సన్మానం స్వీకరిస్తున్న కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి
చెన్నై : జయలలిత మరణం వెనుక చాలా అనుమానాలున్నాయని గతంలో చెప్పిన నేతలు ఇప్పుడు అధికారంలోఉండి కూడా దానిపై ఎందుకు మౌనంగా ఉన్నారో ఎన్నికలకు పోయే ముందు ప్రజలకు సమాధానం చెప్పాలని తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదేశ్వరెడ్డి ఏఐఏడిఎంకే నేతలను డిమాండ్ చేసారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత 72వ జయంతిని పురష్కరించుకుని తమిళనాడు తెలుగు యువశక్తి జరపుతున్న 5 రోజుల జయంతి వేడుకలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కేతిరెడ్డి జగదేశ్వరెడ్డి పేద మహిళలకు చీరలు పంపిణి చేశారు. 27తేదీ వరకు పలు కార్యక్రమాల ద్వారా జయలలిత జయంతి వేడుకలు కొనసాగనున్నాయి.
ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి మాట్లాడుతూ.. “జయలలిత జయంతి వేడుకులు ఇలా పేదల మధ్య జరపటానికి వారే స్పూర్తి దాయకం. దేశంలో ఎన్నో రాష్ట్రాలు ప్రస్తుతం తమిళనాడు రాష్టంలోని జయలలిత ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఆచరిస్తున్నాయి. ఇటీవల ఢిల్లీ ఎన్నికల్లో తమిళనాడు రాష్ట్ర సంక్షేమ కార్యక్రమాలను ఆచరిస్తామని చెప్పి, ఆప్ విజయం సాధించటమే ఇందుకు ఉదాహరణ. జయలలిత దేశంలోనే ఒక ఆదర్శమయిన ముఖ్యమంత్రి, వారి అకాల మరణం తమిళనాడు ప్రజలను కృంగ దీసింద’ని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment