
ఆర్థోపెడిక్ సర్జన్‌తో నందమూరి బాలకృష్ణ
సాక్షి, హైదరాబాద్ : సినీనటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సోమవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయనకు శనివారం కాంటినెంటల్ ఆస్పత్రిలో కుడిభుజానికి శస్త్రచికిత్స జరిగిన విషయం తెలిసిందే. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా షూటింగ్ సమయంలో బాలకృష్ణ కుడిచేతికి గాయమైంది. అప్పటి నుంచి ఆయన ‘రొటేటర్ కఫ్ టియర్స్ ఆఫ్ షోల్డర్ పెయిన్’తో సతమతమవుతున్నారు. అప్పట్లో ఆయన ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. అయితే నొప్పి అధికం కావడంతో సర్జరీ చేయించుకున్నారు. డిశ్చార్జ్ సందర్భంగా బాలయ్య...ఆర్థోపెడిక్ సర్జన్‌తో కలిసి దిగిన ఫోటోను సౌత్ ఇండియన్ మూవీస్ పీఆర్‌వో బీఏ రాజు ట్విటర్‌లో షేర్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment