
ఆస్పత్రి నుంచి కమల్ హాసన్ డిశ్చార్జి
చెన్నై: ప్రముఖ నటుడు కమల్ హాసన్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. శుక్రవారం ఉదయం అపోలో ఆస్పత్రి నుంచి ఆయనను డిశ్చార్జి చేశారు. 23 రోజుల పాటు ఆయన ఆస్పత్రిలో ఉన్నారు. గత నెల 14న ఆయనను ఆస్పత్రిలో చేర్చారు. చెన్నైలోని తన ఇంట్లో మెట్లు దిగుతూ జారి పడడంతో కమల్హాసన్ గాయపడ్డారు. ఆయన కుడికాలికి, వెన్నెముకకు దెబ్బతగిలింది. కమల్ కుడి కాలు విరిగినట్లు గుర్తించి వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. ఆయన కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి ఇంటికి పంపించారు.
తాను బాగానే నడవ గలుతున్నానని కమల్ హాసన్ రెండు రోజుల క్రితం ట్వీట్ చేశారు. ఆస్పత్రి గదిలోనే మెల్లగా నడుస్తున్నానని, నొప్పి తగ్గిందని ట్విట్టర్ ద్వారా తెలిపారు. తన గురించి కంగారు పడొద్దని కుమార్తెలు, సోదరీమణులకు అంతకుముందు కమల్ హాసన్ సూచించారు.
Was up on my feet. A small spin around the room. Of course with two to assist on either side like Gandhiji;). Today was less painful.
— Kamal Haasan (@ikamalhaasan) August 2, 2016