
కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి, డైరెక్టర్ తేజ
‘‘కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి నాకు చిన్నప్పటి నుంచి స్నేహితుడు. నేను చిత్రం మూవీస్ సంస్థను స్థాపించడానికి కారణమైనవాళ్లలో ఆయన ఒకరు. ‘జయం, నిజం’ లాంటి హిట్స్ తీసేందుకు తన వంతు కృషి చేశారు. ఒక రకంగా చెప్పాలంటే నా బాగు కోరే ఆత్మీయుడు. తమిళనాడులో తెలుగు వారి సమస్యలపై ఆయన చేసిన ఉద్యమాలు అభినందనీయం. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు ఆయన ఎంతో కృషి చేస్తున్నారు’’ అని డైరెక్టర్ తేజ అన్నారు.
తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు, ‘లక్మీస్ వీరగ్రం«థం’ సినీ నిర్మాత, దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి జన్మదిన వేడుకలు శనివారం తేజ ఆధ్వర్యంలో జరిగాయి. కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి మాట్లాడుతూ– ‘‘తేజ ఆధ్వర్యంలో జరిగిన ఈ పుట్టినరోజు వేడుకలను ఒక ఆత్మీయ వేడుకగా భావిస్తాను. తేజ తెరకెక్కిస్తోన్న ‘సీత’ చిత్రకథ నాకు తెలుసు. ఈ సినిమా కచ్చితంగా తేజ జీవితంలో ఒక మైలురాయిగా నిలుస్తుంది. త్వరలో ‘చిత్రం మూవీస్ సంస్థ’ ద్వారా తేజ కుమారుణ్ణి హీరోగా పరిచయం చేస్తూ, ఓ మల్టీ లాంగ్వేజ్ సినిమా నిర్మించనున్నాం. నేను తెరకెక్కిస్తోన్న ‘లక్మీస్ వీరగ్రంథం’ టీజర్‌ని ఈ నెల 9న విడుదల చేయనున్నాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నటులు దువ్వాసి మోహన్, మహేశ్, మీసం సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment