![Producer Kethireddy Jagadishwar Reddy thanks YS Jagan Mohan Reddy - Sakshi](/styles/webp/s3/article_images/2020/05/26/kethireddy.jpg.webp?itok=JL6hyJ5W)
కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి
‘‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సింగిల్ విండో పథకం జీవోను ఇవ్వటం ద్వారా సినిమా పరిశ్రమకు సంబంధించిన అందరికీ మేలు కలుగుతుంది. అందుకు ఏపీ సీయం వైయస్. జగన్‌మోహన్ రెడ్డిగారికి ధన్యవాదాలు’’ అన్నారు ఏపీ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ –‘‘సినిమా పరిశ్రమ ఏపీలో అభివృద్ధి చెందడానికి తీసుకోవలసిన చర్యలను రాష్ట్ర ప్రభుత్వానికి వినతిపత్రం ద్వారా తెలియపరుస్తున్నాం.
గతంలో చెన్నై నుండి హైదరాబాద్‌కు చిత్ర పరిశ్రమను తరలించినందుకు అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ఫిల్మ్‌నగర్ సొసైటీని ఏర్పాటు చేశారు. ఆ సొసైటీలో సినీ పరిశ్రమకు చెందిన స్టూడియోలతో పాటు ఇళ్ల స్థలాలను కేటాయించారు. తర్వాతి రోజుల్లో వాటిని షూటింగ్‌ల కోసమే కాకుండా సొంత ప్రయోజనాల కోసం వాడుకున్నారు. ఇప్పుడు ఆంధ్రాలో సినిమా పరిశ్రమ అభివృద్ధిలో భాగంగా స్టూడియోలకు స్థలాన్ని కేటాయిస్తే ప్రభుత్వ భాగస్వామ్యంతో నిర్మించేవారికే స్థలాలు కేటాయించాలి. అలాగే ఆన్‌లైన్ టికెటింగ్‌ను ఎంకరేజ్ చెయ్యాలి. చిన్న సినిమాల ప్రయోజనం కోసం బస్టాండ్, మున్సిపల్ కాంప్లెక్స్‌లలో సుమారు 200 థియేటర్స్‌ను ప్రభుత్వం కట్టించాలి’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment