
సాక్షి, పెరంబూరు: నటుడు, మక్కళ్‌నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గత నెలలో కమల్ హాసన్ కాలుకు శస్త్ర చికిత్స జరిగిన విషయం తెలిసిందే. అప్పుడు ఆయన కాలులో స్టీల్‌ప్లేట్‌ను అమర్చారు. కాగా ఆ తరువాత కమలహాసన్ సినీ, రాజకీయ పనుల్లో బిజీ అవడంతో స్టీల్‌ప్లేట్లను తొలగించడం కుదరలేదు. కాగా ఇటీవల వైద్యుల సలహా మేరకు కమల్ హాసన్ స్థానిక అపోలో ఆస్పత్రిలో చేరారు. శస్త్ర చికిత్స ద్వారా కాలులోని స్టీల్‌ప్లేట్‌ను తొలగించారు. శస్త్ర చికిత్స విజయవంతం కావడంతో మూడు రోజులుగా ఆస్పత్రిలోనే ఉన్న కమలహాసన్ బుధవారం సాయంత్రం డిఛార్జ్ అయ్యారు.
కాగా మరి కొన్ని రోజులు ఆయన విశ్రాంతి తీసుకోవాల్సిందిగా వైద్యులు సలహా ఇచ్చారు. దీంతో జనవరి వరకూ కమల్‌హాసన్ సినీ, రాజకీయాలకు దూరంగా ఉండనున్నారు. కాగా ఆయన ప్రస్తుతం నటిస్తున్న ఇండియన్ 2 చిత్ర షూటింగ్‌కు కూడా జనవరి నెలలోనే పాల్గొననున్నట్లు తెలిసింది. కాగా వచ్చే నెలలో జరగనున్న పంచాయతీ ఎన్నికలకు సైతం కమల్ దూరంగా ఉండనున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment