Kethireddy Jagadeeshwareddy
-
కోర్టును తప్పుదోవ పట్టిస్తున్న బిగ్‌బాస్ నిర్వాహకులు: కేతిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: కోర్టును బిగ్‌బాస్ నిర్వాహకులు తప్పుదోవ పట్టిస్తున్నారని తెలుగు యువశక్తి అధ్యక్షులు, ప్రముఖ నిర్మాత, దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి ఆరోపించారు. బిగ్‌బాస్-3 జరుగుతున్న సందర్భంగా 2019లో మొదట తెలంగాణ హైకోర్టు, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటీగేషన్ దాఖలు చేశామన్నారు. అందులో ‘‘బిగ్‌బాస్ సెలక్షన్స్ పేరుతో అమ్మాయిలను మోసగిస్తున్నారని, ఈ షో వలన సమాజానికి ఎంతో హానికరమని, ముఖ్యంగా యువత పెడమార్గంలో నడవడానికి ఈ షో కారణం అవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఈ షోని రద్దు చేయాలని, 24 గంటల షూట్ చేసి కేవలం ఒక గంట మాత్రమే ప్రసారం చేయటం, ఓటింగ్ పేరుతో జరుగుతున్న అవకతవకలు, గేమ్ షో పేరుతో అసభ్యకర సన్నివేశాలు అభ్యంతరకరమని పేర్కొన్నట్లు కేతిరెడ్డి గుర్తు చేశారు. తెలంగాణ హైకోర్టు దీనిపై కొన్ని వ్యాఖ్యలు చేసిందన్నారు. ఈ షోలు టెలికాస్ట్ కాకుండా ఆపేసే హక్కులు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని జాగ్రత తీసుకోవాలని పేర్కొంది. బిగ్‌బాస్‌కు వ్యతిరేకంగా వేసిన కేసు వెనక్కి తీసుకోలేదని, దీనిపై పోరాటం కొనసాగిస్తామని కేతిరెడ్డి తెలిపారు. -
దేశ భవిష్యత్తు కాళీ మాత చేతిలోనే: కేతిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: బెంగాల్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన మమతా బెనర్జీకి సినీ నిర్మాత, ఫిల్మ్ సెన్సార్ బోర్డ్ మాజీ సభ్యులు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేకాకుండా రానున్న రోజుల్లో దేశ రాజకీయాల్లో మమత కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. మమత నిన్నటి వరకు కలకత్తాలో కాళీ అవతారాన్ని చూశామని రాబోయే రోజుల్లో భారత్‌కు కాళీ మాత అవసరముందనీ కేతిరెడ్డి అభిప్రాయపడ్డారు. 1990లో యువజన కాంగ్రెస్ లో మమతతో కలిసి పనిచేసే అవకాశం వచ్చినందుకు గర్వపడుతున్నానని ఆయన పేర్కొన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దీదీ అదే స్పీడ్‌ను కల్గి ఉందన్నారు. మమత బెనర్జీ ‘భారత విప్లవ సింహం’ అని వర్ణించవచ్చునని ఆయన తెలిపారు. రాబోయే కాలంలో వారి నాయకత్వం దేశానికి చాలా అవసరముందని కేతిరెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం దేశ ప్రజలు దృష్టి మమతా బెనర్జీపైనే ఉందని తెలిపారు. కాగా నేడు ప్రమాణస్వీకారం చేసిన నూతన ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ కు కేతిరెడ్డి శుభాకాంక్షలు తెలుపుతూ..‘ స్టాలిన్ తన పాలనతో తమిళనాడులో నూతన అధ్యయాన్ని లిఖించాలి. దేశం గర్వించదగ్గ ముఖ్యమంత్రిగా వెలుగొంది, వారి తండ్రి కరుణానిధి ఆశయాలను, ప్రజల లక్ష్యాలను తీర్చుతూ..వారి పాలన సాగాల’ని పేర్కొన్నారు. వారి అడుగుజాడల్లో తాము నడుస్తామని కేతిరెడ్డి ప్రమాణం చేశారు. చదవండి: తమిళనాడు నూతన సీఎంగా ఎం.కే స్టాలిన్: కేతిరెడ్డి -
తమిళనాడు నూతన సీఎంగా ఎం.కే స్టాలిన్: కేతిరెడ్డి
చెన్నై: తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే పార్టీ విజయ దుందుభి మోగిస్తుందని, స్టాలిన్ నాయకత్వంలో తమిళనాడు అన్ని రంగాల్లో ముందుకు వెళ్తుందని కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. అంతేకాకుండా రానున్న రోజుల్లో తమిళనాడు రాష్ట్రానికి స్టాలిన్ శాశ్వత ముఖ్యమంత్రిగా పనిచేస్తారని కేతిరెడ్డి తెలిపారు. జయలలిత మరణం వెనుక ఉన్న నిజాలను స్టాలిన్ నిగ్గుతేల్చుతారని కేతిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో స్టాలిన్ తను అధికారంలోకి వస్తే జయలలిత మరణంపై సమగ్ర దర్యాప్తు జరిగేలా చూస్తానని తెలిపిన మాటలను కేతిరెడ్డి గుర్తుచేశారు. అదే చేస్తే కరుణానిధి వారసత్వంతో పాటు, జయలలిత రాజకీయ వారసత్వంను కూడా స్టాలిన్ సొంతం చేసుకోవటం ఖాయమని ఆయన అభిప్రాయపడ్డారు. గత 5 సంవత్సరాలుగా నాయకత్వ లేమితో తమిళనాడు అన్ని రంగాల్లో వెనుకంజ వేసిందని కేతిరెడ్డి తెలిపారు. రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో ముందుంచడం కోసం స్టాలిన్ అడుగులు వేస్తారని పేర్కొన్నారు. గతంలో ఉపముఖ్యమంత్రిగా పనిచేసిన స్టాలిన్ ముఖ్యమంత్రి పదవికి కూడా న్యాయం చేస్తారన్నారు. చెన్నై మేయర్ గా ఉన్న రోజుల్లో నగరంలో ట్రాఫిక్ సమస్యలను తీర్చడానికి ఎన్నో బ్రిడ్జ్ లు నిర్మించడం వారి పరిపాలన దక్షతకు నిదర్శనమని కేతిరెడ్డి తెలిపారు. డీ.ఎం.కే. యువ నాయకుడుగా ఆయన పార్టీ కి చేసిన సేవలు చాలా గొప్పయని వారి తండ్రి గతం లో కితాబు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. స్టాలిన్ విజయంతో భవిష్యత్తులో దేశ రాజకీయాల్లో సమూలమార్పు రావటం తథ్యమని కేతిరెడ్డి పేర్కొన్నారు. చదవండి: జూబ్లీహిల్స్ సొసైటీలో అవకతవకలపై చర్యలు తీసుకోవాలి: కేతిరెడ్డి -
జూబ్లీహిల్స్ సొసైటీలో అవకతవకలపై చర్యలు తీసుకోవాలి: కేతిరెడ్డి
హైదరాబాద్: జూబ్లీహిల్స్ సొసైటీలో జరిగిన అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి విచారణ జరిపించాలని తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రపదేశ్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావును కోరారు. కొంతమంది పెద్దలు మీడియాను అడ్డంపెట్టుకొని, ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నారని ముఖ్యమంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు. తాము ఏమిచేసిన అడిగేవారే ఎవరు లేరనే నెపంతో సొసైటీలో భారీ కుంభకోణాలను చేస్తూ.. అటు ప్రభుత్వాన్ని, ఇటు సొసైటీ సభ్యులను వంచిస్తున్నారని కేతిరెడ్డి ఆరోపించారు. బినామీల పేర్లతో ఉన్న అన్ని లావాదేవిలను వెంటనే రద్దు చేసి నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపించి నిజాలను నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. ‘సొసైటీలో ఒక వ్యక్తికి ఒక ఫ్లాట్ మాత్రమే’ నిబంధనను ఉల్లంఘించి ఎన్నో ఫ్లాట్స్ కలిగివున్న బడా బాబుల నిజస్వరూపంపై కేసీఆర్ ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు చేయించాలన్నారు. జూబ్లీహిల్స్ సొసైటీ పరిధిలోని పార్కుల కోసం మాస్టర్ ప్లాన్‌లో వదిలిన ఖాళీ స్థలాలను కూడా వదలకుండా క్రయవిక్రయాలను జరిపిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. వేల కోట్లను దోచుకున్న వారిని వెంటనే కస్టడీకి తీసుకొని విచారణ చేపట్టాలని కోరారు. ఈ మేరకు ప్రధానమంత్రి, రాష్ట గవర్నర్, ముఖ్యమంత్రి, తెలంగాణ హైకోర్టు ప్రధాన నాయమూర్తికి కేతిరెడ్డి లేఖలు రాశారు. ప్రధానికి రాసిన లేఖలో సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరారు. అంతేకాకుండా త్వరలో ఢిల్లీ లో న్యాయపోరాటం చేస్తానని, జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయనున్నట్లు తెలిపారు. చదవండి: ప్రజారోగ్యాన్ని రాష్ట్రాలకు వదిలేయడం సరికాదు: కేతిరెడ్డి -
ప్రజారోగ్యం పట్ల కేంద్రమే చర్యలు తీసుకోవాలి: కేతిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: జాతీయ విపత్ర పరిస్థితి ఏర్పడిప్పుడు కేంద్రం దాన్ని నేషనల్ ఎమర్జెన్సీగా భావించి, రాష్ట్ర ప్రభుత్వాలను అనుసంధానం చేసి, ప్రజారోగ్యం పట్ల చర్యలు తీసుకోవాలని తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి కోరారు. కరోనా తీవ్రత ఉధృతంగా ఉన్నా, దాని నియంత్రణను రాష్ట్రాలకు అప్పగించడం ఎంతవరకు సమంజసమని శనివారం ఓ ప్రకటనలో ఆయన ప్రశ్నించారు. వ్యాక్సిన్ డ్రైవ్ ప్రకటించినప్పటికీ టీకా దొరకని పరిస్థితి ఉందని విమర్శించారు. మొన్నటి వరకు నిర్వహించిన ఎన్నికల ర్యాలీలు, బహిరంగ సభలు, ఇతర కారణాలతో కరోనా నేడే ఉగ్రరూపం దాల్చిందని మండిపడ్డారు. ప్రజారోగ్యం పట్ల కేంద్ర యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకొని, ప్రజల ప్రాణాలను కాపాడాలని కేతిరెడ్డి కోరారు. స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా నేటికీ మన దేశంలో విద్య, వైద్య రంగాలలో ఇప్పటికీ పరిస్థితులు మెరుగుపడలేదు. ప్రస్తుత ప్రభుత్వాలు కానీ, గతంలో ఉన్న ప్రభుత్వాలుగాని, ప్రజారోగ్యం, విద్య పట్ల శ్రద్ధ వహించి ఉంటే ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి విపత్కర పరిస్థితులు ఏర్పడి ఉండేవి కావు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను సమన్వయం చేసుకుంటూ యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టి మరణాల సంఖ్యను తగ్గించాల్సిన అవసరం ఉంది. పౌరులు కూడా అప్రమత్తంగా ఉంటూ, కోవిడ్ నిబంధనలను పాటించి ప్రభుత్వానికి అండగా ఉండాలన్నారు. కరోనా తీవ్రతను బట్టి అవసరమైతే లాక్‌డౌన్‌ను విధించి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని పేర్కొన్నారు. -
జగన్‌గారికి ధన్యవాదాలు
‘‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సింగిల్ విండో పథకం జీవోను ఇవ్వటం ద్వారా సినిమా పరిశ్రమకు సంబంధించిన అందరికీ మేలు కలుగుతుంది. అందుకు ఏపీ సీయం వైయస్. జగన్మోహన్ రెడ్డిగారికి ధన్యవాదాలు’’ అన్నారు ఏపీ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ –‘‘సినిమా పరిశ్రమ ఏపీలో అభివృద్ధి చెందడానికి తీసుకోవలసిన చర్యలను రాష్ట్ర ప్రభుత్వానికి వినతిపత్రం ద్వారా తెలియపరుస్తున్నాం. గతంలో చెన్నై నుండి హైదరాబాద్‌కు చిత్ర పరిశ్రమను తరలించినందుకు అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ఫిల్మ్‌నగర్ సొసైటీని ఏర్పాటు చేశారు. ఆ సొసైటీలో సినీ పరిశ్రమకు చెందిన స్టూడియోలతో పాటు ఇళ్ల స్థలాలను కేటాయించారు. తర్వాతి రోజుల్లో వాటిని షూటింగ్‌ల కోసమే కాకుండా సొంత ప్రయోజనాల కోసం వాడుకున్నారు. ఇప్పుడు ఆంధ్రాలో సినిమా పరిశ్రమ అభివృద్ధిలో భాగంగా స్టూడియోలకు స్థలాన్ని కేటాయిస్తే ప్రభుత్వ భాగస్వామ్యంతో నిర్మించేవారికే స్థలాలు కేటాయించాలి. అలాగే ఆన్లైన్ టికెటింగ్‌ను ఎంకరేజ్ చెయ్యాలి. చిన్న సినిమాల ప్రయోజనం కోసం బస్టాండ్, మున్సిపల్ కాంప్లెక్స్‌లలో సుమారు 200 థియేటర్స్‌ను ప్రభుత్వం కట్టించాలి’’ అన్నారు. -
ఆమె ఆదర్శమైన ముఖ్యమంత్రి : కేతిరెడ్డి
చెన్నై : జయలలిత మరణం వెనుక చాలా అనుమానాలున్నాయని గతంలో చెప్పిన నేతలు ఇప్పుడు అధికారంలోఉండి కూడా దానిపై ఎందుకు మౌనంగా ఉన్నారో ఎన్నికలకు పోయే ముందు ప్రజలకు సమాధానం చెప్పాలని తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదేశ్వరెడ్డి ఏఐఏడిఎంకే నేతలను డిమాండ్ చేసారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత 72వ జయంతిని పురష్కరించుకుని తమిళనాడు తెలుగు యువశక్తి జరపుతున్న 5 రోజుల జయంతి వేడుకలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కేతిరెడ్డి జగదేశ్వరెడ్డి పేద మహిళలకు చీరలు పంపిణి చేశారు. 27తేదీ వరకు పలు కార్యక్రమాల ద్వారా జయలలిత జయంతి వేడుకలు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి మాట్లాడుతూ.. “జయలలిత జయంతి వేడుకులు ఇలా పేదల మధ్య జరపటానికి వారే స్పూర్తి దాయకం. దేశంలో ఎన్నో రాష్ట్రాలు ప్రస్తుతం తమిళనాడు రాష్టంలోని జయలలిత ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఆచరిస్తున్నాయి. ఇటీవల ఢిల్లీ ఎన్నికల్లో తమిళనాడు రాష్ట్ర సంక్షేమ కార్యక్రమాలను ఆచరిస్తామని చెప్పి, ఆప్ విజయం సాధించటమే ఇందుకు ఉదాహరణ. జయలలిత దేశంలోనే ఒక ఆదర్శమయిన ముఖ్యమంత్రి, వారి అకాల మరణం తమిళనాడు ప్రజలను కృంగ దీసింద’ని అన్నారు. -
కేతిరెడ్డి నా బాగు కోరే ఆత్మీయుడు
‘‘కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి నాకు చిన్నప్పటి నుంచి స్నేహితుడు. నేను చిత్రం మూవీస్ సంస్థను స్థాపించడానికి కారణమైనవాళ్లలో ఆయన ఒకరు. ‘జయం, నిజం’ లాంటి హిట్స్ తీసేందుకు తన వంతు కృషి చేశారు. ఒక రకంగా చెప్పాలంటే నా బాగు కోరే ఆత్మీయుడు. తమిళనాడులో తెలుగు వారి సమస్యలపై ఆయన చేసిన ఉద్యమాలు అభినందనీయం. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు ఆయన ఎంతో కృషి చేస్తున్నారు’’ అని డైరెక్టర్ తేజ అన్నారు. తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు, ‘లక్మీస్ వీరగ్రం«థం’ సినీ నిర్మాత, దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి జన్మదిన వేడుకలు శనివారం తేజ ఆధ్వర్యంలో జరిగాయి. కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి మాట్లాడుతూ– ‘‘తేజ ఆధ్వర్యంలో జరిగిన ఈ పుట్టినరోజు వేడుకలను ఒక ఆత్మీయ వేడుకగా భావిస్తాను. తేజ తెరకెక్కిస్తోన్న ‘సీత’ చిత్రకథ నాకు తెలుసు. ఈ సినిమా కచ్చితంగా తేజ జీవితంలో ఒక మైలురాయిగా నిలుస్తుంది. త్వరలో ‘చిత్రం మూవీస్ సంస్థ’ ద్వారా తేజ కుమారుణ్ణి హీరోగా పరిచయం చేస్తూ, ఓ మల్టీ లాంగ్వేజ్ సినిమా నిర్మించనున్నాం. నేను తెరకెక్కిస్తోన్న ‘లక్మీస్ వీరగ్రంథం’ టీజర్‌ని ఈ నెల 9న విడుదల చేయనున్నాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నటులు దువ్వాసి మోహన్, మహేశ్, మీసం సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
అమ్మ మరణంపై అనుమానాలను నివృత్తి చేయండి
చెన్నై( కొరుక్కుపేట): అమ్మ జయలలిత మరణంపై ప్రజలకు ఉన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి, అతని మంత్రి వర్గం కేంద్రాన్ని సీబీఐ విచారణకు డిమాండ్ చేసినప్పుడే అమ్మకు మీరిచ్చే నిజమైన నివాళి అని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు జయలలిత జయంతిని పురస్కరించుకుని తమిళనాడు తెలుగు యువశక్తి ఆధ్వర్యంలో 10 రోజుల పండుగలో భాగంగా తమిళనాడు, ఆంధ్ర రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో పలు సాంఘిక సేవా కార్యక్రమాలను ఇటీవల ప్రారంభించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఆదివారం సాయంత్రం చెన్నైలోని స్వతంత్రనగర్‌లో మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథిగా కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు అమెరికాలో జాతి వివక్షకు బలైన భారతీయుల ఆత్మశాంతి కోసం మౌనం పాటించారు. అనంతరం కేతిరెడ్డి మాట్లాడుతూ జయలలిత జయంతి వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. త్వరలో వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన మహిళలకు ఏటా ఇచ్చే ‘అమ్మా యంగ్ ఇండియా’ అవార్డులు ప్రదానం చేయనున్నట్టు తెలిపారు. జయలలిత అపోలో ఆసుపత్రిలో ఉన్న 75 రోజులు హాస్పిటల్లో జరిగిన సంఘటనలు, పొంతనలేని ప్రకటనలు, ఆమ్మను కలిసేందుకు వచ్చిన వారిని కలవనీయకుండా చేయడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. ప్రజల సందేహాలను నివృత్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని, దీనిపై పలు పోరాటాలు చేశామని సుప్రీంకోర్టులో కేసు, రాష్ట్రపతి, ప్రధాని, కేంద్రమంత్రులు, పార్లమెంట్ సభ్యులకు వినతి పత్రాలు సమర్పించినట్టు తెలిపారు. ఉద్యమంలో భాగంగా పోస్టుకార్డుల ద్వారా నిరసనలు చేపట్టామని, తిరుపతి వెంకన్న హుండీలో సీబీఐ విచారణ కోరుతూ వినతిపత్రం వేసినట్టు తెలిపారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వ సానుకూలంగా స్పందిస్తోందని పేర్కొన్నారు. ఐదురాష్ట్రాల ఎన్నికల తరువాత కేంద్రం కచ్చితంగా సీబీఐ విచారణకు ఆదేశాలు జారీ చేస్తుందనే నమ్మకం ఉం దన్నారు. ప్రజలు గగ్గోలు పెడుతున్నా పట్టించుకోని జయలలిత కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు విచారణ గురించి ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేయడం వింతగా ఉందన్నారు. ప్రతిపక్షాలు కూడా అమ్మ మరణంపై సీబీఐ విచారణ కోసం ప్రజా ఉద్యమాలు చేసేందుకు పార్టీలకు అతీతంగా ముం దుకు రావాలని కేతిరెడ్డి పిలుపునిచ్చారు.