Daggubati Abhiram Starrer 'Ahimsa' Pre Release Event Confirmed - Sakshi
Sakshi News home page

Daggubati Abhiram: రానా తమ్ముడు హీరోగా 'అహింస'.. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ డేట్‌ ఫిక్స్‌

Published Thu, May 25 2023 2:30 PM | Last Updated on Thu, May 25 2023 3:00 PM

Daggubati Abhiram Starrer Ahimsa Pre Release Event Confirmed - Sakshi

ప్రముఖ నిర్మాత సురేష్‌బాబు తనయుడు, రానా సోదరుడు అభిరామ్‌ అహింస చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. తేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రేమకథా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అభిరామ్‌కు జోడీగా గీతి​కా తివారీ హీరోయిన్‌గా నటిస్తుంది.

ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ సినిమాపై మంచి హైప్‌ క్రియేట్‌ చేస్తోంది. ఇక ఇప్పటికే రిలీజ్‌ డేట్‌ పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం జూన్‌2న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ క్రమంలో భారీగా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ప్లాన్‌ చేస్తున్నారు. ఈనెల 27న ఆంధ్రప్రదేశ్‌ చీరాలలోని ఎన్‌ఆర్‌పీఎం హైస్కూల్‌ గ్రౌండ్‌లో ఈ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఓ పోస్టర్‌ను వదిలారు. ఇక ఈ ఈవెంట్‌కు పలువురు టాలీవుడ్‌ పెద్దలు రానున్నట్లు సమాచారం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement