మళ్లీ జైలుకు: కరోనాతో కోలుకున్న గ్యాంగ్‌స్టర్‌ చోటా రాజన్‌ | Gangster Chhota Rajan Discharge And Back To Tihar Jail | Sakshi
Sakshi News home page

మళ్లీ జైలుకు: కరోనాతో కోలుకున్న గ్యాంగ్‌స్టర్‌ చోటా రాజన్‌

Published Wed, May 12 2021 2:29 PM | Last Updated on Wed, May 12 2021 5:59 PM

Gangster Chhota Rajan Discharge And Back To Tihar Jail - Sakshi

ఢిల్లీ: కరోనా బారిన పడిన గ్యాంగ్‌స్టర్‌ చోటా రాజన్‌ కోలుకున్నాడు. అతడు కరోనా నుంచి కోలుకున్నట్లు అధికారులు బుధవారం వెల్లడించారు. అతడి ఆరోగ్యం మెరుగవడంతో అధికారులు ఢిల్లీ ఎయిమ్స్‌ నుంచి తిహార్‌ జైలుకు తరలించారు. ఏప్రిల్‌ 22వ తేదీన చోట రాజన్‌ కరోనా వైరస్‌ బారినపడ్డాడు. తీవ్ర అస్వస్థతకు గురవడంతో వెంటనే ఆ నెల 24వ తేదీన ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు.

అయితే చికిత్స పొందుతున్న సమయంలో ఒక్కసారిగా చోట రాజన్‌ మృతి చెందాడనే వార్తలు గుప్పుమన్నాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చోటా రాజన్‌ మృతి చెందారనే వార్త వైరల్‌గా మారింది. ఈ పుకార్లపై పోలీస్‌, ఆస్పత్రి అధికారులు స్పందించి ‘లేదు.. లేదు. చోట రాజన్‌ చనిపోలేదు. చికిత్స పొందుతున్నాడు’ అన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. చివరకు ఆయన కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యంతో తిహార్‌ జైలుకు తిరిగి వెళ్లాడు.

చదవండి: మృత్యుఘోష: బాంబుల మోతతో దద్దరిల్లిన గాజా

చదవండి: దారుణం.. వేశ్యను వాడుకుని డ్రైనేజీలో పారవేత

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement