![Varavara Rao Discharged From Hospital - Sakshi](/styles/webp/s3/article_images/2021/03/7/vara.jpg.webp?itok=QASs3JGv)
విడుదల అనంతరం వరవరరావు
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ కవి వరవరరావుకు స్వేచ్ఛ లభించింది. శనివారం రాత్రి 11.45 గంటలకు ముంబైలోని నానావతి ఆస్పత్రి నుంచి వరవరరావు బయటికి వచ్చారని ఆయన న్యాయవాది ఇందిరా జైసింగ్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. భీమా కోరేగాం కేసులో ముంబైలోని తలోజా జైల్లో రెండున్నరేళ్లుగా ఆయన విచారణ ఖైదీగా ఉన్నారు.
కొద్దినెలల కింద ఆయన తీవ్ర అనారోగ్యం బారినపడటంతో బాంబే హైకోర్టు ఆదేశాల మేరకు నానావతి ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇటీవల హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దానికి సంబంధించిన ప్రక్రియ పూర్తవడంతో శనివారం వరవరరావును విడుదల చేశారు. అయితే బెయిల్ ఇచ్చేటప్పుడు బాంబే హైకోర్టు పెట్టిన షరతుల మేరకు ఆయన ముంబై పరిధిలోనే ఉండాలి. దీంతో ఆయన హైదరాబాద్‌కు వచ్చే అవకాశం లేదు.
Comments
Please login to add a commentAdd a comment