ముంబైలోని తలోజా జైల్లో రెండున్నరేళ్లుగా ఆయన విచారణ ఖైదీగా ఉన్నారు. కొద్దినెలల కింద ఆయన తీవ్ర అనారోగ్యం బారినపడటంతో బాంబే హైకోర్టు ఆదేశాల మేరకు నానావతి ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇటీవల హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దానికి సంబంధించిన ప్రక్రియ పూర్తవడంతో శనివారం వరవరరావును విడుదల చేశారు. అయితే బెయిల్ ఇచ్చేటప్పుడు బాంబే హైకోర్టు పెట్టిన షరతుల మేరకు ఆయన ముంబై పరిధిలోనే ఉండాలి. దీంతో ఆయన హైదరాబాద్‌కు వచ్చే అవకాశం లేదు. -
శశికళ వాహనంపై అన్నాడీఎంకే జెండా..
సాక్షి, బెంగుళూరు: అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ బెంగళూరు విక్టోరియా ఆస్పత్రి నుంచి ఆదివారం డిశ్చార్జ్ అయ్యారు. ఆసుపత్రి వద్ద అనుచరులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఇదిలా ఉండగా, శశికళ వాహనంపై అన్నాడీఎంకే పార్టీ జెండా ఉండటం హాట్ టాపిక్‌గా మారింది. ఆమెను ఇప్పటికే పార్టీ నుంచి బహిష్కరించిన సంగతి విధితమే. 2017లో అక్రమాస్తుల కేసులో అరెస్టయిన శశికళ.. బెంగుళూరు పరప్పన అగ్రహారం జైలుకెళ్లారు. కొన్ని రోజుల క్రితం అనారోగ్యానికి గురవడంతో బెంగుళూరులోని ఆసుపత్రికి తరలించారు. (చదవండి: ఏఐఏడీఎంకేతో పొత్తు కొనసాగుతుంది) కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షించగా, పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. దాంతో విక్టోరియా ఆసుపత్రిలో చికిత్స అందించారు. మళ్లీ కరోనా పరీక్ష నిర్వహించగా నెగిటివ్ రావడంతో ఆసుపత్రి నుంచి ఆదివారం డిశ్చార్జ్ చేశారు. అక్రమాస్తుల కేసులో ఈ నెల 27తో నాలుగేళ్ల శిక్షాకాలాన్ని ఆమె పూర్తి చేసుకున్నారు. 2016 వరకు అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీగా పనిచేసిన శశికళను అప్పటి పరిణామాలతో పదవి నుంచి తొలగించడంతో పాటు, పార్టీ నుంచి బహిష్కరించారు.(చదవండి: మోదీ మన్ కీ బాత్: ఆ ఘటన బాధాకరం) -
ఆస్పత్రి నుంచి సౌరవ్ గంగూలీ డిశ్చార్జ్
న్యూఢిల్లీ: బీసీసీఐ అధ్యక్షడు, భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఆసుపత్రి వర్గాలు ఓ ప్రకటన విడుదల చేశాయి. గత శనివారం ఛాతి నొప్పితో కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్స్ ఆస్పత్రిలో చేరిన ఆయన యాంజియోప్లాస్ట్ చేయించుకున్న ఆరు రోజుల తర్వాత గురువారం డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా 'తనకు వైద్యం అందించిన వుడ్‌ల్యాండ్ ఆస్పత్రి వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంతో ఉన్నాను. ఆస్పత్రిలో వైద్యులు జాగ్రత్తగా చూసుకున్నారు. నా జీవితం తిరిగి పొందడానికి వారు సాయపడ్డారు. త్వరలోనే జీవితాన్ని యధాప్రకారంగా కొనసాగించేందుకు మానసికంగా సిద్ధంగా ఉంటానని ఆశిస్తున్నాను' అంటూ ఆయన పేర్కొన్నారు. -
ఆసుపత్రి నుంచి మంత్రి వెల్లంపల్లి డిశ్చార్జ్
సాక్షి, విజయవాడ : మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇటీవలె అనారోగ్యం కారణంగా మెరుగైన చికిత్స నిమిత్తం మంత్రి హైదరాబాద్ అపొలో హాస్పటట్‌లో చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పూర్తిగా కోలుకున్న ఆయన డిశ్చార్జ్ అయ్యారు. విజయవాడ దుర్గమ్మ ఆశీస్తులతో ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని చెప్పారు. ఈ సందర్భంగా తనకు అండగా నిలిచిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు, అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. (రేపు ఇంద్రకీలాద్రికి సీఎం జగన్) -
ఆస్పత్రి నుంచి సోనియా గాంధీ డిశ్చార్జ్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదివారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆరోగ్య పరీక్షల నిమిత్తం జూలై 30 గురువారం రోజున న్యూఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు ఆస్పత్రి చైర్మన్ డీఎస్ రాణా తెలిపారు. దేశంలో రాజకీయ పరిస్థితులు, కరోనా మహమ్మారి ప్రభావం గురించి చర్చించడానికి సోనియా గాంధీ గురువారం తన పార్టీ రాజ్యసభ సభ్యులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సహా కాంగ్రెస్ అగ్ర నాయకులు పాల్గొన్నారు. కాగా.. గత ఫిబ్రవరి నెలలో కడుపు నొప్పి కారణంగా ఇదే ఆస్పత్రిలో చికిత్స పొందిన సంగతి తెలిసిందే. (ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ) -
ఆస్పత్రి నుంచి అచ్చెన్నాయుడు డిశ్చార్జ్
సాక్షి, గుంటూరు: ఈఎస్ఐ కుంభకోణం కేసుల అరెస్ట్ అయిన మాజీ మంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడు బుధవారం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఏసీబీ అధికారులు ఆయనను విజయవాడ సబ్ జైలుకు తరలించారు. కాగా, ఈఎస్ఐ స్కామ్ కేసులో ఏ-2గా ఉన్న అచ్చెన్నాయుడుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితులు దృష్ట్యా గుంటూరు జీజీహెచ్‌కు తరలించాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు జీజీహెచ్‌లోనే మూడు రోజుల పాటు అచ్చెన్నాయుడును విచారించారు. తాజాగా ఆయన ఆరోగ్యం మెరుగుపడటంతో వైద్యులు డిశ్చార్జ్ చేశారు.(చదవండి : ఈఎస్ఐ స్కామ్‌లో ఆచితూచి అడుగులు) -
మూడు రెక్కల దేవత
దేవతలకు రెండు రెక్కలు ఉంటాయి. మణిపూర్‌లోని లైబి ఓయినమ్‌కు మూడు రెక్కలు ఉన్నాయి. వాటిని మూడు చక్రాలుగా మార్చి ఆటో నడుపుతుంటుంది. కష్టంలో సాయం చేస్తే మనిషి అనొచ్చు. దైన్యావస్థలో ఆదుకుంటే దేవత అనాలి. లైబి ఓయినమ్ను ఇప్పుడు మణిపూర్‌లో దేవత అనే అంటున్నారు. ఆమె ఎటువంటి సహాయం చేసిందో తెలిస్తే మీరూ అంటారు. జూన్ 1, 2020. సాయంత్రం ఆరు గంటలకు. మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లోని తూర్పు ప్రాంతం డ్యూలాలాండ్లో ఒక అంబులెన్స్ ఆగింది. అందులో నుంచి ఒక అమ్మాయిని, ఆమె తండ్రిని దించేసి వెళ్లిపోయింది. ‘మమ్మల్ని ఇంటి దాకా దించుతామన్నారు కదా’ అన్నారు తండ్రీ కూతుళ్లు. ‘ఇక్కడ నుంచి జిల్లా మారిపోతుంది. జిల్లా లోపలి వరకే దించాలి. దాటకూడదని రూలు’ అని వెళ్లిపోయాడు అంబులెన్స్ డ్రైవర్. తండ్రీ కూతుళ్లు నిశ్చేష్టులయ్యారు. ఒకవైపు చూస్తే చీకటి పడుతోంది. అమ్మాయి పేషెంట్. కోవిడ్ బారిన పడి పద్నాలుగు రోజులు ఇంఫాల్‌లోని ప్రసిద్ధ వైద్య సంస్థ జె.ఎన్.ఐ.ఎమ్.ఎస్‌లో చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యింది. తీసుకెళ్లడానికి తండ్రి వచ్చాడు. వాళ్లది ఇంఫాల్ నుంచి 140 కిలోమీటర్ల దూరం ఉన్న కాంజోంగ్ జిల్లాలో స్కిప్ అనే గ్రామం. అక్కడకు వెళ్లాలి. ఎలా? తండ్రి తన కూతురిని రోడ్డు పక్కన నిలబెట్టి టాక్సీల కోసం పరిగెత్తాడు. మొదట అందరూ వస్తామన్నారు. బేరం చేశారు. తీరా తీసుకెళ్లాల్సింది పేషెంట్‌ని అని తెలిశాక వెనక్కు తగ్గారు. ‘మా అమ్మాయికి కరోనా తగ్గిపోయింది. ఇప్పుడు లేదు. భయపడకండి’ అని తండ్రి చెప్పినా ఎవరూ వినలేదు. ‘అమ్మో.. మేము రాలేం’ అని తప్పించుకున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ల బాధ చూసిన ఎవరో లైబి ఓయినమ్‌కు ఫోన్ చేశారు. లైబి ఓయినమ్ ఇంఫాల్‌లో తొలి మహిళా ఆటోడ్రైవర్. అంతకు ముందు ఆమె స్ట్రీట్ వెండర్‌గా అవీ ఇవీ రోడ్డు పక్కన అమ్ముతూ ఉండేది. ఇప్పుడు ఆటో డ్రైవర్ అయ్యింది. ఇద్దరు పిల్లల తల్లి. భర్త ఉన్నా కుటుంబానికి తన సంపాదన ఆధారం. ‘కోవిడ్ పేషెంట్‌ను ఇంటికి తీసుకెళ్లాలి’ అని చెప్పారు వాళ్లు. ‘వారికి అభ్యంతరం లేకపోతే తీసుకెళతాను’ అంది లైబి. కాని ఆమెకు ఉన్నది ఆటో మాత్రమే. వెళ్లాల్సిన దూరం పెద్దది. అంత దూరం ఆటోలో వెళ్లడం సాధ్యమా? పైగా చీకటి పడిపోయింది. తోడు కోవిడ్ నుంచి బయటపడ్డ అమ్మాయి. రకరకాల ఆలోచనలు వచ్చినా లైబి ధైర్యం చేసి భర్తకు ఫోన్ చేసింది. ‘నాతో తోడురా. బేరం వచ్చింది’ అని చెప్పింది. భర్త ఆమెను చేరుకున్నారు. ఇద్దరూ కలిసి ఆ తండ్రీ కూతుళ్ల దగ్గరకు వెళ్లారు. ‘పదండి పోదాం’ అన్నారు. లైబి, ఆమె భర్త ముందు కూర్చుంటే వెనుక బాధితురాలు, ఆమె తండ్రి కూచున్నారు. ప్రయాణం మొదలైంది. గంట కాదు... రెండు గంటలు కాదు... ఎనిమిది గంటల పాటు నిరంతరాయంగా ఆటోను నడిపింది లైబి. రాత్రి రెండున్నర ప్రాంతంలో పేషెంట్‌ను సురక్షితంగా ఇల్లు చేర్చింది. ఆమె చేసిన పనికి ఆ కుటుంబం శతకోటి నమస్కారాలు పెట్టింది. లైబి భర్తతో అప్పటికప్పుడు తిరిగి వచ్చేసింది. కాని ఈ విషయం వెంటనే పత్రికల ద్వారా లోకానికి తెలిసింది. లైబి చేసిన పనిని ఇంఫాల్లోనే కాదు దేశ విదేశాల్లో ఉన్న చాలామంది, ముఖ్యంగా మణిపూర్ వాసులు మెచ్చుకున్నారు. ఆమెకు కానుకగా ఇవ్వడానికి అందరూ డబ్బు పంపారు. అవన్నీ లక్షా పది వేల రూపాయలు అయ్యాయి. వాటిని జూన్ 11న మణిపూర్ సి.ఎం. ఎన్.బిరేన్ సింగ్ ఆమెకు అందజేశాడు. ఆమెకు శాలువా కప్పి సత్కరించాడు. లైబి ఆ పేషెంట్‌ను దింపి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ సూచనల ప్రకారం తన భర్తతో కలిసి క్వారంటైన్లో ఉంటోంది. డిశ్చార్జ్ అయిన కోవిడ్ పేషెంట్‌తో అంత సేపు ఉన్నందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఈ పని చేసింది. మణిపూర్‌లో తొలి మహిళా ఆటో డ్రైవర్ అయిన లైబి మీద రెండేళ్ల క్రితం ‘ఆటో డ్రైవర్’ పేరుతో డాక్యుమెంటరీ తయారైంది. దానికి ఎన్నో ప్రశంసలు వచ్చాయి. ‘స్త్రీలకు స్ఫూర్తి కలిగించే విధంగా ఆమె జీవితం ఉంది’ అని ఆ డాక్యుమెంటరీ చూసినవాళ్లంతా అన్నారు. ఇప్పుడు తన సేవాభావంతో కూడా ఆమె చాలామందికి స్ఫూర్తి కలిగిస్తోంది. దేవతలు తెల్లటి బట్టల్లో ఉండరని, సాదాసీదా ఖాకీ యూనిఫామ్ వేసుకు తిరుగుతుంటారు లైబిని చూస్తే మనకు అర్థమవుతుంది. శాలువాతో సత్కరిస్తున్న సీఎం. ఎన్.బిరేన్ తనను ఇంటికి చేర్చిన లైబీతో ప్రయాణికురాలు -
బాధితులంతా డిశ్చార్జ్
సాక్షి, విశాఖపట్నం: ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో వెలువడిన స్టైరీన్ గ్యాస్ ప్రభావానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులందరూ పూర్తిగా కోలుకున్నారు. బుధ, గురువారాల్లో మొత్తం 300 మందికి రూ.లక్ష చొప్పున చెక్కులు అందించి వైద్యులు డిశ్చార్జ్ చేశారు. ► కేజీహెచ్‌లో చేరిన 321 మందిలో 21 మందికి ఆరోగ్యం నయమవడంతో రెండు రోజుల క్రితమే వైద్యులు ఇంటికి పంపించారు. మిగిలిన 300 మందిలో 287 మందికి బుధవారం రూ.లక్ష చొప్పున పరిహారం చెక్కులను ఇచ్చి డిశ్చార్జ్ చేశారు. ► బాధితులు గ్రామాలకు వెళ్లడానికి భయపడే అవకాశాలు ఉండడంతో అధికారులు గోపాలపట్నంలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. డిశ్చార్జ్ అయిన వారిని ప్రత్యేక బస్సులలో అక్కడికి తరలించడానికి ఏర్పాట్లు చేశారు. ► బుధవారం రాత్రికి 180 మంది ఆ కేంద్రాలకు వెళితే.. మిగిలిన 107 మంది వారి సొంత వాహనాలలో ఇళ్లకు వెళ్లిపోయారు. మిగిలిన 13 మంది కూడా గురువారం రూ.లక్ష చెక్కు తీసుకొని డిశ్చార్జ్ అయ్యారు. అధికారులు వీరిని బస్సులో పునరావాస కేంద్రానికి తరలించారు. ► గ్రామాల్లో ప్రస్తుతం స్టైరీన్ అవశేషాలు పూర్తిగా తొలగిపోవడంతో పునరావాస కేంద్రాల్లో 42 మంది మాత్రమే ఉన్నారు. మిగిలిన వారంతా ఇళ్లకు వెళ్లిపోయారు. ఏ ఆరోగ్య సమస్య వచ్చినా చికిత్స అందిస్తాం ప్రమాదానికి గురైన మొత్తం బాధితులందరూ గురువారం నాటికి డిశ్చార్జ్ అయిపోయారు. ఎవరికైనా ఏ చిన్న పాటి ఆరోగ్య సమస్య వచ్చినా గ్రామాల్లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాల్లో చికిత్స అందిస్తారు. గతంలో డిశ్చార్జ్ అయిన వాళ్లు నేరుగా కేజీహెచ్‌కు వచ్చినా చికిత్స అందిస్తాం. – అర్జున, కేజీహెచ్ సూపరింటెండెంట్ -
కరోనాను జయించి.. మనో ధైర్యం నింపి..
సాక్షి, కర్నూలు: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని కర్నూలు జిల్లాలో మరో 24 మంది జయించారు. శనివారం విశ్వభారతి కోవిడ్ ఆసుపత్రి నుంచి క్షేమంగా డిశ్ఛార్జ్ అయ్యారు. వైద్యుల సాయంతో కరోనాపై పోరు సాగించి..వారు అంతిమంగా విజయం సాధించారు. కర్నూలు జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా కోరల నుండి ఆరోగ్యంగా బయటపడి ఒకే రోజు 24 మంది డిశ్ఛార్జ్ కావడంతో బిగ్ రిలీఫ్ కలిగింది. ఇప్పటివరకు కర్నూలు జిల్లాలో 31 మంది కరోనా బారిపడిన బాధితులు క్షేమంగా కోలుకుని డిశ్ఛార్జ్ అయ్యారు. (కరోనా పరీక్షలు చేయించుకున్న ఎంపీ గోరంట్ల మాధవ్) ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వీరపాండియన్ మీడియాతో మాట్లాడుతూ.. జిల్లా ప్రజలకు,యంత్రాంగానికి కరోనాను జయించవచ్చనే మనో ధైర్యం కలిగిందని తెలిపారు. డిశ్ఛార్జ్ అయిన 24 మందికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు కలెక్టర్ వీరపాండియన్, స్టేట్ కోవిడ్ ప్రత్యేకాధికారి అజయ్ జైన్, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్లు ఒక్కొక్కరికి రూ.2వేల నగదు, పండ్లు, కిట్లను అందించి ప్రత్యేక వాహనాల్లో వారి ఇళ్లకు పంపించారు. (ఆరోగ్య రంగంలో అవి చాలా అవసరం: సీఎం జగన్) ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్‌కకు వెళ్లి కరోనా బారినపడిన బాధితులను ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించింది. వైద్యులు,పారా మెడికల్ సిబ్బంది, జిల్లా యంత్రాంగం కృషితో కరోనాపై విజయం సాధించారు. కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం రెండు సార్లు పరీక్షలు చేసిన అనంతరం నెగిటివ్ ఫలితం రావడంతో వారిని శనివారం సాయంత్రం డిశ్ఛార్జ్ చేశారు. జిల్లాలో శనివారం డిశ్ఛార్జ్ అయిన వారి వివరాలు: కర్నూలు నగరం-7 నంద్యాల-7 పాణ్యం-2 సిరవేళ్ల-2 గడివేముల-1 రుద్రవరం-1 నందికొట్కూరు-2 ఆత్మకూరు-1 డోన్-1 -
కరోనా.. వైఎస్సార్ జిల్లాలో 13 మంది డిశ్చార్జ్
సాక్షి, వైఎస్సార్ : జిల్లాలో 13 మంది కరోనా బాధితులు పూర్తిగా కోలుకున్నారు. పలుమార్లు నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగిటివ్ రిపోర్ట్ రావడంతో వారిని డిశ్చార్జ్ చేయాలని వైద్యులు నిర్ణయించారు. దీంతో 17 రోజులుగా కోవిడ్ ఆస్పత్రిలో చికిత్సపొందిన వీరు గురువారం డిశ్చార్జ్ అయ్యారు. కోవిడ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన 13 మందికి డిప్యూటీ సీఎం అంజాద్ బాషా పౌష్టికాహార సామాగ్రిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అంజాద్ బాషాతోపాటు జిల్లా కలెక్టర్ హరి కిరణ్, ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి, మాజీ మేయర్ సురేష్ బాబు పాల్గొన్నారు. చికిత్స అనంతరం 13 మంది కరోనా బాధితులు కరోనా నెగిటివ్ రిపోర్ట్ రావడంపై అధికార యంత్రాంగం ఆనందం వ్యక్తం చేసింది. ఇప్పటివరకు జిల్లాలో 36 కరోనా కేసులు నమోదుకాగా.. నేడు 13 మంది డిశ్చార్జ్ కావడంతో యాక్టివ్ కేసుల సంఖ్య 23కు తగ్గింది. చదవండి : క్వారంటైన్ నుంచి వెళ్లేటప్పుడు రూ. 2,000 సాయం ఏపీ : రెండో విడత రేషన్ పంపిణీ ప్రారంభం -
కరోనా నుంచి బయటపడ్డ కనికా కపూర్
-
హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్
స్టార్ కపుల్ టామ్ హ్యాంక్స్, రీటా విల్సన్ హాస్పిటల్‌కి టాటా చెప్పి ఇంటికి చేరుకున్నారు. ఓ సినిమా షూటింగ్ కోసం ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు జ్వరం, అలసట అనిపించడంతో పరీక్షలు చేయించుకున్నారు టామ్, రీటా. కరోనా అని నిర్ధారణ కావడంతో ఆస్ట్రేలియాలోనే ఓ హాస్పిటల్లో చేరారు. ఐదు రోజులు చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. వీళ్లు కాలిఫోర్నియాలో ఉంటారు. కానీ ఇప్పుడు ప్రయాణం మంచిది కాదని భావించి, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన అనంతరం ఆస్ట్రేలియాలోనే ఓ ఇల్లు అద్దెకు తీసుకుని, అక్కడ ఉండాలనుకున్నారు. కొన్నాళ్ల పాటు బయటకు రాకుండా ఇంట్లోనే ఉండాలని ఈ దంపతులు నిర్ణయించుకున్నారు. -
యాక్సిడెంట్ తర్వాత తొలి ఫొటో..
ముంబై : అలనాటి బాలీవుడ్ నటి షబానా అజ్మీ జనవరి 18న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి రెండు వారాలపాటు కోకిలాబెన్ ఆస్పత్రిలో చికిత్స పొందిన షబానా శుక్రవారం డిశ్చార్జ్ అయ్యారు. చికిత్స అనంతరం ఇంటికి చేరిన షబానా తన తాజా ఫొటోను ట్విటర్లో పోస్ట్ చేశారు. తాను త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేసిన అభిమానులకు, ప్రతి ఒక్కరికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. అలాగే హాస్పిటల్లో తనకు మెరుగైన వైద్యం అందించడంతోపాటు ఆరోగ్యం గురించి కేర్ తీసుకున్న నీతా అంబానీ, కోకిలాబెన్ అంబానీలతోపాటు వైద్యులకు ఆమె థ్యాంక్స్ చెప్పారు. రాయగఢ్ జిల్లాలో ముంబై–పుణే ఎక్స్‌ప్రెస్ హైవేపై షబానా ప్రయాణిస్తున్న టాటా సఫారీ వాహనం జనవరి 18న ప్రమాదానికి గురైంది. డ్రైవర్ ముందుగా వెళుతున్న ట్రక్కును ఓవర్టేక్ చేసే క్రమంలో దాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే షబానాను నవీ ముంబైలోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కోకిలాబెన్ ఆస్పత్రికి మార్చారు. ఈ విషయం తెలుసుకున్న పలువరు బాలీవుడ్ ప్రముఖలు హాస్పిటల్లో షబానాను పరామర్శించిన సంగతి తెలిసిందే. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ప్రధాని మోదీ కూడా ట్వీట్ చేశారు. Thank you all for your prayers and wishes for my https://t.co/A21IxD7Usd back home now Thank you #Tina Ambani and Kokilaben Ambani hospital for the sterling care provided by the doctors team and the nursing staff. Im indebted and grateful🙏 pic.twitter.com/6a1PWsGKnn — Azmi Shabana (@AzmiShabana) February 1, 2020 -
ఆస్పత్రి నుంచి కమల్ హాసన్ డిశ్చార్జ్
సాక్షి, పెరంబూరు: నటుడు, మక్కళ్‌నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గత నెలలో కమల్ హాసన్ కాలుకు శస్త్ర చికిత్స జరిగిన విషయం తెలిసిందే. అప్పుడు ఆయన కాలులో స్టీల్ప్లేట్ను అమర్చారు. కాగా ఆ తరువాత కమలహాసన్ సినీ, రాజకీయ పనుల్లో బిజీ అవడంతో స్టీల్‌ప్లేట్లను తొలగించడం కుదరలేదు. కాగా ఇటీవల వైద్యుల సలహా మేరకు కమల్ హాసన్ స్థానిక అపోలో ఆస్పత్రిలో చేరారు. శస్త్ర చికిత్స ద్వారా కాలులోని స్టీల్ప్లేట్ను తొలగించారు. శస్త్ర చికిత్స విజయవంతం కావడంతో మూడు రోజులుగా ఆస్పత్రిలోనే ఉన్న కమలహాసన్ బుధవారం సాయంత్రం డిఛార్జ్ అయ్యారు. కాగా మరి కొన్ని రోజులు ఆయన విశ్రాంతి తీసుకోవాల్సిందిగా వైద్యులు సలహా ఇచ్చారు. దీంతో జనవరి వరకూ కమల్‌హాసన్ సినీ, రాజకీయాలకు దూరంగా ఉండనున్నారు. కాగా ఆయన ప్రస్తుతం నటిస్తున్న ఇండియన్ 2 చిత్ర షూటింగ్‌కు కూడా జనవరి నెలలోనే పాల్గొననున్నట్లు తెలిసింది. కాగా వచ్చే నెలలో జరగనున్న పంచాయతీ ఎన్నికలకు సైతం కమల్ దూరంగా ఉండనున్నట్లు సమాచారం. -
హాస్పిటల్ నుంచి యంగ్ హీరో డిశ్చార్జ్
హైదరాబాద్ : షూటింగ్లో గాయపడి ఆస్పత్రిలో చేరిన హీరో శర్వానంద్ డిశ్చార్జ్ అయ్యారు. భుజానికి గాయాలు కావడంతో శస్త్ర చికిత్స నిర్వహించిన వైద్యులు శుక్రవారం అతన్ని ఇంటికి పంపించారు.ఈ సందర్భంగా వైద్యులు అతనికి పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ‘96’ సినిమా చిత్రీకరణ భాగంగా థాయ్‌లాండ్‌లో స్కై డైవింగ్ ప్రాక్టీసు చేస్తున్న సమయంలో శర్వానంద్ గాయపడ్డ సంగతి తెలిసిందే. ఈ ఘటన తరువాత వెంటనే థాయ్‌లాండ్ నుంచి హైదరాబాద్ చేరుకున్న శర్వానంద్ చికిత్స కోసం సన్‌షైన్ హాస్పిటల్లో చేరారు. అక్కడ నలుగురు డాక్టర్లతో కూడిన బృందం 11 గంటలపాటు శ్రమించి శర్వానంద్‌కు శస్త్ర చికిత్సను పూర్తి చేశారు. గాయం పెద్దది కావడంతో అతనికి రెండు నెలల బెడ్ రెస్ట్ అవసరమని వైద్యులు సూచించారు. కాగా, శర్వానంద్‌కు గాయం కారణంగా ‘రణరంగం’, ‘96’ సినిమాల షూటింగ్‌కు అంతరాయం ఏర్పాడింది. -
నిమ్స్ నుంచి డిశ్చార్జ్ అయిన కె లక్ష్మణ్
-
ఎయిమ్స్ నుంచి అమిత్ షా డిశ్చార్జి
-
ఎయిమ్స్ నుంచి అమిత్ షా డిశ్చార్జి
సాక్షి, న్యూఢిల్లీ : స్వైన్‌ఫ్లూతో బాధపడుతూ ఎయిమ్స్‌లో చికిత్స పొందిన బీజేపీ చీఫ్ అమిత్ షా ఆదివారం ఉదయం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఆస్పత్రి నుంచి నేరుగా అమిత్ షా తన నివాసానికి చేరుకున్నారని బీజేపీ నేత అనిల్ బలూనీ వెల్లడించారు. స్వైన్‌ఫ్లూ సోకిన అమిత్ షాకు ఎయిమ్స్ డైరెర్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులెరియా పర్యవేక్షణలో చికిత్స అందించారు. కాగా తాను స్వైన్‌ఫ్లూతో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్నానని, భగవంతుడి దయ, మీ అందరి ఆశీస్సులతో త్వరగా కోలుకుంటానని అమిత్ షా ట్వీట్ చేశారు.