
శ్రీహర్ష, కషికా కపూర్ జంటగా నటించిన చిత్రం ‘ఎల్.వై.ఎఫ్’ (లవ్ యువర్ ఫాదర్). దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తనయుడు, సింగర్ ఎస్పీ చరణ్ ప్రధాన పాత్ర పోషించారు. పవన్ కేతరాజు దర్శకత్వం వహించారు. కిశోర్ రాఠీ, మహేష్ రాఠీ, ఎ. రామస్వామి రెడ్డి, ఎ. చేతన్ సాయిరెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 4న విడుదల కానుంది.
ఈ సినిమా ట్రైలర్‌ని వీక్షించి, తొలి టిక్కెట్‌ని కొనుగోలు చేసిన అనంతరం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘ఎల్.వై.ఎఫ్’ ట్రైలర్ చాలా బాగుంది. తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో రూపొందినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వారణాసిలోని కాశీ విజువల్స్ ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం మంచి విజయం సాధించాలి’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ.