Director Teja Talk About His Family And Uday Kiran Death Mystery - Sakshi
Sakshi News home page

Director Teja: నా కొడుకు, కూతురికి పెళ్లి చేయను, ఉదయ్‌ కిరణ్‌ డెత్‌ మిస్టరీ.. ఏమీ తెలియనట్లు అడుగుతున్నారు!

Published Thu, May 25 2023 8:22 AM | Last Updated on Thu, May 25 2023 9:31 AM

Will Reveal Uday Kiran's Death Mystery Before - Sakshi

దగ్గుబాటి అభిరామ్‌ హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం అహింస. గీతికా తివారి హీరోయిన్‌. తేజ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా జూన్‌ 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌ కార్యక్రమాలతో బిజీ అయి తేజ వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ క్రమంలో ఎక్కడికి వెళ్లినా అతడికి దివంగత నటుడు ఉదయ్‌ కిరణ్‌ గురించే ప్రశ్న ఎదురవుతుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఉదయ్‌ కిరణ్‌ పేరు చెప్పగానే పాపం అనేశాడు తేజ.

దీంతో ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి హీరో డెత్‌ మిస్టరీ రివీల్‌ చేస్తానన్నారు కదా సర్‌.. అని అడిగాడు. దీనికి తేజ స్పందిస్తూ.. 'చాలామందికి ఉదయ్‌ కిరణ్‌ మరణం వెనుక అసలు కారణం తెలుసు. కానీ ఎందుకు నాతోనే దాన్ని చెప్పించాలని చూస్తున్నారు. అందరూ ఏమీ తెలియనట్లు అమాయకంగా మీరే చెప్పండని ఎందుకు నటిస్తున్నారో అర్థం కావట్లేదు' అని బదులిచ్చాడు.

తన కుటుంబం గురించి మాట్లాడుతూ.. 'మా అబ్బాయి డైరెక్షన్‌ కోర్స్‌ పూర్తి చేశాడు. తనను త్వరలో హీరోగా పరిచయం చేస్తాను. అమ్మాయి తన చదువు పూర్తి చేసుకుని ఇండియాకు తిరిగొచ్చేసింది. ఆమెకు నేను పెళ్లి చేయను. నచ్చినవాడిని చూసుకుని రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకోమని చెప్పాను. ఆ తర్వాత దగ్గరివాళ్లను పిలిచి భోజనాలు పెడదామన్నాను. ఒకవేళ పెళ్లి తర్వాత నచ్చకపోతే విడాకులిచ్చేయ్‌.. నా ఇద్దరు పిల్లలకు అదే చెప్తా.. జీవితంలో సంతోషంగా ఉండటం కోసం ఏది చేయాలనిపిస్తే అది చేయండి.. అంతే తప్ప పక్కవాళ్ల కోసం ఆలోచించవద్దని చెప్తాను' అని చెప్పుకొచ్చాడు.

చదవండి: చులకన చేసే నోరు ఉంటే చురకలు వేసే నోరు కూడా ఉంటుంది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement