స్పెషల్‌ సీన్‌తో ‘ఎన్టీఆర్‌’ | Director Teja Special Scene for NTR Biopic | Sakshi
Sakshi News home page

Published Mon, Mar 26 2018 6:45 PM | Last Updated on Sat, Sep 15 2018 4:22 PM

Director Teja Special Scene for NTR Biopic - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నందమూరి అభిమానుల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడనుంది. మార్చి 29వ తేదీన దిగ్గజ నటుడు నందమూరి తారక రామారావు బయోపిక్‌ ‘ఎన్టీఆర్‌’  లాంఛ్‌ కానుంది. ఇక తొలి షాట్‌ను ఆసక్తికరమైన సన్నివేశాలతోనే చిత్రీకరించాలని దర్శకుడు తేజ భావిస్తున్నాడంట. 

‘1940లో ఎన్టీఆర్‌ మద్రాస్‌లో అడుగు పెట్టిన ఘట్టాన్నే ఫస్ట్‌షాట్‌గా తీయబోతున్నాడంట. అక్కడి నుంచే ఆయన వెండితెర నట ప్రస్థానం మొదలైందన్నది తెలిసిందే. అందుకే ఆ సీన్‌ను ప్రత్యేకంగా తెరకెక్కించేందుకు తేజ ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకోసం ఒక రోజు కేటాయించి.. వేసవి తర్వాత సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ను చేయబోతున్నారని తెలుస్తోంది. 

ఇక సినిమా లాంఛ్‌కు ముఖ్య అతిథులుగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతారని.. పలువురు సినీ ప్రముఖులు, నందమూరి కుటుంబ సభ్యులు ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారని సమాచారం. బాలకృష్ణ లీడ్‌ రోల్‌లో కనిపించబోతున్న ఈ చిత్రానికి మ్యూజిక్‌ ఎంఎం కీరవాణి కాగా.. సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి, బాలకృష్ణ లు సంయుక్తంగా ‘ఎన్టీఆర్‌’ను నిర్మించబోతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement