director teja
-
ఇండస్ట్రీలో బ్యాక్‌గ్రౌండ్ లేనివాళ్లకు నేనున్నా
‘‘నేను ఫుట్‌పాత్ నుంచి ఈ స్థాయికి వచ్చాను. ప్రతిభ ఉన్నా ఇండస్ట్రీకి ఎలా రావాలో తెలియనివాళ్లు చాలామంది ఉన్నారు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేని వాళ్లకు నేను బ్రేక్ ఇస్తాను.. నేనున్నంత వరకూ అవకాశాలు ఇస్తాను.. స్టార్ హీరోలతో సినిమా చేసినా అందులో కొత్తవారికి చాన్స్ ఇస్తాను’’ అని డైరెక్టర్ తేజ అన్నారు. అభిరామ్, గీతికా తివారీ జంటగా రూపొందిన చిత్రం ‘అహింస’. పి. కిరణ్ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా తేజ చెప్పిన విశేషాలు. ► అభిరామ్‌ని హీరోగా పరిచయం చేస్తానని రామానాయుడుగారికి మాట ఇచ్చాను.. ఆ మాట కోసమే తనతో ‘అహింస’ చేశాను. సినీ నేపథ్యంలో ఉన్న పెద్ద కుటుంబాల్లోని వ్యక్తులతో చేసినప్పుడు సహజంగానే పోలికలు వస్తాయి. ఇప్పటికే స్టార్స్ అయిన వెంకటేశ్, రానాలతో అభిరామ్‌ని పోల్చకూడదు. ఎక్కువ డబ్బులు, పేరు కోసం పెద్ద స్టార్స్‌తో పని చేయాలి. నేను డబ్బులు, పేరు చూశాను.. నాకు ఇంకేం కావాలి? ► ప్రేక్షకులు చాలా తెలివైనవారు. ట్రైలర్‌ని చూసి సినిమాకి వెళ్లాలా? వద్దా అని నిర్ణయించుకుంటున్నారు. స్టార్ హీరోని బట్టి థియేటర్‌కి వెళతారనుకుంటే.. అప్పుడు పెద్ద స్టార్స్‌కి అపజయాలే రాకూడదు కదా! సినిమాలో ఎమోషన్ ఉంటే ట్రైలర్లో కనిపిస్తుంది. ప్రేక్షకులు ఆ ఎమోషన్‌కి కనెక్ట్ అయితే స్టార్ సినిమానా? కొత్తవారిదా అనే తేడా లేకుండా వచ్చేస్తారు. ► ఒక ఫిలాసఫీని బేస్ చేసి తీసిన చిత్రమిది. అహింసని ఎలా ఫాలో అవ్వాలి? అనే కాన్సెప్ట్‌తో మంచి కమర్షియల్ కథతో ఈ సినిమా చేశాం. ఇందులో దాదాపు 14 యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్నాయి. ఓ నాలుగు ఎపిసోడ్స్‌కి నేనే ఫైట్ మాస్టర్‌గా చేశాను. ► అభిరామ్‌కి సినీ నేపథ్యం ఉంది. తనని పరిచయం చేస్తున్నప్పుడు నాకంటే అభీపైనే ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. సురేశ్‌బాబుగారు ఒకసారి సెట్‌కి వచ్చారు. ‘నాన్నా.. నువ్వుంటే నేను చేయను’ అని అభి అనడంతో మానిటర్ వద్దకెళ్లి కూర్చున్నారాయన. ఇన్ని సినిమాలు చేసిన వెంకటేశ్‌గారు, రానాకి కూడా సురేశ్‌గారు సెట్‌కి వస్తే టెన్షన్ వచ్చేస్తుంది (నవ్వుతూ).. సురేశ్‌గారి దృష్టి వేరుగా ఉంటుంది. కిరణ్‌గారు రాజీ పడకుండా ఈ సినిమా తీశారు. ఈ మూవీకి ఆర్పీ పట్నాయక్ సంగీతం, అనూప్ రూబెన్స్ నేపథ్య సంగీతం ప్లస్ అయ్యాయి. ► ‘అహింస’ విజయం సాధించి డబ్బులు వస్తే ఆ డబ్బుతో మళ్లీ సినిమాలు తీస్తాను. నా చిత్రం మూవీస్ బేనర్లో కొత్త దర్శకులని పరిచయం చేస్తాను. నా తర్వాతి సినిమా ‘రాక్షస రాజు’ని రానాతో చేస్తాను. ఆ తర్వాత మా అబ్బాయిని హీరోగా పరిచయం చేసే సినిమా చేస్తాను. -
రానాతో నెక్ట్స్ మూవీని అనౌన్స్ చేసిన డైరెక్టర్ తేజ
డైరెక్టర్ తేజ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ అహింస. ఈ సినిమాతో దగ్గుబాటి అభిరామ్‌ను హీరోగా పరిచయం చేస్తున్నారు. ఈ మూవీ అనంతరం తన నెక్ట్స్ మూవీ రానాతో చేస్తానని తేజ ప్రకటించారు. అహింస ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడిన ఆయన ఈ మేరకు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 'రానాతో నేను చేయబోయే సినిమా పేరు రాక్షస రాజు. ఈ సినిమాతో 45మంది కొత్త ఆర్టిస్టులను పరిచయం చేయాలని అనుకుంటున్నాను. ఆసక్తి ఉన్న వాళ్లు ఇన్స్టాగ్రామ్ ద్వారా నన్ను సంప్రదించవచ్చు. రామానాయుడు స్వస్థలమైన చీరాల నుంచి కనీసం 10మంది ఆర్టిస్టులు కావాలి. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది' అంటూ తేజ వెల్లడించారు. గతంలో రానా-తేజ కాంబినేషన్లో వచ్చిన నేనే రాజు నేనే మంత్రి మూవీ సూపర్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. దీంతో రాక్షస రాజు మూవీపై మరింత ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో ప్రముఖ మలయాళ హీరో కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం. -
అమ్మా, నాన్న చనిపోతే.. వారే అంతా పంచుకున్నారు: తేజ
దగ్గుబాటి అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం 'అహింస'. ఈ సినిమాలో గీతికా తివారి హీరోయిన్గా నటిస్తోంది. విభిన్న కథనాలతో సినిమాలను తెరకెక్కించే తేజ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా జూన్ 2న విడుదల థియేటర్లలో కానుంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు తేజ. (ఇది చదవండి: ఉదయ్‌కిరణ్ డెత్ మిస్టరీ.. ఏమీ తెలియనట్లు నటిస్తున్నారు: తేజ) తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన బాల్యంలో ఎదురైన ఇబ్బందులను పంచుకున్నారు. తన చిన్నప్పుడు ఫుట్ పాత్ మీద పడుకున్న రోజుల గురించి తెలిపారు. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయానని.. ఆ తర్వాతే ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు చూశానని చెప్పుకొచ్చారు. తేజ మాట్లాడుతూ.. 'మేము చెన్నైలో ఉండేవాళ్లం. నాకు ఒక అక్క, ఒక చెల్లి. నా బాల్యంలో మాకు ఆస్తులు బాగానే ఉండేవి. నాకు ఊహ తెలిసే సరికి అమ్మ చనిపోయారు. ఆ బెంగతో నాన్న కొంతకాలానికే కన్నుమూశారు. ఆ పరిస్థితుల్లో మా భవిష్యత్తు తలకిందులైంది. మా బంధువులే మమ్మల్ని పంచుకున్నారు. అక్క ఒక చోట. నేనూ, చెల్లి మరో చోట ఉండాల్సి వచ్చింది. మమ్మల్ని చూసుకున్నందుకు వాళ్లు కూడా కొన్ని ఆస్తులు తీసుకున్నారు. అంతే కాకుండా ఓరోజు నన్ను ఆరు బయట పడుకోమన్నారు. నేను ఆ రోజు రాత్రే పారిపోయా. ఫుట్‌పాత్‌పై పడుకున్నా. ఈ రోజు నేను ఈ స్థాయికి వచ్చానంటే కేవలం సినిమా వల్లే.' అంటూ తను పడిన బాధలను వివరించారు. (ఇది చదవండి: మీ కోసమే వచ్చా.. సల్లు భాయ్‌కి ప్రపోజ్ చేసిన అమ్మాయి!) మహేశ్ బాబు హీరోగా నటించిన నిజం అనుకున్నంతగా ఆడకపోవడంతో సినిమాపై ఏకాగ్రత కోల్పోయానని అన్నారు. ఆ తర్వాత మా అబ్బాయికి ఆరోగ్యం బాగాలేక పోవడంతో సుమారు నాలుగేళ్లపాటు సినిమాకు దూరంగా ఉన్నానని తెలిపారు. నేనే రాజు నేనే మంత్రి మూవీతో తిరిగి హిట్ అందుకున్నా అని తేజ వెల్లడించారు. -
రానా తమ్ముడు హీరోగా 'అహింస'.. ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్
ప్రముఖ నిర్మాత సురేష్‌బాబు తనయుడు, రానా సోదరుడు అభిరామ్ అహింస చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. తేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రేమకథా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అభిరామ్‌కు జోడీగా గీతికా తివారీ హీరోయిన్గా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేస్తోంది. ఇక ఇప్పటికే రిలీజ్ డేట్ పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం జూన్2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో భారీగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ప్లాన్ చేస్తున్నారు. ఈనెల 27న ఆంధ్రప్రదేశ్ చీరాలలోని ఎన్ఆర్పీఎం హైస్కూల్ గ్రౌండ్లో ఈ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఓ పోస్టర్‌ను వదిలారు. ఇక ఈ ఈవెంట్‌కు పలువురు టాలీవుడ్ పెద్దలు రానున్నట్లు సమాచారం. -
ఉదయ్‌కిరణ్ డెత్ మిస్టరీ.. ఏమీ తెలియనట్లు నటిస్తున్నారు: తేజ
దగ్గుబాటి అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం అహింస. గీతికా తివారి హీరోయిన్. తేజ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా జూన్ 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ కార్యక్రమాలతో బిజీ అయి తేజ వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ క్రమంలో ఎక్కడికి వెళ్లినా అతడికి దివంగత నటుడు ఉదయ్ కిరణ్ గురించే ప్రశ్న ఎదురవుతుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఉదయ్ కిరణ్ పేరు చెప్పగానే పాపం అనేశాడు తేజ. దీంతో ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి హీరో డెత్ మిస్టరీ రివీల్ చేస్తానన్నారు కదా సర్.. అని అడిగాడు. దీనికి తేజ స్పందిస్తూ.. 'చాలామందికి ఉదయ్ కిరణ్ మరణం వెనుక అసలు కారణం తెలుసు. కానీ ఎందుకు నాతోనే దాన్ని చెప్పించాలని చూస్తున్నారు. అందరూ ఏమీ తెలియనట్లు అమాయకంగా మీరే చెప్పండని ఎందుకు నటిస్తున్నారో అర్థం కావట్లేదు' అని బదులిచ్చాడు. తన కుటుంబం గురించి మాట్లాడుతూ.. 'మా అబ్బాయి డైరెక్షన్ కోర్స్ పూర్తి చేశాడు. తనను త్వరలో హీరోగా పరిచయం చేస్తాను. అమ్మాయి తన చదువు పూర్తి చేసుకుని ఇండియాకు తిరిగొచ్చేసింది. ఆమెకు నేను పెళ్లి చేయను. నచ్చినవాడిని చూసుకుని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోమని చెప్పాను. ఆ తర్వాత దగ్గరివాళ్లను పిలిచి భోజనాలు పెడదామన్నాను. ఒకవేళ పెళ్లి తర్వాత నచ్చకపోతే విడాకులిచ్చేయ్.. నా ఇద్దరు పిల్లలకు అదే చెప్తా.. జీవితంలో సంతోషంగా ఉండటం కోసం ఏది చేయాలనిపిస్తే అది చేయండి.. అంతే తప్ప పక్కవాళ్ల కోసం ఆలోచించవద్దని చెప్తాను' అని చెప్పుకొచ్చాడు. చదవండి: చులకన చేసే నోరు ఉంటే చురకలు వేసే నోరు కూడా ఉంటుంది -
నేనే రాజు నేనే మంత్రి కాంబినేషన్ రిపీట్
‘‘నేనే రాజు నేనే మంత్రి’ (2017) చిత్రం తర్వాత హీరో రానా, దర్శకుడు తేజ మరో సినిమా చేయనున్నారు. గోపీనాథ్ ఆచంట నిర్మించనున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో ఓ మలయాళ నటుడు కీలక పాత్ర పోషిస్తారని తెలిసింది. ఈ సంగతి ఇలా ఉంచితే... రానా హీరోగా తేజ దర్శకత్వంలో ‘రాక్షసరాజు రావణాసురుడు’ అనే మూవీ రానున్నట్లుగా గతంలో వార్తలు వచ్చాయి. మరి... ఈ ఇద్దరి కాంబినేషన్లో ప్రకటించిన తాజా చిత్రం ఇదేనా? లేక వేరే సినిమానా? అనే విషయం తెలియాల్సి ఉంది. -
హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న డైరెక్టర్ తేజ కుమారుడు
ప్రేమకథా చిత్రాలు తెరకెక్కించడంతో తనదైన మార్క్ చూపించిన దర్శకుల్లో డైరెక్టర్ తేజ ఒకరు. తెలుగులో జయం, నిజం, ఔనన్నా కాదన్నా, లక్ష్మీ కల్యాణం, నేనే రాజు నేనే మంత్రి వంటి పలు హిట్ చిత్రాలు తెరకెక్కించిన ఆయన రీసెంట్గా అహింస అనే సినిమాను రూపొందించారు. దగ్గుబాటి రానా తమ్ముడు అభిరామ్‌ను ఈ సినిమాతో హీరోగా పరిచయం చేస్తున్నారు. గతంలోనూ అనేకమంది నటీనటులను డైరెక్టర్ తేజ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన తేజ తన కొడుకు ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మా అబ్బాయిని హీరోగా పరిచయం చేయాలనుకుంటున్నా. తనకు ఇంట్రెస్ట్ ఉండటంతో విదేశాల్లో అందుకు సంబంధించిన కోర్సులు చేసి వచ్చాడు. చూడటానికి హ్యాండ్సమ్గానే ఉంటాడు. కానీ హీరోగా చేయడానికి అదొక్కటే సరిపోదు కదా.. ఇక మా అబ్బాయిని నేను డైరెక్ట్ చేయాలా లేక ఇంకెవరికైనా అప్పగించాలా అన్నది చూడాల్సి ఉంది అంటూ తేజ పేర్కొన్నారు. -
నాకు జరిగిన అవమానాలను గుర్తు పెట్టుకుంటా: డైరెక్టర్ తేజ
హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు తెరకెక్కించే డైరెక్టర్లలో తేజ ఒకరు. కొత్త నటీనటులతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంటారు. ‘సీత’ తర్వాత ఆయన దర్శకత్వం వహించిన సినిమా అహింస. చిత్రం సినిమాతో జర్నీ ప్రారంభించిన ఆయన.. ప్రస్తుతం అభిరామ్ దగ్గుబాటి హీరోగా తెరకెక్కించిన ప్రేమకథా చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన తన కెరీర్లో ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. (ఇది చదవండి: ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు దూరంగా జూ.ఎన్టీఆర్!) తెలుగులో జయం, నిజం, ఔనన్నా కాదన్నా, లక్ష్మీ కల్యాణం, నేనే రాజు నేనే మంత్రి లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఎలాంటి హంగులకు పోకుండా కంటెంట్‌కు అనుగుణంగా చిత్రాలను తెరకెక్కిస్తే తప్పకుండా అది ప్రేక్షకులకు రీచ్ అయ్యే అవకాశం ఉందని అన్నారు. తప్పుల నుంచే తాను ఎన్నో విషయాలను నేర్చుకున్నానని.. వాటిని ఎప్పటికీ మర్చిపోనని తేజ అన్నారు. డైరెక్టర్ తేజ మాట్లాడుతూ.. 'నేను నా ఇంటి సైట్‌ను బ్యాంక్‌లో పెట్టా. మధ్యలో నాలుగేళ్లు సినిమాలు చేయలేదు. బ్యాంక్ వాళ్లు వచ్చి ఈ ఆస్తి జప్తులో ఉందని గేటుకు రాశారు. ఆ తర్వాత అప్పు కట్టేశా. కానీ జీవితంలో మళ్లీ లోన్ తీసుకోకూడదని గుర్తు పెట్టుకోవడం కోసం వాళ్లు రాసిన నోటీసు తొలగించకుండా అలాగే ఉంచా. కానీ నా జీవితంలో చేసిన తప్పులు, అవమానాలను గుర్తు పెట్టుకుంటా. మళ్లీ వాటిని చేయకూడదని నిర్ణయించుకుంటా. నేను చేసిన సినిమాలు ఫెయిల్ అయ్యాయి. సినిమా తీసినప్పుడే హిట్టా, ఫ్లాపా అనేది ముందే తెలుస్తుంది. అందుకే నేను ఏ సినిమాపై ఎలాంటి ఆశలు పెట్టుకోను. సినిమా విషయంలో బడ్జెట్ ఉందని ఎలా పడితే అలా చేయకూడదు. కథకు తగిన బడ్జెట్లోనే తీయాలి. అంతే కానీ ఉంది కదా అని కథను మించి బడ్జెట్ ఖర్చు పెడితే అంతే ' అని అన్నారు. (ఇది చదవండి: లక్షన్నరలో హీరోయిన్ వివాహం.. పెళ్లి చీర రూ.3 వేలు మాత్రమేనట!) -
రానా తమ్ముడు హీరోగా 'అహింస'.. రిలీజ్ డేట్ ఫిక్స్
నిర్మాత సురేష్ బాబు తనయుడు, హీరో రానా సోదరుడు అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం అహింస. తేజ దర్శకత్వంలో పి. కిరణ్ నిర్మించిన ఈ సినిమా జూన్2న రిలీజ్ కానుంది. లవ్, యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం అహింస. చదవండి: ‘తొలిప్రేమ’ తర్వాత అవకాశాలు వచ్చినా కాదనుకున్నాను: వాసుకి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై క్యూరియాసిటీని పెంచింది. సినిమా కూడా అందర్నీ అలరించేలా ఉంటుంది అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం ఆర్పీ పట్నాయక్, కెమెరా సమీర్ రెడ్డి -
గోపీచంద్ తో ఇప్పటివరకు ఎవరూ ఇలా మాట్లాడి ఉండరు..!!
-
మీ నాన్న గొప్పోడు, కానీ నువ్వేం చేశావ్? గోపీచంద్‌ను కడిగిపారేసిన తేజ
మ్యాచో స్టార్ గోపీచంద్ నటిస్తున్న తాజా చిత్రం రామబాణం. శ్రీవాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో డింపుల్ హయాతి కథానాయికగా నటిస్తోంది. గోపీచంద్ కెరీర్లో 30వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మే 5న రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజైన పాటలు, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరికొద్ది రోజుల్లో సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ల స్పీడు పెంచింది చిత్రయూనిట్. తాజాగా రామబాణం హీరో గోపీచంద్‌ను ఇంటర్వ్యూ చేశాడు డైరెక్టర్ తేజ. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే అతడు పలు విషయాల్లో హీరోను కడిగిపారేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాలయ్యతో ప్రకటించిన మూవీ నీ దగ్గరకు ఎలా వచ్చింది? డైరెక్టర్ శ్రీవాస్‌తో గొడవలయ్యాయట.. నిజమేనా? అని అడగ్గా.. సినిమాలో లెన్త్లు ఎక్కువైపోతున్నాయి. గతంలో ఇలా జరిగిన సినిమాల ఫలితం ఎలా ఉందో చూశాను. అందుకే ఈ విషయంలో డైరెక్టర్‌కు, నాకు చిన్న గొడవలయ్యాయి అని ఒప్పుకున్నాడు గోపీచంద్. బాగా నచ్చిన సినిమా ఏదన్న ప్రశ్నకు జయం అని బదులిచ్చాడు. నీకు ఒక కథ చెప్పాను, ఓకే అన్నావు. హీరోయిన్ దొరకలేదు.. మంచి హీరోయిన్ను వెతికేలోపు ఇంకో సినిమా మొదలుపెట్టేశావు. మళ్లీ నేను ఫోన్ చేస్తే కాల్ కూడా లిఫ్ట్ చేయలేదు అని తేజ అనగా తాను చేసింది ముమ్మాటికీ తప్పేనని అంగీకరించాడు హీరో. అంటే నీ దృష్టిలో తేజ కంటే మరొక డైరెక్టర్ బెటర్ అని నన్ను పక్కన పడేశావ్ కదా, అందుకే ఫోన్ ఎత్తలేదు అని విమర్శలు గుప్పించాడు. మీ నాన్నగారు చేసిన మంచిపని వల్ల నీకు జయంలో ఛాన్స్ వచ్చింది. మీ నాన్న గొప్పోడు. మరి నువ్వేం పీకావ్? అంటూ గోపీచంద్‌ను సూటిగా ప్రశ్నించాడు తేజ. మొత్తానికి ఇంటర్వ్యూలో తన ప్రశ్నలతో గోపీచంద్‌ను ఎన్కౌంటర్ చేశాడు తేజ. Macho Starr @YoursGopichand in an interview with Favourite Director @tejagaru FULL INTERVIEW TOMORROW 💥#RamaBanam #RamabanamOnMay5 🏹 @peoplemediafcy pic.twitter.com/R1cbizia3n — Vamsi Kaka (@vamsikaka) April 25, 2023 -
ఉదయ్ కిరణ్ చావుకు కారణం తెలుసు: తేజ సంచలన వ్యాఖ్యలు
ఏ విషయాన్నైనా మనసులో దాచుకోకుండా కుండ బద్దలు కొట్టినట్లు చెప్తాడు దర్శకుడు తేజ. తనను తెలియని విషయాల జోలికి వెళ్లడు కానీ.. తెలిసిని విషయాన్ని నిర్మోహమాటంగా చెప్తేస్తాడు. ఇతరుల విషయంలోనే కాదు.. తనకు సంబంధించిన విషయాలో కూడా చాలా ఓపెన్‌గా ఉంటాడు. తాజాగా ఈ క్రియేటివ్ దర్శకుడు ఉదయ్ కిరణ్ ఆత్మహత్య సంఘటనపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఉదయ్ కిరణ్ చావుకు కారణాలేంటో తనకు తెలుసని అన్నాడు. తేజ దర్శకత్వం వహించిన ‘చిత్రం’ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు ఉదయ్‌కిరణ్. ఆ సినిమా భారీ విజయం అందుకోవడంతో ఉదయ్‌కి అవకాశాలు వరుసకట్టాయి. తదుపరి ‘నువ్వు నేను’ అంతకుమించి హిట్ అయింది. ఆ తర్వాత వచ్చిన 'మనసంతా నువ్వే' కూడా భారీ విజయం సాధించడంతో స్టార్ హీరోగా మారిపోయాడు. కానీ ఆ స్టార్డమ్ ఎక్కువ రోజులు ఉండలేదు. వరుస సినిమాలు ఫ్లాప్ కావడంతో ఉదయ్ కిరణ్‌కు అవకాశాలు సన్నగిల్లాయి. దీంతో డిప్రెషన్లోకి వెళ్లి.. 2014 జనవరి లో ఉదయ్ కిరణ్ తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అప్పటి నుంచి ఉదయ్ కిరణ్ ఆత్మహత్య పై మీడియాలో రకరకాలుగా కథనాలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు తేజ ఉదయ్ కిరణ్ ఆత్మహత్య పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు కారణం తనుకు తెలుసని, చనిపోయేలోపు ఆ విషయాలు చెబుతానన్నారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ఉదయ్ కిరణ్ చాలా సున్నితమైన మనస్తత్వం కలవాడు. వరుసగా మూడు హిట్ లు వచ్చేటప్పటికి బ్యాలెన్స్ కోల్పోయాడు. స్టార్డమ్ వచ్చినప్పుడు బ్యాలెన్స్ మిస్ కావడం కామన్. నేను దాన్ని తల పొగరు అనుకోలేదు. అమాయకత్వం అనుకున్నా. తను ప్లాప్‌లతో సతమతమవుతున్న సమయంలో పిలిచి ‘ఔనన్నా కాదన్నా’ లో అవకాశం ఇచ్చా. ఆ సినిమా షూటింగ్ సమయంలో విచారం వ్యక్తం చేశాడు. ‘మీ విషయంలో నేను కాస్త పొగరుగా వ్యవహరించినా... గుర్తుపెట్టుకొని మరీ సినిమా అవకాశం ఇచ్చారు. మీ పాదాలు తాకుతా.. క్షమించానని ఒక్కసారి చెప్పండి చాలు’ అన్నారు. నేను అవేవి వద్దని చెప్పా. అతని జీవితంలో ఏం జరిగిందో అంతా నాకు తెలుసు. నాకు అన్ని విషయాలు చెప్పాడు. ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు కారణాలు సమయం వచ్చినప్పుడు బయటపెడతా. నేను చనిపోయేలోపు ఈ విషయాలను వెల్లడిస్తా. ఇప్పుడు చెప్పడం సరైన పద్దతి కాదు’అని తేజ చెప్పుకొచ్చాడు. తేజ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
'అహింస' నుంచి మరో లిరికల్ సాంగ్ రిలీజ్
దగ్గుబాటి అభిరామ్‌ను హీరోగా పరిచయం చేస్తున్నారు డైరెక్టర్ తేజ. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్లో అహింస అనే చిత్రం తెరకెక్కతుతున్న సంగతి తెలిసిందే. ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో గీతికా హీరోయిన్గా నటిస్తోంది. ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్‌పై పీ కిరణ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే టీజర్‌ను విడుదల చేసిన మేకర్స్.. తాజాగా ఈ చిత్రం నుంచి కమ్మగుంటదే పిల్లా అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. చంద్ర బోస్ సాహిత్యం అందించిన ఈ పాటని కాలభైరవ – కీర్తన శ్రీనివాస ఆలపించారు. గ్రామీణ ప్రాంత నేపథ్యంలోని లొకేషన్స్ లో చిత్రీకరించిన ఈ పాట ఆకట్టుకుంటుంది. సదా, సముద్రఖని ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. -
దగ్గుబాటి అభిరామ్ 'అహింస' టీజర్ వచ్చేసింది..
దగ్గుబాటి అభిరామ్‌ను హీరోగా పరిచయం చేస్తున్నారు డైరెక్టర్ తేజ. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్లో అహింస అనే చిత్రం తెరకెక్కతుతున్న సంగతి తెలిసిందే.ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో గీతికా హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఒక ఇంగ్లీష్ (ముద్దు) ఇవ్వు..పోనీ తెలుగు ఇవ్వు అని హీరోయిన్ చెప్పే డైలాగ్‌తో టీజర్ ప్రారంభమవుతుంది. హీరో హీరోయిన్ల మధ్య సాగే లవ్ ట్రాక్‌తో మొదలైన టీజర్.. యాక్షన్ సన్నివేశాలతో క్యూరియాసిటీ పెంచుతుంది. ఇటీవలె ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది. ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్‌పై పీ కిరణ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సదా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనుంది. -
హీరోగా దగ్గుబాటి అభిరామ్ ఎంట్రీ.. 'అహింస' గ్లింప్స్ చూశారా?
దగ్గుబాటి అభిరామ్‌ను హీరోగా పరిచయం చేస్తున్నారు డైరెక్టర్ తేజ. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్లో అహింస అనే చిత్రం తెరకెక్కతుతున్న సంగతి తెలసిందే. ఇటీవలె ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ గ్లింప్స్‌ను విడుదల చేశారు మేకర్స్. ఇందులో హీరోని కొందరు అడవిలో తీసుకెళ్తుండగా అతను తప్పించుకొని పారిపోవడానికి ప్రయత్నించడం, తర్వాత వాళ్లు మళ్లీ లాక్కొచ్చి కొడుతుంటారు. ఈ గ్లింప్స్ సినిమాపై మరింత క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంది.ఈ చిత్రంలో అభిరామ్‌కు జోడీగా గీతికా తివారి హీరోయిన్గా నటించింది. ఆర్పీ పట్నాయక్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. -
ఎగ్జిబిటర్ల సమస్యపై డైరెక్టర్ తేజ అధ్యక్షతన ప్రత్యేక కమిటీ
Director Teja Special Committee On The Issue Of Exhibitors: మంగళవారం (ఆగస్టు 2) ఎగ్జిబిటర్లతో నిర్వహించిన ఫిలిం ఛాంబర్ సమావేశం ముగిసింది. ఈ భేటీలో వీపీఎఫ్ ఛార్జీలు, పర్సంటేజీలపై ఎగ్జిబిటర్లతో నిర్మాతలు చర్చించారు. అయితే వీపీఎఫ్ ఛార్జీలను నిర్మాతలే భరించాలని ఎగ్జిబిటర్లు కోరినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఎగ్జిబిటర్ల సమస్యలను పరిష్కరించేందుకు సానుకూలంగానే ఉన్నామని నిర్మాతల మండలి పేర్కొంది. ఇందుకోసం దర్శకుడు తేజ అధ్యక్షతన ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నారు. డిజిటల్ చార్జీల నియంత్రణపై ఈ కమిటీలో చర్చించనున్నారు. అలాగే ఫిలిం ఛాంబర్ ప్రత్యేక కమిటీ సమావేశం ఇంకా కొనసాగుతుండగా మరోవైపు వేతన సవరణ గురించి ఫెడరేషన్ నాయకులతో మీటింగ్ ప్రారంభమైంది. కాగా ఇదివరకు వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికులు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. చదవండి: సినీ కార్మికుల సమ్మె, నిర్మాతలు, ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యుల భేటీ భార్యతో అబద్ధాలు చెప్పకపోతే ఇన్ని కాపురాలు ఉంటాయా: డైరెక్టర్ సల్లూ భాయ్‌కి లైసెన్స్డ్ తుపాకీ.. ఎలాంటిది అంటే ? బికినీ దుస్తుల్లో వేదిక రచ్చ.. సినిమా అవకాశాల కోసమేనా? -
బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అయిన డైరెక్టర్ తేజ!
టాలీవుడ్ దర్శకుల్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న డైరెక్టర్లలతో తేజ కూడా ఒకరు. చిత్రం సినిమాతో దర్శకుడిగా అవతారం ఎత్తిన తేజ తొలి సినిమాతో సూపర్ హిట్ కొట్టారు. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ హ్యాట్రిక్ హిట్టు సాధించాడు. కానీ కొంతకాలంగా ఆయనకు సాలిడ్ హిట్టు మాత్రం దొరకడం లేదు. గత పదిహేనేళ్లలో ‘నేనే రాజు నేనే మంత్రి’ తప్పితే మరో హిట్టు లేదు. ప్రస్తుతం ఆయన రానా తమ్ముడు అభిరామ్‌ను హీరోగా పరిచయం చేస్తూ ‘అహింస’అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. ఇదిలా ఉండగా ఇప్పుడు తేజ బాలీవుడ్లో సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే రెండు ప్రాజెక్టులకు సైన్ చేసినట్లు సమాచారం. ‘జఖ్మీ’ అనే సినిమాతో పాటు,‘తస్కరి’ అనే వెబ్ సిరీస్‌ని కూడా డైరెక్ట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. టైమ్ ఫిల్మ్స్, ఎన్.హెచ్. స్టూడియోస్, ట్రిఫ్లిక్స్ ఫిల్మ్స్ సంస్థలు వీటిని నిర్మించనున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్టులకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి. -
అభిరాం తీరుకు విసిగిపోయిన తేజ?, ఏం చేశాడంటే!
Abhiram Troubles Director Teja Over Ahimsa Shooting?: దర్శకుడు తేజ గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఉదయ్ కిరణ్, నితిన్, నవదీప్ లాంటి యంగ్ హీరోలను తెలుగు తెరకు పరిచయం చేసిన గొప్ప డైరెక్టర్ ఆయన. ఒకప్పుడు తేజ చిత్రాలకు యమ క్రేజ్ ఉండేది. ఎన్నో ఫ్లాప్‌ల అనంతరం నేనే రాజు నేనే మంత్రి మూవీతో హిట్ అందుకున్నాడు తేజ. అదే జోష్‌లో తేజ ఇప్పుడు దగ్గుబాటి మరో వారసుడు, రానా తమ్ముడు అభిరాంను హీరోగా పరిచయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి అహింస అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ ఇటివల అభిరాం ఫస్ట్‌లుక్‌ను కూడా విడుదల చేశారు మేకర్స్. చదవండి: అసభ్యకర సంజ్ఞతో స్టార్ హీరోయిన్ ఫైర్, పక్కనే షారుఖ్.. ఫోటో వైరల్ దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ నెలాఖరు వరకు శరవేగంగా షూటింగ్‌ను పూర్తి చేసి ప్రమోషన్ కార్యాక్రమాలు, పోస్ట్ ప్రోడక్షన్ పనులను స్టార్ట్ చేయాలని తేజ ప్లాన్ చేస్తున్నాడట. అయితే దీనికి అభిరాం సహకరించకుండ ఇబ్బంది పెడుతున్నట్లు ఫిలిం సర్కీల్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. తన డెబ్యూ మూవీ విషయంలో అభిరాం చాలా నిర్లక్ష్య ధోరణి చూపిస్తున్నాడని, అతడి యాటిట్యూడ్ తీరుకు తేజ విసిగిపోయినట్లు టీ-టౌన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల షూటింగ్‌కు రావాల్సిందిగా అభిరాంకు తేజ ఫోన్ చేయగా.. కాలికి గాయమైందని, రెస్ట్ కావాలని అడిగాడట. చదవండి: RRR: తారక్, చరణ్, రాజమౌళితో యాంకర్ సుమ రచ్చ రచ్చ అయితే తీరా చూస్తే అభిరాం అబద్ధం చెప్పి స్నేహితులతో పార్టీకి వెళ్లినట్లు తేజ దృష్టికి వెళ్లింది. ఇలా ఒక్కసారి కాదు చాలాసార్లు చిన్నచిన్న విషయాలను సాకుగా చూపించి అభిరాం షూటింగ్‌కు డుమ్మా కొట్టాడని సినీ వర్గాల నుంచి సమాచారం. ఇక అతడి తీరుపై అసహానికి లోనైన తేజ అభిరాం గురించి తండ్రి సురేశ్ బాబుకు చెప్పినట్లు సమాచారం. ‘ఫస్ట్మూవీకే యాటిట్యూడ్ చూపిస్తే ఫ్యూచర్ ఉండదంటూ’ నెటిజన్లు అభిరాంపై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఈ వార్తల్లో నిజమెత్తుందో తెలియదు. దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉండగా డైరెక్టర్ తేజను విసిగిస్తున్న అభిరాం అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక దీనిపై స్పష్టత రావాలంటే చిత్ర బృందం స్పందించే వరకు వేచి చూడాలి. -
పీరియాడికల్ లవ్‌స్టోరీ చిత్రంతో రాబోతోన్న తేజ
తన పుట్టిన రోజు (ఫిబ్రవరి 22) సందర్భంగా తాజా చిత్రాల అప్డేట్స్ ఇచ్చారు దర్శకుడు తేజ. 1836వ సంవత్సరంలో సాగే పీరియాడికల్ లవ్‌స్టోరీతో ‘విక్రమాదిత్య’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 2022 ఫిబ్రవరి 22 మధ్యాహ్నం 2 గంటల 22 నిమిషాలకు ఈ చిత్రం షూటింగ్‌ను ప్రారంభించారు తేజ. కాగా తేజ కెరీర్లో సూపర్‌హిట్‌గా నిలిచిన ‘జయం’ సినిమా షూటింగ్ సరిగ్గా 20 సంవత్సరాల క్రితం ఇదే ముహూర్తాన మొదలైంది. ఇక ‘విక్రమాదిత్య’ సినిమా విషయానికివస్తే.. 1836వ సంవత్సరంలో సర్ ఆర్ధర్ కాటన్ ధవళేశ్వరం బ్యారేజీ నిర్మాణం జరిగింది. కాబట్టి ‘విక్రమాదిత్య’ సినిమా కథకు, ఈ వంతెనకు సంబంధం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రాన్ని భవ్య సమర్పణలో లక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. -
ఉదయ్ కిరణ్ తొలి ‘చిత్రం’
టాలీవుడ్లో యువ నటుడు ఉదయ్ కిరణ్ది ఒక ప్రత్యేకమైన శకం. కెరీర్లో తొలి మూడు చిత్రాలు సూపర్ హిట్స్ సాధించి.. ‘హ్యాట్రిక్ హీరో’ ట్యాగ్‌ను తన ముందర చేర్చుకున్నాడు. యూత్‌లో మంచి క్రేజ్ దక్కించుకున్నాడు. అయితే తర్వాతి రోజుల్లో కెరీర్ డౌన్ ఫాలోతోనే కొనసాగి.. చివరికి ఉదయ్ కిరణ్ జీవితం విషాదంగా ముగిసింది. అయితే ఏ హీరోకైనా కెరీర్లో ఫస్ట్ మూవీ ప్రత్యేకం. అలాగే ఉదయ్‌కు కూడా ‘చిత్రం’ ఉంది. ఈ ట్రెండ్ సెట్టర్ మూవీ 21 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా... వెబ్‌డెస్క్: ‘చిత్రం.. ది పిక్చర్’ తెలుగు రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ. కొత్త-పాత ఆర్టిస్టులు, కొత్త టెక్నిషియన్ల కలయికతో రూపుదిద్దుకుంది చిత్రం. కేవలం నెలన్నర రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ.. ఆర్పీ పట్నాయక్ అందించిన ఆడియో సాంగ్స్‌తో సగం హిట్ సాధించగా, తేజ యూత్‌ఫుల్ సబ్జెక్ట్ ప్రజంటేషన్‌తో సెన్సేషన్ హిట్ అయ్యింది. ఉదయ్ కిరణ్, రీమా సేన్, చిత్రం శీను&కో.. ఇలా ఎందరో ఆర్టిస్టుల కెరీర్‌కు ఈ మూవీ ఒక పాథ్‌ను ఏర్పరిచింది. ఫ్రెండ్ నుంచి.. నిజానికి ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ కంటే ముందే వేరే కుర్రాడిని హీరోగా అనుకున్నాడట డైరెక్టర్ తేజ. ఈ విషయాన్ని స్వయంగా తేజ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఉదయ్ కిరణ్ ముందుగా ఫ్రెండ్స్‌లో ఓ క్యారెక్టర్. హీరోగా చేస్తానన్న వ్యక్తి వెనక్కి తగ్గడంతో.. ఉదయ్‌ను హీరోగా ముందుకు తెచ్చాడు తేజ. అయితే మళ్లీ ఆ కుర్రాడు ముందుకు రావడంతో.. ఉదయ్‌ను మళ్లీ ఫ్రెండ్ క్యారెక్టర్‌కే సెట్ చేశారు. అయితే షూటింగ్‌కి సరిగ్గా ముందురోజే మళ్లీ ఆ వ్యక్తిని వద్దనుకుని.. తేజ ఉదయ్ కిరణ్‌నే హీరోగా ఫైనలైజ్ చేశాడు తేజ. ఇక షూటింగ్ మొదట్లో ఉదయ్ కిరణ్ తడబడడంతో.. పక్కకు తీసుకెళ్లి తన స్టైల్లో క్లాస్ పీకాడట తేజ. ఆ తర్వాత ఉదయ్ కిరణ్ తనకు(తేజ) కావాల్సినట్లుగా యాక్ట్ చేయడం, ‘చిత్రం’ సూపర్ హిట్ కావడం జరిగిపోయానని తేజ ఆ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నాడు. సబ్జెక్ట్ కొత్తదే, అయినా.. మిడిల్ క్లాస్ కుర్రాడు రమణ(ఉదయ్ కిరణ్), ఫారిన్ రిటర్ని జానకీ(రీమాసేన్).. ఈ ఇద్దరి టీనేజర్ల ప్రణయగాథే ‘చిత్రం’ థీమ్. టీనేజీ వయసులో ఇన్ఫాక్చుయేషన్ ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనేది తనదైన ట్రీట్మెంట్తో ఇందులో చూపించాడు తేజ. పనిలో పనిగా కామెడీ, ఫ్యామిలీ సెంటిమెంట్, అందమైన పాటలు అందించాడు. అయితే కొద్దిపాటి అడల్ట్ థీమ్ ఉండడం, టీనేజీలో గర్భం, పైగా ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ నుంచి ఈ మూవీ రావడంతో క్రిటిక్స్ కొద్దిపాటి విమర్శలు చేశారు. కానీ, యూత్ థియేటర్లకు పోటెత్తడంతో 42 లక్షల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా బంపర్ సక్సెస్ సాధించింది. అప్పటికి ఇరవై ఏళ్ల వయసున్న ఉదయ్ కిరణ్.. ఫ్లస్ టూ స్టూడెంట్ రమణ క్యారెక్టర్‌తో అలరించి చాక్లెట్ బాయ్ ట్యాగ్‌కు తొలి బీజం వేసుకున్నాడు. కన్నడలో 125రోజులు చిత్రం సినిమాను రీమా సేన్‌కు కోలీవుడ్‌లో దక్కిన కొద్దిపాటి గుర్తింపు కారణంగా డబ్ చేశారు. అయితే కోలీవుడ్ వెర్షన్ కోసం మణివణ్ణన్, సెంథిల్, ఛార్లీ, మనోరమా, కల్పనలతో కొన్ని సీన్లను రీషూట్ చేశారు. ఇక 2001లో తెలుగు చిత్రం మూవీ కన్నడలో ‘చిత్ర’ పేరుతో రీమేక్ అయ్యింది. నాగేంద్ర ప్రసాద్, రేఖ వేదవ్యాస(ఆనందం ఫేమ్) లీడ్ రోల్లో నటించిన ఈమూవీ బ్లాక్‌బస్టర్ టాక్ దక్కించుకుని.. థియేటర్లలో 125 రోజులు ఆడింది. చదవండి: ఇరవై ఏళ్ల తర్వాత చిత్రం.. రిపీట్ -
Krithi Shetty: ఆ డైరెక్టర్‌కు బేబమ్మ నో చెప్పడమేంటి?
తొలి సినిమా 'ఉప్పెన'తోనే ధక్ ధక్ ధక్ అంటూ కుర్రకారుల గుండె తలుపు తట్టింది కృతీ శెట్టి. తనకు వచ్చిన క్రేజ్‌తో ఫట్ ఫట్ ఫట్ అంటూ అందివచ్చిన ఆఫర్లు అన్నింటినీ చేసుకుంటూ పోతోంది. దీంతో టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయింది కృతీ. ప్రస్తుతం ఆమె చేతిలో సుమారు అరడజను సినిమాలున్నట్లు తెలుస్తోంది. నాని 'శ్యామ్ సింగరాయ్', సుధీర్‌బాబుతో 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి', రామ్ పోతినేనితో మరో సినిమాలో కృతీ హీరోయిన్ అని అధికారికంగా ప్రకటించారు. మరోవైపు తమిళ చిత్రసీమలో ధనుష్ సరసన నటించనున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే తెలుగులో మరో రెండు సినిమాలకు సంతకం చేయనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో బేబమ్మ కాల్షీట్లు ఖాళీగా లేవు. ఈ సమయంలో వినూత్న చిత్రాల దర్శకుడు తేజ తన కొత్త సినిమా కోసం కృతీ శెట్టిని సంప్రదించాడట. దగ్గుబాటి అభిరామ్ వెండితెర అరంగ్రేటం చేయనున్న సినిమాలో బేబమ్మ నటిస్తే ప్లస్ అవుతుందని ఆయన భావించినట్లు తెలుస్తోంది. కానీ చేతిలో ఇప్పటికే ఎన్నో ఆఫర్లు ఉండటంతో తేజ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించిందట. అయితే తేజ తన సినిమాల్లో హీరోయిన్ పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉండేలా జాగ్రత్తపడతాడు. అలాంటి దర్శకుడికి బేబమ్మ తొందరపడి నో చెప్పిందా? అని సినీప్రియులు చర్చించుకుంటున్నారు. చదవండి: తమిళ స్టార్ హీరో సినిమాలో బేబమ్మకు ఛాన్స్! Krithi Shetty: ‘బేబమ్మ’కు ఓ కోరిక ఉందట.. నెరవేర్చేదెవరు? -
హీరోగా రానా తమ్ముడు.. ఆ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్!
దగ్గుబాటి కుటుంబం నుంచి మరో హీరో వెండితెరకు పరిచయం కానున్నారు. దగ్గుబాటి రానా తమ్ముడు అభిరామ్ రీఎంట్రీకి అంతా సిద్ధమైంది. అతి త్వరలోనే ఓ ప్రముఖ దర్శకుడితో అభిరామ్ సినిమా చేయనున్నారు. ఇప్పటికే వంశీ, తరుణ్ భాస్కర్, రవి బాబులతో చర్చలు జరిగినా అవి వర్కవుట్ కాలేదు. ఫైనల్ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో ఓ స్ర్కిప్ట్‌ను సురేష్‌బాబు ఓకే చేసినట్లు సమాచారాం. దీంతో అతి త్వరలోనే అభిరామ్‌ను గ్రాండ్‌గా పరిచయం చేసేందుకు సిద్ధమయ్యారు సురేష్‌బాబు. ఇది వరకే తేజ దర్శకత్వంలో రానా నటించిన 'నేనే రాజు నేనే మంత్రి సినిమా విజయవంతమైన సంగతి తెలిసిందే. ఈ నమ్మకంతోనే అభిరామ్‌కు కూడా డెబ్యూ మూవీతోనే హిట్ కొట్టించాలని ప్లాన్ చేస్తున్నారట. అంతేకాకుండా తేజ డైరెక్ట్ చేసే ఈ సినిమాకు ఆర్పీ పట్నాయక్ సంగీతం అందించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన..త్వరలోనే ఓ మంచి ప్రాజెక్ట్ ద్వారా రీ ఎంట్రీ ఇస్తున్నట్లు చెప్పారు. దీంతో ఆర్పీ పట్నాయక్ అభిరామ్ మూవీకి సంగీతం అందించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక తేజ- ఆర్పీ పట్నాయక్ కాంబినేషన్లో ఇప్పటికే జయం, నీ స్నేహం,నువ్వు నేను వంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. చదవండి : సిద్ శ్రీరామ్ ఒక్క పాటకు ఎంత తీసుకుంటాడో తెలుసా? మన శరీరం కేవలం అందుకోసమే కాదు కదా : రేణు దేశాయ్ -
కొడుకుని హీరోగా పరిచయం చేస్తున్న డైరెక్టర్ తేజ
‘చిత్రం’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు తేజ. తొలి సినిమాతోనే సెన్సేషన్ క్రియేట్ చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈ చిత్రంతో ఉదయ్‌కిరణ్, రీమాసేన్ హీరో, హీరోయిన్లుగా పరిచయం అయ్యారు. ఈ మూవీ ఘన విజయంతో ఇద్దరూ స్టార్స్‌గా ఎదిగారు. ఈ చిత్రం అప్పట్లోనే బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచి నిర్మాతలకు కాసులు కురిపించింది. ఇప్పుడు దీనికి సీక్వెల్ గా `చిత్రం 1.1` సినిమాని రూపొందిస్తున్నారు. ఈ సినిమాతో తేజ తన కొడుకు అమితవ్ తేజని హీరోగా పరిచయం చేయనున్నాడు. ఇందుకోసం విదేశాల్లో శిక్షణ కూడా ఇప్పించినట్లు సమాచారం. మరి అమితవ్ తేజకి ఈ సినిమా ఎలాంటి టర్న్ తీసుకుంటుందో చూడాల్సి ఉంది. ఈనెల 18న ఈ చిత్రం షూటింగ్ పప్రారంభం కానుంది. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల కానుంది. చదవండి: నిహారిక పోస్ట్‌పై భర్త షాకింగ్ కామెంట్స్ ! పుట్టిన రోజు నాడు భోరున ఏడుస్తున్న ఆర్జీవీ! -
‘సింహాసనం’కోసం కృష్ణ ఎన్నో సాహసాలు.. ప్రతీది సంచలనమే
జేమ్స్‌బాండ్, కౌబాయ్, సినిమాస్కోప్ లాంటి ప్రయోగాలతో అలరించిన హీరో కృష్ణ తొలిసారి దర్శకుడై చేసిన మరో సాహసం ‘సింహాసనం’. తెలుగులో తొలి 70 ఎం.ఎం–6 ట్రాక్ స్టీరియో ఫోనిక్ సౌండ్ చిత్రంగా అది ఆ రోజుల్లో ఓ సంచలనం. అది 1983. ఎన్టీఆర్ సినిమాలు వదిలి, రాజకీయాల్లోకి వెళ్ళారు. ఎన్టీఆర్ వదిలి వెళ్ళిన నంబర్ 1 స్థానం కోసం అగ్ర హీరోల నుంచి యువ తారల దాకా అందరూ పోటీలోకి దిగారు. 1983లోనే నవంబర్‌లో కృష్ణ సొంత స్టూడియో పద్మాలయా ప్రారంభమైంది. నటుడిగా తెలుగులోనూ, నిర్మాతగా హిందీలోనూ కృష్ణ బిజీ. అయితే, ఒకపక్క సొంత స్టూడియోకు పని కల్పిస్తూనే, ఏదైనా సాహసం చేసి, సంస్థ జెండాను దేశవ్యాప్తంగా రెపరెపలాడించాలి. సరిగ్గా అప్పుడే కృష్ణ హిందీలో ‘పాతాళ్ భైరవి’ (1985 మే 3) రీమేక్‌తో ఓ జానపద ప్రయోగం తీశారు. హిట్. అంతే, పద్మాలయాకూ, దర్శకుడిగా తనకూ ప్రతిష్ఠాత్మకంగా భారీ సెట్స్‌తో జానపద సినిమా, అదీ ఫస్ట్ టైమ్ 70 ఎం.ఎంలో తీస్తే? ఆ ఆలోచన నుంచి రూపుదిద్దుకున్నదే ‘సింహాసనం’. రెండు రాజ్యాల పోరాటకథగా... జానపదాలు కనుమరుగైపోయిన రోజుల్లో, కోట్ల రూపాయలు ఖర్చయ్యే ఈ సాహసం వర్కౌట్ అవ్వాలంటే, హిందీలోనూ తీయాలని తీర్మానించుకున్నారు. తెలుగులో ‘సింహాసనం’, హిందీలో జితేంద్ర హీరోగా ‘సింఘాసన్’ పట్టాలెక్కాయి. మంచికీ – చెడుకీ సంఘర్షణగా ఈ చిత్రం తీశారు. సింహాసనం కోసం దశార్ణ రాజ్యానికీ, అవంతీ రాజ్యానికీ మధ్య పోరాటం ఈ చిత్రకథ. చరిత్ర కలగలిపిన జానపదం టైటిల్స్‌లో కథకు క్రెడిట్ కృష్ణదే అయినా, ఆయన ఆస్థాన రచయిత త్రిపురనేని మహారథిదే రచనలో కీలకపాత్ర. కాకతీయ సామ్రాజ్యం – రాణీ రుద్రమదేవి – ఆపత్కాలంలో ఆమెకు సాయపడే గోన గన్నారెడ్డి... ఈ ప్రసిద్ధ చారిత్రక పాత్రల ఆధారంగా రాణి అలకనందాదేవి (జయప్రద), ఆమెను కాపాడే సేనాధిపతి విక్రమసింహుడి (కృçష్ణ) పాత్రలు సృష్టించారు. మౌర్య సామ్రాజ్యంలో చంద్రగుప్తుడి మీద విషకన్య ప్రయోగం జరిగినట్టు చరిత్ర. ఆ స్ఫూర్తితో చందనగంధి పాత్ర (మందాకిని) రాశారు. భారీ రాజదర్బారు... విగ్రహాలు... రెండు రాజ్యాల మధ్య జరిగే ఈ జానపద కథలో సహజత్వం కోసం కళాదర్శకుడు భాస్కరరాజు లక్షల ఖర్చుతో భారీ సెట్లు వేశారు. గమ్మత్తేమిటంటే, ఈ రాజుల కాలం కథలో కీలకమైన కాస్ట్యూమ్ డిజైనర్ కూడా ఆయనే! ఆయన వేసిన ఆరుబయట రాజ దర్బార్ సెట్టు, భారీ విగ్రహాలు... చాలా కాలం స్టూడియోలో పలకరిస్తుండేవి. రామోజీ ఫిల్మ్‌సిటీ కట్టే ముందు రామోజీరావుకు సైతం ఆ విగ్రహాల తయారీ గురించి ‘పద్మాలయా’ హనుమంతరావు వివరించారట. కొత్త సింగర్... పాటలు సూపర్‌హిట్ ‘సింహాసనం’లో కృష్ణ చేసిన మరో సాహసం – రాజ్ సీతారామ్ గానం. అప్పట్లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో కృష్ణకు ఓ వివాదం తలెత్తింది. అదే సమయంలో తమిళనాడుకు చెందిన డిగ్రీ స్టూడెంట్ రాజ్ సీతారామ్ గొంతు బాగుందనిపించింది. అంతే... కృష్ణ తన ‘సూర్య చంద్ర’ (1985)లో అన్ని పాటలూ అతనితోనే పాడించారు. ‘సింహా సనం’ మ్యూజిక్ డైరెక్టర్ బప్పీలహరి ఆ గొంతుకే ఓటేశారు. ‘ఆకాశంలో ఒక తార’, ‘వహవ్వా నీ యవ్వనం’, ‘ఇది కలయని నేననుకోనా’– ఇలా ఆత్రేయ, వేటూరి పాటలన్నీ హిట్. రాజ్‌సీతారామ్ పేరు మోతమోగింది. తీసేది 65 ఎం.ఎం! వేసేది 70 ఎం.ఎం!! నిజం చెప్పాలంటే, అప్పట్లో ఈ చిత్రాలేవీ సిసలైన 70 ఎం.ఎం కెమేరాతో తీసినవి కావు. ఆ కెమేరాలు 35 ఎం.ఎం కన్నా రెట్టింపు రిజల్యూషన్ ఉండే పెద్ద కెమేరాలు. అప్పటికి మన దేశంలో ఆ కెమేరాలూ లేవు. అందుకే అందరూ స్కోపులో, 65 ఎం.ఎం నెగటివ్ స్టాక్ మీద సినిమా షూట్ చేసుకొని, దాన్ని జాగ్రత్తగా డెవలప్ చేయించి, 70 ఎం.ఎం ఫిల్ము మీద ప్రింట్ చేసేవారు. షూట్ చేసిన 65 ఎం.ఎం పోగా, మిగతా 5 ఎం.ఎం ఫిల్మేమో ‘సౌండ్ ట్రాక్’ కోసమన్న మాట. మామూలు 35 ఎం.ఎం రీలుపై గీతలా సింగిల్ సౌండ్ ట్రాక్ ఉంటుంది. కానీ, 70 ఎం.ఎం రీలుపై మేగ్నటిక్ కోటింగ్‌లో సౌండ్‌ను ఆరు ట్రాక్‌లుగా, ఆరుసార్లు ముద్రించాల్సి ఉంటుంది. అందుకే, ‘6 ట్రాక్ స్టీరియో ఫోనిక్ సౌండ్’ అంటారన్న మాట. అందరిలానే తెలుగు ‘సింహాసనం’ సైతం ఆ టెక్నిక్‌లో 65ఎం.ఎంలో తీసి, 70 ఎం.ఎంకి బ్లోఅప్ చేసినదే! ‘‘ఫేమస్ ‘షోలే’తో సహా మన దేశంలో తీసిన 70 ఎం.ఎంలన్నీ దాదాపు ఇలా తీసినవే. 35 ఎం.ఎంకి ఒక రకంగా, 70 ఎం.ఎంకి మరో రకంగా కెమేరాలో మార్కింగ్ ఉంటుంది. 35 ఎం.ఎంలో బొమ్మ ఎత్తుంటుంది. నలుచదరంగా ఉంటుంది. 70 ఎం.ఎంలోనూ బొమ్మ ఎత్తు అంతే కానీ, వెడల్పు రెట్టింపు ఉంటుంది. 70 ఎం.ఎం సినిమా తీయాలంటే కెమేరాలో గేట్ మారుస్తారు. ఒక్క 70 ఎం.ఎంలోనే సినిమా తీస్తే సులభమే కానీ, మన దగ్గర అన్ని థియేటర్లుండవు కాబట్టి, అత్యధిక చోట్ల 35 ఎం.ఎం ప్రింట్లే ప్రదర్శించాల్సి వస్తుంది. అంటే, సినిమా తీస్తున్నప్పుడే బొమ్మ కట్ కాకుండా 35 ఎం.ఎం ప్రింట్‌కీ, 70 ఎం.ఎం ప్రింట్‌కీ తగ్గట్టు జాగ్రత్తగా కెమేరా ఫ్రేమింగ్ పెట్టాలి’’ అని ‘సింహాసనం’కి పనిచేసిన నేటి ప్రముఖ దర్శకుడు తేజ వివరించారు. స్వామి కెమేరా! నగాయిచ్ ట్రిక్స్ ‘సింహాసనం’ ఛాయాగ్రహణమంతా వి.ఎస్.ఆర్. స్వామి పనితనమే. కాగా, ఆయనకు కెమేరా గురువైన రవికాంత్ నగాయిచ్ ఈ ‘సింహాసనం’కి ట్రిక్ ఫోటోగ్రఫీ చేశారు. నగాయిచ్ దగ్గర అసిస్టెంట్‌గా తేజ పనిచేశారు. ‘‘‘ఆకాశంలో ఒక తార...’ పాటలో బృందావన్ గార్డెన్స్‌లోనే ఓ ప్యాలెస్ ఉన్నట్టు చూపించడం లాంటివి ట్రిక్షాట్లే. అందుకోసం ప్యాలెస్ మినియేచర్ సెట్ తీసుకెళ్ళాం. అక్కడ షూటింగ్ చేశాక, 6 బస్సుల్లో డ్యాన్సర్లందరినీ హైదరాబాద్ తీసుకొచ్చి, ఇక్కడ షూట్ సాగించాం’’ అని తేజ చెప్పారు. ఏడెనిమిది రెట్లు ఎక్కువ బడ్జెట్! ఒక షాట్‌ను తెలుగులో తీసి, వెంటనే అదే సెటప్‌లో హిందీ ‘సింఘాసన్’ చిత్రీకరించేవారు. 65 రోజుల్లో రెండు వెర్షన్లూ పూర్తి చేశారు. 40 – 50 లక్షల్లో సిన్మాలు తీసే ఆ రోజుల్లో ఈ జానపదం కోసం దర్శక, నిర్మాత, హీరో కృష్ణ రూ. 3 కోట్ల 20 లక్షల దాకా చాలా ధైర్యంగా ఖర్చు పెట్టారు. బిజినెస్ కూడా అదే రేంజ్లో భారీగా జరిగింది. తెలుగులో... ఆ ప్రింట్లు ఆరే ఆరు! షూటింగే కాదు... ‘సింహాసనం’ పబ్లిసిటీ, ప్రింట్ల రిలీజు కూడా ఆ రోజుల్లో భారీగా సాగింది. తెలుగు వెర్షన్ సుమారుగా 86 ప్రింట్లతో, 150కి పైగా థియేటర్లలో రిలీజవడం మరో సంచలనం. ఇక హిందీ వెర్షన్‌కు 120 – 130 ప్రింట్లు తీశారు. అప్పట్లో మామూలు 35 ఎం.ఎం ప్రింట్ తీయడానికి రూ. 30 – 40 వేల దాకా అయ్యేది. అదే 70 ఎం.ఎం ప్రింట్ తీయాలంటే, లక్షా అరవై వేలయ్యేది. పైపెచ్చు, దానికి కావాల్సిన పాజిటివ్ ఫిల్ము కోసం మూడు నెలల ముందుగానే చెప్పి, విదేశాల నుంచి తెప్పించుకోవాల్సి వచ్చేది. ఇక, ల్యాబ్‌లో 70 ఎం.ఎం ప్రింట్ డెవలప్ చేసేటప్పుడు దానికి తగ్గట్టు రోలర్స్ మార్చాలి. ఆ ప్రింట్లు తీస్తున్నప్పుడు వేరేవి ప్రింట్ చేయలేరు. అందుకే 70 ఎం.ఎం ప్రింట్లకు ఎక్కువ ఛార్జ్ వసూలు చేసేవారు. ఆ ప్రింట్‌ను హాలులో వేయాలన్నా మామూలు ప్రొజెక్టర్‌కు ఉండే రోలర్లు, దానికి ఉండే లెన్సులు మార్చాలి. వెనకాల ఉండే ఆర్క్ లైట్‌ను బ్రైట్ చేయాల్సి ఉంటుంది. అప్పట్లో ఇలా ‘70 ఎం.ఎం – 6 ట్రాక్ స్టీరియో ఫోనిక్ సౌండ్’ సినిమాలు ప్రదర్శించేందుకు తగిన సాంకేతిక సదుపాయాలున్న హాళ్ళూ తెలుగునాట తక్కువే! గుంటూరు, నెల్లూరు లాంటి చోట్ల ‘సింహాసనం’ 70 ఎం.ఎం ప్రదర్శన కోసం అదనంగా ఖర్చు పెట్టి, హాళ్ళను ప్రత్యేకంగా సిద్ధం చేశారు. ఈ పరిస్థితుల మధ్య ‘సింహాసనం’ చిత్రం రిలీజు కోసం ఆరు 70 ఎం.ఎం. ప్రింట్లు వేశారు. ప్రత్యేక ఏర్పాట్లు చేసుకొని, విజయవాడ (రాజ్), గుంటూరు (మంగా డీలక్స్), విశాఖపట్నం (చిత్రాలయా), నెల్లూరు (అర్చన), కాకినాడ (దేవి), హైదరాబాద్ (దేవి) – ఈ 6 కేంద్రాలలో 70 ఎం.ఎం ప్రింట్లు వేశారు. అందులో 68 రోజులకే సినిమా మారిన ఒక్క నెల్లూరు మినహా మిగతా 5 కేంద్రాలలోనూ, అలాగే రాజమండ్రిలో 35ఎం.ఎం ప్రింట్‌తో (స్వామి టాకీస్‌లో)నూ మొత్తం 6 కేంద్రాలలో ‘సింహాసనం’ డైరెక్ట్ శతదినోత్సవం చేసుకుంది. పోస్టర్ పబ్లిసిటీలో... 24 షీట్ ట్రెండ్! సినిమాలానే ‘సింహాసనం’ పబ్లిసిటీ కూడా భారీగా సాగింది. అప్పట్లో తెలు గులో కేవలం 4 షీట్, 6 షీట్, 9 షీట్ వాల్ పోస్టర్లే ఉండేవి. కానీ, ‘సింహాసనం’ కోసం తెలుగులో తొలిసారిగా 24 షీట్ వాల్ పోస్టర్లు సిద్ధం చేయించారు ‘పద్మాలయా’ హనుమంతరావు. అందరినీ ఆకర్షించిన ఆ 24 షీట్ పోస్టర్ల విధానం అప్పటి నుంచి తెలుగు సినిమా పబ్లిసి టీలో ఓ ట్రెండైంది! అలాగే, సినీ వాణిజ్య రాజధాని విజయవాడలో ‘సింహాసనం’ రిలీజుకు ముందు అలంకార్ థియేటర్ వద్ద 95 అడుగులు, బెంజ్ సర్కిల్ సెంటర్ దగ్గర 75 అడుగుల చొప్పున హీరో కృష్ణ భారీ ప్లైవుడ్ కటౌట్లు పెట్టారు. అప్పట్లో ఆ పబ్లిసిటీ ఆకర్షణ టాక్ ఆఫ్ ది టౌన్! రాజకీయ ప్రత్యర్థి ఎన్టీఆర్‌పై విసుర్లు అప్పటికి కాంగ్రెస్ పార్టీలో ఉన్న హీరో కృçష్ణ సహజంగానే ప్రత్యర్థి పార్టీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మీద ‘సింహాస నం’లో కొన్ని విసుర్లు కూడా పెట్టారు. ‘‘థియేటర్లలో ఆ డైలాగ్స్‌కు స్పందన లభించింది. దాంతో ఎన్టీఆర్‌పై జనంలో వ్యతిరేకత మొదలైందనే అంచనాతో మేము ‘నా పిలుపే ప్రభంజనం’, తర్వాత ‘సాహసమే నా ఊపిరి’ తీశాం’’ అని ‘పద్మాలయా’ ఆదిశేషగిరిరావు గుర్తుచేసుకున్నారు. సముద్రపుటొడ్డున... అభిమాన జనసముద్రం మధ్యన... 1986 జూలై 12న మద్రాసులో సముద్రపుటొడ్డున వి.జి.పి. గార్డెన్స్‌లో వందలకొద్దీ బస్సులు, కార్లు, వ్యాన్లలో తెలుగు నేల నలుమూలల నుంచి తరలివచ్చిన వేలాది అభిమానుల మధ్య ‘సింహాసనం’ వందరోజుల వేడుక సాగింది. ఆ తరువాత... ఆ సినిమాలు అరుదే! వాస్తవానికి, ‘సింహాసనం’ కన్నా ముందు తెలుగులో ఎన్టీఆర్ ‘బొబ్బిలిపులి’, ‘సింహాసనం’ రిలీజైన తరువాత చిరంజీవి ‘కొండవీటి దొంగ’ లాంటి చిత్రాలు కూడా 70 ఎం.ఎం.లో తీసే ప్రయత్నాలు జరిగాయి. కారణాలేమైనా, వాటిని చివరకు ఆ టెక్నిక్‌లో తీయలేదు. ‘సింహాసనం’కే ఆ క్రెడిట్ దక్కింది. తెలుగులో వచ్చిన రెండో 70 ఎం.ఎం – ఏయన్నార్, నాగార్జున ‘అగ్నిపుత్రుడు’ (1987). కాలగతిలో డి.టి.ఎస్, డాల్బీ, డిజిటల్ లాంటి టెక్నాలజీలు వచ్చేయడంతో, 6 ట్రాక్ స్టీరియో ఫోనిక్ సౌండ్ అనేదే ప్రధాన ఆకర్షణ అయిన 70 ఎం.ఎం సినిమాలు రావడం మన దగ్గర ఆగిపోయింది. అయితేనేం... తెలుగుతెరపై సాహసం.. సాంకేతిక ప్రయోగం రీత్యా ‘సింహాసనం’ ఇప్పటికీ ఓ సంచలనమే! చిరస్మరణీయమే! బప్పీ లహరి బాణీల మేనియా హిందీలో ‘డిస్కో డ్యాన్సర్’ (1982) బాణీలతో దేశాన్ని ఊపేసిన బప్పీలహరికి తెలుగులో మ్యూజిక్ డైరెక్టర్‌గా ఇదే తొలి చిత్రం. పద్మాలయాకు హిందీలో అప్పట్లో ఆయనే పర్మినెంట్ మ్యూజిక్ డైరెక్టర్. తెలుగులో ‘ఆకాశంలో...’ బదులు ‘ఆకాసంలో...’ లాంటి అపశబ్దో చ్చారణ జరిగినా, ముప్పావు నిమిషం పైగా సుదీర్ఘమైన బి.జి.ఎంలే వినిపించినా, శ్రావ్యత కన్నా శబ్దం ఎక్కువైనా సరే – జనం బప్పీలహరి సంగీతం మాయలో పడిపోయారు. అప్పట్లో ఆ పాటలు, వాటి బి.జి.ఎంలు మారుమోగని ఊరు లేదు. శ్రీదేవి బదులు మందాకిని! ఈ భారీ సాహసం కోసం భారీ తారాగణాన్నే ఎంచుకున్నారు. రెండు వెర్షన్లలో హీరోలు వేరైనా, హీరోయిన్లు జయప్రద, రాధ, మందాకిని, అలాగే వహీదా రెహమాన్ కామన్. అప్పటికే రాజ్‌కపూర్ ‘రామ్ తేరీ గంగా మెయిలీ’లో అందాలు ఆరబోసి, జనాన్ని ఆకర్షించిన నీలికళ్ళ సుందరి మందాకినిని కూడా తెలుగుకు తీసుకువచ్చారు. ‘‘ఆ పాత్రను శ్రీదేవితో చేయిస్తే ఎలా ఉంటుందని కూడా ఆలోచించాం. అప్పటికే, కృష్ణ – శ్రీదేవి కాంబినేషన్ చాలా సినిమాలతో పాపులర్. అయితే, ఫ్రెష్‌గా ఉంటుందని, హిందీలో అప్పుడు సరికొత్త హాట్ మందాకినిని తీసుకున్నాం’’ అని కృష్ణ సోదరుడు జి. ఆదిశేషగిరిరావు వివరించారు. కృష్ణ, మందాకిని హయ్యస్ట్ ఓపెనింగ్ కలెక్షన్ల రికార్డ్! సెవన్టీ ఎం.ఎం ప్రింట్లు ఆడిన అరడజను కేంద్రాలలోని సైడ్ థియేటర్లతో సహా, మిగతా అన్ని కేంద్రాలలో సర్వసాధారణమైన 35 ఎం.ఎం. ప్రింట్లతోనే ‘సింహాసనం’ ప్రదర్శితమైంది. అయితేనేం, సినిమా పట్ల ప్రేక్షకుల ఆసక్తిలో, ఆదరణలో మార్పు లేదు. అభిమానులేమో రికార్డులపై మోజు వీడలేదు. ఏకంగా 116 రోజులు ప్రదర్శితమైన వైజాగ్ ‘చిత్రాలయా’ లాంటి చోట్ల, సరిగ్గా ఆఖరు రోజుకు ముందు రోజు దాకా హాలు బయట హౌస్‌ఫుల్ బోర్డులే దర్శనమిచ్చాయి. ‘‘మొదటివారమే ఆంధ్రప్రదేశ్, బెంగుళూరు కలిపి ఏకంగా రూ. 1.51 కోట్ల పైగా వసూలు చేసి, అప్పటికి హయ్యస్ట్ ఓపెనింగ్ గా ‘సింహాసనం’ బాక్సాఫీస్ చరిత్ర’’ సృష్టించింది. మొదటి 70 ఎం.ఎం ‘షోలే’ కాదు! తెలుగులో తొలి 70 ఎం.ఎం. ‘సింహాసనం’ చిత్రమనే మాట సరే! కానీ, దేశంలోనే ఫస్ట్ సిన్మా ఏమిటి? చాలా మంది ‘షోలే’ అనుకుంటారు. కానీ, ‘షోలే’ కన్నా ముందే వచ్చిన రాజ్‌కపూర్, రాజశ్రీ ‘ఎరౌండ్ ది వరల్డ్’ (1967) మన దేశంలోనే ఫస్ట్ 70ఎం.ఎం చిత్రం. రెండోచిత్రంగా ‘షోలే’ (1975) 70 ఎం.ఎం సిక్స్‌ట్రాక్ స్టీరియోఫోనిక్ సౌండ్‌లో అలరించింది. తర్వాత హిందీలో ‘షాన్’ (’80), అమితాబ్ ‘మహాన్’ (’83) లాంటి సక్సెస్‌లు వచ్చాయి. దక్షిణాదిలో తొలిసారిగా మలయాళంలో ‘పడయోట్ట మ్’ (’82)వచ్చింది. తర్వాత నాలుగేళ్ళకు కృష్ణ తొలి తెలుగు 70 ఎం.ఎంగా ‘సింహాసనం’ (’86) అందించారు. ‘సింహాసనం’ చిత్రాన్ని తమిళంలో ‘సిమ్మాసన్’ పేరిట పద్మాలయా వారే అనువదించి, రిలీజ్ చేశారు. కాగా, అదే ఏడాది తమిళంలోనూ ‘తొలి తమిళ 70 ఎం.ఎం’ రజనీకాంత్ హీరోగా ‘మావీరన్’ (1986 నవంబర్ 1) వచ్చింది. ఈ తొలి తమిళ 70 ఎం.ఎం.నూ పద్మాలయా వారే నిర్మించడం విశేషం. సెట్స్‌లో దర్శకుడిగా సూపర్‌స్టార్ కృష్ణ, జితేంద్ర హిందీ ‘సింఘాసన్’ – రెంటాల జయదేవ ∙ -
45 మంది కొత్త వారితో 'చిత్రం' సీక్వెల్
డైరెక్టర్ తేజ గతేడాది రెండు సినిమాలు ప్రకటించాడు. ఒకటి గోపీచంద్‌తో 'అలిమేలుమంగ వేంకటరమణ' కాగా మరొకటి దగ్గుబాటి రానాతో 'రాక్షసరాజు రావణాసురుడు'. ఈ రెండు సినిమాలు ఇంకా షూటింగ్‌కు నోచుకోనేలేదు, అప్పుడే మరో కొత్త చిత్రాన్ని ప్రకటించాడు. తొలి ప్రయత్నంలోనే తనకు పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టిన చిత్రం మూవీకి సీక్వెల్ "చిత్రం 1.1" తీస్తున్నట్లు వెల్లడించాడు. ఈ సినిమా షూటింగ్ మార్చిలో షురూ కానున్నట్లు పేర్కొన్నాడు. సోమవారం తన పుట్టిన రోజు సందర్భంగా తేజ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో అధికారికంగా తెలిపాడు. అంతే కాదు, ఇందులో 45 మంది కొత్త వాళ్లు నటించనున్నట్లు చెప్పుకొచ్చాడు. కాగా 2000 సంవత్సరంలో వచ్చిన 'చిత్రం' సినిమాతో తేజ టాలీవుడ్‌కు దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఆర్పీ పట్నాయక్ కూడా ఈ చిత్రంతోనే సంగీత దర్శకుడిగా ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఉదయ్ కిరణ్, రీమాసేన్ జంటగా నటించిన ఈ మూవీ అప్పట్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. మళ్లీ 21 ఏళ్ల తర్వాత దీనికి సీక్వెల్ తీయడానికి రెడీ అవుతున్నాడు తేజ. తన సినిమాల ద్వారా ఎందరో నటీనటులకు లైఫ్ ఇచ్చిన తేజ ఈసారి ఇండస్ట్రీకి ఎవర్ని పరిచయం చేస్తారనేది టాలీవుడ్లో ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సీక్వెల్ మరోసారి 'చిత్రం' మ్యాజిక్ రిపీట్ చేస్తుందా అనేది తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే. Will start shoot this Year! pic.twitter.com/VHVIJEJ2PT — Teja (@tejagaru) February 22, 2021 చదవండి: తేజ సినిమా: కాజల్ పోయి.. తాప్సీ వచ్చే బన్నీని పోలీసులు అలా వాడేసుకున్నారన్నమాట! -
తేజ కొత్త సినిమా.. అలిమేలు ఆవిడే!
‘జయం’, ‘నిజం’ సినిమాల్లో గోపీచంద్‌లోని విలన్ యాంగిల్‌ని బాగా చూపించారు దర్శకుడు తేజ. చాలా గ్యాప్ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనుందనే వార్త వచ్చిన విషయం తెలిసిందే. ‘అలిమేలు మంగ వెంకటరమణ’ అనే టైటిల్‌తో రూపొందనున్న ఈ సినిమాలో గోపీచంద్ హీరోగా నటించనున్నారు. ఇందులో అలిమేలుగా కాజల్ అగర్వాల్, కీర్తీ సురేశ్, తాప్సీ పేర్లను పరిశీలిస్తున్నారనే వార్త వచ్చింది. తాజాగా అలిమేలు ఆవిడే అంటూ సాయి పల్లవి పేరు బయటికొచ్చింది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. మరి... అలిమేలు ఆవిడేనా అనేది అప్పుడు తెలుస్తుంది. -
అలిమేలు దొరికిందా?
దర్శకుడు తేజ తెరకెక్కించిన ‘జయం, నిజం’ చిత్రాల్లో గోపీచంద్ విలన్‌గా నటించారు. తాజాగా గోపీచంద్ హీరోగా తేజ దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘అలిమేలు మంగ వేంకటరమణ’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇందులో గోపీచంద్ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని సమాచారం. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరు నటిస్తారు అని కొంతకాలంగా చర్చలు నడుస్తున్నాయి. చాలామంది హీరోయిన్ల పేరు వినపడ్డాయి కూడా. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్గా కీర్తీ సురేశ్ నటిస్తారని తెలిసింది. ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చిత్రబృందం భావిస్తోంది. -
ఏ టైటిల్ ఎవరిది?
శనివారం తేజ పుట్టినరోజు. ఈ సందర్భంగా తాను దర్శకత్వం వహించబోయే రెండు సినిమాలను ప్రకటించారు. ఒకటి గోపీచంద్‌తో, మరొకటి రానాతో. ఈ హీరోలతో సినిమాలు చేయబోతున్నట్లు ప్రకటించి, ‘రాక్షసరాజు–రావణాసురుడు’, ‘అలివేలు మంగా– వెంకటరమణ’ అని రెండు టైటిల్స్ కూడా చెప్పారు. అయితే ఈ టైటిల్స్‌లో గోపీచంద్ సినిమా ఏది? రానా సినిమా ఏది? అనే క్లారిటీ ఇవ్వలేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ‘అలివేలు మంగా–వెంకటరమణ’ గోపీచంద్ సినిమా టైటిల్ అని తెలిసింది. ఇక గోపీచంద్–తేజ, రానా–తేజల కాంబినేషన్ రిపీట్ కాబోతోంది. గోపీచంద్‌ను ‘జయం’ చిత్రం ద్వారా విలన్‌గా పరిచయం చేసి, పెద్ద హిట్ ఇచ్చారు తేజ. అలాగే రానాకు ‘నేనే రాజు– నేనే మంత్రి’ వంటి చక్కటి విజయాన్ని అందించారు. -
అలివేలు వెంకటరమణ
దర్శకుడు తేజ తెరకెక్కించిన ‘జయం, నిజం’ సినిమాల్లో విలన్ పాత్రలో నటించారు గోపీచంద్. విలన్‌గా మంచి ప్రశంసలు అందుకున్నారు కూడా. ఇప్పుడు తేజ దర్శకత్వంలో హీరోగా నటించనున్నారాయన. గోపీచంద్ – తేజ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రానికి ‘అలివేలు వెంకటరమణ’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఇందులో గోపీచంద్ పాత్ర పూర్తి పవర్‌ఫుల్‌గా ఉంటుందని సమాచారం. గోపీచంద్‌లోని కొత్త కోణాన్ని ఈ సినిమాలో ఆవిష్కరించనున్నారట తేజ. జూన్‌లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో ‘సీటీమార్’ అనే సినిమా చేస్తున్నారు గోపీచంద్. -
తేజ దర్శకత్వంలో అమితాబ్
విభిన్న కథా చిత్రాలతో టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు దర్శకుడు తేజ. ఇప్పుడు తేజ దృష్టి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ‘ఆర్టికల్ 370’పై పడిందని తెలిసింది. ఈ అంశం ఆధారంగా ఆయన ఓ కథ రాశారని సమాచారం. ఆ కథను ఓ ప్రముఖ నిర్మాత తెరకెక్కించనున్నారట. గోవాలో ఈ కథకు సంబంధించిన ప్రీ–ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని వినికిడి. ఈ చిత్రంలో నటించడానికి అమితాబ్ సుముఖంగా ఉన్నారట. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కబోతోందని ఫిలింనగర్ వర్గాల సమాచారం. -
గురువుతో నాలుగోసారి
‘దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి’ అన్నది సామెత. ఈ విషయాన్ని కొందరు కథానాయికలు బాగానే అర్థం చేసుకుంటున్నారు. అందుకే కేవలం హీరోయిన్‌గానే కాదు.. ఇతర వ్యాపారాలు, ప్రొడక్షన్ వైపు కూడా అడుగులేస్తున్నారు. కాజల్ అగర్వాల్ ప్రొడక్షన్ హౌస్ స్థాపించి, సినిమాలు నిర్మించాలనుకుంటున్నారని ఇండస్ట్రీలో చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ సమయం రానే వచ్చిందట. టాలీవుడ్లో తన నట గురువు తేజ దర్శకత్వంలో కాజల్ ఓ సినిమా నిర్మించి, కొత్త ప్రయాణాన్ని ప్రారంభించనున్నారని ఫిల్మ్‌నగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. అందులోనూ ఈ సినిమాలో కాజల్ లీడ్ రోల్లో నటించనున్నారట. ఇందుకోసం లేడీ ఓరియంటెడ్ స్క్రిప్ట్‌ను తేజ సిద్ధం చేస్తున్నారని, సమాజానికి సందేశం ఇచ్చేలా ఈ సినిమా ఉంటుందని టాక్. 2007లో వచ్చిన ‘లక్ష్మీ కల్యాణం’ సినిమాతో కాజల్‌ని టాలీవుడ్‌కి పరిచయం చేశారు తేజ. ఈ సినిమా విడుదలైన పదేళ్ల తర్వాత వీరి కాంబినేషన్లో వచ్చిన ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా మంచి విజయం అందుకుంది. గత నెలలో వచ్చిన ‘సీత’ చిత్రంతో మూడోసారి కలిసి పనిచేసిన తేజ–కాజల్ ఇప్పుడు నాలుగోసారి కొత్త ప్రాజెక్ట్ కోసం చేతులు కలపనున్నారట. -
ఆ సినిమా తీయకుండానే మంచి పేరు వచ్చింది
‘‘ఇండస్ట్రీలో శుక్రవారం నుంచి శుక్రవారానికి ఈక్వేషన్లు మారిపోతుంటాయి. శుక్రవారానికి నా సినిమా హిట్ అయితే నా తదుపరి సినిమాకు పెద్ద స్టార్ వస్తాడు. యావరేజ్‌గా ఆడితే యావరేజ్ స్టారే వస్తాడు. ఫ్లాప్ అయితే కొత్తవాళ్లతో సినిమా తీసుకోవడమే. ‘బెగ్గర్స్ కెనాట్ బీ చూజర్స్’ అనే సామెత ఉంటుంది ఇంగ్లీష్‌లో. అడుక్కునే వాడికి ఆప్షన్స్ ఉండవు అని. ప్రేక్షకుల నుంచి మన కొత్త చిత్రానికి వచ్చిన స్పందనే మన నెక్ట్స్ సినిమా అవుతుంది’’ అని దర్శకుడు తేజ అన్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ జంటగా తేజ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సీత’. అనిల్ సుంకర నిర్మించిన ఈ చిత్రం గత శుక్రవారం రిలీజైంది. ఈ సందర్భంగా తేజ మీడియాతో పలు విశేషాలు పంచుకున్నారు. ► రామాయణానికి, మా కథకు ఏ సంబంధం లేదు. టైటిల్ సీత, కొన్ని డైలాగ్స్ చూసి అలా కొందరు ఊహించుకున్నారంతే. సీత పాత్ర ప్రస్తుత సమాజంలో ఉన్న ధన దాహం, పేరు కోసం పరిగెడుతున్న వారందరికీ ప్రతీక. న్యాయంగా, పద్ధతిగా ఉండాలి అనేది రామ్ పాత్ర తెలుపుతుంది. సమాజం ఎలా ఉండాలన్న దానికి ఉదాహరణ రామ్ అయితే ఎలా ఉంది అన్నది సీత పాత్రలో చూపించాను. రామ్, సీత ఇద్దరికీ మధ్య జరిగే క్లాషే ఈ చిత్రకథ. ► సీత అనే పాత్ర ప్రస్తుతం ఉన్న మనుషులందర్నీ ఉద్దేశించింది. కేవలం స్త్రీలని కాదు. గట్టిగా చెప్పాలంటే స్త్రీలు ఎంతో ఫార్వార్డ్ థింకింగ్‌తో ఉన్నారు. చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. కానీ మేమే సినిమాల్లో హీరోయిన్లను కేవలం హీరో వెనక పాటలు పాడుకునేట్టు చూపిస్తాం. దానికి కారణం మనం ఒక ఫార్మాట్ సినిమాకు అలవాటు పడి ఉండటమే. దీన్ని ఒకేసారి బద్దలుకొట్టడం కష్టం. మెల్లిమెల్లిగా జరగాలి. ► నా సినిమాలన్నింటికి రివ్యూస్ బావుండవు. ఆ విషయానికి నేను అలవాటు పడ్డాను. ‘సీత’ సినిమా కూడా ఫర్వాలేదని రివ్యూలు రాశారు. జనమైతే బావుంది అంటున్నారు. ‘నేనే రాజు నేనే మంత్రి’ కూడా రివ్యూలు డివైడ్‌గానే వచ్చాయి. కానీ సినిమా సక్సెస్ అయింది. మన ప్రోడక్ట్‌ను మనం జడ్జ్ చేయలేం. మనం ఒకటి అనుకుంటాం.. ఒకటి జరుగుతుంది. ప్రీ–రిలీజ్ వేడుకలో నేను తీసిన సినిమాను జడ్జ్ చేయడం నాకు రాదని చెప్పింది అందుకే. ఈ సినిమా ఆడుతుందో లేదో మనం చెప్పలేం. అదే తెలిస్తే ఎవ్వరం ఫ్లాప్ సినిమా తీయం కదా? తేజ దగ్గర నుంచి జేమ్స్ కామెరూన్ వరకూ ఎవ్వరూ ఫ్లా‹ప్ తీయాలనుకోరు. ► యాక్టర్స్ నుంచి బెస్ట్ రాబట్టాలంటే వాళ్లను ఆ పాత్ర మూడ్‌లోకి తీసుకెళ్లాలి. లేకపోతే యాక్టింగ్ అనేది కేవలం గొంతులో నుంచి వచ్చే డైలాగ్‌తో ఆగిపోతుంది. పాత్ర మూడ్‌లోకి వెళ్తే డైలాగ్ కడుపులో నుంచి వస్తుంది. ప్రతీ సీన్ ముందు యాక్టర్‌ని హిప్నటైజ్ చేయాలి. అప్పుడు యాక్టర్స్‌కి ఈజీ అవుతుంది. కొన్నిసార్లు యాక్టర్స్‌కి యాక్టింగ్ వచ్చినా ఒక గోడ కట్టుకొని లోపల ఉండిపోతారు. చాలా మంది దర్శకులు ఆ గోడ బయట నుంచే ఏదోటి చెప్పి చేయించేస్తుంటారు. నేను మాత్రం ఆ గోడ బద్దలు కొట్టి ఆ యాక్టర్‌ను బయటకు తీసుకొచ్చి నాకు కావాల్సినట్టు చేయించుకుంటాను. ► నాకు నా పాత సినిమా ఏది చూసినా ఇంకా బాగా చేసి ఉంటే బావుండు అనిపిస్తుంటుంది. మొన్న టీవీలో ‘నువ్వు–నేను’ సినిమా వస్తుంటే చూశా. మా ఎడిటర్‌కి ఫోన్ చేసి ‘క్లైమాక్స్‌లో హీరోయిన్ గోడ దూకే దగ్గర నాలుగు ఫ్రేములు తగ్గించొచ్చు కదా?’ అన్నాను. ‘ఊరుకోవయ్యా బాబు. ఆల్రెడీ ఆ సినిమా సూపర్ హిట్ అయిపోయింది’ అని సమాధానమిచ్చారు. నేనెప్పుడూ సంతృప్తి చెందను. ఇంకా బెటర్ చేయొచ్చు అనుకుంటాను. ► సినిమా కథ రాసుకున్నాక హీరో ఎవరైతే బావుంటుందని ఆలోచిస్తాను. ఈ పాత్రకు స్ట్రాంగ్ బాడీ ఉండి, అమాయకత్వం ఉండాలి. సాయి శ్రీనివాస్ బావుంటాడనిపించింది. హీరో కంటే విలన్ బలంగా ఉన్నప్పుడే కథ పండుతుంది. సమస్య పరిష్కరించలేని విధంగా ఉన్నప్పుడు, నువ్వు దాన్ని ఛేదిస్తేనే నీ పవర్ తెలుస్తుంది. హీరోయిజమ్ ఎలివేట్ అవుతుంది. హీరో ఆల్రెడీ చాలా స్ట్రాంగ్‌గా ఉండి విలన్ వీక్ అయితే సినిమా నిలబడదు. ► ఆడియన్స్ మూడ్ బట్టి సినిమాలు ఆడతాయి. సినిమా తీసేవాళ్లం సినిమాను కేవలం ఒక ప్రోడక్ట్లాగా చూస్తాం. ప్రేక్షకుడికి మాత్రం చాలా కారణాలుంటాయి. మొన్న శుక్రవారం ఇంకా ఎన్నికల మూడ్‌లోనే ఉండబట్టే మార్నింగ్ షోలు స్లోగా స్టార్ట్ అయ్యాయి. నైట్ షో నుంచి కలెక్షన్స్ పెరిగాయి. ► కథ మొదలయ్యాక పూర్తి అవ్వాలి. పూర్తయ్యే వరకూ ఉండేదే కథ. అది చూడకుండా క్యాలిక్యులేటర్ పట్టుకొని అది బావుంది, ఇది బాలే దు అని కూర్చొని లెక్కలు వేస్తే ఎలా? కామన్ ఆడియన్ మాత్రం సినిమా బావుండాలని ఆలోచనతో మాత్రమే వెళ్తాడు. మనం (రివ్యూ రైటర్స్‌ని ఉద్దేశిస్తూ) మాత్రం చెక్ చేయడానికి మాత్రమే వెళ్తాం. ఏది బాలేదో చూసి దర్శకుడి కంటే మనం గొప్ప అని నిరూపించుకోవడానికి సినిమా చూస్తాం. సినిమాను ఆస్వాదించాలి. సినిమానే కాదు జీవితాన్ని కూడా. పోలికలు ఆపేయాలి. ఆడు ఇది చేశాడు, ఈడు ఇది చేశాడని పోలికలు పెట్టుకుంటే కష్టం. అందుకే రివ్యూల కంటే ఆడియన్స్ ఏం చెబుతారన్నదే ముఖ్యం. ► నా సినిమాల్లో కథకు కావాల్సినంతే ఖర్చు పెడతాను. ప్రస్తుతం ఇండస్ట్రీ తప్పు దోవలో వెళ్లిపోతుందనిపిస్తుంది. బడ్జెట్ ఉందని ఖర్చు పెట్టకూడదు. కథ గుడిసె ఉండాలని అడిగితే గుడిసె ఉండాలి. బిల్డింగ్ ఉండకూడదు. దీనివల్ల ఖర్చు పెరిగి కథ బయటకు వెళ్లిపోతుంది. ► ప్రస్తుతం కొత్త దర్శకులు మంచి ఆలోచనలతో వస్తున్నారు. కొత్తోళ్లు వస్తే పాతోళ్లంతా పోతాం. అప్పుడే ఇండస్ట్రీ బెస్ట్ అవుతుంది. కొత్తవాళ్లు ఎలా వస్తారు? హై బడ్జెట్ సినిమాలతో కొత్తవాళ్లు రారు. అది కేవలం చిన్న సినిమాల వల్లే కుదురుతుంది. అందుకే చిన్న సినిమాలకు సపోర్ట్ ఇవ్వాలి. ఆదరించాలి. థియేటర్స్ ఇవ్వాలి. ► రామారావుగారికి న్యాయం చేయలేనని ‘ఎన్టీఆర్’ బయోపిక్ నుంచి తప్పుకున్నాను. ఆ సినిమా వదిలేసి వచ్చినందుకు చాలా మంది తప్పు చేస్తున్నావు అన్నట్టు చెప్పారు. రిలీజ్ అయ్యాక ‘మంచి పని చేశావు’ అన్నారు. మీడియా మాత్రం నన్ను పొగిడారు. ‘తేజ తీసి ఉంటే ఇంకా బాగా వచ్చేది’ అని. సినిమా తీయకుండా మంచి పేరు వచ్చింది. ► నేనెప్పుడూ అడ్వాన్స్డ్ సినిమాలే తీస్తుంటాను. ‘చిత్రం’ సినిమా ఇప్పటికీ రిలవెంట్గా ఉంటుంది. కొన్నిసార్లు నేనే స్క్రిప్ట్‌లో కొంచెం డోస్ తగ్గించుకుంటుంటా. ఇందులో కూడా కాజల్ – సోనూ సూద్ అగ్రిమెంట్ కాన్సెప్ట్ ఫస్ట్ వద్దన్నారు మా వాళ్లు. కానీ నేనే పెట్టించాను. బౌండెడ్ స్క్రిప్ట్ తీసుకొనే షూటింగ్‌కు వెళ్తాను. కామెడీ వరకు ఆన్ లొకేషన్లో మార్పులు చేర్పులు చేస్తుంటాం. ఎమోషన్స్‌ను మార్చను. మారిస్తే కథ మారిపోతుంది. ► నా మూడ్ బాలేక బాలకృష్ణ, వెంకటేశ్‌తో చేయాల్సిన రెండు సినిమాలు ఒకే రోజు వదిలేశా. ఆ సినిమాలు వదిలేశా అని బాధపడను. అదే కాదు ఏ విషయంలోనూ రిగ్రెట్ ఫీల్ అవ్వను. నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటో ఇంకా తెలియదు. ఈ సినిమా ఆడటాన్ని బట్టి ఉంటుంది. ► ‘తేజ కథలో ఎవ్వరూ చేయి పెట్టకూడదు, యాక్టర్స్‌ని కొడతాడు’ అని అనుకుంటారు. కానీ కథ గురించి టీమ్ అంతా కూర్చొని మాట్లాడుకుంటాం. సినిమా తీశాక కూడా నిర్మాతలకు చూపిస్తాను. మార్పులు చెబితే వింటాను. కొడతాడనే అభిప్రాయం కూడా ఒకందుకు మంచిదైంది. టైమ్‌పాస్ చేసేవాళ్లు రారు. సీరియస్‌గా, సిన్సియర్‌గా ఉండేవాళ్లే వస్తారు. ► మన జనాభా విపరీతంగా పెరిగిపోయింది. అందరికీ పని దొరకడం లేదు. దాంతో కొందరు సినిమాలను ఆపేయాలి, మా మనోభావాలు దెబ్బతిన్నాయి అన వివాదం చేయడానికి ఓ పనిగా పెట్టుకుంటున్నారు. పని ఉండి ఉంటే ఇవన్నీ పట్టించుకోడు ఎవ్వడూ. ఇండియాలో వెబ్సైట్లు చూస్తూ కూర్చునేవాళ్లు ఎక్కువ. అందుకే యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్ ఇండియా, చైనా మీద దృష్టి పెడుతుంటాయి. మేం తీసే పిచ్చివో, మంచివో సినిమాలకు కలెక్షన్స్ ఎందుకు ఇంత వస్తున్నాయి? ఎక్కువ మంది సినిమా చూస్తున్నారు కాబట్టే. ఖాళీగా ఉండేవాళ్లే మాకు దేవుళ్లు. -
ఓ సీత కథ
తేజ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా రూపొందుతున్న సినిమా ‘సీత’. రామబ్రహ్మాం సుకంర నిర్మిస్తున్నారు. అజయ్ సుకంర, అభిషేక్ అగర్వాల్ సహ–నిర్మాతలు. శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ సినిమా కొత్త పోస్టర్స్‌తో పాటు సినిమాను ఏప్రిల్ 25న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు చిత్రబృందం. ప్రస్తుతం ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. సోనూ సూద్, మన్నారా చోప్రా కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో కాజల్ పాత్రలో నెగటివ్ షేడ్స్ ఉంటాయి. పురాణాల్లో సీత ఫుల్ పాజిటివ్. ఆ సీతకు ఈ రీల్ సీతకు సంబంధం లేదు. ఈ రీల్ సీతలో కొత్త యాంగిల్ చూడబోతున్నామన్న మాట. ఈ సినిమాకు కిషోర్ గరికపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. -
క్వాలిటీ ముఖ్యం!
ఇండస్ట్రీలో పదేళ్లకుపైగా ఉంటూ అగ్రకథానాయికల లిస్ట్‌లో తన పేరు తప్పిపోకుండా కష్టపడుతూనే ఉన్నారు కాజల్ అగర్వాల్. ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్‌లో వరుస ఆఫర్లు అందుకుంటూ కెరీర్లో స్పీడ్ పెంచారీ బ్యూటీ. మీ సక్సెస్ మంత్ర ఏంటి? అని కాజల్‌ని అడిగితే...‘‘నాకు సూట్ అయ్యే పాత్రలనే ఎంపిక చేసుకుంటాను. సినిమా సినిమాకి నా పాత్రల మధ్య వైవిధ్యం ఉండేలా జాగ్రత్త పడతా. నా పాత్రకు ఆడియన్స్ ఎంత కనెక్ట్ అవుతారనే విషయం కూడా మైండ్‌లో ఉంచుకుంటా. క్వాలిటీ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ముఖ్యం. రోల్ మోడల్ అంటూ నాకు ప్రత్యేకంగా ఎవరూ లేరు. ప్రముఖ నటీనటుల నుంచి ఒక్కో డిఫరెంట్ క్వాలిటీని తీసుకుంటాను’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం తేజ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సీత’ అనే సినిమాలో టైటిల్ రోల్ చేస్తున్నారు కాజల్. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరో. ఈ సినిమాలో కాజల్ క్యారెక్టర్లో నెగటివ్ షేడ్స్ ఉంటాయట. కమల్‌హాసన్–శంకర్ కాంబినేషన్లో రాబోతున్న ‘ఇండియన్ 2’ చిత్రంలో కాజల్ కథానాయికగా నటిస్తారు. తమిళంలో ఆమె నటించిన ‘ప్యారిస్ ప్యారిస్’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. -
కేతిరెడ్డి నా బాగు కోరే ఆత్మీయుడు
‘‘కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి నాకు చిన్నప్పటి నుంచి స్నేహితుడు. నేను చిత్రం మూవీస్ సంస్థను స్థాపించడానికి కారణమైనవాళ్లలో ఆయన ఒకరు. ‘జయం, నిజం’ లాంటి హిట్స్ తీసేందుకు తన వంతు కృషి చేశారు. ఒక రకంగా చెప్పాలంటే నా బాగు కోరే ఆత్మీయుడు. తమిళనాడులో తెలుగు వారి సమస్యలపై ఆయన చేసిన ఉద్యమాలు అభినందనీయం. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు ఆయన ఎంతో కృషి చేస్తున్నారు’’ అని డైరెక్టర్ తేజ అన్నారు. తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు, ‘లక్మీస్ వీరగ్రం«థం’ సినీ నిర్మాత, దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి జన్మదిన వేడుకలు శనివారం తేజ ఆధ్వర్యంలో జరిగాయి. కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి మాట్లాడుతూ– ‘‘తేజ ఆధ్వర్యంలో జరిగిన ఈ పుట్టినరోజు వేడుకలను ఒక ఆత్మీయ వేడుకగా భావిస్తాను. తేజ తెరకెక్కిస్తోన్న ‘సీత’ చిత్రకథ నాకు తెలుసు. ఈ సినిమా కచ్చితంగా తేజ జీవితంలో ఒక మైలురాయిగా నిలుస్తుంది. త్వరలో ‘చిత్రం మూవీస్ సంస్థ’ ద్వారా తేజ కుమారుణ్ణి హీరోగా పరిచయం చేస్తూ, ఓ మల్టీ లాంగ్వేజ్ సినిమా నిర్మించనున్నాం. నేను తెరకెక్కిస్తోన్న ‘లక్మీస్ వీరగ్రంథం’ టీజర్‌ని ఈ నెల 9న విడుదల చేయనున్నాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నటులు దువ్వాసి మోహన్, మహేశ్, మీసం సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
మాస్ మసాలా స్టార్ట్
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తేజ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. కాజల్ అగర్వాల్ కథానాయిక. ఏటీవీ సమర్పణలో ఏకే ఎంటరై్టన్మెంట్స్ పతాకంపై అనీల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి డైరెక్టర్ వీవీ వినాయక్ క్లాప్ ఇవ్వగా, మరో డైరెక్టర్ శ్రీవాస్ కెమెరా స్విచ్చాన్ చేశారు. చిత్రదర్శకుడు తేజ తొలి షాట్ డైరెక్షన్ చేశారు. ‘‘మాస్ మసాలా ఎంటరై్టనర్‌గా తెరకెక్కనున్న చిత్రమిది. సోమవారమే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. తేజ, కాజల్ కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా ఇది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ రెండోసారి నటిస్తున్నారు’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ ప్రారంభోత్సవంలో మాజీ మంత్రి దానం నాగేందర్, నటుడు అభిమన్యు సింగ్ పాల్గొన్నారు. సోనూ సూద్ నటిస్తున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కృష్ణ కిషోర్ గరికపాటి, సహ నిర్మాతలు: అజయ్ సుంకర, అభిషేక్ అగర్వాల్, సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: శీర్షరే, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర రావు. -
మళ్లీ కాజల్‌తోనే రొమాన్స్
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్‌కు అవకాశాలు అస్సలు తగ్గటం లేదు. ఫ్రెష్ ఫేస్‌లకు పోటీగా ఆమె కెరీర్ కొనసాగుతోంది. ఓవైపు సీనియర్లతోపాటు కుర్ర హీరోలతోనూ రొమాన్స్ చేస్తోంది. తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న ఓ చిత్రంలో ఆమె నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంతో శ్రీనివాస్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. అయితే ఈ యువ హీరోతోనే ఆమె మరో ప్రాజెక్టుకు ఓకే చెప్పినట్లుగా ఓ వార్త వినిపిస్తోంది. తేజ దర్శకత్వంలో ఓ ప్రాజెక్టు కోసం ఈ ఇద్దరు మరోసారి జోడీ కట్టబోతున్నారని తెలుస్తోంది. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కబోయే ఈ ప్రాజెక్టును ఏకే ఎంటర్టైనర్మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మించబోతున్నారన్నది ఆ కథనం సారాంశం. ప్రస్తుతం తేజ స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నట్లు చెబుతున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
ఉదయ్ కిరణ్ బయోపిక్‌పై క్లారిటీ
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం టాలీవుడ్లో బయోపిక్‌ల క్రేజ్ కనిపిస్తోంది. మహానటి సక్సెస్‌తో మరిన్ని జీవితగాథలను వెండితెరపై తెరకెక్కించే ప్రయత్నాలు మొదలయ్యాయి. అయితే గత రెండు రోజులుగా ఆసక్తికర కథనాలు టాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొట్టాయి. దివంగత నటుడు ఉదయ్ కిరణ్ బయోపిక్ రాబోతుందని, దీనికి తేజ దర్శకత్వం వహించబోతున్నాడని, ‘కాబోయిన అల్లుడు’ అనే ఆసక్తికర టైటిల్ ఫిక్స్ చేశాడని ఆ కథనాల సారాంశం. అయితే ఆ వార్తలపై ఎట్టకేలకు దర్శకుడు తేజ స్పందించారు. ఉదయ్ కిరణ్ బయోపిక్‌ను తాను తీయట్లేదని, అదంతా రూమర్ అని ఆయన నవ్వేశారు. దీంతో పుకార్లకు పుల్‌స్టాప్ పడినట్లైంది. ఉదయ్ కిరణ్ కెరీర్‌కు తేజ సాయం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన చిత్రం తీయబోతున్నాడంటూ కథనాలు అల్లేశారు. అయితే తన తర్వాతి చిత్రం మాత్రం యాక్షన్ బ్యాక్ డ్రాప్లోనే ఉండబోతుందని తేజ స్పష్టం చేశారు. ఎన్టీఆర్ బయోపిక్ నుంచి అర్థంతరంగా తప్పుకున్న తేజ.. దగ్గుబాటి రానాతో తేజ యుద్ధ నేపథ్యంలో ఓ చిత్రం ఫ్లాన్ చేస్తున్నాడంటూ ఆ మధ్య ఓ టాక్ వినిపించింది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
ఎన్టీఆర్ బయోపిక్ నుంచి తప్పుకున్న తేజ
-
అందుకే తప్పుకున్నా: తేజ
దివంగత నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) బయోపిక్ ‘యన్.టి.ఆర్’ ప్రారంభోత్సవం మార్చి 29న హైదరాబాద్‌లో జరిగిన విషయం తెలిసిందే. తేజ దర్శకత్వంలో ఎన్.బి.కే ఫిలింస్ పతాకంపై విబ్రి మీడియా సమర్పణలో ఈ చిత్రం మొదలైంది. దసరాకి ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నారు. అయితే అనుకోకుండా బుధవారం ఈ చిత్రం నుంచి తేజ తప్పుకుంటున్నారనే వార్త వచ్చింది. ‘‘ఎన్టీఆర్ లాంటి మహా వ్యక్తి చరిత్రను తెరకెక్కించలేనేమో అనే భయంతోనే ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నాను’’ అని దర్శకుడు తేజ చెప్పినట్లుగా సినిమా పి.ఆర్.వో తెలిపారు. తేజ బయటకు వచ్చారనే వార్త రావడంతో నెక్ట్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కించే దర్శకుడు ఎవరు? అనే చర్చ మొదలైంది. సీనియర్ దర్శకుడు కె. రాఘవేంద్ర రావు ఆ బాధ్యత నిర్వహించే అవకాశం ఉందనే ఊహాగానాలు మొదలయ్యాయి. -
ఎన్టీఆర్ బయోపిక్ నుంచి తప్పుకున్న తేజ!
సాక్షి, హైదరాబాద్: దివంగత మాజీ ముఖ్యమంత్రి, తెలుగువారి అందాల నటుడు నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా ఆయన తనయుడు బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు తేజ దర్శకత్వంలో ఇటీవల ఈ సినిమా షూటింగ్ అట్టహాసంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. తండ్రి ఎన్టీఆర్ తరహాలో దుర్యోధనుడి వేషం ధరించిన సీన్లను షూటింగ్ ప్రారంభం సందర్భంగా తెరకెక్కించారు. అంతా సజావుగా జరుగుతుందనుకున్న సమయంలో ఎన్టీఆర్ బయోపిక్కు సంబంధించిన సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు నుంచి దర్శకుడు తేజ తప్పుకున్నారు. ఎన్టీఆర్ బయోపిక్‌ను తాను తెరకెక్కించడం లేదని ఆయన వెల్లడించారు. ఎన్టీఆర్ జీవితాన్ని ఎలా చూపించాలి? ఎక్కడి నుంచి ఎక్కడివరకు ఆయన జీవితాన్ని తెరకెక్కించాలి? అనే విషయాల్లో బాలకృష్ణకు, దర్శకుడు తేజకు మధ్య విభేదాలు వచ్చాయని, స్క్రిప్ట్ విషయంలో ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఆయన ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ బయోపిక్ నుంచి తేజ అర్ధాంతరంగా తప్పుకోవడంతో ఈ సినిమాకు బ్రేక్ పడిందనే భావిస్తున్నారు. కొత్త దర్శకుడిని రంగంలోకి తీసుకొచ్చేవరకు ఎన్టీఆర్ బయోపిక్ నిర్మాణం నిలిచిపోనుంది. మొత్తానికి తేజ మీడియా ముందుకు వస్తే తప్ప అసలు ఆయన ఎందుకు సినిమా నుంచి తప్పుకున్నారో తెలిసే అవకాశముందని అంటున్నారు. క్రిష్, రాఘవేంద్రరావుకు పిలుపు! మార్చి 29న తెలుగు దేశం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రామకృష్ణ స్టూడియోలో ఎన్టీఆర్ బయోపిక్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ క్యారెక్టర్ విషయంలో తేజ సూచనలు బాలకృష్ణకు నచ్చకపోవడం తోనే ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయని సంబంధిత వర్గాలు అంటున్నాయి. కథ ఎంతో బాగా వచ్చిందని, అయినప్పటికీ, సినిమాకు న్యాయం చేయలేనని పేర్కొంటూ తేజ తపుకున్నారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. తేజ తప్పుకున్న నేపథ్యంలో సీనియర్ దర్శకుడు కే. రాఘవేంద్రరావుకు, డైరెక్టర్ క్రిష్‌కు పిలుపు అందినట్టు సమాచారం. మే నెలలో 15 రోజులు షూటింగ్ చేయాలి అని బాలకృష్ణ పట్టుబడుతున్నట్టు సమచారం. బాలీవుడ్ సినిమా ‘మణికర్ణిక’ షూటింగ్లో క్రిష్ బిజీగా ఉండటంతో.. ఎన్టీఆర్ బయోపిక్‌ను డైరెక్ట్ చేసే చాన్స్ రాఘవేంద్రరావుకు దక్కవచ్చునని అంటున్నారు. వీరిద్దరు కుదరకపోతే స్వీయ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్‌ను తెరకెక్కించాలని బాలకృష్ణ భావిస్తున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు అంటున్నాయి. -
బాహుబలి ఫార్ములానే వాడతారా?
జానపద నేపథ్యం ఉన్న ఓ కథను బాహుబలి సిరీస్‌గా తెరకెక్కించి ఒక తెలుగు చిత్రం గురించి ప్రపంచమంతా చర్చించుకునేలా చేశాడు దర్శకుడు రాజమౌళి. నిజానికి తొలుత ఒక పార్ట్‌లో తీయాలని ఆయన భావించారంట. కానీ, నిడివి... కట్టప్ప వెన్నుపోటు లాంటి ట్విస్ట్.. పైగా ప్రధాన పాత్రల ద్వారా రెండో భాగంపై ఆసక్తి పెరగాలనే ఉద్దేశంతో విభజించానని తర్వాత పలు ఇంటర్వ్యూలో జక్కన్న చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడు ఇదే ఫార్ములాను ఎన్టీఆర్ బయోపిక్కు కూడా అన్వయించబోతున్నారని సమాచారం. ‘ఎన్టీఆర్’ కోసం చాలా గ్రౌండ్ వర్క్ చేసిన దర్శకుడు తేజ.. పెద్ద స్క్రిప్ట్‌నే రూపొందించాడంట. రామారావు జీవితంలో ఎన్నో మలుపులు.. ఎన్నో పాత్రలు.. అన్నింటికి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే ఈ చిత్రాన్ని సింపుల్‌గా కీలకాంశాలు చూపించి అయిపోగొట్టడం లాంటిది చేయకూడదనే ఆలోచనకు వచ్చాడంట. ఈ నేపథ్యంలో రెండు పార్ట్‌లుగా తెరకెక్కించేందుకు సిద్ధమైపోతున్నాడు. మొదటి పార్ట్ ట్విస్ట్‌తో ముగిసి.. దానిని రెండో పార్ట్ నుంచి కొనసాగించాలని యోచిస్తున్నాడంట. అందుకోసం ఇప్పుడు ఈ చిత్ర హీరో బాలకృష్ణను కన్విన్స్ చేసే పనిలో పడ్డాడని తెలుస్తోంది. రెగ్యులర్ షూటింగ్ సమయానికి దీనిపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. బయోపిక్‌ను కమర్షియల్ ఫార్మట్‌లో తెరకెక్కించాలంటే దానికి నాటకీయత చాలా అవసరం. ఆ ప్రయత్నంలో వాస్తవాలను కూడా చూపించాల్సి ఉంటుంది. దానికి ఎంఎస్ ధోనీ చిత్ర విజయమే ఉదాహరణ. ఎన్టీఆర్ లాంటి దిగ్గజం జీవితగాథను బాలయ్య లాంటి హీరోతో తెరకెక్కించడం తేజకు సవాలే. వ్యక్తిగత జీవితంతోపాటు కీలకమైన రాజకీయ ప్రస్థానం అంటే.. ముఖ్యమంత్రి కావటం.. వెన్నుపోటు లాంటి ఘట్టాలను పూర్తిగా చూపిస్తేనే ప్రేక్షకుడు కన్విన్స్ అయ్యే అవకాశం ఉంది. అలా కాకుండా ఒక దశ వరకు చూపించి.. అర్థాంతరంగా ముగిస్తే మాత్రం అది సరైంది కాదన్నది సినీ విశ్లేషకుల అభిప్రాయం. -
స్పెషల్ సీన్‌తో ‘ఎన్టీఆర్’
సాక్షి, హైదరాబాద్ : నందమూరి అభిమానుల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడనుంది. మార్చి 29వ తేదీన దిగ్గజ నటుడు నందమూరి తారక రామారావు బయోపిక్ ‘ఎన్టీఆర్’ లాంఛ్ కానుంది. ఇక తొలి షాట్‌ను ఆసక్తికరమైన సన్నివేశాలతోనే చిత్రీకరించాలని దర్శకుడు తేజ భావిస్తున్నాడంట. ‘1940లో ఎన్టీఆర్ మద్రాస్‌లో అడుగు పెట్టిన ఘట్టాన్నే ఫస్ట్‌షాట్‌గా తీయబోతున్నాడంట. అక్కడి నుంచే ఆయన వెండితెర నట ప్రస్థానం మొదలైందన్నది తెలిసిందే. అందుకే ఆ సీన్‌ను ప్రత్యేకంగా తెరకెక్కించేందుకు తేజ ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకోసం ఒక రోజు కేటాయించి.. వేసవి తర్వాత సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను చేయబోతున్నారని తెలుస్తోంది. ఇక సినిమా లాంఛ్‌కు ముఖ్య అతిథులుగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతారని.. పలువురు సినీ ప్రముఖులు, నందమూరి కుటుంబ సభ్యులు ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారని సమాచారం. బాలకృష్ణ లీడ్ రోల్లో కనిపించబోతున్న ఈ చిత్రానికి మ్యూజిక్ ఎంఎం కీరవాణి కాగా.. సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి, బాలకృష్ణ లు సంయుక్తంగా ‘ఎన్టీఆర్’ను నిర్మించబోతున్నారు. -
ఎన్టీఆర్ బయోపిక్‌పై స్పష్టత వచ్చేసింది
సాక్షి, సినిమా / విజయవాడ : ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో ఎట్టకేలకు స్పష్టత వచ్చేసింది. తేజ దర్శకత్వంలో తెరకెక్కబోయే ‘ఎన్టీఆర్’ చిత్రంలో సీనియర్ హీరో బాలకృష్ణ లీడ్ రోల్ పోషిస్తున్న విషయం విదితమే. ఈ నెల 29న చిత్రాన్ని లాంఛ్ చేయనున్నట్లు ఆయన నేడు మీడియాతో ప్రకటించారు. ఈ నేపథ్యంలో నేడు కృష్ణా జిల్లా పామర్రు మండలం కోమరవోలు, ఎన్టీఆర్ స్వస్థలం నిమ్మకూరు గ్రామాలలో త్వరలో బాలకృష్ణ పర్యటించారు. చిత్ర ముహూర్తానికి రావాలని ఆయా గ్రామల్లో ఉన్న తమ బంధువులను ఆయన ఆహ్వానించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బాలయ్య.. ఎన్టీఆర్ తనయుడిగా ఆయన జీవిత చరిత్ర నటించటం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్ రామకృష్ణ సినీ స్టూడియోలో తొలిషెడ్యూల్ షూటింగ్ జరగనున్నట్లు తెలియజేశారు. ఎన్టీఆర్ వాస్తవ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కబోయే చిత్రమని, ఎన్నికల సందర్భంగా తీసే సినిమా కాదని బాలయ్య స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. సినిమా షూటింగ్‌ను వేగవంతంగా పూర్తి చేసి వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. -
ఎన్టీఆర్ బయోపిక్.. ప్రధాన సమస్య అదే!
సాక్షి, సినిమా : ఇంకా సెట్స్ మీదకు వెళ్లక ముందే ఎన్టీఆర్ బయోపిక్ దర్శకుడు తేజకు ముచ్చెమటలు పోయిస్తోంది. ముఖ్యంగా తారాగణం విషయంలోనే దర్శకుడు గందరగోళంలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నటీనటులకు సంబంధించి ఒక్క బాలయ్య మినహాయించి ఇంత దాకా ఎవరి పేరును అధికారికంగా ప్రకటించలేదు. ఎన్టీఆర్ జీవితంలోని పాత్రలకు దగ్గరి పోలికలు ఉండాలన్న కారణంగానే కాస్టింగ్ ఎంపికలోనే జాప్యం జరుగుతోంది. ఇందుకోసం హాలీవుడ్ నుంచి వచ్చిన ఓ టీమ్ చాలా కష్టపడింది. ఇప్పటిదాకా మొత్తం 72 పాత్రలకు సంబంధించిన నమునాలను(స్కెచ్లను) వారు అందజేశారంట. దీంతో వాటికి తగ్గట్లు ఉండే వ్యక్తులను ఎంపిక చేసే పనిలో తేజ బిజీగా ఉన్నాడు. ఈ పనుల మూలంగానే ‘ఎన్టీఆర్’ చిత్రం సెట్స్ మీదకు వెళ్లటం ఆలస్యమౌతోంది. మరోవైపు బయోపిక్ పనుల జాప్యంపై బాలయ్య తీవ్ర అసంతృప్తితో ఉన్నాడనే మరో వార్త వినిపిస్తోంది. ఏది ఏమైనా వీలైనంత త్వరలో చిత్రాన్ని లాంఛ్ చేసి రూమర్లకు పుల్ స్టాప్ పెట్టాలని తేజ డిసైడ్ అయ్యాడు. అదే రోజు టీజర్‌ను కూడా విడుదల చేసే అవకాశం ఉంది. సుమారు 60 కోట్ల బడ్జెట్‌తో ‘ఎన్టీఆర్’ తెరకెక్కనుంది. -
ఎన్టీఆర్ బయోపిక్ టీజర్ రిలీజ్ వాయిదా
సంక్రాంతి బరిలో జై సింహాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నందమూరి బాలకృష్ణ, తరువాత ఎన్టీఆర్ బయోపిక్‌లో నటిస్తున్న సంగతి తెలసిందే. నేనే రాజు నేనే మంత్రి సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన తేజ దర్శకత్వంలో బాలయ్యే స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఎంతో రిసెర్చ్ చేసిన తరువాత ఎన్టీఆర్ బయోపిక్ ను ప్రారంభిస్తున్నామని గతంలోనే ప్రకటించాడు నందమూరి హీరో. ఈ సినిమా టీజర్ ను ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా జనవరి 18న రిలీజ్ చేయాలని భావించారు. టీజర్ కోసం ప్రత్యేకంగా షూటింగ్ కూడా చేశారు. తాజాగా టీజర్ రిలీజ్ ను వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది. టీజర్ రిలీజ్ ఎప్పుడున్న విషయాన్ని త్వరలోనే బాలకృష్ణ స్వయంగా ప్రకటించనున్నారు. -
62 గెటప్పుల్లో బాలయ్య
ఈ సంక్రాంతికి జై సింహాగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న నందమూరి బాలకృష్ణ త్వరలో సీనియర్ ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా తెరకెక్కబోయే సినిమాను ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ కోసం ప్రత్యేకంగా ఒకరోజు షూటింగ్ నిర్వహించారు. ఈ టీజర్‌ను ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఈ నెల 18న రిలీజ్ చేయనున్నారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు బాలయ్య. ఈ బయోపిక్‌లో ఎన్టీఆర్ జీవితాన్ని సమగ్రంగా తెరకెక్కిస్తున్నట్టుగా తెలిపిన బాలయ్య, దాదాపు 62 గెటప్పుల్లో కనిపిస్తానని వెల్లడించారు. అంతేకాదు సినిమాలో ఎన్టీఆర్ స్నేహితులు, సన్నిహితులతో పాటు ఆయన శత్రువుల ప్రస్థావన కూడా ఉంటుందని తెలిపారు. తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను నందమూరి బాలకృష్ణ స్వయంగా నిర్మాతగా మారి తెరకెక్కిస్తున్నారు. -
నందమూరి అభిమానులకు శుభవార్త..!
నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో ఎన్టీఆర్ బయోపిక్ రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంచలన దర్శకుడు తేజ దర్శకత్వం వహించనున్నారు. చాలా రోజలు క్రితమే అధికారికంగా ప్రకటించిన ఈ సినిమా, రెగ్యులర్ షూటింగ్ మొదలవ్వటానికి మరికొద్ది రోజుల సమయం పట్టనుంది. అయితే ఈ లోగా అభిమానుల కోసం ఓ ఆసక్తికరమైన టీజర్ ను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు చిత్రయూనిట్. బాలయ్య లుక్ ఏమాత్రం రివీల్ కాకుండా ఇంట్రస్టింగ్ కాన్సప్ట్ తో టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. ఇటీవలే ఈ టీజర్ కు సంబంధించిన షూటింగ్ రామకృష్ణ సినీ స్టూడియోస్ లో పూర్తయ్యిందన్న టాక్ వినిపిస్తోంది. ఈ టీజర్ లో ఎన్టీఆర్ రాజకీయ ప్రచారం కోసం వినియోగించిన చైతన్య రథాన్ని ప్రముఖంగా చూపించనున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ లుక్ లో ఉన్న బాలయ్యను వెనకనుంచి చూపించి టీజర్ ను ముంగిచాలని భావిస్తున్నారట. అయితే టీజర్ లో డైలాగ్స్ ఏమైనా ఉంటాయా..? లేదా..? తెలియాల్సి ఉంది. ఈ టీజర్ ను ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా జనవరి 18న రిలీజ్ చేయనున్నారు. -
వెంకీకి జోడీగా హైదరాబాదీ భామ!
సాక్షి, సినిమా : అగ్ర నటుడు వెంకటేష్ కొత్త చిత్రం కోసం హీరోయిన్ అన్వేషణ దాదాపు ముగిసినట్లేనన్న వార్త అందుతోంది. ఈ చిత్రం కోసం ఓ బాలీవుడ్ హీరోయిన్ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. నటి అదితి రావ్ హైదరి పేరు ఇప్పుడు తెరపైకి వచ్చింది. నిజానికి ఈ చిత్రం కోసం అనుష్క, కాజల్, తమన్నా పేర్లను తొలుత దర్శకుడు తేజ పరిశీలించాడు. వీరందరినీ కాదని అదితి రావ్‌ను ఫైనలైజ్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సిన అవకాశం ఉంది. కాగా, హైదరాబాదీ అయిన 31 ఏళ్ల అదితి పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించినప్పటికీ సక్సెస్ అందుకోలేకపోయింది. మణిరత్నం చెలియా చిత్రం కూడా ఆమె ఫేట్‌ను మార్చలేకపోయింది. దీంతో వెంకీ ప్రాజెక్టు పట్ల ఎంతో ఆసక్తిని ప్రదర్శిస్తున్నట్లు అర్థమౌతోంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్-సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆటా నాదే వేటా నాదే అన్న టైటిల్ పరిశీలనలో ఉంది. వచ్చే ఏడాది సమ్మర్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. -
వెంకీ 60 రోజుల్లో పూర్తి చేస్తాడట..!
సీనియర్ హీరోలు నాగార్జున, బాలకృష్ణ వరుస సినిమాలతో జోరు చూపిస్తుంటే మరో సీనియర్ హీరో వెంకటేష్ మాత్రం ఆచితూచి సినిమాలు చేస్తున్నాడు. సినిమాకు సినిమాకు మధ్య భారీగా గ్యాప్ తీసుకుంటూ నెమ్మదిగా కెరీర్ కొనసాగిస్తున్నాడు. గురు సినిమా తరువాత మరోసారి గ్యాప్ తీసుకున్న వెంకీ ఇటీవల తేజ దర్శకత్వంలో తదుపరి చిత్రాన్ని ప్రారంభించాడు. ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారట. వెంకీ కూడా ఈ సినిమాను వేసవి బరిలోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. అందుకు తగ్గట్టుగా షూటింగ్ కోసం పక్కా ప్లాన్ రెడీ చేస్తున్నారు. టాకీ పార్ట్ మొత్తాన్ని 60 రోజుల్లోనే పూర్తి చేసేలా తేజ టీం షూటింగ్ ను ప్లాన్ చేసింది. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాకు అనూప్ రుబెన్స్ సంగీతమందిస్తుండగా.. అభినందన్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. వెంకీతో తెరకెక్కించబోయే సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి వెంటనే బాలకృష్ణతో ఎన్టీఆర్ బయోపిక్ పనులు ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు తేజ. -
‘ఆటా నాదే..వేటా నాదే’ అంటున్న అగ్రహీరో
సాక్షి, హైదరాబాద్: విక్టరీ వెంకటేష్, క్రియేటివ్ డైరెక్టర్ తేజ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ఈ మూవీకి 'ఆటనాదే వేటనాదే' అనే టైటిల్ పెట్టాలని భావిస్తోందట చిత్ర యూనిట్. సోమవారం ఉదయం రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి పరచూరి గోపాల కృష్ణ, రాజా రవీంద్ర, అనీల్ సుంకర తదితరులు హాజరయ్యారు. తేజ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ కొత్త చిత్రం ఎట్టకేలకు హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో అధికారికంగా పూజ వేడుకలతో ప్రారంభమైంది.‘ నేనే రాజు నేనే మంత్రి` హిట్‌తో మళ్లీ లైమ్‌లైట్‌లోకి వచ్చిన తేజ ఈ సారి ఏకంగా వెంకటేష్‌తో మరో హిట్ కొట్టేందుకు రడీ అవుతున్నాడు. అలాగే 'గురు' సినిమా తర్వాత గ్యాప్ తీసుకుని వెంకీ చేస్తున్న సినిమా ఇది. టైటిల్ బట్టి చూస్తోంటే..థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని భావిస్తున్నారు. డిసెంబరు 16 లేదా 18 వ తేదీ నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. వెంకటేష్ జన్మదినం సందర్భంగా ఈ నెల 13 వ తేదీన ఈ చిత్రాన్ని ప్రారంభించనున్నట్టు వార్తలొచ్చినా .. ముందుగానే ప్రారంభించారు. తాజా నివేదికల ప్రకారం ఈ మూవీకి 'ఆటా నాదే వేటానాదే' అని పేరు పెట్టినట్టు తెలిసింది. సురేష్ ప్రొడక్షన్, ఏకే ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమాకి అభినందన్ సినిమాటోగ్రాఫర్. మరిన్ని వివరాలు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. -
పాతికేళ్ల తర్వాత... కాలేజీలో క్లాసులు!
కళ్లజోడు... గళ్లచొక్కా... రెండిటికీ తోడు చక్కగా బూటులు వేసుకుని, టై కట్టుకుని పాతికేళ్ల క్రితమే వెంకటేశ్ పాఠాలు చెప్పారు. ‘సుందరకాండ’ సిన్మాలో! రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాలో జూనియర్ కాలేజ్ లెక్చరర్‌గా వెంకీ కనిపించారు. మళ్లీ ఇప్పుడు కాలేజీలో క్లాసులు చెప్పడానికి రెడీ అవుతున్నారట! తేజ దర్శకత్వంలో నటించే సినిమా కోసం! వెంకటేశ్ హీరోగా తేజ దర్శకత్వంలో సురేశ్ ప్రొడక్షన్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు ఓ సినిమా నిర్మించనున్న సంగతి తెలిసిందే. యాక్షన్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమాలో వెంకీ కాలేజ్ ప్రొఫెసర్‌గా కనిపిస్తారట! ఎట్ ద సేమ్ టైమ్... ఆయన లుక్ చాలా స్టైలిష్‌గా ఉంటుందని సమాచారమ్. వెంకటేశ్ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 13న మొదలు కానున్న ఈ సిన్మాలో హీరోయిన్ ఎవరనేది చిత్రబృందం ఇంకా ప్రకటించనప్పటికీ... కాజల్ అగర్వాల్ పేరు పరిశీలనలో ఉందట!! -
ఒకేసారి రెండు సినిమాలు..!
ఆచితూచి సినిమాలు చేస్తున్న సీనియర్ హీరో వెంకటేష్ గురు లాంటి హిట్ సినిమా తరువాత మరోసారి గ్యాప్ తీసుకున్నారు. ప్రస్తుతం కథలు ఫైనల్ చేసే పనిలో ఉన్న వెంకీ ఒకేసారి రెండు సినిమాలను సెట్స్ మీదకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారట. నేనే రాజు నేనే మంత్రి సినిమాతో ఘనవిజయం సాధించిన దర్శకుడు తేజ మరోసారి సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో సినిమా చేయనున్నాడు. ఈ సినిమా వెంకటేష్ హీరోగా తెరకెక్కనుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమాను డిసెంబర్ 13న ప్రారంభించనున్నారు. ఈ సినిమాతో పాటు మరో సినిమాకు కూడా వెంకటేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది. రాజా ది గ్రేట్ సినిమా సక్సెస్‌తో హ్యాట్రిక్ సాధించిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకీ ఓ మల్టీ స్టారర్ సినిమా చేయనున్నాడు. దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కనున్న ఈ సినిమాకు ఎఫ్ 2(ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్) అనే టైటిల్‌ను ఫైనల్ చేశారట. ఈ సినిమాను కూడా 2018 మొదట్లోనే ప్రారంభించే ఆలోచనలో ఉన్నారు. అంటే తేజ సినిమా సెట్స్ మీద ఉండగానే అనిల్ రావిపూడి సినిమా ప్రారంభంకానుంది. మరి స్లో అండ్ స్టడీ సూత్రాన్ని ఫాలో అవుతున్న వెంకీ.. రెండు సినిమాలను ఒకేసారి చేస్తాడో లేదో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. -
ఆ రోజే... కొత్త సినిమా ప్రారంభం!
డిసెంబర్ 13... ‘విక్టరీ’ వెంకటేశ్ బర్త్‌డే. ఆ రోజునే కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టాలనుకుంటున్నారట వెంకీ అండ్ కో! తేజ దర్శకత్వంలో ఈ స్టార్ హీరో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఆ సినిమానే బర్త్‌డేకి లాంచ్ చేయాలనుకుంటున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. స్క్రిప్ట్ వర్క్ ఆల్మోస్ట్ కంప్లీటెడ్ అట! ప్రస్తుతం ప్రీ–ప్రొడక్షన్ వర్క్ చివరి దశలో ఉందంటున్నారు. ‘గురు’ తర్వాత వెంకీ హీరోగా నటించనున్న చిత్రమిది. యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమాను రూపొందించనున్నారు. ఇందులో వెంకీ సరసన ఎవరు నటిస్తారనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదట! ప్రస్తుతానికి కాజల్ అగర్వాల్ పేరు వినబడుతోంది. తేజ లాస్ట్ సిన్మా ‘నేనే రాజు నేనే మంత్రి’లో కాజలే మెయిన్ హీరోయిన్. ‘లక్ష్మీ కల్యాణం’తో ఆమెను తెలుగు తెరకు పరిచయం చేసిందీ ఆయనే. అందువల్ల, తేజ అడిగితే కాజల్ ‘యస్’ చెప్పే అవకాశాలు ఎక్కువే! ఈ చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్, ఏకే ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయని తెలుస్తోంది!! వెంకటేశ్ సినిమా తర్వాత బాలకృష్ణ హీరోగా రూపొందనున్న ఎన్టీఆర్ బయోపిక్‌కి తేజ దర్శకత్వం వహించనున్నారు. -
'ఈ నగరానికి ఏమైంది' అంటున్న వెంకీ
సీనియర్ హీరో వెంకటేష్ ఈ మధ్య ఆచితూచి సినిమాలు చేస్తున్నారు. సినిమా సినిమాకు మధ్య చాలా గ్యాప్ తీసుకుంటున్నారు. ముఖ్యంగా రామానాయుడు మరణం తరువాత గురు సినిమా మాత్రమే చేసిన వెంకీ.. మరోసారి లాంగ్ గ్యాప్ తీసుకొని తేజ దర్శకత్వంలో నటించేందుకు అంగీకరించాడు. సొంత నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కనుంది. రానా హీరో నేను రాజు నేనే మంత్రి లాంటి భారీ హిట్ సాధించిన తేజ మరోసారి అదే బ్యానర్ లో అదే ఫ్యామిలీ హీరోతో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు ఓ ఆసక్తికరమైన టైటిల్ ఫైనల్ చేశారన్న వార్త వినిపిస్తోంది. ఇటీవల సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఫిలిం ఛాంబర్ లో 'ఈ నగరానికి ఏమైంది..?' అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించారు. దీంతో ఈ టైటిల్ వెంకీ, తేజ ల సినిమాకే అన్న ప్రచారం మొదలైంది. వెంకటేష్ సినిమాతోపాటు తరుణ్ భాస్కర్ దర్శకత్వంలోనూ మరో సినిమాను కూడా నిర్మిస్తోంది సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ మరి ఈ రెండింటిలో ఈ ఆసక్తికర టైటిల్ ఏ సినిమాకు ఫిక్స్ చేస్తారో చూడాలి. -
ఎన్టీఆర్ బయోపిక్ మరో వార్త..!
నందమూరి తారకరామారావు జీవితకథ ఆధారంగా ఆయన తనయుడు, హీరో నందమూరి బాలకృష్ణ బయోపిక్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పనులు ఊపందుకున్నాయి. దర్శకుడు తేజ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ నటిస్తున్న ఈసినిమాను తెలుగుతో పాటు హిందీలోనూ రూపొందించనున్నారట. ఈ విషయాన్ని ప్రముఖ బాలీవుడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. అయితే ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఓ సినిమాను రూపొందిస్తున్నాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించి అక్టోబర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. దీంతో ఈ రెండు చిత్రాల్లో ఎన్టీఆర్ జీవితాన్ని ఎవరు ఎలా చూపిస్తారో అని అభిమానులు ఆసక్తిగా గమనిస్తున్నారు. Biopic on legendary actor and politician NTR being made in Telugu and Hindi. Actor Balakrishna [son of NTR] will play NTR in the biopic... pic.twitter.com/q8b6QYTD34 — taran adarsh (@taran_adarsh) 13 October 2017 -
ఎన్టీఆర్ బయోపిక్... స్టార్టింగ్ సూన్!
హీరో బాలకృష్ణ, దర్శకుడు తేజ మధ్య చర్చలు ముగిశాయి. చిత్రీకరణ మొదలు కావడమే మిగిలుంది! ఎన్టీఆర్ బయోపిక్ గురించే ఈ ఇద్దరు చర్చించుకున్నారు. హీరో, దర్శకుడు ఓ ఐడియాకి వచ్చేశారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తామని ఫేస్బుక్ ద్వారా తేజ ప్రకటించారు. తెలుగు చిత్రసీమలోనూ, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసి, ప్రేక్షకుల మనసుల్లో నిలిచిన స్వర్గీయ ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా ఓ సినిమా రూపొందించనున్నట్టు ఆయన తనయుడు, హీరో నందమూరి బాలకృష్ణ గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. బాలకృష్ణ హీరోగా నటించనున్న ఈ చిత్రానికి తేజ దర్శకత్వం వహించనున్నారు. ‘‘ఎన్టీఆర్ బయోపిక్... స్టార్టింగ్ సూన్’’ అని బుధవారం తేజ పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని బాలకృష్ణే నిర్మిస్తారట! -
ఎన్టీఆర్ బయోపిక్ : వర్మ కాదు.. ఆయన శిష్యుడు
నందమూరి తారక రామారావు బయోపిక్ పై రోజుకో వార్త టాలీవుడ్ సర్కిల్స్ లో హల్ చల్ చేస్తోంది. బాలకృష్ణ ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా సినిమా తెరకెక్కించనున్నట్టుగా ప్రకటించారు. అప్పటి నుంచే వివాదాలు మొదలయ్యాయి. అదే సమయంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించటం మరింత ఆసక్తి కలిగేలా చేసింది. తాజాగా మరో ఆసక్తికరమైన వార్త టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. నేనే రాజు నేనే మంత్రి సినిమాతో పొలిటికల్ థ్రిల్లర్ లను కూడా తెరకెక్కించగలనని ప్రూవ్ చేసుకున్న దర్శకుడు తేజ. ఎన్టీఆర్ బయోపిక్ కు దర్శకత్వం వహించే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఈ విషయంపై దర్శకుడు తేజ స్పందించారు. తాను బాలకృష్ణతో ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో చర్చించిన విషయం నిజమేనన్న తేజ, తాను దర్శకత్వం వహించేది లేనిది త్వరలోనే ప్రకటిస్తానని తెలిపారు. వర్మ మాత్రం తన స్టైల్ లో ఎన్టీఆర్ బయోపిక్ తో వివాదాలు సృష్టిస్తున్నారు. ఇప్పటికే లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే టైటిల్ తో ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసిన వర్మ, వచ్చే ఏడాది చివరకు సినిమాను రిలీజ్ చేస్తానని తెలిపారు. -
తేజ దర్శకత్వంలో మెగా మల్టీ స్టారర్..?
చాలా కాలం తరువాత నేనే రాజు నేనే మంత్రి సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన దర్శకుడు తేజ, ఇప్పుడు మరో ఇంట్రస్టింగ్ సినిమాకు రెడీ అవుతున్నాడన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే యంగ్ హీరోలతో ఓ మల్టీ స్టారర్ సినిమా చేసే ఆలోచన ఉన్నట్టుగా తేజ ప్రకటించాడు. అయితే ఆ హీరోలు ఎవరన్నది మాత్రం వెల్లడించలేదు. తాజాగా తేజ దర్శకత్వంలో మల్టీ స్టారర్ సినిమా చేయబోయే హీరోలకు సంబంధించి ఆసక్తికరమైన వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్ లో హల్ చల్ చేస్తోంది. బిగ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న మెగా హీరోలు సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ లు తేజ దర్శకత్వంలో కలిసి నటించనున్నారట. ఈ సినిమా యునైటెడ్ మూవీస్ బ్యానర్ లో తెరకెక్కనుంది. అయితే ఈ మెగా మల్టీ స్టారర్ కు సంబంధించి అఫీషియల్ గా మాత్రం ఎలాంటి కన్ఫర్మేషన్ రాలేదు. అయితే చిత్రయూనిట్ ఈ వార్తలను ఖండించకపోవటంతో అభిమానులు మెగా మల్టీ స్టారర్ సెట్స్ మీదకు రావటం ఖాయం అని భావిస్తున్నారు. -
మరో స్టార్ వారసుడితో తేజ..?
రానా హీరోగా తెరకెక్కిన నేనే రాజు నేనే మంత్రి సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన స్టార్ డైరెక్టర్ తేజ, మరో ఇంట్రస్టింగ్ సినిమాకు రెడీ అవుతున్నారట. తన కెరీర్ లో ఎక్కువగా కొత్త నటీనటులతోనే విజయాలు సాధించిన తేజ, స్టార్ ఇమేజ్ ఉన్న హీరోలతో సినిమాలు చేసిన ప్రతీ సారి ఫెయిల్ అయ్యారు. దీంతో లాంగ్ గ్యాప్ తరువాత రానా లాంటి స్టార్ తో సినిమా చేసి మెప్పించిన ఈ క్రియేటివ్ డైరెక్టర్ మరోసారి స్టార్ వారసుడి మీద దృష్టి పెట్టారు. ఈ సారి మెగా క్యాంప్ మీద కన్నేసిన తేజ, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఫిదా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన వరుణ్ ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. తేజ కథా కథనాలు రెడీ చేయడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. వెంకీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పూర్తయిన తరువాత షార్ట్ గ్యాప్ తీసుకొని తేజ సినిమాకు రెడీ అవ్వనున్నారు వరుణ్. ప్రస్తుతానికి ఈ కాంబినేషన్ పై ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా.. తేజ లాంటి దర్శకుడితో సినిమా చేస్తే వరుణ్ కు లవర్ భాయ్ మరింత స్ట్రాంగ్ ఇమేజ్ వస్తుందని భావిస్తున్నారు ఫ్యాన్స్. -
నాయుడుగారుంటే ఆనందపడేవారు!
‘‘మా పిల్లలు ఓపెన్‌గా మాట్లాడతారు. ‘ఈ కథ తీస్తున్నావా? ఫ్లాపేలే! నువ్వెళ్లి వాళ్లతో సినిమా తీయొచ్చుగా’ అంటుంటారు. ‘మీరేమో ఇక్కడ కూర్చుని చెబుతారు. వాళ్లు డేట్స్ ఇవ్వరు. ఒక్క హిట్ సాధించాలి’ అనేవాణ్ణి. ఈ ట్రైలర్ విడుదలకు ముందు నేనొస్తుంటే కొందరు లోపలకు వెళ్లి తలుపులు వేసుకునేవారు. ఇప్పుడు ఎదురొచ్చి ‘ట్రైలర్ బాగుంది. కంగ్రాట్స్’ అంటుంటే... ‘ఇదేదో ఆడే సిన్మాలా ఉంది’ అనుకున్నా. మా పిల్లలూ ‘హిట్’ అంటున్నారు’’ అన్నారు తేజ. రానా, కాజల్ అగర్వాల్ జంటగా ఆయన దర్శకత్వంలో డి. సురేశ్‌బాబు, కిరణ్‌రెడ్డి, భరత్ చౌదరిలు నిర్మించిన ‘నేనే రాజు నేనే మంత్రి’ ఈ శుక్రవారం విడుదలవుతోంది. తేజ చెప్పిన సంగతులు... ♦ నేను, మా ఫ్యామిలీ పొలిటికల్ సిన్మాలకు వెళ్లం. నేను వెళ్లనప్పుడు అలాంటి సినిమా ఎందుకు తీస్తా? ట్రైలర్, అందులో డైలాగులను చూసి పొలిటికల్ థ్రిల్లర్ అనుకుంటున్నారు గానీ... ఇందులో మసాలాలన్నీ ఉన్నాయి. రాజకీయాలు పది శాతమే ఉన్నాయి. రాజకీయ నేపథ్యంలో తీసిన భార్యాభర్తల కథే ఈ సిన్మా. కమర్షియల్ మీటర్లో ఆర్ట్ ఫిల్మ్‌గా తీశా. ♦ ఈ సిన్మాలో జోగేంద్ర అనే వ్యక్తి ఐదేళ్ల జీవిత కథను, అందులో మంచి–చెడు, దేశానికి బాగు చేసే, చేటు చేసే పనులు... అన్నీ చూపించా. రేపు మనం ఈ సీన్ చేస్తున్నామని రానాకి చెబితే, మర్నాడు క్యారెక్టర్‌కు కావల్సిన మూడ్‌లో సెట్‌కి వచ్చేవాడు. చాలామంది ‘నాకు నటన బాగా వచ్చు. నేను సూపర్ స్టార్’ అన్నట్టు సెట్‌కి వస్తారు, అదే ఫీల్‌తో చేస్తారు. రానా అలా కాదు. పాత్రకు తగ్గట్టు మారతాడు. ♦ నేను దర్శకుడిగా ఫెయిల్ అయ్యానో? లేదో? కానీ... కథకుడిగా కొన్నిసార్లు ఫెయిలయ్యా! ఈసారి కథ బలంగా ఉండాలనుకున్నా. ఈ కథను రాజశేఖర్‌గారితో ‘అహం’గా తీయాలనుకున్నా. ♦ వర్కౌట్ కాలేదు. కథకు న్యాయం చేయాలేనేమోనని వెనక్కి వచ్చేశా. తర్వాత సురేశ్‌బాబుతో కూర్చున్నాక రానాకు సూట్ అయ్యేలా కథలో మంచి మార్పులు జరిగాయి. నాకు పర్ఫెక్ట్ ప్రొడ్యూసర్ ఆయన. నేను అనుకున్న లెవల్ కంటే సినిమా బాగా రావడానికి ఆయనే కారణం. ట్రైలర్ బాగుందని షేక్ హ్యాండ్ ఇచ్చేవాళ్లలో కొందరు ‘సురేశ్‌బాబు బాగుందని చెప్పారంటే తప్పకుండా బాగుంటుంది’ అంటున్నారు. ♦ మద్రాస్‌లో సురేశ్ ప్రొడక్షన్స్ ఆఫీసు వెనుక అవుట్ హౌస్‌లో మా ఫ్యామిలీ ఉండేది. నేను స్కూల్‌కి వెళుతూ, వస్తూ గోడపై పోస్టర్లలో రామానాయుడిగారి పేరు చూస్తుండేవాణ్ణి. ఇప్పుడు సురేశ్ సంస్థలో సినిమా చేయడం హ్యాపీ. నాయుడుగారుంటే ఆయన మనవడితో మంచి సినిమా తీసినందుకు సంతోషపడేవారు. రష్ చూసి రానాతో ‘మీ తాతగారు ఉండుంటే బాగుండేది’ అన్నాను. ♦ ‘‘ఆరో తరగతి, ఏడో తరగతి పిల్లలకు డ్రగ్స్ అలవాటు చేశారు. దీన్ని సహించకూడదు. చిన్న పిల్లలను కాపాడండి. వాళ్లే ఫ్యూచర్ సిటిజన్స్’’ అన్నారు తేజ. డ్రగ్స్ అంశంలో సినీ ప్రముఖుల పేర్లు రావడం సినిమాలపై ప్రభావం చూపిస్తుందా? అని తేజను అడగ్గా... ‘‘కథ బాగుంటే ప్రేక్షకులు చూస్తారు. అన్నా హజారే గొప్ప వ్యక్తి. ఆయన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తే చూస్తారా? చూడరు! ఫలానా వ్యక్తి డ్రగ్స్ తీసుకుంటున్నాడనేది అనవసరం. సినిమా బాగుంటే చూస్తారు. వ్యక్తిగత అభిరుచులు, అభిప్రాయాలతో మనం (ప్రేక్షకులు) కనెక్ట్ అవ్వం’’ అన్నారు. -
పెనకచెర్లడ్యాంపై షూటింగ్‌కు ఏర్పాట్లు
పెనకచెర్లడ్యాం(శింగనమల) : నేనే రాజు–నేనే మంత్రి సినిమాలోని ఒక సన్నివేశాన్ని గార్లదిన్నె మండలం పెనకచెర్లడ్యాంపై షూటింగ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ షూటింగ్ ఈ నెల 23వ తేదీన ఉండటంతో మంగళవారం ఈ సినిమా దర్శకుడు తేజ ఈ ప్రాంతాన్ని సందర్శించారు. -
త్వరలో 'అనంత'లో సినిమా షూటింగ్!
అనంతపురం ఎడ్యుకేషన్ : విక్టరీ వెంకటేష్, యువ హీరో దగ్గుబాటి రానా కథానాయకులుగా తేజ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం షూటింగ్‌కు ‘అనంత’ వేదిక కానుంది. ఇందుకోసం మూడు రోజుల కిందట స్వయంగా డైరెక్టర్ తేజ అనంతపురం వచ్చి కొత్తూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలతోపాటు శత వసంతాల చరిత్ర కలిగిన ఆర్ట్స్ కళాశాలను పరిశీలించారు. ఆర్ట్స్ కళాశాలలో షూటింగ్‌కు అనుమతి ఇవ్వాలని ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.రంగస్వామిని కోరారు. సెలవు దినాల్లో షూటింగ్ పెట్టుకుంటే తమకు ఎటువంటి అభ్యంతరం లేదని ప్రిన్సిపల్ పేర్కొన్నారు. అయితే ముందుగా అనుమతి లేఖ ఇస్తే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఆమోదం తీసుకుంటామన్నారు. దీనిపై ప్రిన్సిపల్ రంగస్వామి 'సాక్షి'తో మాట్లాడుతూ డైరెక్టర్ తేజ వచ్చి కళాశాలను సందర్శించారన్నారు. త్వరలోనే షూటింగ్ ఏర్పాటుకు అనుమతులు కోరుతూ లేఖ పంపుతామని చెప్పారన్నారు. -
కాజల్.. కేథరిన్...మధ్యలో రానా
ప్రేమ కథలతో సంచనాలత్మక చిత్రాలు రూపొందించిన దర్శకుడు తేజ... ‘బాహుబలి’తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు రానా... వీళ్లిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే రేర్ న్యూసే మరి. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ నాయిక అంటే అది కూడా స్పెషల్ న్యూసే. ఎందుకంటే తేజ దర ్శకత్వం వహించిన ‘లక్ష్మీ కల్యాణం’ సినిమాతోనే కాజల్ తెలుగు తెరకు పరిచయమయ్యారు. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ తేజతో కాజల్ చేయనున్న చిత్రమిదే. ముందు రానా, కాజల్‌ని ఎంపిక చేసి ఫొటోషూట్ కూడా చేశారు. తాజాగా కేథరిన్ చేరారు. మరో నాయికగా ఆమెను ఎంపిక చేశారు. ఓ భిన్నమైన కథాంశంతో తేజ ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అనూప్ రూబెన్స్ స్వరకర్త. -
సినీ దర్శకుడు తేజపై క్రిమినల్ కేసు
హైదరాబాద్: సినీ దర్శకుడు తేజ, వడ్డెర సత్యం, కైసర్ గ్యాంగ్ నుంచి తనకు ప్రాణ హాని ఉందంటూ కలప వ్యాపారి ఆర్వి.కృష్ణారావు ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు ముగ్గురిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం ఫిలింనగర్ రోడ్ నెం.9లో నివసించే ఆర్వి.కృష్ణారావు టింబర్ బిజినెస్ చేస్తున్నారు. ఈ నెల 7వ తేదీన రాత్రి 8 గంటల సమయంలో ఫిలింనగర్‌లోని ముక్తిధామం సాయిబాబా దేవాలయం నుంచి బంజారాహిల్స్ రోడ్ నెం.12 వైపు వెళ్తుండగా విక్కి అనే వ్యక్తి కారు ఆపి ఆయనను కలుసుకొని వడ్డెర సత్యం, కైసర్ గ్యాంగ్ నీపై దృష్టి పెట్టాయని సినిమా దర్శకుడు తేజ ఇంటి విషయాన్ని సెటిల్ చేసుకోవాలని సూచించారు. హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న ఈ ఇంటి విషయాన్ని త్వరగా తేల్చుకోకపోతే వడ్డెర సత్యం, కైసర్ గ్యాంగ్ చూస్తూ ఊరుకోవని హెచ్చరించారు. మళ్లీ ఈ నెల 13వ తేదీన సినీ డెరైక్టర్ తేజ ఇదే విషయంపై కృష్ణారావుకు ఫోన్ చేసి దూషించాడు. తనకు ఈ ముగ్గురి నుంచి ప్రాణ హాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బంజారాహిల్స్ పోలీసులు న్యాయ సలహా కోసం ఫిర్యాదును కోర్టుకు పంపించారు. కోర్టు ఆదేశాలతో శనివారం రాత్రి ముగ్గురిపై ఐపీసీ సెక్షన్ 506 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
యాంగ్రీ హీరోతో క్రేజీ డైరెక్టర్
చాలా రోజులుగా హిట్ కోసం ఎదురు చూస్తున్న ఇద్దరు టాలీవుడ్ స్టార్స్ కలిసి పనిచేయడానికి రెడీ అవుతున్నారు. హీరోగా ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు మాస్ ఆడియన్స్‌ను కూడా మెప్పించిన యాంగ్రీ హీరో రాజశేఖర్ కొంత కాలంగా సరైన హిట్ లేక ఇబ్బందుల్లో ఉన్నాడు. స్ట్రయిట్ సినిమాలతో పాటు రీమేక్‌లు కూడా సక్సెస్ ఇవ్వకపోవటంతో ఆలోచనలో పడ్డ రాజశేఖర్ ఓ ఆసక్తికరమైన కాంబినేషన్‌కు రెడీ అవుతున్నాడు. చిత్రం, జయం, నువ్వునేను లాంటి సినిమాలతో స్టార్ హీరోలకు పోటీగా క్రేజ్ సంపాదించుకున్న దర్శకుడు తేజ. ఒకప్పుడు స్టార్ డైరెక్టర్‌గా ఉన్న తేజ ఇటీవల కాలంలో మినిమమ్ కలెక్షన్లు సాదించే సినిమాలు కూడా అందించలేకపోతున్నాడు. తాజాగా తేజ దర్శకత్వంలో వచ్చిన 'హోరాహోరీ' కూడా ఆశించిన స్ధాయి విజయం సాధించలేకపోయింది. దీంతో మరోసారి ఆలోచనలో పడ్డ తేజ, రాజశేఖర్ లీడ్రోల్లో సినిమా తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉన్న ఈ సినిమాను 'నిజం' తరహాలో సోషల్ ఎలిమెంట్‌తో కూడిన చిత్రంగా తెరకెక్కించనున్నాడు. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లి, వీలైనంత త్వరగా రిలీజ్ కు రెడీ చేయాలని భావిస్తున్నారు. -
హిట్ కోసం హోరాహోరీ
కొత్త సినిమా గురూ! తెర వెనుక కబుర్లు * విపరీతంగా వర్షపాతం ఉండే కర్ణాటకలోని ఆగుంబెలో ప్రధాన భాగం చిత్రీకరించారు. ఆ చిత్తడి నేలలో జలగలు, పాములు ఎక్కువ. * అతి తక్కువ మంది యూనిట్‌తో చిత్రీకరణ జరిపారు. లొకేషన్లో 23 మందితో, హీరో నుంచి లైట్‌బాయ్ దాకా అందరికీ ఒకే ఫుడ్, ట్రీట్మెంట్తో పొదుపుగా సినిమా తీశారు. * ‘హోరాహోరీ’లో కృత్రిమంగా సృష్టించే షూటింగ్ వాన కూడా రియల్‌గా అనిపించేలా జాగ్రత్త పడ్డారు. ‘రెయిన్ మిషన్’ తయారు చేశారు. * హీరో, హీరోయిన్, విలన్ - ఈ ముగ్గురికీ షూటింగ్ కన్నా ముందే క్యాస్టింగ్ డెరైక్టర్ రామానంద్ దగ్గర ప్రత్యేక శిక్షణనిప్పించారు. ‘చిత్రం’ టైమ్‌లో ఉదయ్ కిరణ్ నుంచి చాలా మంది కొత్తవాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చింది ఆయనే! * కెమేరామన్ దీపక్ భగవంత్ సినిమాల్లోకి రాక ముందు తంజావూరు బృహదీశ్వరాలయంలో అఫిషియల్ ఫొటోగ్రాఫర్. ఈ కొత్త మిలీనియమ్ ప్రారంభంలో టీనేజ్ లవ్‌స్టోరీ ‘చిత్రం’తో తెలుగు సినిమా సరికొత్త ప్రయాణానికి దిశ చూపించిన దర్శకుడు తేజ. ఆ తరువాత ‘నువ్వు - నేను’, ‘జయం’ లాంటి హిట్సిచ్చిన ఈ మాజీ సినిమాటోగ్రాఫర్‌కు మళ్ళీ అంత పెద్ద విజయాలు దక్కలేదు. వైఫల్యా లను ఎదుర్కొంటున్న ఆయన ఈసారి ‘హోరాహోరీ’ (ఉపశీర్షిక ‘ఫైట్ ఫర్ లవ్’)తో ముందుకొచ్చారు. జయము... జయము... టీనేజ్ లవ్‌స్టోరీకి! టీనేజ్ ప్రేమకథల్లో పెద్ద హిట్టయి, ఒక దశ తరువాత తేజ చేతులకూ, కాళ్ళకూ అడ్డంగా మారిన ‘జయం’ సినిమా తాలూకు ప్రభావం ఈ సినిమా మీదా ఉంది. హైదరాబాద్‌లో అభిరామ్ పోలీసు ఉన్నతాధికారి. చెల్లెలు మైథిలి (దక్ష) పెళ్ళికి ఇవ్వాల్సిన కట్నం కోసం బసవన్న (ఛస్వా) అనే పెద్ద గూండా నుంచి పాతిక లక్షలు తీసుకుంటాడు. నడిరోడ్డు మీద హత్యలు చేసిన సదరు గూండావర్యుడు డబ్బు ఇవ్వడానికి వచ్చి, కాబోయే పెళ్ళికూతురును తొలి చూపులోనే మోహిస్తాడు. ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకోవడా నికి వచ్చిన ప్రతి ఒక్కరినీ చంపించేస్తుంటాడు. దాంతో మానసికంగా కుంగిపోయి, మాట్లాడ కుండా తయారై, పెళ్ళికొడుకుల హత్య గుర్తొచ్చి నప్పుడల్లా హీరోయిన్ హిస్టీరికల్గా మారిపోతుం టుంది. తాతయ్య సహా కుటుంబం ఆమెను మామూలు మనిషిని చేయడానికి కొన్ని వందల కిలోమీటర్ల దూరం తీసుకువెళుతుంది. అక్కడ నుంచి కథ కర్ణాటకలోని వర్షపాతం ఎక్కువగా ఉండే ఆగుంబెలో నడుస్తుంది. హీరోది ఆ ఊరే. తల్లితండ్రులు ఆత్మహత్య చేసుకోవడంతో కష్టపడి ప్రింటింగ్ ప్రెస్ నడుపుతూ బామ్మ (సీమ) చాటున ఉండే టీనేజ్ కుర్రాడు స్కంద (దిలీప్). వరకట్నం వేధింపులకు గురవుతున్న మేనత్తను కాచుకొనే బాధ్యత కూడా అతనిదే. హీరోయిన్ను మామూలు మనిషిని చేయడానికి ఇంట్లోవాళ్ళు కాలేజీకి పంపుతారు. ఆమె ద్వారా ఇంటర్నెట్ సెంటర్ బిజినెస్‌ను నిలబెట్టుకోవాలని హీరో ప్రయత్నిస్తాడు. ఆ క్రమంలో హీరో యిన్‌ను హీరో మామూలు మని షిని చేస్తాడు. వాళ్ళి ద్దరూ ప్రేమలో పడ తారు. మరోపక్క హీరోయిన్ కోసం గాలిస్తున్న విలన్ ఆ ఊరికి వస్తాడు. విలన్ ప్రేమిస్తు న్నది తన లవర్నే అని తెలియని హీరో, అతనికి ‘లవ్ గురు’ అవుతాడు. తీరా విషయం తెలిశాక హీరో, విలన్ ఏం చేశారన్నది మిగతా సినిమా. కొత్త, పాతల సమ్మేళనం గతంలో ఉదయ్‌కిరణ్, నితిన్, నవదీప్ లాంటి కొత్త హీరోలను పరిచయం చేసిన తేజ ఈసారి దిలీప్ అనే పాలకొల్లు కుర్రాణ్ణి తెరపైకి తెచ్చారు. హీరోయిన్ దక్ష ఆకర్షణీయంగా ఉన్నా, హావభావాలు పలికించడానికి కృషి మొదలు పెట్టాలి. ఏకకాలంలో నాలుగు వేర్వేరు సినిమాలు వేసుకొని చూసే వెరైటీ విలన్‌గా ఛస్వా బాగు న్నాడు. దక్షిణాదిని ఒకప్పుడు ఊపేసిన పేరున్న సీనియర్ మలయాళ నటి సీమ - హీరో బామ్మ పాత్రలో కనిపించడం ఫ్రెష్నెస్సే! రచయిత ఎం.వి.ఎస్. హరనాథరావు హీరోయిన్ తాతగా కనిపిస్తారు. కథ, స్క్రీన్‌ప్లే, మాటలిచ్చి, దర్శకత్వం కూడా వహించడం ఎవరికైనా టఫ్. తేజ కోరి ఆ ఛాలెంజ్‌ను భుజానికెత్తుకున్నారు. కెమేరా కంటితో... ప్రకృతి అందం చెట్టుచేమల మధ్య వర్షం పడుతుండగా తీసిన ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ ప్రాణం. సినిమాటోగ్రాఫర్ దీపక్ భగవంత్ కెమేరా యాంగిల్స్, లైటింగ్, వర్షంలో సన్నివేశాల చిత్రీకరణ, పల్లె వాతావరణాన్ని చిత్రీకరించిన తీరు బాగున్నాయి. కల్యాణి కోడూరి బాణీల్లో పాటలన్నీ ఎక్కడో విన్నట్లుగా అనిపిస్తాయి. ఆ బాణీలకు పెద్దాడ మూర్తి రచన తోడై, ఒకటి రెండు పాటలు బాగున్నాయి. టైటిల్ థీవుసాంగ్ కొంతకాలం వెంటాడుతుంది. కథ తెలిసిందే! కథనమే... సినిమా మొదటి పావుగంట ఉత్కంఠగా సాగుతుంది. కథ కర్ణాటకకు షిఫ్టయ్యాక, లవ్‌స్టోరీ ఎస్టాబ్లిష్మెంట్ కోసం నిదానిస్తుంది. ఒక దశకు వెళ్ళాక, కథ ఎలా ముందుకు సాగుతుందన్నది సగటు ఆడియన్సకు తెలిసిపోతుంది. ఇక, స్క్రీన్‌ప్లే చమత్కారం కోసమే ఆశగా ఎదురు చూస్తాడు. విలన్ కాసేపు పెద్ద రౌడీగా, మరో సారి డి.జి.పి. సైతం తన వెంట వి.ఐ.పి.గా తీసుకొచ్చే బడాబాబుగా సీన్ అవసరాలకు తగ్గట్లు కనిపిస్తారు. బ్లూటూత్‌లో విలన్ పంపే ఫొటోలను అందుకొని ఫ్లెక్సీ ప్రింట్లు తీయడానికి సిద్ధపడే హీరో ఇంకా ట్రెడిల్ మిషన్‌తో నడిచే ప్రింటింగ్ ప్రెస్ నిర్వహిస్తుంటాడు. ఇంటర్నెట్ సెంటర్ల మధ్య పోటీ ఒకప్పటి టైప్ ఇన్స్టిట్యూ ట్ల బాణీలో నిమిషానికి ఎన్ని అక్షరాలు టైప్ చేస్తారనే ధోరణిలో సాగుతుంది. ‘అలా మొద లైంది’, ‘అంతకు ముందు - ఆ తరువాత’తో ఆకట్టుకున్న నిర్మాత కె.ఎల్. దామోదర్‌ప్రసాద్ ఈ కథను తెరకెక్కించడానికి బాగా శ్రమించారు. అది తెరపై కనిపిస్తుంది. వెరసి, ఇది బాక్సాఫీస్ వద్ద గత వైభవం కోసం ‘ఫైట్ ఫర్ లవ్’ అంటూ తేజ ‘హోరాహోరీ’గా చేసిన పోరాటం. -
జగదీశ్వర రెడ్డి ప్రొడ్యూస్ చేస్తోన్న డాక్యుమెంటరీ
-
కొత్తగా 'తప్పు' చేయబోతున్న తేజ !
-
షాక్‌కు గురయ్యా: దర్శకుడు తేజ
హైదరాబాద్ : ఉదయ్ కిరణ్ ఆత్మహత్య వార్త విని షాక్‌కు గురైనట్లు దర్శకుడు తేజ తెలిపారు. ఈ విషయాన్ని ఓ స్నేహితుడు తనకు ఫోన్ చేసి చెప్పాడని, ఆ వార్త నిజం కాకపోతే బాగుండు అనుకున్నానన్నారు. ఉదయ్ కిరణ్‌ను చివరగా అతనిని పెళ్లిలో చూశానని ...చాలా సంతోషంగా ఉన్నాడని తేజ తెలిపారు. తనను కలవాలని ఉదయ్ కిరణ్ అడిగితే.... కొంత సమయం తీసుకుందామని చెప్పానన్నారు. సినిమాలు లేకపోతే ఏ నటుడైనా డిప్రెషన్‌కు గురవుతారని, యాక్టర్లకు సినిమాలు తప్ప, మరేమీ తెలియదని తేజ అన్నారు. మీసాలు కూడా రాని ఉదయ్‌ను తానే చిత్ర పరిశ్రమకు పరిచయం చేశానని, చాలా మంచి వ్యక్తి అని, ఎవరికీ హాని చేసే మనస్తత్వం కాదని అన్నారు. తన కెరీర్‌కు బాగోనందున కొంత సమయం తీసుకుని...ఉదయ్ కిరణ్‌తో ఓ సినిమా చేద్దామనుకున్నానని, ఇంతలోనే ఈ దుర్ఘటన జరిగిపోయిందన్నారు. కొద్ది రోజుల క్రితం ధర్మవరపు సుబ్రహ్మణ్యం చనిపోవటం...ఇప్పుడు ఉదయ్ మృతి బాధాకరమన్నారు. కాగా ఉదయ్ కిరణ్‌ను చిత్రపరిశ్రమలో తొక్కేసారా? లేదా అన్నది తనకంటే మీడియాకే బాగా తెలుసు అని...విలేకర్ల ప్రశ్నకు తేజ సమాధానం ఇచ్చారు. -
షాక్‌కు గురయ్యాను:దర్శకుడు తేజ
-
గాల్లో తేలినట్టుందే పాటలు
‘‘మా సంస్థలో ఇది మూడో చిత్రం. యువతను ఆకట్టుకునే అంశాలతో పాటు చక్కని సందేశం ఉంటుంది’’ అని సీహెచ్ వంశీకృష్ణ చెప్పారు. ఆయన చొక్కాకుల వెంకట్రావుతో కలిసి వెంకట సురేష్ గుణ్ణం దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘గాల్లో తేలినట్టుందే’. అజయ్‌వర్మ, కౌసల్య, మోనీషా ఇందులో హీరో హీరోయిన్లు. ఈ సినిమా ప్రచార చిత్రాలను, పాటల సీడీని దర్శకుడు తేజ ఆవిష్కరించారు. సాయికార్తీక్ మంచి సంగీతం అందిం చారని, కథ కూడా వినకుండా నిర్మాతలు తనను నమ్మి ఈ సినిమా అవకాశమిచ్చారని దర్శకుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయికార్తీక్, వందేమాతరం శ్రీనివాస్, కృష్ణచైతన్య, సందీప్ కిషన్, శాన్వి, మనోజ్ నందం, భాస్కర్ విల్లూరి, సీలం లక్ష్మణ్, సాయిశ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. -
నా బ్లడ్‌లోనే సెన్సేషన్ ఉందేమో!
వెయ్యి అబద్ధాలాడైనా ఒక పెళ్లి చెయ్యాలన్నారు. తేజ మాత్రం తన పెళ్లి కోసం ఒక్క అబద్ధం కూడా ఆడించలేదు. ‘అబ్బాయికి సొంతిల్లుందా?’ ‘లేదు. కనీసం అద్దె ఇల్లు కూడా లేదు’ (పచ్చినిజం) ‘కారుందా?’ ‘కారా! సైకిలుంటే గొప్ప’ (మరో పచ్చినిజం) ఇలాగే మరికొన్ని ప్రశ్నలు, మరికొన్ని ‘లేదు’ లు! ఒక్క అబద్ధమైనా ఆడించకపోగా.. వెయ్యి నిజాలు చెప్పాడు తేజ! పెళ్లి కోసమో, పబ్లిసిటీ కోసమో అబద్ధాలు చెప్పే రకం కాదతడు. అయితే - నిజాలు చెప్పి, పెళ్లి చేసుకున్నంత తేలిక కాదు... ఇండస్ట్రీలో అబద్దాలు చెప్పకుండా బతికేయడం! కానీ తేజ బతికాడు, పదిమందిని బతికిస్తున్నాడు. తేజ లైఫ్ మొత్తం బిట్టు బిట్టు ఒక టెరిఫిక్ ఫైట్! ఈవారం ‘తారాంతరంగం’ చదవండి. ‘మనిషంటే వీడ్రా’ అని మీకు ఒక్కచోటైనా అనిపించలేదంటే... కచ్చితంగా మీరు అబద్ధం చెబుతున్నట్లే! మంచి పీక్‌లో ఉన్నప్పుడు ‘నిజం’ చెప్పారు.. ఇప్పుడు అబద్ధాలు! ఒకటి కాదు, రెండు కాదు... వెయ్యి! ‘నిజం’కే ప్రేక్షకులు అవ్వాల్సినంతగా రియాక్ట్ కాలేదు. మరి అబద్ధాలను అంగీకరిస్తారంటారా? తేజ: జనాలకు నిజం చెబితే నచ్చడంలేదు. ‘నిజం’ సినిమాలో మీరు నిజం అనుకునేవన్నీ నిజాలు కాదు... అంతా అబద్ధమే అని చెప్పాను. అందుకే ‘ఇట్స్ ఎ లై’ అన్నాను. ఇప్పుడు ‘అబద్ధం’లోనూ అస్సలు నిజం లేదు అంటున్నా. అయితే, ఏకంగా టైటిలే పెట్టి సినిమా తీశా. వెయ్యి అబద్ధాలాడి హీరో ఎలా పెళ్లి చేసుకున్నాడు? అన్నదే ఈ ‘వెయ్యి అబద్ధాలు’ చిత్రకథ. ఇక, ఓసారి మీ కెరీర్‌ని విశ్లేషించుకుంటే.. వెళ్లాల్సినంత పీక్‌కి వెళ్లారు. కానీ ఆ తర్వాత ఆశించిన స్థాయిలో హిట్స్ రాలేదు. పైగా సినిమా సినిమాకీ బాగా గ్యాప్ తీసుకుంటున్నారు. ఎందుకలా? తేజ: మధ్యలో ఓ రెండేళ్లు, ఆ తర్వాత నాలుగైదేళ్లు సినిమాలు చెయ్యలేదు. మా అబ్బాయికి వంట్లో బాగా లేకపోవడంవల్ల సినిమాలకు దూరమయ్యాను. ఆ తర్వాత చేసిన చిత్రమే ‘నీకు నాకు డాష్ డాష్’. ట్రాక్‌లో పడి, పదునవ్వడానికి టైమ్ పట్టింది. అందుకే ఆ సినిమా రిజల్ట్ తేడా అయ్యింది. ఇప్పుడు తీసిన సినిమా కరెక్ట్‌గా ఉంటుంది. ఇకమీద మీ కెరీర్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? తేజ: ఎలా ఉన్నా ఓకే. ఎక్కడో ఉండేవాణ్ణి ఈ రేంజ్‌కి వస్తాననే అనుకోలేదు. భవిష్యత్తు గురించి ఏం చెప్పగలను. ఇప్పుడు నన్ను ఇక్కడ ఊడ్చేయమన్నారనుకోండి.. పని నచ్చితే శుభ్రం చేస్తాను. ఆ తర్వాత మన పరిస్థితి ఏంటి? అని ఆలోచించను. ఆత్మసంతృప్తి కోసం పని చేస్తాను. అంటే.. మీకు లక్ష్యాలు లేవా? తేజ: సాధారణంగా డెరైక్టర్స్‌కి ఉండే... బాలకృష్ణతోనో పవన్కళ్యాణ్తోనో సినిమా చేయాలనే లక్ష్యాలు నాకు లేవు. కానీ ఒక్క లక్ష్యం ఉంది. ప్రస్తుతం తెలుగు సినిమా తప్పుదోవలో వెళుతోంది. అది దర్శక, నిర్మాతలకు, హీరోలకు.. అందరికీ తెలుసు. ఈ పరిస్థితిలో మార్పు తేవాలన్నదే ఆ లక్ష్యం. సరైన దారంటే... తేజ: చెప్పను.. చేసి చూపెడతా! డిఫరెంట్ టైపాఫ్ సినిమాలు తీయాలని ఉంది. ఇండియాలో కమర్షియల్, ఆర్ట్.. ఇలా రెండు రకాల సినిమాలున్నాయి. ఆర్ట్ అంటే మరీ ఆథెంటిక్‌గా ఉంటాయి. బి. నరసింగరావుగారు తీసిన ‘దాసి’లాంటివి అన్నమాట. ఆ సినిమాలు చూస్తున్నప్పుడు జీవితాలను చూస్తున్నట్లనిపిస్తుంది. ‘అత్తారింటికి దారేది’, ‘ఎవడు’.. ఇలాంటివన్నీ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్స్. ఇలా కాకుండా ఆథెంటిక్ సినిమాలో కమర్షియల్ వేల్యూస్ ఉండేలా, కమర్షియల్ వేల్యూస్ ఉన్న చిత్రం ఆథెంటిక్‌గా ఉండేలాగ. ఆ రెండిటికీ మధ్య ఉన్న గోడ తీసేయాలన్నది నా ఆశయం. నేను తీసిన ‘చిత్రం’ని తీసుకుంటే ... అటు కమర్షియల్గానూ ఉంటుంది. అలాగే ఆర్టిస్టిక్‌గా కూడా ఉంటుంది. దాన్ని ఒప్పుకోవడానికి కొంచెం టైమ్ పట్టొచ్చు. కానీ, ఆడియన్స్ అన్ని రకాల సినిమాలు చూడ్డానికి రెడీగా ఉన్నారు. మేమే తియ్యడంలేదు. ‘నిజం’లాంటి సినిమా తీస్తే, కమర్షియల్‌గా వర్కవుట్ కాలేదని టాక్... ఇంకా కొత్తరకం సినిమా తీయడం రిస్కేగా? తేజ: ‘నిజం’ని ఆరున్నర కోట్లలో తీశాం. అంతకు ముందు నలభైలక్షలు తీసుకున్న మహేష్‌బాబుకు ఈ సినిమాకి కోటిన్నర ఇచ్చాం. దాంతో కలిపి ఆరున్నర కోట్లలో తీశాం. అప్పట్లోనే ఆడియో రైట్స్‌ను 2 కోట్లకు, సినిమాని 26 కోట్లకు అమ్మాం. నష్టం వచ్చినవాళ్లకి కొంత వెనక్కి ఇచ్చాం కూడా. అయినా ఐదారు కోట్లు లాభమే వచ్చింది. ఈ లెక్కలు చాలామందికి తెలియక ‘నిజం’ కమర్షియల్‌గా ఫ్లాప్ అనుకుంటారు. మహేష్‌బాబు తర్వాత వేరే స్టార్ హీరోస్తో ఎందుకు సినిమాలు చేయలేదు? తేజ: తెలుగు హీరోలందరూ ఓ ఫిక్స్డ్ ఫార్మట్‌లో ఉన్నారు. స్లో మోషన్లో నడవాలి, ఆరు పాటలు, ఫైట్లు ఉండాలి. మిగిలినదాంట్లో కథ చెప్పాలి. ఇప్పుడు ‘స్వాతిముత్యం’లాంటి సినిమాని నేను తెలుగులో తీయాలనుకున్నాననుకోండి.. ఒక్క హీరో పేరు చెప్పండి. ఏం మన హీరోల్లో యాక్ట్ చేసే కెపాసిటీ లేదా? అంటే... మహేష్‌బాబు, ఎన్టీఆర్లాంటివాళ్లు అద్భుతంగా చేయగలుగుతారు. కానీ చెయ్యరు. కమర్షియల్ గిరి నుంచి బయటికి రావడానికి వాళ్లు ఇష్టపడటంలేదు. అందుకే నేను పెద్ద స్టార్స్‌తో చెయ్యను. ఒకవేళ ఏ స్టార్ హీరో అయినా మీతో సినిమా చేయాలనుకుంటే? తేజ: నాతోనా? అస్సలు అనుకోరు. కొత్తరకం సినిమా ట్రై చేద్దామనేంత పరిణతి మన తెలుగుపరిశ్రమలో ఉన్న హీరోల్లో ఉందని నేననుకోను. ఎందుకంటే, హీరో అంటే ఇంత పారితోషికం అని ఫిక్స్ అయిపోయింది. అంతకన్నా తక్కువ తీసుకుంటే మార్కెట్ తగ్గిపోయిందనుకుంటారని భయం. ఎక్కువ పారితోషికం తీసుకుని, భారీ బడ్జెట్‌తో సినిమా చేసినప్పుడు ఎక్కువకే అమ్మాలి. అప్పుడు రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, కమర్షియల్ సినిమానే చేస్తారు. మహేష్‌బాబుని ఇప్పుడు ‘నిజం’ చెయ్యమంటే చెయ్యడు. ఆ సినిమాకి అతన్ని అడిగినప్పుడు ‘బాబీ’ అనే అట్టర్ ఫ్లాప్ సినిమా చేశాడు. నేను తీసిన ‘జయం’ సక్సెస్ అయ్యింది కాబట్టి ‘నిజం’ చేయడానికి ఒప్పుకున్నాడు. లేకపోతే ఎందుకు చేస్తాడు? ఇలా ఓపెన్‌గా మాట్లాడేస్తున్నారు... మీకు ప్రాబ్లమ్స్ ఏమీ రావా? తేజ: ఏం ఫర్వాలేదండి. ఎందుకంటే నేనెవరి మీదా ఆధారపడి లేను. నాకసలు వాళ్లతో సినిమాలు చేయాలనే ఆశలేవీ లేవు. అలాంటప్పుడు నా మనసులో మాట చెబితే ప్రాబ్లమ్ ఏంటి! ఇలాంటి మాటలు మాట్లాడటంవల్లే తేజకు నోటి దురుసుతనం ఎక్కువని అంటుంటారు... తేజ: చాలామంది లోపల ఒకటనుకుని బయటికి ఒకటి చెబుతారు. దానివల్ల ఏం సాధిస్తారు? ఫైనల్‌గా వెనక్కి తిరిగి చూసుకుంటే, వాడి దగ్గర వీడి దగ్గర అణిగి మణిగి పడున్నాం అనే అసంతృప్తి తప్ప ఏమీ మిగలదు. వీళ్లకి ఉండే ఓ గొప్ప టాలెంట్ ఏంటంటే, అసంతృప్తి వల్ల ఏర్పడిన కోపాన్ని ఇంట్లో భార్యాపిల్లల మీదో, అసిస్టెంట్ల మీదో చూపిస్తారు. లేకపోతే తాగేసి రభస చేస్తారు. కానీ నేనలా చేయను. నాకే అలవాట్లు లేవు. ఐ థింక్ ఐయామ్ ది మోస్ట్ స్ట్రయిట్ ఫార్వర్డ్ పర్సన్. ఏదనుకుంటే అది ఓపెన్‌గా చెప్పేస్తాను. తెలుగు ఇండస్ట్రీలో నాకు తెలిసి ఇంత ఓపెన్‌గా ఎవరూ మాట్లాడలేరు. ఇలా ఓపెన్‌గా మాట్లాడటంవల్లే ‘ధైర్యం’ సినిమా అప్పుడు ఇరుకుల్లో పడ్డారట? తేజ: ఆ సినిమా అప్పుడు ఒక బయ్యర్ వచ్చి, ‘‘సార్.. ‘జయం’ నేనే కొన్నాను. ‘ధైర్యం’ కూడా కొనబోతున్నా. కొనమంటారా’’ అన్నాడు. ‘‘ఇంట్లో భార్యాపిల్లలు బాగున్నారు కదా.. జాగ్రత్త’’ అన్నాను. దాంతో అతనా సినిమాని కొనలేదు. ఆ తర్వాత.. అతను ‘‘మీ డెరైక్టరే సినిమాని కొనొద్దన్నాడు’’ అంటూ నిర్మాతకి లెటర్ ఇచ్చాడు. అప్పుడా నిర్మాత నన్ను పిలిచి ‘‘నిజంగానే అలా అన్నావా?’’ అంటే, నేనేమన్నానో చెప్పా. దాంతో దాసరి నారాయణరావుగారు, తమ్మారెడ్డి భరద్వాజ్‌గారు, ఆదిశేషగిరిరావుగారు, కేఎస్ రామారావుగారు, చిల్లర కళ్యాణ్‌గారు జడ్జిలుగా వ్యవహరించి, ఏషియన్ ఫిలింస్వాళ్లకి కోటి రూపాయలు, సుధాకర్‌రెడ్డిగారికి 33 లక్షలు కట్టించారు. మీ సినిమాని మీరే కొనొద్దని చెప్పడం ఏంటి? తేజ: నేను తీసే సినిమా ఆడుతుందా? లేదా? అని నాకే కదా తెలుస్తుంది. ఆ బయ్యర్ మంచి కోరి చెప్పాను. మరి.. ఇవతల నిర్మాత ఏమైపోతాడు? తేజ: అప్పుడు నేను చెప్పింది వినాలి కదా. ఇక్కడ తేడా ఉంది... ఆ తేడాని సరి చేయాలన్నాను. ‘‘లేదు. డేట్ కుదిరింది. రిలీజ్ చేద్దాం’’ అన్నారు. వద్దని నేను, రసూల్ పోరాడాం. వినలేదు. ఆ కోపంతో బయ్యర్‌కి అలా చెప్పారా? తేజ: నిజం చెప్పాను. నన్నడిగాడు కాబట్టి చెప్పా. నేను కొనొద్దు అనలేదు. జాగ్రత్త అన్నాను. ఇప్పుడదే బయ్యర్ వచ్చి ‘వెయ్యి అబద్ధాలు’ కొన్నాడు. ఈసారి కొనమన్నారా? అంటే.. ‘వెయ్యి అబద్ధాలు’ కన్ఫర్మ్ హిట్టా? తేజ: జాగ్రత్త అని మాత్రం చెప్పలేదు. హిట్, ఫ్లాప్ గురించి చెప్పను. ఎందుకంటే, ఈ సినిమా ఇంత హిట్ అవుతుందని, ఇంత కలక్ట్ చేస్తుందని నేనే సినిమాకీ చెప్పలేదు. సెన్సేషన్ కోసం తేజ స్టేట్మెంట్లు ఇస్తాడని కూడా అనుకుంటుంటారు..? తేజ: అలా సెన్సేషన్ కోసం స్టేట్మెంట్లు ఇచ్చి ఉంటే నేనింకా సక్సెస్‌ఫుల్‌గా ఉండాలి కదా. సెన్సేషన్‌ని వాడుకోవడం తెలియాలిగా. మే బీ నా బ్లడ్‌లోనే సెన్సేషన్ ఉందేమో. అందుకే ఇలా మాట్లాడుతున్నానేమో. ‘ఐయామ్ ఎ బార్న్ ఫైటర్’. ఒకవేళ నేను రోడ్డు మీద కారులో వెళుతున్నప్పుడు అనవసరంగా ఎవరైనా ఒకణ్ణి ఏమైనా అంటున్నారనుకోండి... నాకు సంబంధం లేకపోయినా కారు దిగి ఆ సంగతేంటో తేల్చుకునే వెళతాను. ఎందుకంటే, ‘ఇది నా దేశం.. నేను భారతీయుణ్ణి’ అని ఫీలవుతా. చాలామంది ఫీలవ్వరు. నా ఫీలింగ్‌ని సెన్సేషనలిజమ్ అంటున్నారంటే.. ఏమనాలో నాకు తెలియడంలేదు. అవునూ మీ ఇంటి చుట్టూ ఈ ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ ఏంటి? తేజ: కొత్తవాళ్లతో సినిమా తీయబోతున్నానని ప్రకటించగానే కొడుకునో, కూతురినో హీరో హీరోయిన్ చేసేయాలనే తాపత్రయంతో గేట్లు దూకి ఇంట్లోకి వచ్చేస్తున్నారు. ఇద్దరు లేడీస్ అయితే చీరలతో దూకేశారు. కాలో, చెయ్యో విరుగుతుందని మా భయం. అందుకే ఈ ఫెన్సింగ్. నేను కూడా సాఫ్ట్‌గా కాకుండా రూడ్‌గా మాట్లాడటం మొదలుపెట్టాను. ఎందుకంటే, ఓ 40వేల అప్లికేషన్స్ వస్తుంటాయి. వాళ్లల్లో నటన వచ్చినవాళ్లు 70మందే ఉంటారు. మిగతావాళ్లంతా ఏదో ఇస్తానంటున్నాడు కదా అని ఓ అప్లికేషన్ పడేస్తుంటారు. అదే తేజ రూడ్‌గా మాట్లాడతాడు.. కొడతాడు.. ఇంతకుముందు మీరన్నట్లు దురుసుగా మాట్లాడతాడనే ఫీలింగ్ ఏర్పడిందనుకోండి.. అప్పుడు ఇంతమంది ట్రై చేయరు. సిన్సియర్‌గా పైకి రావాలనుకున్నవాళ్లే వస్తారు. ఇంతకుముందు ఓ ప్రశ్నకు సమాధానం చెబుతూ.. ‘బార్న్ ఫైటర్’ ని అన్నారు. అసలేంటి మీ ఫ్లాష్‌బ్యాక్? తేజ: నాకు మూడేళ్లప్పుడు అమ్మ చనిపోయింది. అమ్మ పోయిన బాధలో నాన్న తాగడం మొదలుపెట్టారు. అంతకుముందు అలవాటు ఉండేదేమో.. అమ్మ పోయిన తర్వాత ఎక్కువైంది. అలా అలా... రోడ్డుకొచ్చేశాం. ఆ తర్వాత నాన్నగారు కూడా చనిపోయారు. దాంతో మమ్మల్ని మా బంధువులు పంచుకున్నారు. మీ తోబుట్టువులు ఎంతమంది? తేజ: అక్కా, నేను, చెల్లి. నాన్న చనిపోయిన తర్వాత మా ముగ్గుర్నీ బంధువులు పంచుకున్నారు. ముగ్గురం మూడు ఇళ్లల్లో పెరిగాం. ఆ ముగ్గురికీ పడకపోతే మేం మాట్లాడుకోకూడదు. ఒక్కోసారి మా అక్క నాకు శత్రువులా అనిపించేది. ఇంకోసారి ఫ్రెండ్‌లా. మేం ఎవరింట్లో ఉన్నామో వాళ్లందరూ కలిస్తే మేం కలిసేవాళ్లం. లేకపోతే లేదు. మీ ముగ్గుర్నీ మీ బంధువులు బాగా చూసుకునేవాళ్లా? తేజ: మా అక్క మా అత్తయ్యగారింట్లో, చెల్లి మా బాబాయ్ వాళ్లింట్లో ఉండేవాళ్లు. చెల్లిని పోషించలేక బాబాయ్ వాళ్లు స్త్రీ సేవామందిర్ అని అనాథ శరణాలయంలో చేర్చారు. నేను ఇంకో బాబాయ్ ఇంట్లో ఉండేవాణ్ణి. కొన్నిరోజుల తర్వాత ఆ ఇంట్లోంచి బయటికి వచ్చేశా. మా నాన్నగారు చనిపోయినప్పుడు, ‘‘నీకేదైనా సమస్య వస్తే నా దగ్గరకు రా’’ అని మా పెద్దనాన్న అన్నారు. అది మనసులో పెట్టుకుని ఆయన దగ్గరకు వెళితే, ‘‘ఏదో మాట వరసకంటే వచ్చేస్తావా?’’ అనడిగారు. దాంతో వెనక్కి వచ్చేశా. అప్పట్నుంచి జీవన పోరాటం మొదలైంది. అప్పుడు మీ వయసెంత? తేజ: వయసు గుర్తు లేదు. టైమ్, డేట్ అన్నీ అప్పట్లో కడుపుతోనే కనెక్షన్. కడుపు నిండితే ఒక రోజు ముగిసినట్లు అనుకున్నాను. అసలు మీరెంతవరకు చదువుకున్నారు? తేజ: నేను పుట్టి, పెరిగింది చెన్నయ్‌లో. కానీ తెలుగువాళ్లమే. చెన్నయ్‌లో బాల గురుకుల్లో చదువుకున్నాను. ముందు నర్సరీలో చేర్చారు. ఫస్ట్ స్టాండర్డ్ చదివా. సెకండ్ చదవలేదు. థర్డ్, ఫోర్త్ చదివాను. ఫిఫ్త్, సిక్త్స్ చదవలేదు. సెవెన్త్ చదివాను. ఎయిత్ మధ్యలో మానేశాను. ఏదో మామూలుగా చదువు సాగింది. కాకపోతే ఇంగ్లిష్ మీడియమ్ కాబట్టి, ఇంగ్లిష్ బాగా వచ్చింది. అలాగే చాలా పుస్తకాలు చదివేవాణ్ణి. మీ నాన్నగారు ఏం చేసేవారు? ఆయన ఉన్నంతవరకు ఆర్థికంగా బాగుండేదా? తేజ: నాన్న ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసేవారు. కొన్నాళ్లు బాగానే ఉంది. ఆ తర్వాత కష్టాలు మొదలయ్యాయి. మూడోక్లాస్ చదివేటప్పుడు అందరూ లంచ్ తింటుంటే, మేం ముగ్గురం మా లంచ్ బాస్కెట్ కోసం స్కూల్ బయట వెయిట్ చేసేవాళ్లం. నాన్న పంపిస్తే తినేవాళ్లం. లేకపోతే మంచినీళ్లు తాగేవాళ్లం. నాన్న ఏదైనా ఊరెళ్లినప్పుడు.. మా ముగ్గుర్నీ ఒకింట్లో ఉంచేవారు. వాళ్లకి డబ్బులిచ్చి వెళ్లేవారాయన. ఆ డబ్బులైపోయేవరకూ మాకు ఫుడ్ పెట్టేవాళ్లు. నాన్న ఊరి నుంచి వచ్చేవరకు స్కూల్ ఫీజు కూడా కట్టేవాళ్లం కాదు. ఎవరెవరు ఫీజు కట్టలేదని క్లాస్‌లో అడిగితే, మేం ముగ్గురూ దాక్కునేవాళ్లం. అప్పట్లో ఇంత విరివిగా ఫోన్లు లేవు కదా. మా నాన్న మనియార్డర్ పంపిస్తారని వెయిట్ చేసేవాళ్లం. రోజూ పోస్టాఫీస్ దగ్గరకు వెళ్లేవాళ్లం. ‘నిన్న నేను అడిగాను కదా.. ఇవాళ నువ్వు అడుగు..’ అంటూ వంతులు వేసుకుని పోస్ట్ మాస్టర్ని మనీయార్డర్ గురించి అడిగేవాళ్లం. కొన్ని రోజులు తర్వాత మేం కనపడగానే ‘ఇవాళ మనీయార్డర్ రాలేదు’ అని చెప్పేవాళ్లు. మీ పెద్దనాన్న ఎందుకొచ్చావన్న తర్వాత ఏం చేశారు? తేజ: కొన్నాళ్లు లారీలు తుడిచా. అలా... రకరకాల పనులు చేసి, చివరికి ఫిలిం రిప్రజెంటేటివ్‌గా చేశాను. 1983, 1984ల్లో అది చేసిన తర్వాత కెమెరామేన్ రవికాంత్ నగాయిచ్గారి దగ్గర కెమెరా అసిస్టెంట్‌గా చేరా. ఒక్క ఎంజీఆర్ తప్ప శివాజీగణేశన్, రజనీకాంత్, కమల్‌హాసన్... ఇలా మద్రాసులో అందరి హీరోలతో సినిమాలు చేశాను. తెలుగులో కూడా చాలామంది హీరోల సినిమాలకు కెమెరా అసిస్టెంట్‌గా చేశాను. ఆ తర్వాత మహీధర్గారి దగ్గర అసిస్టెంట్‌గా చేశాను. అక్కణ్ణుంచి అసిస్టెంట్ డెరైక్టర్ అయ్యా. ఆ తర్వాత పబ్లిసిటీ డిజైనర్‌గా చేశా. బాగుంది.. మరి కెమెరామేన్‌గా ఎప్పుడు మారారు? తేజ: ‘రాత్రి’ సినిమాతో మారాను. అంతం, మనీ, రక్షణ, తీర్పు.. తెలుగులో చేసినవి ఇవే. ఆ తర్వాత ముంబయ్ వెళ్లి 30 సినిమాలకు కెమెరామేన్‌గా చేశాను. శతృఘ్న సిన్హా, ధర్మేంద్ర, గోవిందా, ఆమిర్‌ఖాన్, అక్షయ్‌కుమార్ ఇలా చాలామందితో సినిమాలు చేశాను. డెరైక్టర్ అయిన తర్వాత బాలీవుడ్ నుంచి మీకు ఆఫర్స్ రాలేదా? తేజ: అక్కడి హీరోలు ఆఫర్స్ ఇస్తుంటారు. ఇక్కడో విషయం చెప్పాలి. తెలుగు హీరోల యాటిట్యూడ్‌తో పోల్చితే బాలీవుడ్ హీరోలు మహాత్మా గాంధీలాంటివాళ్లు. అక్కడ హీరో, డెరైక్టర్, కెమెరామేన్ కలిసి భోజనం చేస్తారు. తెలుగులో ఒకప్పుడు అలా ఉండేది. రామారావుగారు కూడా అందరితో పాటే కలిసి భోజనం చేసేవారట. కానీ, ఇప్పుడు తెలుగు పరిశ్రమలో హీరో ఒక కారవాన్, హీరోయిన్ మరో కారవాన్‌లో ఉంటారు. ఒక ఫ్యామిలీలా ఉండరు. తెలుగు ఇండస్ట్రీలో టెక్నీషియన్స్ అంటే కొంచెం చులకన. ఒక్క మ్యూజిక్ డెరైక్టర్‌కి, డెరైక్టర్‌కి తప్ప మిగతా టెక్నీషియన్స్‌కి విలువ ఇవ్వరు. ఇంకా చెప్పాలంటే డెరైక్టర్ కూడా సెకండరీయే. హీరోనే ముందు. ఇక్కడి హీరోల్లో చాలామందికి తమ సినిమాకి పని చేస్తున్న ఆర్ట్ డెరైక్టర్ ఎవరో కూడా తెలియదు. అలా ఉంది పరిస్థితి. మరలాంటప్పుడు బాలీవుడ్‌కి ఎందుకు దూరమయ్యారు? తేజ: త్వరలో వెళ్లిపోతానంటూ నాకు స్టేట్మెంట్లు ఇవ్వడం నచ్చదు. కానీ హిందీ సినిమాలు చేసే ఉద్దేశం ఉంది. బాలీవుడ్ హీరోలు హైదరాబాద్ వచ్చినప్పుడు మా ఇంటికొస్తారు. నేను కూడా అప్పుడప్పుడూ వాళ్లు చేసే సినిమాల కథాచర్చల్లో పాల్గొని, ఏవైనా కరెక్షన్స్ ఉంటే చెబుతుంటా. ఆకలి బాధ ఎలా ఉంటుందో చిన్నప్పుడే చూశా అన్నారు కదా... ఆ సమయంలో మీ మానసిక స్థితి ఎలా ఉండేది? తేజ: నా చిన్నప్పుడు ప్లేట్‌మీల్స్ రూపాయి డెబ్భై అయిదు, ఫుల్ మీల్స్ రెండు రూపాయల ఇరవైపైసలుండేది. మెస్‌లో నెలకి సరిపడా టోకెన్స్ కొనుక్కునేవాళ్లుంటారు. వాళ్ల చేతిలో టోకెన్ బుక్ చూడగానే, లైఫ్‌లో ఎప్పటికైనా ఫుల్ టోకెన్ బుక్ కొనుక్కుని, స్టయిల్‌గా టోకెన్ చింపి ఇవ్వాలనుకునేవాణ్ణి. ఇంకోటేంటంటే మా కెమెరామేన్గారింటికి వెళ్లాలంటే బస్సులో టికెట్ కొనుక్కోవడానికి డబ్బులుండేవి కాదు. ఎక్కడికెళ్లినా కాలినడకనే. దాంతో ఎప్పటికైనా సైకిల్ కొనుక్కోవాలనుకునే లక్ష్యం ఉండేది. మీరు నమ్ముతారో లేదో కానీ ఇప్పటికీ మా ఇంట్లో ఓ సైకిల్ ఉంది. మీరనుకున్నట్లు సైకిల్ కొనుక్కున్నారు. ఆ తర్వాత కార్లు కూడా కొనుక్కున్నారు కాబట్టి ఇదంతా ఆ దేవుడి వల్లే అనుకుంటారా? అసలు దేవుణ్ణి నమ్ముతారా? తేజ: దేవుణ్ణి నమ్మడం అనేది నా సౌకర్యాన్నిబట్టే. కంట్రోల్ చేసుకోలేనంత ప్రాబ్లమ్ వచ్చినప్పుడు దేవుడు గుర్తొస్తాడు. ప్రొఫెషనల్‌గా గుర్తు రాలేదు. సినిమా హిట్టయినా, ఫ్లాపయినా దేవుణ్ణి ఏమీ అనుకోలేదు. దేవుడా.. ఫలానా హీరో డేట్స్ ఇవ్వాలని ఎప్పుడూ కోరుకోలేదు. నేను దేవుణ్ణి బాగా నమ్ముకున్నది మా రెండో అబ్బాయికి ఆరోగ్యం బాగాలేనప్పుడు మాత్రమే. కానీ వాడు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు. దాంతో ఆ దేవుడు గుర్తు రావడంలేదు. అంటే.. దేవుడి మీద నమ్మకం పోయిందా? తేజ: నమ్మకం కాదు.. అవసరంపోయింది. ఆ బాబుకి చికిత్స చేయించడానికి చాలా ఊళ్లు వెళ్లారట. అసలు ప్రాబ్లమ్ ఏంటి? తేజ: పుట్టినప్పుడు బాగానే ఉన్నాడు. ఆ తర్వాత ఏదో మిస్టేక్ వల్ల అనారోగ్యానికి గురయ్యాడు. ఏదైతే అయ్యిందనుకుని ఏ దేశమైనా వెళ్లి చికిత్స చేయించాలనుకున్నాను. చైనా, జర్మనీ తీసుకెళ్లాం. జర్మనీలో నా భార్య, కూతురు నెలన్నర ఉన్నారు. ఆ తర్వాత చైనాలో చికిత్స జరిగింది. కోలుకుంటున్నట్లే కనిపించాడు. ఇక.. ఫర్వాలేదు అనుకుంటున్న సమయంలో ఓ రోజు దగ్గి, పడిపోయాడు. అంతే.. చాలా చిన్నప్పుడు అమ్మా నాన్న.. ఇప్పుడు కన్న కొడుకు దూరమయ్యాడు. ఈ రెంటినీ ఎలా తట్టుకున్నారు? తేజ: మా అమ్మ చనిపోయినప్పుడు నాకు మూడేళ్లట. దాదాపు ఏడాదిన్నర ఆవిడ కోసం ఏడ్చానట. మా నాన్నగారు చనిపోయినప్పుడు ఏడుపు రాలేదు. ఒకే ఒక్కసారి మద్రాసులో నేను రోడ్డు మీద పడుకున్నప్పుడు ఏదో జరిగితే ఏడెనిమిది కిలోమీటర్లు పరిగెత్తుకుంటూ ఏడ్చాను. ఆ తర్వాత ఎప్పుడూ ఏడవలేదు. మా అబ్బాయి మరణం అంటారా.. ఆ బాధను మాటల్లో చెప్పలేను. దేవుణ్ణి అవసరాన్ని బట్టి నమ్ముతానన్నారు. కానీ స్వామీజీలను నమ్ముతారేమో. ఓసారి మీ ఇంటికి నిత్యానంద వచ్చినట్లున్నారు? తేజ: మా అబ్బాయికి వంట్లో బాగాలేనప్పుడు నిత్యానందస్వామిని నా భార్య ఇంటికి తీసుకు వచ్చింది. లక్ష రూపాయలివ్వమన్నారు. కానీ చెక్ బౌన్స్ అయ్యింది. దాంతో ‘స్వామీజీకిచ్చిన చెక్ బౌన్స్ అయ్యింది. లెంపలేసుకోండి. ఎకౌంట్లో డబ్బులు వేయండి’ అని చెప్పింది మా ఆవిడ. నేను మర్చిపోతే రెండోసారి కూడా చెక్ బౌన్స్ అయ్యింది. మూడోసారి ఎకౌంట్లో డబ్బులేద్దామని వెళుతుండగా, నిత్యానందను అరెస్ట్ చేశారని టీవీల్లో వచ్చింది. నాకు లక్ష మిగిలింది. మా అబ్బాయిని బాగు చేస్తాడేమోనని తనని ఇంటికి తీసుకొచ్చా. ప్రతి మనిషికి ఒక ‘వీక్ సిట్యుయేషన్’ ఉంటుంది. ఆ సమయంలో చుట్టూ ఉన్నవాళ్ల ప్రోద్బలంతోనో, మన మనసు వీక్ అయ్యో.. అవతలివైపు వ్యక్తికి ఆ పవర్ లేకపోయినా ఉన్నట్లనిపిస్తుంది. చెక్ బౌన్స్ అయ్యిందని మీరే అన్నారు. మీ సినిమాకి పని చేసేవాళ్లల్లో చాలామందికి సరిగ్గా పారితోషికం ఇవ్వరట? తేజ: శ్రమపడేవాళ్లకి తప్పకుండా ఇస్తాను. పడనివాళ్లకి ఎందుకు ఇవ్వాలి? ఉదాహరణకు, మీకు యాక్టింగ్ రాదు.. శ్రమపడి నేను యాక్టింగ్ నేర్పిస్తా. మరి.. మీరు నాకేం ఇస్తున్నారు. నితిన్‌ని హీరోని చేశాను. 11 వేలు ఇచ్చాను. గోపీచంద్‌తో విలన్‌గా చేయించాను. 11వేలు ఇచ్చాను. సదాకి 11వేలు ఇచ్చాను. ఇక, ఎవరికి ఇవ్వలేదో తెలియడంలేదు. ఈ 11వేల సెంటిమెంట్ ఏంటండి? ఆ పారితోషికం అందుకున్నవాళ్లు ఎక్కడికో వెళ్లిపోతారట కదా? తేజ: అట..! సూపర్స్టార్లు, కోటీశ్వర్లు అవుతారట. నాకూ తెలియదు. బొంబాయిలో అడ్వాన్స్ 11వేలు, లక్షాపదకొండు వేలు.. అలా ఇస్తుంటారు. అదే మీరూ ఫాలో అవుతున్నారన్నమాట. తేజ: ‘చిత్రం’ సినిమా అప్పుడు నాకు, రసూల్‌కి, ఉదయ్కిరణ్కి, రీమాసేన్కి 11 వేలు అని ఫిక్స్ చేశా. అయిదువేల అయిదువందలు ఇచ్చినవాళ్లకి కలిసి రాలేదు. అది కూడా అందరూ చెప్పడం తప్ప నాకు తెలియదు. ఇప్పుడు నితిన్వాళ్లతో మీ అనుబంధం... మళ్లీ తనతో సినిమా చేసే ఆలోచన ఉందా? తేజ: ఇప్పుడు మేం బాగానే ఉన్నాం. నితిన్ ఫాదర్ సుధాకర్‌రెడ్డిగారు సినిమా చేద్దామని అడుగుతుంటారు. ిహ ట్లో ఉన్నవాళ్ల దగ్గరికి అస్సలు వెళ్లను. ముఖ్యంగా తెలుగు పరిశ్రమలో! ఎందుకంటే వాళ్ల యాటిట్యూడ్ వేరేలా ఉంటుంది. నితిన్ ఎప్పుడైతే కథను నమ్మడం మొదలుపెట్టాడో అప్పుడు హిట్లొచ్చాయి. తనతో సినిమా చేయకూడదని ఏమీ లేదు... చేయాలనే తపనా లేదు.! మీ జనరేషన్ డెరైక్టర్స్‌లో మీరు బాగా రిచ్ అంటారు. అసలు కోట్లు సంపాదిస్తానని ఎప్పుడైనా అనుకున్నారా? తేజ: అనుకోలేదు. ఇప్పుడు నేనుంటున్న ఇలాంటి పెద్ద ఇళ్లను మద్రాసులో చూసినప్పుడు, ఆ ఇంటి తాలూకు అవుట్‌హౌస్‌లో ఉంటే చాలనుకున్నాను. కానీ ఏకంగా పెద్ద ఇంట్లోనే ఉంటున్నాను. అందుకే మా వాచ్‌మన్ ఉండే రూమ్‌కి కూడా మంచి మార్బుల్ వేయించా. సంపాదించేసిన తర్వాత మాట్లాడుతున్నానని అనుకోవద్దు. డబ్బుతో సంతృప్తి రాదు. సమస్యలు వస్తాయి. మినిమమ్ డబ్బులుండాలి. డబ్బున్నా లేకపోయినా సంతృప్తి ముఖ్యం. నేను మధ్యలో నాలుగేళ్లు సినిమాలు చేయలేదు. అయినా చాలా ఆనందంగా ఉన్నా. ఒకప్పుడు వందల రాత్రులు ఫుట్‌పాత్ మీద పడుకున్నాను. కప్పుకోవడానికి దుప్పటి లేకపోతే న్యూస్‌పేపర్లు కప్పుకున్నా. అలాంటి జీవితాన్ని చూశాను. అందుకే ఉన్న డబ్బుతో సంతృప్తిపడతాను. ప్రయోగాలు చేసి, డబ్బులు పోగొట్టుకోవడానికి వెనకాడను. ఆర్థికంగా సేఫ్ అయ్యారు కాబట్టే ప్రయోగాలు చేయడానికి వెనకాడటంలేదేమో? తేజ: అలా ఏం లేదు. ‘జయం’ అప్పుడు నా దగ్గర ఏముంది? రిస్క్ చేశాగా. అప్పుడు మీరు సింగిల్.. ఇప్పుడు ఫ్యామిలీ ఉంది కదా.. మరి భయం ఉండదా? తేజ: అస్సలు లేదు. ఎప్పుడైనా సరే రోడ్డు మీద నిలబడటానికి రెడీగా ఉండండని నా వైఫ్, పిల్లలతో చెప్పేశా. ‘‘నేను ప్రయోగాలు చేస్తూనే ఉంటా. పెద్దయిన తర్వాత రూపాయి ఇవ్వను. నేను సొంతంగా సంపాదించుకున్నాను. మీరూ అంతే. ఒకవేళ నేను ప్రయోగాలు చేసి, మొత్తం డబ్బు పోగొడితే, అప్పుడు నన్ను కూడా మీరే చూసుకోవాలి’’ అని మా పిల్లలకు క్లియర్‌గా చెప్పేశాను. మరి.. ఆవిణ్ణి మీరెలా చూసుకుంటున్నారు? తేజ: తన వల్ల నాకే ప్రాబ్లమ్ లేదు. నాతో కాపురం చేయడం మాత్రం కష్టమేనండి. దాదాపు మూడీగానే ఉంటాను. తినాలనిపిస్తే తింటాను. లేకపోతే లేదు. ఎప్పుడేం చేస్తానో తెలియదు. మా ఆవిడవాళ్లు బిగ్ షాట్స్. మొదట్లో ఓ రెండు ఫంక్షన్స్‌కి తీసుకెళ్లింది. అందరూ సూట్, కోట్ వేసుకుని హంగామాగా ఉంటే, నేనేమో సాదాసీదాగా వెళ్లాను. నలుగురిలో కలవను. దాంతో ‘‘ఇకనుంచి నన్ను పిలవొద్దు. నువ్వు కావాలంటే వెళ్లు’’ అని చెప్పేశా. కాబట్టి తనే వెళుతుంటుంది. నా స్టయిల్ తనకు అలవాటైపోయింది. మీ అబ్బాయి డెరైక్షన్ కోర్స్ చేస్తున్నాడట. అది మీ సలహానా? తేజ: నా పిల్లలకు సలహాలివ్వను. బాగా చదువుకోమని కూడా చెప్పను. మీ భవిష్యత్తు గురించి మీరే ఆలోచించుకోవాలని చెబుతాను. డెరైక్షన్ కోర్స్ చేయడానికి అబ్రాడ్ వెళతానంటే రూపాయి కూడా ఇవ్వలేదు. అస్సలు సపోర్ట్ చేయనని కూడా చెప్పేశాను. నా సిస్టర్స్ దగ్గర డబ్బులు తీసుకుని వెళ్లాడు. నేను టికెట్ కూడా కొనివ్వలేదు. విచిత్రంగా ఉంది. ఎలాగూ మీరు కష్టాలు పడ్డారు కదా. మరి మీ పిల్లలు కూడా కష్టపడాలనుకోవడమేమిటి? తేజ: నేను కష్టపడి పైకొచ్చాను. నా పిల్లలు కూడా అలానే రావాలి. కష్టపడితేనే సుఖాన్ని ఎంజాయ్ చేయగలుగుతారని నా ఫీలింగ్! పిల్లలకు తల్లిదండ్రులేదైనా చేస్తేనే కదా.. వాళ్లూ ధైర్యంగా ముందుకెళతారు? తేజ: ఫుడ్ పెడతాం. బట్టలు, నీడ ఇస్తాం. కల్చర్ నేర్పిస్తాం. పద్ధెనిమిది, ఇరవయ్యేళ్లు వచ్చేవరకే ఇవన్నీ చేయాలి. ఆ తర్వాత వాళ్ల భవిష్యత్తును వాళ్లే డిసైడ్ చేసుకోవాలి. ఏ అలవాట్లు చేసుకోవాలి, ఏవి చేసుకోకూడదని వాళ్లే తెలుసుకోవాలి. ఇది రైట్, అది రాంగ్ అనే జ్ఞానం మాత్రమే మనం ఇవ్వాలి. ఆలోచనా విధానాన్ని నేర్పాలి కానీ మనమే ఆలోచించి ఫినిష్డ్ ప్రొడక్ట్ ఇవ్వకూడదు. అయినా, మా అబ్బాయి తెలివితేటల మీద నాకు చాలా నమ్మకం ఉంది. మీరెంతోమందిని హీరో, హీరోయిన్లుగా పరిచయం చేశారు కదా.. వాళ్లందరూ మీకు కృతజ్ఞతగా ఉంటారా? తేజ: అడుక్కునేవాడికి అందరూ రూపాయి ఇస్తే, మీరు వంద రూపాయలు ఇచ్చి, ఆ మర్నాడు సిగ్నల్ దగ్గర మిమ్మల్ని గుర్తుపెట్టుకోవాలని ఎక్స్పెక్ట్ చేస్తే తప్పు మీదవుతుంది. కృతజ్ఞతగా ఉండాలని ఆశించడం తప్పు. అడిగారు కాబట్టి చెబుతున్నా. కుల, మతాలు ప్రాంతాలకు అతీతంగా నేను 397మందిని పరిచయం చేశాను. అందులో విశ్వాసం, ఓ పద్దతి ఉండేవాళ్లు ఆర్టిస్టుల్లో ఓ ఆరేడు మంది ఉంటారేమో. నవదీప్, సుమన్‌శెట్టి, వేణు, కాజల్, సదా, రీమాసేన్, ఈ మధ్య పరిచయం చేసిన ప్రిన్స్... వీళ్లంతా బాగుంటారు. ఇక పెద్ద ఆర్టిస్టుల్లో తనికెళ్ల భరణిగారు, ధర్మవరపు, తెలంగాణ శకుంతల.. వీళ్లు నాకేదైనా సమస్య వస్తే వెంటనే వచ్చేస్తారు. సుమన్శెట్టిలో గొప్పతనం ఏంటంటే.. తను ఇల్లు కట్టుకున్నాక, ‘‘మీ వల్లే పైకొచ్చాం.. మీ ఋణం ఏ విధంగా తీర్చుకోవాలి’’ అని సుమన్‌శెట్టి, వాళ్ల నాన్న అంటే.. ‘‘నాకేం వద్దు. కానీ నేను కొత్తవాళ్లతో సినిమాలు తీస్తుంటాను. ఎప్పుడైనా రోడ్డుమీదికొచ్చేస్తానేమో. నాకోసం మీ ఇంట్లో ఒక గది కట్టించండి చాలు..’’ అన్నాను. ఇప్పటికీ వాళ్లింట్లో నాకోసం ఓ గది ఉంది. ఇక విశ్వాసం లేనివాళ్లంటే... ఇద్దరు హీరోలున్నారు... పేర్లు అనవసరం! మరి.. మీకు అవకాశాలిచ్చినవాళ్ల దగ్గర మీరెంత కృతజ్ఞతగా ఉంటారు? తేజ: అక్కినేని వెంకట్‌గారు ఇప్పుడు పిలిస్తే వెళ్లిపోతాను. రామోజీరావుగారు పిలిచి సినిమా చేయమంటే చేసేస్తాను. రామ్‌గోపాల్‌వర్మకు నా అవసరం రాకూడదని కోరుకుంటున్నాను. ఒకవేళ అవసరమైతే ఇల్లు అమ్మయినా రాము దర్శకత్వంలో నేను సినిమా నిర్మిస్తా! రజనీకాంత్‌తో ప్లాన్ చేసిన ‘రైతు’ సినిమా ఏమైంది? తేజ: రజనీకాంత్‌తో కథాచర్చలు కూడా జరిగాయి. ఆయన క్లయిమాక్స్ వేరే రకంగా మార్చమన్నారు. ఆ తర్వాత ఆయన్ను కలవడం మానేశాను. మామూలుగా అంత పెద్ద హీరో అడిగితే ఏ దర్శకుడైనా కాదనరు. మీరెందుకంత పట్టుదలగా ఉంటారు? తేజ: సినిమాకి హీరో కాదు కథ ముఖ్యం. ఒక కథ వల్ల ఓ యాక్టర్ స్టార్ అవుతాడు. స్టార్ వల్ల స్టోరీ హిట్ అవ్వదు. రజనీకాంత్ నటించిన ‘బాబా’ని తీసుకోండి. ఆ సినిమాలో ఉన్నది స్టారేగా. కానీ ఏమైంది? అమితాబ్‌బచ్చన్, చిరంజీవి, బాలకృష్ణగార్లకు ఎన్ని ఫ్లాపులున్నాయో తెలుసు. ఓన్లీ స్టోరీయే హీరో. అది ప్రతి ఒక్కరూ రియలైజ్ అవ్వాలి. భాషాభేదం లేదని, కులమతాలకు అతీతం అని, ప్రాంతాలకు అతీతంగా ఎంతోమందిని పరిచయం చేశానని అన్నారు. సినిమాల్లో పరిచయం సంగతి సరే.. రియల్ లైఫ్‌లో కూడా ప్రాధాన్యం ఇవ్వరా? తేజ: లేదు. మా పిల్లల స్కూల్ ఫామ్‌లో క్యాస్ట్ ఫిల్ చేయను. ఇంటి పేరు కూడా ఎక్కడా చెప్పను. మా అబ్బాయి పేరు అమితవ్, అమ్మాయి పేరు అలియా. అమితవ్తేజ, అలియాతేజ అని చెప్పుకుంటుంటారు. నా డ్రైవింగ్ లెసైన్స్, డెబిట్ కార్డ్స్.. ఏ కార్డులోనూ ఇనిషియల్ ఉండదు. ఐయామ్ యాన్ ఇండియన్... దట్సాల్! - డి.జి. భవాని కొట్టామని పబ్లిసిటీ చేశాం...కొట్టినదానికన్నాఎక్కువ పబ్లిసిటీ వచ్చింది!! స్కూల్ పిల్లలను అస్సలు కొట్టకూడదు. ఏమీ తెలియని వయసు వాళ్లది. వీళ్లు బడితల్లా ఉంటారు. పాతికేళ్లుంటాయి. యాక్టర్ అవ్వాలనే లక్ష్యంతో వచ్చి, ఇన్వాల్వ్మెంట్ లేకుండా చేసేవాళ్లని ఏమనాలి? కొంతమంది యాక్టర్స్ ఉన్నారనుకోండి. తెలియని గీతేదో పెట్టుకుంటారు. అది దాటితే వాళ్లల్లో అద్భుతమైన యాక్టర్ ఉంటాడు. దాటించడానికి కొంతమందిని బతిమాలాలి, కొంతమందిని తిట్టాలి, మరికొంతమందిని పుష్ చెయ్యాలి. ఈ ఫుషింగ్లో కూడా తేడా ఉంటుంది. కొంతమంది చెప్పగానే చేసేస్తారు. సదా ఉందనుకోండి.. చెప్పగానే చేసేది. కాజల్ చేసేది కాదు. ఓ సీన్లో కాజల్ ఏడవాలనుకోండి.. వాళ్ల అమ్మమ్మ చనిపోయిన సంఘటనను వాళ్ల అమ్మ గుర్తు చేస్తే అప్పుడు ఏడ్చింది. అనిత మంచి ఆర్టిస్ట్. అయితే ‘నువ్వు నేను’ చేస్తున్నప్పుడు ఓ పర్టిక్యులర్ సీన్లో తను ఏడవాలి. ఏడుపు రావడం లేదంది. మాకేమో లైట్ పోతోంది. ఒకటి కొడతాను.. చేస్తావా అంటే ఓకే అంది. ఒక్కటిచ్చాను. ఏడ్చేసింది. సీన్ తీశాం. అలా కొట్టామని పబ్లిసిటీ చేశాం. కొట్టినదానికన్నా పబ్లిసిటీ ఎక్కువ వచ్చింది. మీది లవ్‌మ్యారేజ్ అట. మీ పెళ్లి ఎపిసోడ్ చాలా ఇంట్రస్టింగ్‌గా ఉంటుందని వినికిడి. వివరంగా చెబుతారా? తేజ: మా వైఫ్ వాళ్ల అన్నయ్య, నా చెల్లెలు మద్రాస్‌లో క్లాస్మేట్స్. ఆ విధంగా తనతో నాకు పరిచయం ఏర్పడింది. తర్వాత ఇద్దరం ఒకరినొకరం ఇష్టపడ్డాం. దానికి నా భార్య సైడ్వాళ్లు ఒప్పుకోలేదు. మనకు ఇక్కడ కొంచెం క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ. క్యాస్ట్ మాత్రమే కాదు.. అప్పటికి నాది మామూలు స్థాయి. కెమెరామాన్గా ఫస్ట్ సినిమా ‘రాత్రి’ ఇంకా విడుదల కాలేదు. పైగా సినిమా ఇండస్ట్రీలో ఉండే మగాళ్లను అస్సలు నమ్మరు. ఆ మాటకొస్తే ఆడవాళ్లనూ నమ్మరు. నా వైఫ్వాళ్లు సుబ్బిరామిరెడ్డిగారికి బంధువులు. ఆ పక్కిల్లు అక్కినేని నాగేశ్వరరావుగారిది. ఆ విధంగా అక్కినేని వెంకట్‌గారు, ఆయన మిసెస్ జ్యోత్స్నగారు ‘కుర్రాడు మంచోడు. మా స్టూడియోలో పని చేశాడు’ అని చెప్పారు. కానీ, ‘ఉండటానికి సొంత ఇల్లు కూడా లేదు.. కారు కూడా లేదు’ అని వాళ్లన్నారు. అప్పటికి సొంత ఇల్లేం ఖర్మ నాకు అద్దె ఇల్లు కూడా లేదు. వర్మ కార్పొరేషన్ ఆఫీసులో ఉండేవాణ్ణి. వెంటనే ఓ ఇల్లు అద్దెకి తీసుకుని, కారు కొని, ఓ మంచం కొని, ఏసీ కూడా కొన్నాను. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాను. పెళ్లి కోసం ఇన్ని త్యాగాలు చేశాననుకోవద్దు. నన్ను నేను తగ్గించుకోలేదు. ఆ అమ్మాయిని పెళ్లిచేసుకోవాలని పట్టుదల పట్టాను కదా. అది కూడా మొండితనమే. ఆ మొండి పట్టుదలను నెరవేర్చుకోవడం కోసం అవన్నీ చేశాను. ఇప్పటికీ నా మిసెస్ తరఫువాళ్లు ‘‘బాగున్నాడా.. కరెక్ట్‌గానే ఉంటున్నాడా’’ అని ఫోన్ చేసి అడుగుతుంటారు (నవ్వుతూ).